వృక్షశాస్త్రము/జిల్లేడు కుటుంబము
297
జిల్లేడు కుటుంబము.
జిల్లేడు మొక్క బీడుగా నున్న అన్నిప్రదేశములందును పెరుగుచున్నది. అది చిన్న గుబురు మొక్క ఆకుల పైనను కొమల పైనను తెల్లని బూడిద గలదు. మొక్క నిండ పాలు గలవు.
- ఆకులు
- - అభిము చేరిక, లఘు పత్రములు, నిడివి చౌక పాకారము. సమాంచలము విషమ రేఖ పత్రములు. ఆకులు దట్టముగ నుండును. ఆకులు దట్టముగా నుండును.
- పుష్ప మంజరం
- - కొమ్మ చివరల నుండి మధ్యారంభము మఝ్జరులులగు గుత్తులు పువ్వులు సరాళము. సంపూర్ణము. తెల్లగాగా నుండును.
- బొమ్మ
- 1. కొమ్మ. 2. పుష్పము. 3. కిరీటము 4. అండ కోశము. 298
- పుష్ప కోశము
- - సంయుక్తము 5 తమ్మెలు గలవు. నీచము.
- దళవలయము
- - సంయుక్తము కాని మొదటి వరకు చీలి యున్నది. తమ్మెలైదు తమ్మెల లోపల వైపున మెత్తని రోమములు గలవు.
కింజల్కములు:- ఇతర పుష్పములందున్నట్లు కింజల్కములు కాన రావు. కాని కిరీటము నంటి ఒకటి వున్నది. 5 చులుకల వంటివి కలసి యున్నవి. ఒక్కొక్క చిలుక, ఒక కింజల్కము నుండి వచ్చినది. ఇక వేరే కాడలు లేవు.
పుప్పొడి తిత్తులును మారియున్నవి. ఆచిలుకల పైన గుండ్రముగ ఐదు పలకలది యొకటున్నది. దాని మీదనే పుప్పొడి తిత్తులు గలవు. ఒక పుప్పొడి తిత్తి యొక్క రెండు గదులు గలసి లేవు. పుప్పొడి ఇతర పుష్పములలో నున్నట్లు రేణువులవలె లేదు. అంతయు కలసి ఒక ముద్ద వలె నున్నది. అట్టిముద్ద గదికొకటి యున్నది.
ఒకపుప్పొడితిత్తి యొక్క ఒకగదిలోని ముద్ద ప్రక్కన వున్న పుప్పొడి తిత్తి గదిలోని ముద్దతో కలసి యున్నది. వీనిని రెండింటిని గలుపుచు నల్లని చుక్క వంటిది వాని మధ్యన గలదు. ఇట్టి ఐదు మూలలను ఐదు గలవు. ఈ పుష్పము నందు పుప్పొడి ముద్దలు క్రిందకు, వీనిని గలుపు నల్లని చుక్కలు పైకి వున్నవి.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము రెండు గలవు. ఇవి రెండును కిరీటములులో మధ్య మరుగుగు పడి వున్నవి. కీలము ఒకటియే. కీలాగ్రము గుండ్రము. ఇది పుప్పొడి తిత్తుల మధ్య నున్నది. రెండు కాయలు కాచును. ఏకదారుణ ఫలము గింజలు చాల గలవు. అవి పలుచగ నుండును. మరియూ వా 299
ని చివర తెల్లరోమములు గలవు. వీని మూలమున గింజలు గాలికెగిరి దూర దూరముగ బోగలవు.
- సుగంధి తీగె.
- సుగంధి
- - తీగె హిందూస్థానమున విశేషముగ పెరుగుచున్నది. దీని నులు తీగెలు లేవు.
- ఆకులు
- - అభిముఖ చేరిక. లఘు పత్రములు. అన్ని ఆకులు ఒక తీరున వుండవు. విషమ రేఖ పత్రము సమాంచలము. అడుగు వైపున మెత్తని రోమములు గలవు.
- పుష్ప మంజరి
- - వృంతములు పొట్టివి. కణుపు సందుల నుండి మధ్యా రంభ మంజరులు పువ్వులు చిన్నవి. కొంచమాకు పచ్చగ నుండును., సరాళము సంపూర్ణము.
- పుష్ప కోశము
- - అసంయుక్తము. 5. 5 రక్షక పత్రములు. కొన సన్నముగా వుండును. నీచము.
- దళ వలయము
- - సంయుక్తము తమ్మెలు దట్టముగా వుండును. అవి అయిదు ఒక దాని నొకటి మొగ్గలో తాకు చుండును. రెండేసి తమ్మెల మధ్య దళవలయము నంటుకొని 5 పాలుసులు గలవు.
- కింజల్కములు-
- కాడలు విడివిడిగానే వున్నవి. కాని పుప్పొడి తిత్తులు గలసి యున్నవి. ఒక్కొక్కగదియందు నాలుగేసి జతల పుప్పొడి ముద్దలు గలవు.
- అండ కోశము
- - అండాశయము ఉచ్చము. రెండు స్త్రీ పత్రములు రెండు విడిగా వుండును. కీలము ఒకటి. గింజలుచాలగలవు. 300
ఇది పెద్దకుటుంబమే. ఈకుటుంబములోని మొక్కలు మనదేశములో చాల గలవు. వీనిలో విస్తారము తీగెలే. అన్నిటిలోను పాలుగలవు. ఆకులు అభి ముఖ చేరిక, లఘు పత్రములు. సమాంచలము. పుష్పములు. మధ్యారంబ మంజరులు. 5 రక్షక పత్రములు, 5 ఆకర్షణ పత్రములు . ( ఇవి కలసి యుండును) 5 కింజల్కములు గలవు. సాధారణముగ పొలసులు వుండును. ఇవి విడి విడి గా నైనను, అన్నియు కలిసి యైనను దళ వలయము నంటి యైనను, కింజల్కముల నంటి యైనను వుండును. అండ కోశములో రెండు విడివిడిగ నున్న స్త్రీ పత్రములు గలవు. గింజలకు సాధరణముగ రోమములుండును.
జిల్లేడు మొక్కలలో రెండు రకములు గలవు. కొన్నిటి పువ్వులు తెల్లగానుండును. మరి కొన్నిటివి కొంచెము నీలిరంగుగానుండును. ఇదియే నల్ల జిల్లేడు అని అందురు. ఈ మొక్క వాయు దేవునకు ప్రతి యనియు రుద్రునకు ప్రీతి యనియు కొందరును, వారి వారి దేవులకు ప్రీతియని అరబ్బీలును, మహమ్మదీయులును దీని పుష్పములతో పూజ చేసెడి వారు. జిల్లేడు మొక్క ఉపయోగకర మగునదియే కాని దానిని అశ్రద్ధ చేయు చున్నారు.
ఈ మొక్కలనుండి మంచి నారతీయ వచ్చును. ఈ నారతో వలలు అల్లినచో చిర కాలము చీకి పోకుండ వుండును. మరి 301
యు నదిమెరయుచును ఎత్తగా నుండుటచే చాల పనులకు పయోగించును. కొన్ని ద్రావకములలో బెట్టి శుభ్ర పర్చిన యెడల పట్టు వలెనే గనబడును. ఇన్ని యుపయోగములు వున్నను ఉపేక్ష చేయుటకు నార తీయుట కష్టగుటయే కారణము. మొక్కలను నీళ్ళలో నాన బెట్టితిమా అవి కుళ్ళి పోవును. కాన నాన బెట్టకుండ యంత్ర సహాయమున దీయ వలయును. కాని, దీనికి తగు యంత్రము లున్నట్లు గానవచ్చుట లేదు. నార తీయగ మిగిలి పోవు మెత్తని పదార్థము కాగితములు చేయుటకు బాగుండును. జెల్లేడు దూది మిక్కిలి మృథువుగాను మెరయుచు పట్టి వలె వుండును. కాని నూలు పనికి వచ్చు చున్నట్లు ఇది పనికి రాదు. నూలు నేసి నంత తేలికగా దీనిని నేయ లేము. ఇది మిక్కిలి తేలికగను సన్నము గాను వుండుట చే దీనితో నెట్టి పనులైన చేయుట కష్టమే కాని కొన్ని కొన్ని చోట్ల ఓపికతో నేసినవి పట్టు వాని కంటే బాగుగ నున్నవి. ఈ దూదిని మనము పరుపులలోను, తలగడలలోను నదురుగ వాడుదుము. ఈ దూది పరుపులు మిక్కిలి మెత్తగావుండును. ఇది చలువ చేయు నందురు.
దీని పాల నుండి కూడ రబ్బరు వంటి పదార్థమొకటి చేయవచ్చును గాని పాలను దీయుట కష్టము. ఈ మొక్క ఔష 302
ధనములో కూడ పనికివచ్చును. వేళ్ళ బెరడునుండి జిగట్ విరేచనములకు మందు చేయుదురు. ఆకులు కాచి నొప్పులకు పట్టు వేయుదురు. జిల్లేడు రసమూ దాల్చిన వేళ్ళు కాల్చిన బొగ్గు బాగుండును.
సుగంధితీగెకు ముండ్లు గలవు. దీని వేరు ఔషధములలో వాడుదురు. అది సన్నముగను పొడవుగను వుండి సువాసన గల బెరడు కలిగి యుండును. వేళ్ళు దేహమునకు బలము కలుగ జేయును. వేళ్ళేగాక, ఎండుటాకులను రెమ్మలను కూడ వాడుదురు.
- మంచి మాడు తీగె
- - దొంకల వద్ద మొలచును. ఆకులు మిక్కిలి దట్టముగా నుండును. పువ్వులు కొంచ మాకు పచ్చగను, కొంచె ఊదాగను నుండును. దీని కాడలను వేళ్ళను కూడ కొందరు వండుకొని తిందురు.
- కొమ్ము మాడు
- - వేళ్ళు అంతకంటే లావుగ నుండును. వీని నంతగా దినరు.
- తీగె జెముడు
- - డొంకలనల్లుకొని యుండును. దీనికి ఆకులులేవు. దీని చిన్న తెల్లని పువ్వులు మంచి వాసన వేయును. 303
- కాకిపాల తీగ
- - ఇసుక నేలలందు బాగుగ పెరుగును. కొమ్మల చివరల నున్న ఆకులు చిన్నవి. ఆకుల అడుగుపైపున రోమములు గలవు. వీనితో జిగట విరేచనములకు మందు చేయుదురు. వేరు బెరడు నరుగ దీసి ఇచ్చిన డోకులు వచ్చును.
- పూలపాల తీగె
- - వర్షాకాలములో పుష్పించును. దీని ఆకులు కూడ చాల దట్టముగనుండును.
- దొడ్డి పాల తీగె పెద్దది
- - వర్షాకాలములో పుష్పించును. దీని ఆకులు కూడ చాల దట్టముగ నుండును.
- దొడ్డిపాలతీగె పెద్దది
- - దీని ప్రకాండము లావుగ నుండును. పువ్వులాకు పచ్చగ నుండును.
- పాలగర్జి తీగె
- - కొండ ప్రదేశములలో మొలచును. అకులు రెండు వైపుల రోమములు గలవు. ఈనెలు ఎరుపు. పువ్వులు ఎరుపు. తెలుపు, ఆకు పసుపు గలిసి యుండును.
- పాల సిఖండి
- - పలు చోట్ల పెరుగును. లేత కొమ్మల మీద ఆకులు సన్నముగాను ముదురు వాని మీద వెడల్పుగాను వుండును. వేళ్ళు బెరడు పొడుము చేసి వెన్నతో నిచ్చిన ఉబ్బసపు దగ్గులు తగ్గు నందురు.
- చిరుపాల తీగె
- - కాలువల గట్లమీద పెరుగును. దీనిఆకులు పెద్దవి. పువ్వులు కొంచెము తెల్లగాను గులాబి రంగుగను అందముగా వుండును. 304
జటతీగె కూడ డొంకల మీద పెరుగును. ఆకులపై వత్తుగ రోమములు గలవు. దీని పువ్వులు మంచి వాసన వేయును.
ముషిణి కుటుంబము.
ఈ కుటుంబములో పెద్ద చెట్లు, గుబురు మొక్కలు, గుల్మములును కూడ కలవు. ఆకులు లఘు పత్రములు. ఒంటరి చేరిక. కొన్నింటికి సన్నని కణుపు పుచ్చములున్నవి. కణుపు సందులనుండి యైన కొమ్మల చివరల నుండి యైన మధ్యారంభ మంజరులు వచ్చును. పువ్వులు సరాళములు, పుష్ప కోశమునకు నాలుగైదు దంతము లుండును. నీచము దళ వలయము నకు నాలుగైదు దంతములుండును. నీచము. దళవలయమునకు నన్నియే తమ్మెలుండును. కింజల్కములు దళ వలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు అండాశయము ఉచ్చము. రెండు గదులు, కీళము కొన్నిటిలో రెండు చీలి యున్నది.
ముషిణి చెట్టు చిన్న చెట్టు. ఆకులు అండాకారము పువ్వులు చిన్నవి. కొంచమాకు పచ్చగను తెల్లగను నుండును. దీని గింజల వ్యాపార మీమధ్యనే కొంచెము తగ్గెను. పండ్లను గోసి, గింజలను కడిగి ఎండ బెట్టుదురు. ఈ గింజ్లనుండి కొన్ని ద్రవములను తీయు చున్నారు. వీనితో బట్టలకు దోపు