వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/కాలానుక్రమణిక

వికీసోర్స్ నుండి

కాలానుక్రమణిక


1853 డిసెంబ్రు 21 తేది వేంకటరాయశాస్త్రులవారి జననము

1860 జూలై 14 తేది పూడ్ల రామకృష్ణయ్యగారి జననము

1869 శాస్త్రులవారు మెట్రిక్యులేషను పరీక్షయగుట

1862 చిన్నయసూరిగారి నిర్యాణము.

1875 శాస్త్రులవారు ఎఫ్. ఏ. అగుట.

1879 ఆగస్టు 3, వీరేశలింగము పంతులువారు విధవావివాహమును గురించి చేసిన యుపన్యాసము మిద శాస్త్రులవారు రాజమండ్రినుండియే ఖండనోపన్యాసముంగావించిరి. [వీ. లిం. స్వీయచరిత్ర -పు 140]

1883 స్త్రీ పునర్వివాహ దుర్వాదనిర్వాపణ గ్రంథము ప్రకటితము.

1885 శబ్దరత్నాకర ప్రథమ ముద్రణము.

ఆముద్రితగ్రంథచింతామణి ప్రారంభము.

1886 జూలై 25 శాస్త్రులవారి కుమారులు వేంకటరమణయ్య (రాజన్న) గారి జననము.

ప్రక్రియా ఛందస్సు, అలంకారసారసంగ్రహముల రచన

భోజవిక్రమార్క చరిత్రములు తెనుగుటీకలతో ముద్రించుట

నవంబరు క్రిశ్చియన్కాలేజీ సంస్కృతపండిత పదవినందుట

1887 బి. ఏ. పరీక్షకుపోవుట.

1888 ప్రతాపరుద్రీయకథను జనవినోదినిలో బ్రకటించుట

1890 జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను ప్రారంభించుట

1891 కథాసరిత్సాగర ప్రథమముద్రణము

మార్చి, 20 శుక్రవారము సాయంకాలము శ్రీ. బ. సీతారామాచార్యులవారి నిర్యాణము. జనవినోదినీ సంపాదకత్వమును మానుకొనుట (?)

నాగానందనాటక ప్రకటనము. పాత్రోచితభాషా ప్రారంభము.

1894 కొక్కొండ వేంకటరత్నము పంతులవారి బిల్వేశ్వరీయమును పూండ్ల రామకృష్ణయ్యగారు విమర్శించుట.

1895 ధ. రా. గారి చిత్రనళీయ ప్రకటనము.

1896 శాస్త్రులవారి ఆంధ్రాభిజ్ఞాన శాకుంతలనాటక ప్రకటనము.

1897 ప్రతాపరుద్రీయనాటక ప్రకటనము

కన్యాశుల్కము. అప్పారావుగారిది.

ఏప్రిలు - ఆంధ్ర కవి పండిత సంఘము. ప్రథమ సమావేశము.

1898 జక్కన విక్రమార్కచరిత్ర ముద్రన విమర్శనము. శారదాకాంచిక ప్రథమకింకిణి. ఆంధ్ర ప్రసన్న రాఘవనాటక విమర్శనము. శా. కా. ద్వితీయకింకిణి.

1899 జనవరి 1 తేది. ఆంధ్ర కవి పండిత సంఘ ద్వితీయ సమావేశము.

ఏప్రిలు 31 తేది. ఆంధ్ర భాషాభిమాని సమాజ ప్రారంభము నెల్లూరు.

1900 కాళహస్తి మహాత్మ్య ముద్రణ విమర్శనము. శా. కా. 3 కింకిణి.

వేంకటరమణశాస్త్రులవారి నిర్యాణము.

1901 గ్రామ్యభాషా ప్రయోగ నిబంధనము. శా. కా. 4 కింకిణి.

మోచాకుసుమామొదవిచారము శా. కా. 5 కింకిణి (?)

మార్చి - శేషగిరి శాస్త్రులవారి నిర్యాణము.

ఉషానాటక ప్రకటనము.

1902 మేఘసందేశము పదప్రయోజనిక

1904 సెప్టెంబరు 1 తేది పూండ్ల రామకృష్ణయ్యగారి నిర్యాణము.

ఆముద్రిత గ్రంథ చింతామణి నిలిచిపోవుట.

1908 అక్టోబరు. జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను మరల నెలకొల్పుపుట. 1909 పుష్పబాణ విలాసము. తెనుగుటీక.

1910 క్రిశ్చియన్కాలేజి నుండి విరామము. గ్రంథముద్రణ కార్యములు

రఘువంశము 6 సర్గలు తెనుగుటీక.

కుమారసంభవము. 6 సర్గలు తెనుగుటీక.

అమరుకావ్యము. తెనుగుటీక.

రసమంజరి.

భర్తృహరి శతకత్రయము. సంపూర్ణాంధ్ర వ్యాఖ్యతోను తెనుగుపద్యములతోను ముద్రితము.

పంచతంత్రము మూలము మాత్రము

చేమకూర - సారంగధర చరిత్ర. లఘుటీక

చేమకూర - విజయవిలాసము. లఘుటీక

గౌరన - హరిశ్చంద్ర ద్విపద. లఘుటీక

మడికి సింగన - జ్ఞానవాసిష్ఠ రామాయణము

బాణాల శంభుదాసు - సారంగధర ద్విపద

విన్నకోట పెద్దన - కావ్యాలంకార చూడామణి

ముక్కు తిమ్మన - పారిజాతాపహరణము.

ప్రియదర్శికా నాటిక - శ్రీహర్ష కృతి - సంస్కృత టిప్పణము, తెనుగు సంపూర్ణ టీక, గద్యపద్యములుగా ఆంధ్రీకరణము.

హితోపదేశము - తెనుగు తర్జుమాతో.

దశకుమార చరితము - తెనుగు తర్జుమాతో.

బేతాళ పంచవింశతిక - తెనుగు వచనము

విక్రమార్కుని యద్భుత కథలు - తెనుగు వచనము.

1912 గ్రామ్యాదేశ నిరసనము - ఉపన్యాసము

1913 శృంగార నైషధము - సర్వంకష వ్యాఖ్య.

1914 నవంబరు 18 తారీఖు-నెల్లూరు, మూలపేటలో నివాసము.
1915 డిసంబరు-సూర్యరాయాంధ్ర నిఘంటుసంపాదకత్వ ప్రాంభము.
     అందులకై మదరాసు కాపురము
1916 బొబ్బిలియుద్ధ నాటకప్రకటనము.
     శ్రీ వేంకటగిరిమహారాజా గోపాలకృష్ణయాచేంద్రులవారి మరణము
1918 పిబ్రవరి నిఘంటువుతో సంబంధము వీడిపోవుట
1919 జ్యోతిష్మతీవిక్రయము
     మాళవికాగ్ని మిత్రనాటకము.
     మహోపాధ్యాయబిరుదము, రు 1116. బహుమానము
     ఆంధ్రసాహిత్యపరిషదధ్యక్షత్వము.
1920 విమర్శవినోదప్రకటనము
     తిక్కనసోమయాజివిజయము-తిక్కనవర్ధంత్యుపన్యాసము.
     ఉత్తరరామచరిత్రనాటకాంధ్రీకరణము.
     ఆముక్తమాల్యదవ్యాఖ్య తే 24-6-1920 నాడు ప్రారంభించి
     తే 28-10-1920 నాటికి పూర్తిగావించిరి.
1921 విక్రమోర్వశీయము
     రత్నావళీనాటిక
     సాహిత్యదర్పణమును ఆంధ్రీకరించుటకు పిబ్రవరి 2 తారీఖున ప్రారం
     భించి ఏప్రిలునెల 11 తారీఖునాటికి పూర్తిగావించిరి.
     ఆంధ్రహితోపదేశచంపువు
1922 జనవరి-నేటివిండ్సరుప్రభువు, వేల్సుయువరాజుగా మనదేశముంకు
     వచ్చినప్పుడు మదరాసులో సన్మానము చేయుట.
     మరల నెల్లూరుకాపురము

       జూలై-స్వాములవారి సత్కారము మహామహోపాధ్యాయ,
       సర్వతంత్ర స్వతంత్రేత్యాది బిరుద ప్రదానము.
       నవంబరు 14 తేది శాస్త్రులవారికుమారులు వెంకటరమణయ్యగారి
       నిర్యాణము.
1923 ఆంధ్రమహాసబాధ్యక్షత్వము-చిత్తురు.
1924 గద్వాలు ప్రయాణము.
1925 ఆంధ్రభాషాభిమానిసమాజము. రజతోత్సవము.
      మరల మదరాసు కాపురము.
1926 కంటిఆపరేషను. ఆముక్తముద్రణము.
1927 ఆముక్తప్రకాశనము.
      కళాప్రపూర్ణబిరుదము. బెజవాడ పురపాలకసంఘమువారు 'నగర
      స్వాతంత్ర్యగౌరవము' నొసంగుట
1928 డిసంబరు. శాస్త్రిగారి తల్లిగారు గతించుట ఏనాదిరెడ్డిగారు ఋణ
      మునుతీర్చివేయుట.
1929 జూను, 18 తేది ఉదయము 5-45 గంటలకు శాస్త్రిగారి నిర్యాణము.
1931 నవంబరు 12 తేది వారిసోదరులు వేంకటాచలయ్యగారి నిర్యాణము.
1932 ఆంధ్రహితోపదేశచంపూముద్రణము
1935 ఆంధ్రసాహిత్యదర్పణ ముద్రణము.


___________