వృక్షశాస్త్రము/కిత్తనార కుటుంబము

వికీసోర్స్ నుండి

417

దీని సువాసనకై తాంబూలమునందు పిండి వంటల యందు వాడు చున్నాము. దీనిని ఔషధములలో కూడ వాడుదురు. రాజులును మిక్కిలి ధనవంతులు దీనితో బొట్టు పెట్టు కొనుదురు. బహుశ దీని బట్టియే సాధరణముగా బొట్టు పెట్టుకొను దానికి కుంకుమ అని పేరు వచ్చి యుండును గాని కుంకుమ పువ్వు దీనియందణు మాత్రము లేదు.


ఒక్కొక్కప్పుడు కుంకుమ పువ్వులో కుసుంబ పువ్వును గలిపి దగాచేయుదురు. కాని కుసుంబపువ్వునకు కూడ మంచి వాసన గలదు.


కిత్తనార కుటుంబము.


కేసరి మొక్క.
ప్రకాండము. భూమిలోపల నుండును. లశునము.
ఆకులు. భూమిలోనున్న లకునము నుండి వచ్చును. తొడిమ లేదు. పత్రములు సన్నముగాను బొడుగుగా నుండును. సమాంచలము. సమ రేఖ పాత్రము రెండు వైపుల నున్నగా నుండును.
పుష్ప మంజరి
ఆకుల మధ్య నుండి ఒకకాడ వచ్చును. ఈ కాడ చివర పుష్పముండును గాని వేరే ఆకులుండవు. పుష్పములు పెద్దవి.

418

పుష్పనిచోళము, సంయుక్తము. 6 దంతములు గలవు. 3 రక్షక పత్రములు, 3 ఆకర్షణ పత్రములు గలసి ఈ పుష్పనిచోళమైనదని యూహింప వచ్చును. తెలుపు. సువాసన గలదు.

కింజల్కములు 6 పొడుగుగా నున్నవి. పుప్పొడి తిత్తులు గాడలపై నూగులాడు చుండును., కింఅల్కములను గలుపుచు నొక పొర గలల్దు.

కేసరి. 419
అండకోశము. అండాశయము నీచము. 3గదులు. అండములు మధ్యస్థంభ సంయోగము, కీలము, గుండ్రము. కీలాగ్రము చిన్నది.

ఈ కుటుంబపు మొక్కలన్నియు గుల్మములే. పెద్ద చెట్లు లేవు. ఆకులు సమ రేఖ పత్రములు ప్రకాండము భూమి లోపలనే యుండును. పుష్ప భాగములన్నియు నొక్కొక్క వలయమున మూడో, ఆరో గలవు. ఈ కుటుంబపు మొక్కల అండాశయము ఉచ్చము. వీని యండాశయము నీచము. ఇది యే భేదము.

ఈ కుటుంబములో ఉపయోగమైన మొక్కలంతగా లేవు.

కేసరి పువ్వులు ప్రాతః కాలమున వికసించి అందముగాను పరిమళముగాను నుండుటచే తోటలందు బెంచు చున్నారు.

కిత్తనార మొక్కయే ఈ కుటుంబములో మిక్కిలి యుపయోగమైనది. అది పెక్కు చోట్ల గంచెలు కంచెలుగా పెరుగు చున్నది. నివాట్టమలే ఆకులు, మట్టలు, మిక్కిలి ద 420

కిత్తనార, పెద్ద పుష్ప మంజరి. 421

ట్టముగా నుండుటచే నీరంతగా లేకున్నను పెరుగ గలవు. ఈ మట్టల మధ్యనుండి ఒకప్పుడు స్థంభమువలె పది అడుగుల ఎత్తు పెరుగు నొక దానిని జూడ నగును. దీని మీద ఆకులు లేవు. కాని, దీని చివర కొమ్మలు రెమ్మలు గలవు. వీని మీద ఆకు పచ్చని మొగ్గలను చూడ వచ్చును. ఈ స్థంభము వంటిది పెద్ద పువ్వుల కాడ. ఆయాకు పచ్చని మొగ్గలు పువ్వుల మొగ్గలు. కిత్త నార మొక్క పూర్తిగ నెదిగిన తరువాత నొకమారు పుష్పించును. పుష్పించి కాయలు గాసిన పిదప నాభారమును మొక్క వహింప జాలక నీరసించి చచ్చి పోవును. ఒక్కొక్కప్పుడా మొగ్గలు పువ్వులు పూయకయే రాలి పోవును. ఇట్లు రాలి పోవు మొగ్గల యందేవియో మార్పులు గలుగుట చేత అవి రాల కున్నను పుష్పింప జాలవు. రాలి భూమి పై బడిన పిదప కొంచెము నీరు తగలగనే గింజలు మొక్కలు మొలచును.

ఈ విధస్ముననే కొన్ని చోట్ల పైరు చేయుట గలదు గాని సాధారణముగ గింజలు పాతి గాని భూమి లోపలనున్న ప్రకాండమును దుంపను ముక్కలుగా కోసి గాని పెంచు చున్నారు. 422

చిన్నమొక్క్లు ఒకటి రెండడుగులెత్తు పెరిగి తరువాత వానిని దీసి పది, పది, అడుగుల దూరమున పాతవలెను. ఒక వేళ దగ్గర దగ్గరగా పాతిన యెడల ఆకులొక దాని నొకటి రాచుకొని విరిగి పోవును. ఈ మొక్కలు పదేండ్లలో పెరిగి పుష్పించును. గాని యవి పుష్పింఫ బోవు చుండగా మట్లను విరగ కుండ కోసెదరు.

వీని నుండి నారదీయుటకు కొందస్రు ఆకులను బాదెదరు. కాని అది మంచి పద్ధతి కాదు. ఆకులను మరికొందరు నీళ్ళలో మరుగ బెట్టు చున్నారు. కొందరు సన్న సన్నముగా చీల్చి చల్లని నీళ్ళతోనే జాడించి జాడించి మెత్తని పదార్థమంతయు బోగొట్టు చున్నారు. కాని నార దీయుటకిప్పుడు మంచి యంత్రములు గలవు. చాపలు, ' బ్రషు లు మొదలగునవి చేయు చున్నారు. మంచి నార తీయగ మిగిలిన పదార్థముతో కాగితములను చేయు చున్నారు.

వీని పువ్వులు పూసెడు స్థంభపు ముక్కలు కత్తి నూరుటకు దోలు వలెనే బాగుండును. ఆ ముక్కలు కత్తికి పదును దెచ్చును. మట్టల రసముతో సబ్బు చేయ వచ్చును. దీనిని కొన్ని వ్యాధులకును ఉపయోగించుచున్నారు. 423

అనాసమొక్కయు నీమొక్కలవలెనే యుండును కాని ఈకుటుంఅములోనిది గాదు. అనాస కుటుంబము నీకుటుంబము కొంచ్మించు మించు నొక రీతిగనె యుండును. అనాస మొక్క తప్ప ఆకుటుంబములోని ఇతర మొక్క లేవియు మనదేశమున పెరుగుట లేదు.

అనాస మొక్క

అనాస మొక్క అమెరికా దేశమునుండి మన దేశమునకు తేబడినది. ప్రధమమున పోర్చ గీసు వారు బ్రెజీలు 424

దేసనుమని పోయినపుడీ పండ్లు బాగుంటుట చూచి వారి దేశములో వ్యాపింప జేసిరి. తద్వారా ప్రపంచ మంతయు వ్యాపించెను. బ్రెజీలు దేశస్తులీ పండును నానాస్ పందందురు. ఈ పేరును బట్టియే పోర్చు గీసు వాఎరి దీనిని అనానాస్ పండనిరి. ఇదియే మన దేశములో అనాస అనరస, అనానాష మొదలగు పెక్కు పేరుగుల బరగుచున్నచి.

అనాసపండు ఉష్ణ దేశములో మాత్రము పెరుగ గలదు. శీతల దేశములకు కొన్ని దేశముల వారెగుమతి చేయు చుండినను మన దేశశ్తులుపేక్ష చేయు చున్నారు. దీనికి పంట తక్కువయగుట ఒక కారణము. అనాస పండ్లలో, అరటి పండ్లు, మామిడి పండ్లలో వలె పలు రకములు లేవు. ఇప్పటికి రెండు రకములు మాత్రము గాన వచ్చు చున్నవి. ఒక దాని మీది కండ్లు విశాలముగతక్కువగను నున్నవి. రెండవరకు మీది కండ్లు చిన్నవి.

ఈ మొక్కలకు ఇసుకతో గూడిన ఒండ్రు మట్టి నేలలు మంచివి. రాగడి నేలలఓ పెరుగ లేవు. వీనికి దగు ఎరువును కూర్చి పలుపురు పలు విధములాగా చెప్పు చున్నారు. కొందరు వర్షములు కురియక పూర్వము చేప పెంట వేయ వలెనందురు. పెంట విస్తారము వేసిన బాగుగ పెరుగునని8 మరి కొంద 425

రందురు. కుళ్ళిన ఆవుపేద మంచిబలమునిచ్చునని ఇంకొక కొందరు చెప్పుదురు. బహుశ ఈ ఎరువు లన్నియు ఆయా ప్రదేశములను బట్టి యుండును. కాయగాయు చున్నప్పుడి నీరు విస్థారముగ దగుల చుండవలెను. వీనిపై నీడ విస్తారముగ నుండ రాదు. ఉన్నచో కాయ మిక్కిలి పెద్దిగానగును గాని సువాసన తగ్గి పోవును. పండు పండునపుడు భూమిలో ప్రకాండము చుట్టు కొమ్మలుండును. ఈ కొమ్మలను నాటి యైనను పండులోనుండు నల్లని గింజలగాని పండు పై నుండు ఆకుల కొమ్మ గాని పాతిన మొక్కలు మొలచును. దీని ఆకులనుండి ప్రశస్త మగు నారవచ్చును. కొన్ని దేసములలో ఈ నారతో మిక్కిలి సన్నని బట్టలు నేయు చున్నారు. మరియు ఈ నార దారము మిక్కిలి గట్టిగా నుండుట చే చెప్పులు కుట్టుటకు నుపయోగించు చున్నారు.


పెండలము కుటుంబము.


ఇది యొక మిక్కిలి చిన్న కుటుంబము. దీనిలో నన్నియు గ్తుల్మములే. అవియు తీగెలు. దీనికి కాకర, పొట్ల గెలయందున్నట్లు నులి తీగెలు లేవు. ఆకులు ఒంటరి చేరిక లఘు పత్రములు. సమాంచలము. వీని ఈనెలు, సాధారణ