Jump to content

వృక్షశాస్త్రము/పెండలము కుటుంబము

వికీసోర్స్ నుండి

425

రందురు. కుళ్ళిన ఆవుపేద మంచిబలమునిచ్చునని ఇంకొక కొందరు చెప్పుదురు. బహుశ ఈ ఎరువు లన్నియు ఆయా ప్రదేశములను బట్టి యుండును. కాయగాయు చున్నప్పుడి నీరు విస్థారముగ దగుల చుండవలెను. వీనిపై నీడ విస్తారముగ నుండ రాదు. ఉన్నచో కాయ మిక్కిలి పెద్దిగానగును గాని సువాసన తగ్గి పోవును. పండు పండునపుడు భూమిలో ప్రకాండము చుట్టు కొమ్మలుండును. ఈ కొమ్మలను నాటి యైనను పండులోనుండు నల్లని గింజలగాని పండు పై నుండు ఆకుల కొమ్మ గాని పాతిన మొక్కలు మొలచును. దీని ఆకులనుండి ప్రశస్త మగు నారవచ్చును. కొన్ని దేసములలో ఈ నారతో మిక్కిలి సన్నని బట్టలు నేయు చున్నారు. మరియు ఈ నార దారము మిక్కిలి గట్టిగా నుండుట చే చెప్పులు కుట్టుటకు నుపయోగించు చున్నారు.


పెండలము కుటుంబము.


ఇది యొక మిక్కిలి చిన్న కుటుంబము. దీనిలో నన్నియు గ్తుల్మములే. అవియు తీగెలు. దీనికి కాకర, పొట్ల గెలయందున్నట్లు నులి తీగెలు లేవు. ఆకులు ఒంటరి చేరిక లఘు పత్రములు. సమాంచలము. వీని ఈనెలు, సాధారణ 426

ముగ నన్ని ఏకదళబీజకపు మొక్కల ఆకులందున్నట్లుండక, తమలపాకు నందు వలె నున్నవి. పుష్పములు ఏక లింగములు. కొన్నిటిలో, ఏక లింగ పుష్పములు వేరు వేరు మొక్కల మీదనే యున్నవి. పుష్పములకు ఆరు తమ్మెలతో, రంగుగలిగిన పుష్పనిచోళము గలదు. అండాశయము నీచము. మూడుగదులున్నవి.

పెండలమును పెద్ద దుంపల ముక్కలను గోసి వానిని బాతి పైరు చేయుటయే వాడుకయై వున్నది. దుంపలూరుటకు నేల గట్టిగా నుండ రాదు. అందులకు కొంచెమిసుక నేలలు మంచివి. పొలమును లోతుగ ద్రవ్వి నిండ యెరువువేసి దున్నుదురు. తరువాత మూడు నాలుగు అడుగుల వెడల్పున పొలము పొడుగున మళ్ళు గట్టి మళ్ళోఅగట్లు మీద అడుగున్నర దూరమున ఈ ముక్కలను పాతుదురు. కొన్నిచోట్ల దుంప ముక్కలను మొదటనే పొలములో పాతక చిన్న మొక్కలుగ నెదుగు వరకు వేరే మడులలో పెంచు చున్నారెఉ. తీగెలు ప్రాకుటకు ప్రతి దాని వద్ద నొక గడ కర్రను పాతవలయును. అట్టి పాతిన గెడ కర్రలను నాలుగైదు గలిసి వాని చివర నొక కట్టు కట్టు చున్నారు. కొన్ని చోట్లలో గెడ కర్రలకు బదులుగా చెట్లనే పెంచు చున్నారు. కొన్ని చోట్లనేమియు 427

పాత దీగెను భూమిమీదనే ప్రాకనిచ్చు చున్నారు. దుంపలు బాగుగ నేడెనిమిది నెలలకు ఊరును. నేలను బట్టియు, రకమును బట్టియు ఎకరమునకు అరువది మణుగుల మొదలు రెండు వందల మణుగుల వరకు వచ్చును.

బంగాళ దుంపల కంటె నివియే బలమగు నాహార పదార్థము.

అవతంగ తీగె మెట్ట నేలలందు మొలచు చున్నది. ఇదియు దుంపలు బారును.


ఉల్లి కుటుంబము.


ఉల్లి మొక్కలను పెక్కు చోట్ల సేద్యౌ చేయుచున్నారు.

ప్రకాండము లసునము. భూమిలోపల నుండును. పలుచగా నుండును. ఉల్లి పాయల అడుగున గరుకుగరుకుగా నుండునదే ప్రకాండము. కొన్ని ఆకులు మార్పు చెంది ఉల్లి పాయలైనవి.

ఆకులు లల్ఘు పత్రములు. సన్నముగాను పొడుగు గాను నుండును. వాని అడుగు భాగము భూమిలో నున్న భాగము, దళసరిగాను, తెల్లగా నుండును. ఆకులు గొట్టముల వలె నొకదాని నొకటి చుట్టుకొని యుండును. సమాచలము సమరేఖ పత్రము. ఉల్లి మొక్క పుష్పించి కాయలు గాచుటకు ఆహార పదార్థమును పాయలలో నిలివ చేసికొనును.

పుష్ప మంజరి. గుత్తి వృంతము ఆకుల మధ్య నుండి వచ్చును.