Jump to content

వృక్షశాస్త్రము/వేప కుటుంబము

వికీసోర్స్ నుండి

వేప కుటుంబము.

వేప చెట్టు మనదేశమందంతటను బెరుగుచున్నది.

ఆకులు:- ఒంటరి చేరిక, కణుపు పుచ్ఛములు లేవు. మిశ్రమ పత్రములు, విషమ భిన్నము, చిట్టి యాకులు బల్లెపు నాకారము, మొదలు వంకరగా నుండును. కొన వాలము గలదు. అందున రంపపు పండ్లున్నవి. రెండు వైపుల సన్నగ నుండును.

పుష్పమంజరి:- కణుపు సందుల నుండి రెమ గెలలు పువ్వులు చిన్నవి.

పుష్పకోశము:- సంయుక్తము 5 తమ్మెలు గలవు. తమ్మెకొన గుండ్రముగా నుండును. నీచము.

దళవలయము:- ఆకర్షణ పత్రములు 5., నిడివి చౌకపు నాకారము.

కింజల్కములు: కాడలన్నియు గలిసి యొక గొట్టము వలె నేర్పడి యున్నవి. ఈ గొట్టము లోపలి వైపున పుప్పొడి తిత్తులున్నవి.

అండకోశము: అండాశయము, ఉచ్చము. 3 గదులు. అండాశయము చుట్టు బళ్ళెరము గలదు. కీలము ఒకటి, సన్నముగానుండును. ఫలము లో పెంకు కాయ.

ఈకుటుంబములో విస్తారము వృక్షములే గలవు. ఆకులకు గణుపు పుచ్ఛము లుండును. ఒంటరి చేరిక, సాధారణముగ పక్ష వైఖరిగ నుండును. చిట్టి యాకుల మొదలు వంకరగా నుండును. పుష్పములు చిన్నవి. రక్షకపత్రములు. ఆకర్షణ పత్రములు, ఐదేసి కలవు. ఆవి కలసి యైనను వివిడివిడిగా నైనను నుండును. కింజల్కపు కాడలన్నియు గలసి ఒక గొట్టము వలె నేర్పడును. ఈ గొట్టము యొక్క లోపలి వైపునే నేర్పడును. ఈ గొట్టము యొక్క లోపలి ఒవైపుననే పుప్పొడి తిత్తులు గలవు. అండాశయము చుట్టు బళ్ళెరము గలదు. అండాశయములో దరుచుగా నైదు గదులుండును.

వేపచెట్టు: మిక్కిలి యుపయోగ మైనది. ఆకులు వువ్వులు కాయలు, గింజలు, వేరులు అన్నియు ఔషదముల లో బనికి వచ్చును. చెట్టు బెరడను, వేరు బెరడును లేత కాయలను కొన్ని జ్వరములకు మంచి పని చేయుచును. వేప నూనె చర్మ వ్యాధులకు మంచిది. ఆకుల కషాయముతో పుండ్లు కడుగ వచ్చును. స్పోటకము మొదలగు వానికిని ఆకుల రసమును బూయుట మంచిది. పువ్వులు అజీర్ణమునకును నీరసమునకు బని చేయును. మరియు వేప కల్లు. క్షయకును, కుష్టునకును కూడ మంచిపని చేయును. ఈ కల్లు ఒక్కొక్కప్పుడు చెట్టు చివర నుండి స్రవించును. ఇట్టి దానినే తీయుటకు చెట్టు మొదట గొంత త్రవ్వి మంచి వేరు మీద నాటు పెట్టి దాని క్రింద నొక పాత్ర బెట్టుదురు. దీనిలోనికి రసము దిగును. వేప కలపయు మిక్కిలి గట్టిగా నుండును. బళ్ళు, నా గళ్ళు, పడవలు మొదలగునవి చేయుదురు. వేపచెట్ల గాలిని శుబ్రపరుచును. అది ఎక్కువగా నున్న చోట్ల కలరా తక్కువగా నున్నది. ఇవి చల్లని నీడ నిచ్చును

తురకవేప-: చెట్లును పెద్దవియె. వీని యాకులు ద్వి భిన్నముగను త్రి భిన్నముగను కూడ నుండును. దీని వేరు బెరడు గింజలను కూడ కొందరు ఔషధములలో వాడుదురు. దీని గింజలతో తాళవమును చేయుదురు.

బిళ్ళుచెట్టు:- రాతి నేల లందు బెరుగును. ఆకులు పక్ష వైఖరి. చిట్టి యాకు లిరువది జతల వరకు నుండును. దీని కలప చాల బాగుండును.

గారుగు:- చెట్టు మిక్కిలి పెద్దది. వేసవి కాలమందు బుష్పించును. దీని కాయలను తిందురు.

వల్లరసి:- పెద్ద చెట్టు. శీతాకాలము నందు పుష్పించునును. దీని బెరడును చాల చేపలుండు నెచ్చట నైనను వేసినచో నవి పైకి తేలి త్వరగా బట్టు వడును. కలపయు బాగుండును.

చిన్నవల్లరసి:- కొండల వద్ద బెరుగు చిన్న చెట్టు. ఆకులకు మూడేసి చిట్టి యాకులున్నవి.

మాల్కుంగుని కుటుంబము

ఈ చిన్న కుటుంబములో చెట్లు గుబురు మొక్కలు గలవు. ఆకులు ఒంటరి చేరికగా నైనను, అభిముఖ చేరిక గానైన నుండును. అవి మర్రి ఆకుల వలె బిరుసుగా నున్నవి. పువ్వులలో మిధున పుష్పములు, ఏక లింగ పుష్పములు కూడ గలగు చున్నవి. పుస్ప కోశము చిన్నది. నాలుగైదు తమ్మెలు అల్లుకొని యుండును. కాయ నంటు కొని పుష్పకోశము స్థిరముగా నుండును. ఆకర్ణ పత్రములు నాలుగో అయిదో యుండును. కొన్నిటిలో లేక పోవుటయు గలదు. ఇవియు నల్లు కొనియే యుండును: కొన్నిటిలో బళ్ళెరము నంటియున్నవి. కింజల్కములు 3 మొ. 5 . కాడలు వెడల్పుగా నుండును. అండాశయములో గదులు 3. మె. 5 వరకు గలవు. ఒక్కొక్క దానిలో రెండేసి అండము లుండును. కీలము పొట్టిగా నుండును. గొన్నిటిలో లేనే లేదు. కీలాగ్రము త్రిభుజాకారము.

మాల్కంగుని:- మొక్క దేనినైన ఆనుకొని పొదవలే బెరుగును. ఆకులు అండాకారము. పువ్వులు చిన్నవి. పచ్చగా నుండును. దీని గింజలనుండి తీసిన చమురును ఔషదములలో ఉపయోగించుదురు. ఉబ్బు జబ్బులకది గుణమి