వెలుగులే లింగమై వెలుగు దేవా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు


పల్లవి 
వెలుగులే లింగమై వెలుగు దేవా వెలుగువై గుండెలో వెలుగ రావా

తరచి చూడ జ్ఞానమే వెలుగు సుమ్ము
వెలుగులేమొ కిరణమై తాము ప్రమ్ము
కిరణమేమొ స్తంభమై హొయలు చిమ్ము
శివుని లింగ మరయగా నిదియె సుమ్ము

సర్వతోముఖమ్ము గాదె కిరణలింగము
తత్త్వమరయ పంచముఖములై వెలుంగును
ధారయైన జలము గూడ స్తంభరూపమై
ప్రియము గూర్చు శివునకు తగిన రూపమై

వెలుగులే కాలమై పదియు రెండునై
సూర్యులై నదులునై విస్తరిల్లగా
ద్వాదశ జ్యోతులై శివుని లింగము
సచ్చిదానందముల్ పంచి యిచ్చుగా

ప్రమ్ము = చుట్టూతా కమ్ము