వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/17-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

17-ప్రకరణము

గ్రామ్యవాదము - గురుజాడ అప్పరావుగారి జాబులు

ఇక్కాలమునకు సరిగా నాంధ్రదేశమున వ్యావహారికభాషావాదము బయలుదేరినది. శ్రీ కీ.శే. గిడుగు రామమూర్తి పంతులవారు ఉపన్యాసము లీయసాగిరి. వీరికి శ్రీ కీ.శే. గురుజాడ అప్పారావుగారు సహాయులైరి.

వేంకటరాయశాస్త్రులవారు నూతనమార్గ ప్రియులే యైనను వ్యావహారికభాషావాదమును ఎంతమాత్రమును ఒప్పుకొనలేదు. ఏమార్గమునుగాని స్థాపించుటకుగాని తప్పించుటకు గాని సమర్థులును పాండిత్యమునందును వాదపటిమయందును ఎల్ల వారిని మించియుండినందున వ్యావహారికవాదులకు మేరు పర్వతమువలె నడ్డుతగిలిరి. శాస్త్రులవారీ నూతనమతము నొప్పుకొన్నచో నికదీనికి ఏ భయమునులేదు. శాస్త్రులవా రొప్పనిచో వ్యావహారికభాషను సర్వజనాదరణీయముగా నొప్పించుటకు భగీరథప్రయత్నము చేయవలసియుండును. శాస్త్రులవారు తా మేపద్ధతి నవలంబించినను నెగ్గించుకొను శక్తిగలవారు. తమది క్రొత్తమార్గమేయైనను కొంత పూర్వసాంప్రదాయము ననుసరించియు ప్రమాణపూర్వకముగా నుండునట్లు చేయుస్వభావముకలవారు. ఆంధ్ర వచనమున పూర్వమార్గమును తొలగించి సులువుగా వ్రాయసాగిరిగదా. నాటకములు లోకస్వభావము ననుసరించి యుండవలయునని పాత్రోచితభాషం దెచ్చినారు. గ్రామ్య రీతులను సయితము ప్రతాపరుద్రీయమున చూపినారు మఱి యీక్రొత్తవాదమువచ్చినంతనే విసంధినిగూర్చి యొక యుపన్యాసమొసంగిరి. "సంహితఏకపదమందు నిత్యము (ఉ.వనేన.ఇచ్చెను) ధా,తూపసర్గలకునిత్యము (ఉ. ఉపాన్తే అభ్యేతి); సమాసమందు నిత్యము (ఉ. రాజాజ్ఞ. ఇల్లాలు); వాక్యమందైననో వివక్షాధీనము (దధి అత్ర, పెరుగు ఇక్కడ) సంహితముగా అర్ధమాత్రాకాల మాత్రవ్యవధానము, రెండక్షరములకు అర్ధమాత్రావ్యవధానము తప్పదు, తావన్మాత్ర వ్యవథానము సంహిత, అంతకన్న హెచ్చువ్యవథానము సంహితకాదు....... విసంధి సహ్యముగాను సుఖముగాను ఉన్నది అట్లే 'అతడు అప్పుడు అక్కడఉండెను' అనువాక్యమును సులువుగా నుచ్చరించిన సుఖముగానేయుండును" అని దానిసారము. అట్లే తమ గ్రంథములయందు విసంధిని పాటించిరి.

ఈకాలమున మదరాసునందును ఆంధ్రడేశమందు పలుతావులను గ్రామ్యాదేశ నిరసనోపన్యాసములు జరుగుచుండినవి. ఆసభలలో శ్రీ శాస్త్రులవారును అప్పారావుగారును కలసికొనుచుండెడివారు. పచ్చయప్ప కళాశాలాసౌధమున నొక సమావేశము జరిగినది. ఆవెంటనే శ్రీ గురుజాడ అప్పారావుగారు వేంకటరాయశాస్త్రులవారికి వ్రాసిన జాబు-

2nd June 1912,

Dear and respected friend,

I was very much gratified when you told me at the Madras conference that you went with me a long way though you differed with me on some points. though there may be difference of opinion on the practical solution of prose diction it would be impossible for us to differ on questions of authority. We go to the same original sourcess; That is Why I admire you. you generally exhaust any subect Which you discuss. But I cannot say the same thing of pandits generally. Judgments are, in their case, a matter purely of sentiment, and they do not take the trouble to examine the genuine Sanskrit tradition. I Was amused to read in దేశమాత (.............'s paper) a sentence whose meaaning I put into english.

"One or two persons advocated the use of గ్రామ్య in dramas, but pandits have condemned the practice" Where are the pandits ? I should like to see them. Of the persons who assembled at pachayappa's I wonder how many deserve that name.

It appears you spoke at the Nidadavolu conference. I am anxious to learn what you said, at leaast your chief arguments and general conclusions. Unfortunately your speeches are not reported in the Madras papers. Only ఆంధ్రప్రకాశిక gave a report of the meeting at which you spoke of Sandhi. The one or two sentences in which your views were given, were written in a Telugu which I did not understand. I shall feel obliged if you publish your Nidadavolu speech in some Telugu weekly - at leaast the gist of it. I value your opinions hihgly. sir, please take some trouble for my sake and the sake of Telugu and write to me briefly what your views are, how far we concur, and where we differ.

yours very sincerely,
G. V. APPA RAO.


2nd june 1912.

P.S................

Dear & respected friend,

In continuation of my letter of this morning:-

Which prose works and poems of tha present day do you offer as standards? May we take your కథాసరిత్సాగరము as a standarad ? and your dramatic verse for poetry, say Usha?

How far have you deviated from the rules and precedants of the language of the older poets? What is your test of correctness? Do you think it possible, I mean is it a practical measure, to secure a fairly common standard of correctness among prose writers. What is your opinion of the solution of Mr. Veeresalingam Pandits of a prose diction for Telugu? Do his followers follow any intellgible fairly uniform standard? Granting that to scholors accustomed to literary forms, serious writing in the spoken dialect, sounds undignified, does not the popular prose of the present day with Veeresalingam at its head, offend the sense of propriety ? of both the Pandit and the western scholara ?

yours very sincerely,
G. V. APPA RAO. నిడుదవోలులో 1912 సం. మున గ్రామ్యవాదమును ఖండించుటకును గవర్న మెంటువారికి నిర్బంధగ్రామ్యమును తొలగించుట కొకవిన్నపము కావించుటకును ఒక సభకూడినది. ఆ సభలో శాస్త్రులవారు ఇట్లుపన్యసించిరి.
  • గంగాదేవి నారాయణపాదమందు జనించి పరమశివునిచే మూర్ధంబున లాలితమై నగాధిరాట్చృంగంబున విలసిల్లి దిగివచ్చి హరిద్వార వారణ స్యాదులమీదుగా నానాదేశములం బవిత్రీకరించి కడపట సకలకశ్మల సమృద్ధయై సముద్రమునంబడి తన్మ యత్వముంబొంది అస్పృశ్యయై అపేయయై నష్టరూపయైపోయినట్లే వాగ్దేవియు పద్మజాతమనోజాతయై చురుర్వేదీమహితములయిన యాచతుర్ముఖుని ముఖంబులందు విలసిల్లి వాల్మీకివ్యాసకాళిదాసాదుల వదనంబులం బరిడవిల్లి మనయాంధ్ర దేశంబునకుందిగి తెలుగై రాజరాజనరేంధ్ర కేష్ణరాయాదులు యాస్థానములయందు మహితయై నానాదిగ్దేశంబులం బవిత్రీకరించి కడపట నిక్కాలంబునం బ్రాయికంబుగా తెగులై సకల కశ్మలసమృద్ధయై గ్రామ్యప్రాయతంజెంది అనుచ్చారణీయయు అనాకర్ణనీయయునై రూపహానిం జెందుచున్నది.

చిరకాలము ఆంధ్రవాగ్ధేవిని సంస్కృతాంధ్రోభయ భాషాప్రవీణులైన వాగనుశాసన సోమయాజి పెద్దనార్యప్రభృతులు మహోన్నతదశయంద యుంచి పూజించిరి. ఇటీవల రాగారాగా ప్రాయికముగా సంస్కృతమెఱుగనికవులు, చదువనికవులు, సమాస మొల్లనివారు, అలంకారమునొప్పనివారు, యతిప్రాసల హితశత్రువులు, అక్షరద్వేషులు, ఔచిత్యబాహ్యులు-ఏవమాదులు వాగ్దేవికి ఈచరమదశను సాధించినారు.

ఈదశలో.....భావివాఙ్మయమునెల్ల గ్రామ్యతంబొరయింప నొకయుద్యమము తలసూపియున్నది. ఆగ్రామ్యవాదుల వాదసారము ఇదిగా కానిపించుచున్నది.-


  • గ్రామ్యాదేశ నిరసనము. "వ్యాకృతభాషకఠినము; దానివ్యాకరణము దుర్బోధము; తదీయ శబ్దజాలము బహుళముగా గ్రంథమాత్ర ప్రసిద్ధము. వ్యాకరణము వ్యావహారిక భాషానుగుణముగాదు, అందులకు కర్మార్థక భవిష్యదర్థక పడుకలానుబంధములు ఉదాహరణములు.

గ్రామ్యమన్ననో, సులువు, సర్వజనవిదితము-

ఇటలీలో డాంటిమహాకవివ్రాసిన 'డివైన్ కామెడీ'ని ఉదాహరణముగా గనవచ్చును. గ్రామ్యములో ఇప్పుడు రచితములయిన యేతన్మత నిర్వాహార్థ పత్రికావ్యాసములను, పఠనీయపుస్తకసభవారు (Text-book Committee) పాఠశాలలకు నిర్ణయించినట్టి కొన్నిగ్రామ్యగ్రంథములను, ఉదాహరణముగా బరికింపవచ్చును."

ఇందులకు సమాధానము.-

అగ్రామ్యవాఙ్మయము కఠినమనుట యిప్పుడుపుట్టినమాట, పూర్వులు దీనిని కఠినమనలేదు, లెస్స'యనిరి.

         'ఎల్ల భాషలందు నెఱుగ వేబాసాడి
         దేశభాషలందు దెలుగులెస్స.'

మఱి యిప్పటికాఠిన్యమునకుం గారణము తెలిపెద.

ఆంధ్రభాషాప్రవచనమందు-

(1) ప్రాచీనమార్గము (2) నవీనమార్గమునురెండు. ప్రాచీనమార్గమును, అనులోమమార్గ మనందగును. అమరము, ఆంధ్ర నామసంగ్రహము, సంస్కృతశబ్దమంజరి, సంస్కృతపంచ కావ్యములు, నన్నయభట్టీయము, ఆంధ్ర పంచకావ్యములు ఈవరుసప్రవచనము ప్రాచీనమార్గము. ఇందలిక్రమము - శబ్దము లక్షణము లక్ష్యమునుంగా నుండును. నవీనమార్గము రాజకీయవిద్యాంగ నిర్ణీతమార్గమే; ఇది ప్రతిలోమ మనందగినది; ఇందు వరుస-లక్ష్యము లక్షణము శబ్దమునుగానుండును. ఈనవీనమార్గము మనభాషకుపనికిరాదు.

........ఇందు దృడపాండిత్యముకై అనులోమమార్గమే అనుకూలముగానున్నది. దీనివలన క్లేశమును కాలమును కరము సంక్షిప్తములగును. ఈ గుణముంగననేరక విద్యాధ్యక్షులు ఈమార్గముందొలగించి ఈభాషను అసమర్థమయిన యేతద్విపరీత నవీనమార్గమున ఈభాషం జెప్పించుటచేత ఇది ఆదినుండియు కఠినమే అగుటయు, ఎన్నాళ్లుచదివినను పాండిత్యముసున్నయే యగుటయు...సంభవించుచున్నవి.

మఱియు.......తెలుగులో జయమొందమి పైతరగతికిపోవుటకు ఆటంకపడమిచేతను, ఇట్లెగబ్రాకగా ప్రాకగా యూనివర్సిటీ పరీక్షలయందు తెలుగులో జయము అతిసులభమగుటచేతను, అందులకై యీయధమ విద్యార్థులుకూడ చదువనే అక్కఱలేమిచేతను, విద్యార్థుల వ్రాత లెట్లున్నను జయములో మామూలు 'పర్సెంటేజి' ప్రతివర్షము తప్పనందునను, పాఠగ్రంథ ప్రశ్నపత్రమునకు (Text paper) యథాశక్తి ఇంచుకంత యుత్తరము వ్రాసి భాషాంతరీకరణ ప్రశ్నపత్త్రము (Translation paper) నకు మాత్రము ఉత్తరము విపులముగానేనియు లేక, ఆంధ్రీకరణమాత్రమయినను వ్రాసి, పరీక్షయందు జయమొందుట ప్రాయికమయి యుండుటవలనను, సర్కారుకొలువునకు తెలుగులోని తెలివితోపని లేనందునను, తెనుగు చక్కగాతెలిసినచో మునిషీలమైపోదుమేమో అని విద్యార్థులకును అట్లయిపోదురేమోయని వారితండ్రులకును దిగులు కలిగియుండుట చేతను.... ఈభాష యిప్పుడు కఠినమయినది.

ఆంగ్లభాష సులువనుట దానినిసాధించుటకై తాముపడిన ప్రయాసను మఱచుటచేత.

పరీక్షాగ్రంథములలో పదిపద్యములైనను చదివినాడా - పదచ్ఛేద విధానమయిన నెఱుంగునా - పదిపద్యములకైనను లక్షణావిరుద్ధముగా అర్థము చెప్పగలడా - లక్షణగ్రంథము ఏమైన చదివినాడా - అనువిషయములను మూలంద్రోచి - ఒజ్జలు నేర్పుజిత్తులచేత అర్ధకల్పముగా నుత్తరమువ్రాయందగు ప్రశ్నపత్త్రముల నిచ్చుచుండుటచేతను, ఎట్లువ్రాసినను 100 కి 80-90 మందికి జయము తప్పనందునను, ఈకాఠిన్యముకలిగినది.

కావున పైపొరబాటులను సవరించుకొనినయెడల ఈమిథ్యా కాఠిన్య మిథ్యాసౌలభ్యములు తొలగును.

లాటినుమాని డాంటి ఇటాలియనులోవ్రాయుట మనపూర్వులు సంస్కృతమునుమాని యాంధ్రములో గ్రంథములను వ్రాయందొడంగుట వంటిదిగా గ్రహింపవలయునుగాని అగ్రామ్యస్థానమున నిర్బంధపూర్వకముగా గ్రామ్యము పెట్టుటవంటిదిగా నెన్నదగదు. ఏలయన రసజ్ఞులు కారణవిశేషములంబట్టి గ్రామ్యమందు గ్రంథములను వ్రాసికొందురుగాక, బొబ్బిలిపాటయు దేశింగురాజు పాటయు గ్రామ్యములేగదా, ఆరాధ్యమల్లనరచించిన జంగాల బొబ్బిలి పాటలోని రసములో శతాంశమయినను రంగరాట్చరిత్ర పద్యకావ్యమునలేదు.....అట్లేగ్రామ్యమున సుద్దులును కథలును గద్దెలును రసవంతములు గలవు. 'వాక్యం రసాత్మకంకావ్యమ్మ'ని గదా విశ్వనాథకవిరాజు అనుశాసించినాడు. అది హృదయంగమముగాని, బాలురపాఠపుస్తకములను గ్రామ్యమున వ్రాయుటయు, ఆగ్రామ్యపుస్తకములను దొరతనమువారు నిర్బంధపూర్వకముగా పాఠశాలలో చదివించుటయు, అసమంజసము.

ప్రతిగ్రామ్యమును సర్వజనీనమనుట సరిగాదు. గ్రామ్యములు పెక్కుదెఱంగులు. గంజాంజీల్లా యోడ్రగ్రామ్యము, విశాఖపట్టణ రాజమేహేంద్రవరాది హిందూస్థానీగ్రామ్యము, నెల్లూరు కడపజిల్లాల శుద్ధగ్రామ్యము, మదరాసు చిత్తూరు తంజావూరు సేలము తిరుపత్తూరు మధుర తిరుచనాపల్లుల యఱవ గ్రామ్యములు, బల్లారి బెంగుళూరుల కన్నడగ్రామ్యము, కర్నూలు హైదరాబాదుల తురకగ్రామ్యము,, ఇంక ధార్వాడ బెల్గాముల కన్నడ మరాటి గ్రామ్యము, ఈతూర్పునాటి మనకు గోడవలెనుండు హైదరాబాదు పశ్చి మోత్తరపు జిల్లాలగ్రామ్యములు పెక్కులుగలవు. ఒకజిల్లాగ్రామ్యము మఱియొక జిల్లావారికి తెలియదు సరిగదా అసహ్యముగా కూడనుండును. ఇవిగాక యిన్ని జిల్లాల నానాజాతుల గ్రామ్యములుకలవు. అందులో మనజిల్లావే అనేకములు మనకే తెలియవు.

నిర్బంధగ్రామ్య ప్రాబల్యముచే అగ్రామ్యగ్రంథములు మూలబడును. మనపూర్వులమహిమ, వారుమనకై గ్రంథరూపమున నిక్షేపించి పెట్టిపోయిన ధర్మనీతిజ్ఞాన విజ్ఞానములు, వారికవనములసొంపు, రామకృష్ణాద్యవతారమూర్తుల దివ్యచరిత్రములు, కృష్ణరాయాది మహాపురుషుల వైదుష్యాది విశేషములు, సర్వమును ఆంధ్రులకు అబ్బని లిబ్బియగును. ఆపారంపరిచే ఆంధ్రులకు, గీర్వాణగ్రంథములుకూడ మూలబడును.

........ఆంధ్రమహాజనులు దొరతనమువారికి విన్నవించుకొని ఈ నిర్బంధ గ్రామ్యమును వెంటనే తొలగించి మఱి తల చూపకుండం జేసికొనవలయుననియు హైస్కూలు ఫారములకును ఇంటర్మీడియేట్ బి.ఏ., పరీక్షలకును ఏదేనొకదేశభాష (వర్నాక్యులరు) మునుపటివలె అవశ్యపఠనీయముగా జేయించుకొనుడనియు మహాజనులకెల్ల మదీయవిజ్ఞాపనము.

ఈయుపన్యాససారముకొఱకే మరల గురుజాడ అప్పారావుగారు ఇట్లువ్రాసిరి.


12th june 1912.

Dear friend,

Please accept my sincere thanks for your kind note of the 9th inst. I have the first edition of Kathasarithsagara at home. Please order your publisher to send me a copy of the new edition when it is out by V.P.P. I have not yet received the booklet which you promised to send as a specimen. Your remarks about yourself show your modesty. None of us can altogether shake off the habits and sentiments of a lifetime, but original thinkers like you who combine real scholarship with literary power are able to chalk out new paths to meet new conditions and to save the literature from stagnation. So I want to study your writings. Your poetry is qute in the grammar and diction of the old ports. In prose you have certainly deviated, but what I fail to understand is how you can make common cause with persons like Mr. Vavilikolanu- Subbarao who takes on one hand an extreme position in prose and reflects a decadant taste in poetry and with writers of the Viresalingam School on the other from whom there is greater danger to the old literary dialect than from persons who advocate cultivation of spoken dialects. I think as a leader it is your duty to examine the merits and defects of that school of prose which is in greater vogue than the classical style that you advocate.

I await with interest your pamphelt on Gramya...... I hope you have recovered from the fatigue of the journey to Nidadavolu.

yours very sincerely,
G. V. Appa Rao.


P. S. I just now received your pamphlet. Please accept my best thanks for it. I wanted to read the best presentation of the opposite views. I shall try to meet your objections. We differ little on questions of authority. I am afraid I did not make myself sufficiently intelligible at the conference. You meet contentions in a shape in which I did not raise them.

I admire you for many things especially for the atmosphere of historical romance and literary patriotism with which you have developed the story of prataparudra. Perhaps those times were as prosaic as ours as all present is for a present generation, but you have succeeded in idealising characters and institutions. Few so called critics understand the merits of the drama. Telugu critcs grovel in the mud of the grammatical accuracy and the minutia of artificial art. Admiring you as I do, I should be loth to cross awords with you. But you have left us no alternative. therefore I crave your permision, as Pandavas craved that of Bhishma. If I succeed in convincing you even to less than least extent, it can be only with your help.

With kind regards
I remain
yours sincerely,
G.V. Appa Rao.

అప్పారావుగారు శాస్త్రులవారికి జాబులు వ్రాయుచునే యుండిరి. తా మెంత వ్యావహారిక భాషావాదులైనను వేంకటరాయశాస్త్రులవారివంటి వశ్యవాక్కులను తమ మతమునకుత్రిప్పిన ఎల్లవారికిని అనుకరించుటకు తగిన వ్యావహారికము వారు వ్రాయుదురనుతలంపే కారణము గావలయును. ఏభాషయైనను వేంకటరాయశాస్త్రులవారు వ్రాయగలరను దృడమగు నమ్మకము అప్పారావుగారి కేర్పడియుండినది. ప్రతాపరుద్రీయమును రచించిన ప్రతిభాశాలి ఎట్టి శైలియైనను వ్రాయసమర్థుడనియు వ్యావహారికభాషాశైలి వారికడ నాంధ్రులునేర్చుకొనవలసినదేగాని ఇతరత్ర అసాధ్యమను నుద్దేశముతో కాబోలు 8-జన-1914 తేది యొకజాబులో నిట్లువ్రాసియున్నారు.

"I have to ask you one question. You used in your plays various class dialects on the ground of ఔచిత్యము. Why did you omit the best of them, i,e, the language of the cultured Brahmans. Is there no use for it any where? Does not the same ఔచిత్యము require that characters of a certain social standard use it ?" అని

ఈజాబులకు శాస్త్రులవారేమి జవాబువ్రాసిరో తెలియదు. శాస్త్రులవారి జాబులుదొరకిన నదృష్టవంతులమే. కాని అప్పారావుగారు కోరినపనిమాత్రము వారుచేసినట్లు లేదు. భాషను సులువుపఱచనగును; ఆయావిషయములకు తగినట్లు ఔచిత్యముంజూచుకొని వ్రాయవచ్చుననియే శాస్త్రులవారి యభిప్రాయము. ఎవరికితోచినట్లు వారు 'ఎల్లామాట్లాడుతామో అల్లావ్రాయాలి' అనుమతమును శాస్త్రులవారు ఎంతమాత్ర మొప్పుకొనలేదు. మఱి శాస్త్రులవారి యభిప్రాయమేనగా శబ్ద స్వరూపములు చెడక రసవంతముగా నెవరికితోచినట్లు వారువ్రాసికొనవచ్చును. రసము ప్రథానము. కాని చదువుకొను విద్యార్థులకు మొదట మొదట సాధువాఙ్మయమునే నేర్పవలయును-అన్నిభాషలో - ఈవిధముగా వ్రాయవలయును, ఈవిధముగాకూడదు-అను నేర్పాటులు జలలిపివంటివని వారి యభిప్రాయము.__________