వృక్షశాస్త్రము/గోరింట కుటుంబము

వికీసోర్స్ నుండి

235

డు నుండి త్రాళ్ళు, సంచులు చేయుటకు నారదీయుదురు. బెరడు రంగు చేయుటలోను, తోలు బాగు చేయుటలోను కూడ పనికి వచ్చుచున్నది. పువ్వుల కషాయమును, కొన్ని దేశముల వారు ప్రసవించిన తోడనే బాలింత రాండ్రకు ఇత్తురు. ఎండ బెట్టిన పువ్వులను దగ్గు మొదలగు జబ్బులకు మందు చేయుదురు. దీని కలపయు గట్టిగానె యుండును. దూలములకు, స్థంభములకు రోళ్ళు, రోకళ్ళు మొదలగు వానికి తుపాకులకు కూడ వుపయోగించెదరు. దీని బెరడన్న అడవిపందులకు ప్రీతిమెండు గావున వేట కాండ్రు దీనినినెర వెట్టు చుందురు.

యూకలిప్టసు
- కెజపుటినూనె లీకుటుంబపు చెట్ల నుండియే వచ్చు చున్నవి. ఈ చెట్లు మన దేశములో నంతగా పెరుగుట లేదు.


గోరింట కుటుంబము.


గోరింట చెట్టు
- చాల చోట్ల పెరుగు చున్నవి. వానికి ముండ్లున్నవి.
ఆకులు
- అభిముఖ చేరిక, లఘు పత్రములు. బల్లెపాకారము సమాంచలము. కొనసన్నము.
పుష్ప మంజరి
- కొమ్మలచివరలనుండి మధ్యారంభ మంజరులగు రెమ్మలు గెలలు పువ్వులుచిన్నవి. సువాసన గలదు. 236
పుష్ప కోశము
- సంయుక్తము. 4 తమ్మెలున్నవి. నీచము.
దళ వలయము
- అసంయుక్తము. 4 ఆకర్షణ పత్రములు. ఇవి ముడతలు ముడతలుగా నుండును. పుష్పకోశము యొక్క గొట్టము చివరనంటి యుండును. దీనికి సువాసన గలదు.
కింజల్కములు
- ఎనిమిది. రెండు రెండు దగ్గిరగానున్నవి. ఈ రెండును రెండు ఆకర్షణ పత్రములకు మధ్యగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.
అండ కోశము
- అండాసయముచ్చము. 4 గదులు స్థంభ సంయోగము. కీలము ఒకటి. కాయ ఎండిపగులును.

ఈ కుటుంబములో చెట్లు గుబురు మొక్కలు. చిన్న మొక్కలు కూడ కలవు. ఆకులు అభిముఖ చేరిక. చిన్న కణుపు పుచ్చము లుండును. పుష్ప మంజరులు మధ్యారంభ మంజరులు. ఆకర్షణ పత్రములు నాలుగైన, ఆర్థన నుండును. వానికి పాదము గలదు. కింజల్కములు ఆకర్షణ పత్రములన్నియైన, వానికి రెట్టింపైన, మిక్కిలి ఎక్కువగానైన నుండును. కాడలు పొడుగుగానే యుండును. అండాశయము ఉచ్చము గింజలు చాల గలవు.

గోరింటి చెట్లను వాని ఆకుల నుండి వచ్చు రంగు కొరకు పైరు చేయు చున్నారు. పొలములను బాగుగ దున్ని, ఎరువు వేసి, 25 దినములు విత్తనములు నీళ్ళలో నానిన పిద 237

ప జల్లెల్దరు. విత్తనములు జల్లుటకు ముండు మూడు నాలుగు దినములనుండి మళ్ళలో నీరు బెట్టుదురు. నీరుండగానే గింజలను జల్ల వలెను. నీరింక గానె గింజలు భూమి లోనికి దిగును. తరువాత మూడు దినముల వరకు ప్రొద్దుట, సాయంత్రము నీరు పెట్టవలెను. మొక్కలు మొలచిన తరువాత దినము విడచి దినము నీరు బెట్టిన చాలును. రెండడుగు లెత్తు పెరిగిన తరువాత వానిని దీసి దూరము దూరముగ పాతవలెను. రెండవ యేడు నుండియు ఆకులు కోయుట ఆరంభింతురు. కొమ్మల చివర తొమ్మిదంగుళములను గోయుచుందురు. ఎకరము నేల నుండి ఇరువది మణుగులు ఎండాకులు వచ్చును.

ఆకులను ఎండ బెట్టి కొంచెము నూనె గలిపి పొడుము చేయుదురు. ఈ పొడుముతో అప్పుడప్పుడు బట్టలకు రంగు వేయుదురు. ఈ పొడుమును చిరకాలము నుండియు మహమ్మదీయ స్త్రీలు తలకు రాచు కొను చున్నారు. దీని చే వెండ్రుకలు ఎర్రబడును. తరువాత నీలి రంగు బూసిన మిక్కిలి నల్లగా నగురు. జుట్టు నొక్కు నొక్కులుగా గూడనగును.

పచ్చిఆకును రుబ్బి చిన్న పిల్లలు గోళ్ళకు పెట్టుకొందురు. పువ్వులను పరిమళ ద్రవ్యములు చేయుటలో వాడుదురు. 238

ధాతుక చెట్టును పువ్వులు గూడ అందముగా ఉండుటచే తోటలయందు పెంచు చున్నారు. దీని పువ్వులను ఎండబెట్టి యొక రంగు చేసెదరు. ఆకులలో తోలు భాగు చేయు పదార్థము కలదు. కొన్నిచోట్ల ఆకులను వండుకొని తిందురు. ఈ చెట్టు నుండి జిగురు కూడ వచ్చును. దీని కలప పొయిలోకి తప్ప మరెందులకు పనికిరాదు.

చెన్నంగి:- పెద్దచెట్టు. ఇది మన దేశమందటను గలదు. దీని కలప వాసములకు, దూలములకు బండ్లు, నాగళ్ళు మొదలగు వాని నన్నింటికీని బనికివచ్చును. దీని నుండి నారయు వచ్చును. ఒక రకము పట్టు పురుగు కూడ దీని యాకులు తిని బ్రతుక గలదు.

అగంధ్రపాకు మొక్క చిన్నది. ఆకులకు తొడిమలు లేవు. కొన్ని నొప్పులను బోగొట్టుట కీయాకులను గాచి పట్టు వేసెదరు.


గుమ్మడి కుటుంబము.


గుమ్మడి పాదు తోటలలో బెట్టుచున్నారు. లంకలలో నివి విస్తారముగా బెరుగు చున్నవి.

ప్రకాండము:- తీగ. రోమములుగలవు. ఆకుల దగ్గిర మూడు నాలుగు చీలికలుగ నున్న తీగలు గలవు.