వృక్షశాస్త్రము/మైసాక్షి కుటుంబము

వికీసోర్స్ నుండి

151

గలుగు చున్నవి. పువ్వులు సరాళము. పుష్పకోశమునకు 3...5 తమ్మెలు గలవు. అవి అల్లు కొనియైనను, తాకుచు నైననుండును. ఆకర్షణ పత్రములు 3...5 ఇవి యు మొగ్గలో బుష్పకోశపు తమ్మెలుండినట్లే యుండును. కింజల్కములు, ఆకర్షణ పత్రములన్ని గాని, అంతకు రెట్టింపుగాని యుండును. కొన్నిటిలో మాత్రము అసంఖ్యములుగా నున్నవి. కాడల కడుగున నొక పొలుసుండిన నుండును. పుప్పొడి తిత్తులు నిడివి చౌకపు నాకారము. అండాశయములో నండము ఒకటియే యుండును.

మద్ది పాలు చెట్టు బెరడును ఔషధములలో వాడుదురు. ఈ చెట్లనుండి గుగ్గిలము వంటి పదార్థమొకటి వచ్చును. బెరడున కంటె నిదియే మంచి పని చేయును. ఇది నీళ్ళలో గరుగదు. కొన్ని ద్రావకములలో గలిపి మూత్ర వ్యాధులు, శెగ దగ్గు,. జిగట విరేచనములు మొదలగు జబ్బులకిత్తురు.

గార చెట్టు
- రాతి నేలలందు బెరుగును. దీని పండు గుంజు కాకిమర్రిపండు వలెనే చర్మ వ్యాధులకు బని చేయును.

మైసాక్షి కుటుంబము.


ఈ కుటుంబమునందు జెట్లును, గుబురు మొక్కలును గలవు. ఆకులు, ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు 152

చిట్టి యాకులు గలసి యైనను, విషమభిన్నముగ బక్షపైఖరినైన నుండును. పువ్వులు చిన్నవి. సరాళము మిధున పుష్పములు ఏక లింగ పుష్పములు కూడ గలవు. పుష్ప కోశమునకు 3...6 తమ్మెలుండును. ఇవి మొగ్గలో నల్లుకొని యైనను ఒక దానికొకటి తాకుచునైన నుండును. ఆకర్షణపత్రములు 3...6 గలవు. కొన్నిటిలో మాత్రమడుగునందు కలసి యున్నవి. కింజల్కములు ఆకర్షణ పత్రములన్నియో అంతకు రెండు రెట్లో యుండును. కొన్నింటిలో నవియన్నియు సమముగా లేవు. అండాశయములో 2..5 గదులున్నవి. సాధారణముగ రెండేసి అండములుండును. స్థంభ సంయోగము. ఫలము ఎండు కాయ, పగులదు.

మైసాక్షి చెట్లు హిందూ స్థానమునందెక్కువ బెరుగు చున్నవి. శీతాకాలమందు వానిమీద నాట్లు పెట్టిన యెడల జిగురు వంటి పదార్థము వచ్చును. అది పరి సుభ్రముగా నున్న యెడల గొంచము పచ్చగా నుండును. దీని నౌషధములలో వాడుదురు. ఇది మిక్కిలి చేదుగానుండును గాన లోపలకు పుచ్చుకొనలేరు. కడుపు ఉబ్బుట ఎక్కిళ్ళు మొదలగు వానికి దేహముపైన రాతురు. అది శరీరమునుగట్టిగా నంటు కొనును. 153

బాలింత బొలము
- చెట్లు మన దేశములో నంతగా లేవు. ఈచెట్లనుండియు జిగురువంటిపదార్థము వచ్చును. దీనిని ఔషధములలో వాడుదురు.
నల్ల రోజను
- చెట్లు పడమటికనుమలదగ్గర నెక్కువగా బెరుగు చున్నవి. వీని నుండి వచ్చు జిగురు వంటి పదార్థముతో దగ్గు మొదలగు వానికి, గుండెల మీద పట్టు వేయుదురు.
ఫరంగి సాంబ్రాణి
- చెట్లు కొందల మీద బెరుగును. దీని నుండియు జిగురు వచ్చును. దీనిని పొడుము గొట్టి పంచదార కలపి నీళ్ళలో వేసి పుచ్చుకొన వచ్చును. ఆజీర్ణ విరేచనము మొదలగు నవి కట్టును. ఈ పొడిని మంచి నూనెలో నైనను, గసగసాల నూనెలో నైనను, గలిపి కాచి, వడగట్టి, తలకు రాచు కొనుచున్న యెడల దలవెండ్రుకలు పెరుగును.
అండుగపిసను
- చెట్టును పై దానివలెనే యుండును. ఈ పదార్థమున కొక విధమగు సువాసనగలదు. దీనిని గుగ్గిలము సాంబ్రాణి పొగ వేసినట్లు పొగ వేయుదురు. ఈ చెట్టు కలుప గట్టిగానె యుండును. దీనితో తరుచుగా తేయాకు పెట్టుటకు పెట్టెలు చేయుదురు. వంట చెరుగుగ కూడ బాగుండును.