వృక్షశాస్త్రము/గన్నేరు కుటుంబము

వికీసోర్స్ నుండి

289

కొన్నిటిలో మూడేసి మాత్రమే గలవు. కొన్నిలఘు పత్రములే.

మాలతీ తీగెయు ఎగ ప్రాకును. ఆకులు పక్ష వైఖరి. చిట్టి ఆకులు మూడు జతలైనను, అయిదు జతలైనను వుండును.

పారుజాతము చిన్న చెట్టు. సదాపుష్పించు చుండును. పువ్వులు తెల్లగాను సువాసనగను నుండును. దళ వలయము యొక్క గొట్టము తిరుచూర్ణము రంగుగా నుండును.

సన్నజాజి తీగెకు నులి తీగె లుండవు. దీని పువ్వులు తెల్లగను సువాసనగను నుండును.


గన్నేరు కుటుంబము.


గన్నేరు తోటలందు గుబురుగా పెరుగు మొక్క.

ఆకులు
- కిరణప్రసారము. కణుపువద్ద మూడేసి కలవు. సన్నము గాను, బల్లెపాకారముగను దట్టముగను వున్నవి. రెండు వైపుల నున్నగా నుండును. కొనసన్నము. సమాంచలము. విషమరేఖ పత్రము. మధ్య ఈనె పెద్దదిగా నున్నది.
పుష్ప మంజరి
- కొమ్మల చివర నుండి మధ్యారంభ మంజరులగు రెమ్మ గెలలు. చేటికలు గలవు. పువ్వులు సరాళము గులాబిరంగు., 290
పుష్పకోశము
- రక్షక పత్రములు 5. బల్లెపాకారము. కొన సన్నము. నీచము.
దళ వలయము
- సంయుక్తము. అడుగున గొట్ట్ము వలె గలసి యున్నవి. పైన వెడల్పగు ఐదు తమ్మెలు గలవు. కొన గుండ్రము. మొగ్గలో అల్లుకొని నట్లుండును. గొట్టముయెక్క కంఠము నుండి చిన్నచిన్న కాడలు గలవు.
కింజల్కములు
- 5. కాడలు లేవు. పుప్పొడితిత్తులైదును దళవలయము నంటి యుండును. వానిపై తెల్లని మెలి పెట్టిన కాడలైదు వచ్చును.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. 4 తమ్మెలు గలవు. కీలము ఒకటి. గుండ్రము. పొట్టిది. కీలాగ్రము గుండ్రము. కాయకొక్కొక పుష్పము నుండి రెండు ఏకవృంత ఫలములు. గింజల నంటుకొని రోమములు గలవు.
పాల చెట్టు

హిందూ దేశములో కెల్ల ఆంధ్ర దేశమునందెక్కువ పెరుగు చున్నది.

ప్రకాండము
- మాను వంకరగా నుండును. దీనికైవారము బాగ పెరిగినపుడు 4,...5 అడుగులుండును.
ఆకులు
- అభిముఖ చేరిక లఘు పత్రము. తొడిమ కురుచనిది. అండాకారము. సమాంచలము. విషమ రేఖ పత్రము. రెండు వైపుల నున్నగా నుండును.
పుష్ప మంజరి
- రెమ్మగెలలు కొమ్మల చివరలందుండి పుట్టుచున్నవి. ప్రతి గెల మొదట అండాకారముగ నున్న చేటికగలదు. 291
పుష్ప కోశము
- సంయుక్తము గుండ్రని 5 తమ్మెలు. నీచము:
దళ వలయము
- సంయుక్తము. పొట్టిగొట్టము గలదు. పైన నిడుపాటి 5 తమ్మెలున్నవి.
కింజల్కములు
- అయిదు. కాడలు పొట్టివి. గొట్టము యొక్క కంఠమునంటి యున్నవి. పుప్పొడి తిత్తులైదు గలసి కీలమును టోపి వలె గప్పు చున్నవి. వీని అడుగున రోమములు గలవు.
అండ కోశము
- అండాశయము ఉచ్చము. 2 గదులు. మొదాట చివర గలసి యున్నవి కాని మధ్య విడిగానే యున్నవి. కీలము ఒకటి కీలాగ్రము గుండ్రము.

ఈ కుటుంబపు మొక్కలు విస్తారము ఉష్ణ దేశపు టడవులలో పెరుగు చున్నవి. వీనిలో తీగెలు చాలగలవు. కొమ్మలందు పాలున్నవి. ఆకులు లఘు పత్రములు. సమాంచలము. సాధారణముగ అభిముఖ చేరిక. దళ వలయము సంయుక్తము. తమ్మెలు మొగ్గలో మెలి వెట్టి నట్లుండును. కింజల్కముల కాడలు మిక్కిలి పొట్టివి. తరచుగా వుండవు. అండ కోశము ఉచ్చము. రెండు గదులు విడిగా నైనను కలసి యైనను వుండును. పుప్పొడి తిత్తులు కీలాగ్రము నంటి యున్నవో లేవో అండాశయము దగులు రెండును విడిగా నున్నవో కలిసి యున్నవో అను ఇట్టి అంశములను బట్టి ఈ కుటుంబమును జాతులుగను, తెగలుగను విభజించి యున్నారు. 292

పాల చెట్లు మనఆంధ్ర దేశములో విస్తారముగ పెరుగు చున్నవి. ఇవి ఆకు లాలి చిగురించినపుడే పుష్పములు పూయును. లేత చిగుళ్ళును పుష్పములును గలసి నప్పుడెంతో ఇంపుగా వుండును. వీని కొమల ఈద నాటు పెట్టిన యెడల తెల్లని పాలు గారును. ఈ పాల నుండి రబ్బరు చేయ వచ్చును. వీని కలయయు మిక్కిలి బాగుండును. చిత్రిక పట్టిన పిదప దంతము వలె నున్నగాను, తెల్లగాను, కాంతి వంతముగాను వుండును. దీని తో దువ్వెనలు, బొమ్మలు చెక్కడపు పనులు చేయ వచ్చును గాని యందుల కుపయోగింపక వంట చెరుకు గానె తగుల బెట్టు చున్నారు. ఒక చెట్టును నరికిన యెడల దాని మొండెము నుండి చిన్న చెట్లు పెక్కులు బయలు దేరును. దీని గింజలు కొన్ని రంగులలో వాడుదురు. అవి జిగట విరేచనములకు మందందురు గాని అంతగా పని చేసి నట్లు గాన వచ్చుట లేదు.

పూతజిల్లేడుచెట్టు పాలచెట్టు వలె నుండును. దీని కలప మృధువుగా నుండి దువ్వెనలు, బొమ్మలు మొదలగు చెక్కడపు పనులకు బని వచ్చును. దీని ఆకులు, తిగుళ్ళు గొంజలు కూడ తేలు కుట్టునకు పాము కాటునకును బని చేయు నందురు. గింజలనుండి తీసిన చమురును మందులలో వుప 293

యోగించు చున్నారు. దీనికొమ్మలనుండి పచ్చనిపాలు వచ్చును. ఈపాలనుండి పచ్చని రంగు నొక దానిని చేయ వచ్చును.

అంకుడు చెట్టు మన దేశ మందంటటను పెరుగు చున్నది. ఇదియు పాల చెట్టు వలెనే యుండును. దీని బెరడును గింజలను చిరకాలము నుండి జిగట విరేచనములకు మందుగా వుపయోగించు చున్నారు. కాని, పాల చెట్టు నిదియు నొక రీతి నుండుటచె కొందరు పాల చెట్టు బెరుడు నుపయోగించి అంకుడు బెరుడు మంచిది కాదను వచ్చిరి. కాని వాని రెండింటిని సులభముగానే గుర్తింప వచ్చును. పాల చెట్టు బెరడు, అంకుడు బెరుడు కంటె నల్లగా నుండును. అంకుడు కలపయు మృదువుగా వుండును గాన దీని తోడను, దువ్వెనలు, బొమ్మలు మొదలగునవి చేయ వచ్చును.


వాక్కాయ చెట్టు మిక్కిలి గుబురుగా బెరుగు చున్నది. దీని కొమ్మలు భూమి వద్ద నుండియు వ్వాపించు చున్నవి. వీనికి పెద్ద ముండ్లు గలవు. ఆకు లొక్కొకచో రెండేసి యుండును. గాని, జత విడస్చి జత పెద్దదిగా నుండును. వాక్కాయలతో పచ్చడి మాత్రము చేసి కొను చున్నాము. కాని వీనిని తరుచుగా దినిన యెడల దేహ దార్డ్యము ధృడ మైనదిగానిచో జబ్బు చేయును. 294

పాలగరుడ చెట్టు పొడుగుగా పెరుగు చున్నది. దీని బెరడు, అజీర్ణము, జిగట విరేచనములు నీరసము మొదలగు జబ్బులకు మంచి పని చేయును. మరియు క్వయినా వలె కొన్ని జ్వరములను మాన్పును. దీనికలప అంతగా గట్టిది కాదు గాని పెట్టెలు, బల్లలు మొదలగునవి చేయుటకు పనికి వచ్చును.

బిళ్ళ గన్నేరు

295

బొమ్మ
పుష్పము చీలిక.

గన్నేరు పువ్వులందముగా నుండును గాన తోటలలో పెంచు చున్నారు. కొన్ని మొక్కల పువ్వులెర్రగాను, మరి కొన్నిటివి తెల్లగాను వుండును. వేరొక కొన్నిటి యందు రేకు లెక్కువగా నుండును. వీని ఆకులు సన్నముగాను, మరి కొన్నిటి యందు రేకు లెక్కువగా నుండును. వీని ఆకులు సన్నముగాను, దట్టముగాను నుండును గాన నీరంతగా లేకున్నను పెరుగ గలవు.

బిళ్ళగన్నేరు చిన్నమొక్క. ప్రతిచోట పెరుగు చున్నది. కొమ్మలు భూమి నంటు చుండెనా యవి వేళ్ళు బారును. వీనిలోను కొన్నిటి పువ్వు లెర్రగాను, కొన్నిటివి తెల్లగాను వుండును. 296

పచ్చగన్నెరు పెద్దగుబురుమొక్క. దీని ఆకులు గన్నేరు అకుల వలెనే వుండును గాని అంతకంటే పలుచగాను మృధువు గాను వున్నవి. దీని యందు తెల్లని బాలు గలవు. పువ్వులు పచ్చగాను గరాటి వలె ఉండును.

అడవిపాలతీగ డొంకల మీదను పొదల మీదను వుండును. వర్షాకాలమందిది పచ్చని పూవులు పూయుము.

మాలతీ లత విస్తారముగ కొండ ప్రదేశములదు పెరుగును. లేత ఆకులు, తొడిమలు, ఈనెలు కొంచెమెర్రగా వుండును. పువ్వులు తెలుపు. కాని మిక్కిలి మనోహరముగ వుండును. పువ్వులు తెలుపు. కాని ఇక్కిలి మనోహరమగు సువాసన గలదు. దీనిని పుష్పములకై తోట లందు పెంచెదరు.

వలతీగ డొంకల మీద పెరుగును. దీని పుష్పములు అందముగా నుండును గాని సువాసనంతగా లేదు.

దేవ గన్నేరు
- ముఖ్యముగా దేవుడు గుడుల్లో పెంచెదరు. కొమ్మల చివర ఆకులు కొంచెము గుబురుగా నుండును. అది, పైన కొంచెమెరుపు జీరలును అది, పైన కొంచెము మెరుపు జీరలును లోపల బంగారు వన్నె గలిగిన తెల్లని పెద్ద పువ్వులను పూయును. పుష్పములకు మంచి వాసన గలదు. 297

జిల్లేడు కుటుంబము.


జిల్లేడు మొక్క బీడుగా నున్న అన్నిప్రదేశములందును పెరుగుచున్నది. అది చిన్న గుబురు మొక్క ఆకుల పైనను కొమల పైనను తెల్లని బూడిద గలదు. మొక్క నిండ పాలు గలవు.

ఆకులు
- అభిము చేరిక, లఘు పత్రములు, నిడివి చౌక పాకారము. సమాంచలము విషమ రేఖ పత్రములు. ఆకులు దట్టముగ నుండును. ఆకులు దట్టముగా నుండును.
పుష్ప మంజరం
- కొమ్మ చివరల నుండి మధ్యారంభము మఝ్జరులులగు గుత్తులు పువ్వులు సరాళము. సంపూర్ణము. తెల్లగాగా నుండును.
బొమ్మ
1. కొమ్మ. 2. పుష్పము. 3. కిరీటము 4. అండ కోశము.