వృక్షశాస్త్రము/నేరేడు కుటుంబము

వికీసోర్స్ నుండి

పాంచన చెట్టు:- చిరిమాను చెట్టువలెనే యుండును గాని మాను అంత పొడుగుగాను సూటిగను వుండదు. మరియు నీరుదగిలిన పుచ్చుట నారంభించును.

బొద్దు తీగె పెద్దది. అడవులలో చెట్ల మీద ప్రాకును. కాయలకు ఐదు రెక్కలు గలవు.

బండిమురుదుడు: శీతాకాలములో పుష్పించును.


నేరేడు కుటుంబము.


నేరేడు చెట్టు: పెద్దది. అది చాల చోట్లనే పెరుగు చున్నది.

ఆకులు:- అభిముఖచేరిక, లఘుపత్రములు. తొడిమకలదు. కణుపు పుచ్చములు లేవు. నిడివి చౌక పాకారము. సమాంచలము. నున్నగాను దట్టముగాను నుండును. కొన యందు చిన్న వాలముగలదు. అంచు చుట్టు ఈనెగలదు.

పుష్పమంజరి:- కణుపుసందుల నుండి రెమ్మ గెలలు, పుష్పములు సరాళము సంపూర్ణము.

పుష్పకోశము:- చిన్న చిన్న రక్షకపత్రములు. ఇవి ఒక్కొక్కప్పుడు అడుగున కలసి యుండును. ఉచ్చము.

దళవలయము:- అసంయుక్తము. ఆకర్షణపత్రములు నాలుగు చిన్నవి. గుండ్రముగాను ఆకుపచ్చగాను నుండును. పుష్పకోశము నంటి యున్నవి.

కింజల్కములు:- అసంఖ్యములు. మొగ్గలో కాడలు ముందునకు పెరిగి యుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు.

అండకోశము:- అండాశయము నీచము. రెండు గదులు కీలము ఒకటి కీలాగ్రము చిన్నది. కండ కాయ 1. గింజ.

ఈ కుటుంబములో పెద్ద చెట్లును గుబురు చెట్లును కలవు. ఆకులు, అభిముఖ చేరిక, సమాంచలము. లఘు పత్రములు వీనిలోను నారింజ ఆకులలో వలె గ్రంధి కణములు గలవు. పుష్పములు సరాళములు. ఆకర్షణ పత్రములు నాలుగో అయిదో యుండును. అవిత్వరగా రాలి పోవును. కింజల్కములు చాల గలవు. వాని కాడలకు కూడ రంగుండును. అండాశయము నీచము. ఫలము కండకాయ.

నేరేడు చెట్టు నదీతీరము లందెక్కువగా బెరుగు చున్నవి. వీనిలో చాలరకములు గలవు. మంచి వానిని తోటలయందు పైరు చేయు చున్నారు. వీని పండ్లకు పులియ బెట్టి ఒక విధమగు సారాయిని దీయు చున్నారు. దీని కలపయు బాగుగనే యుండును. ఇంటి పనులకును నాగళ్ళు మొదలగు నవి చేయుటకును, నూతిపనులకును బనికి వచ్చు చున్నది. ఇది నీళ్ళలో త్వరగా జీకిపోదు. దీని యాకులను ఒకవిధమగు పట్టు పురుగు దినును. బౌద్ధులకు నీ చెట్లు పవిత్రములైనవి.

గులాబిజామ చెట్లను అచ్చటచ్చట బెంచు చున్నారు. దీని పండ్లు తినుటకు చాల బాగుండును. వానికి సువాసన గలదు. చెట్లు కూడ అందముగనే యుండును.


లవంగము.

లవంగములు లవంగ వృక్షము యొక్క ఎండిన మొగ్గలు. లవంగములో నాలుగు దందములవలె నున్నవే రక్షక పత్రములు. వానిమీద గుండ్రముగ నున్నది వికసింపని దళ వలయము. ఈ వువ్వుల మొగ్గలను వికసింపక పూర్వమే గోసి వైతురు. రజోసంయోగమైనచో కాయకాచును. ఆకాయలో నొకటి రెండు గింజ లుండును.

లవంగముచెట్ట్లను బెంచుటకు మళ్ళలో నడుగడుగు దూరమున కాయలు పాతెదరు. కాయలెంత ఎండకుండ నుండిన అంత మంచివి. ఎండినచో వాని శక్తి తగ్గి పోవును. పాతిన నాలుగైదు వారముల కవి మొలకలెత్తును. చిన్న మొక్కలు నాలుగడుగు లెత్తు పెరిగగానే వానిని దీసి తోటలందు ఇరువది ముప్పది అడుగుల దూరము దూరముగ నాటుదురు. ఈ చెట్లకు రాగిడి నేల గాని ఇసుక నేల గాని పనికి రాదు. బురదనేలలో మెలవనే మొలవదు. కొంచెము ఇసుకతో కూడిన ఒండ్రు మట్టి నేలలు మంచివి. వీనికి నీటి యాధారము బాగుండ వలయును. సముద్రపు గాలులు తగులట మంచిది గాదు. ఆరేండ్లు వచ్చు నాటికి ఈ చెట్లు కాపు లోనికి వచ్చును. నూరు నూట యేబది సంవత్సరముల వరకు లవంగములు వచ్చు చున్నను, ఇరువది ఏండ్లయిన తరువాత వాని కాపు తగ్గి పోవ నారంబించును. కొన్నిచోట్ల లవంగములను సులభముగ కోయుటకు చెట్టు ఎనిమిది తొమ్మిది అడుగులెత్తు పెరుగగనే చిగురును కత్తిరించి వైతురు. లవం గములను కోయుటయే మంచి పద్దతియైనను కొన్నిచోట్ల చెట్లక్రింద బట్టలు పరచి మొగ్గలను రాల గొట్టుదురు. పచ్చి మొగ్గలను ఎండ బాగున్నయెడల నెండలోనే పెట్టుదురు. లేదా, సన్నని మంట మీద నైనను, వేడి నీళ్ళలోనైనను కొంచెము సేపుంచి ఎండబెట్టుదురు.


పుష్పము చీలిక. జామ.


ఈచెట్ల కొమ్మలు పాతినను మొలచును. లవంగము సుగంధ ద్రవ్వ్యములలో నొకటి. వానిని మనము తాంబూలముల నందును, ఔషధములలోను, వాడు చున్నాము. లవంగములు మన దేశములో అంతగా పండుట లేదు. చాలవరకును మన మన్యదేశముల నుండి దిగుమతి చేసి కొను చున్నాము.

జామ చెట్లు మన దేశమున అంతటను పెరుగు చున్నవి. అవిఏనేల లందైనను పెరుగగలవు. గింజలను నాటినను, కొమ్మ పాతినను మొక్క మొలచును. వాని గురించి మనమంత శ్రద్ధ పుచ్చుకొన నక్కర లేదు. జామ పండ్లలో రెండు రకములు గలవు. కొన్ని తెల్ల గాను, కొన్ని ఎర్రగాను వుండును. వీని కలపను బల్లెములు, మొదలగు సాధనములు చేయుటలో వాడు చున్నారు. కొన్ని చోట్ల ఆకులను బెరడును రంగు వేయుటలో ఉపయోగింతురు.

దానిమ్మ చెట్టును కొందరు గోరింట కుటుంబము లో చేర్చెదరు. ఈ చెట్టును పలు తావులలో పెరుగు చున్నది. ఇది గింజలను నాటిగాని కొమ్మలను పాతిన గాని మొలచును. కాని అంటు గట్టుట మంచిది. కాయలు లేతవిగా నున్నప్పుడు వానిలో నొక పురుగు చేరి అంతయు తిని వేయును. కాయలను కుళ్ళ జేయును. పురుగు పట్ట కుండ చేయుటకు లేత కాయ ముచ్చిగను పూర్తిగ కోసి వేసి దానికొన గుట్ట కట్టవలెను. కొన్ని చోట్ల పువ్వులు నెర్రరంగు చేయుటకును కాయ బెరుడు చర్మములు బాగు చేయుటకు వుపయోగించు చున్నారు.

కంబిచెట్టు హిమాలయా పర్వతముల ప్రాంతముల మొలచు చున్నది. ఈచెట్టునుండి జిగురువచ్చును బెర 235

డు నుండి త్రాళ్ళు, సంచులు చేయుటకు నారదీయుదురు. బెరడు రంగు చేయుటలోను, తోలు బాగు చేయుటలోను కూడ పనికి వచ్చుచున్నది. పువ్వుల కషాయమును, కొన్ని దేశముల వారు ప్రసవించిన తోడనే బాలింత రాండ్రకు ఇత్తురు. ఎండ బెట్టిన పువ్వులను దగ్గు మొదలగు జబ్బులకు మందు చేయుదురు. దీని కలపయు గట్టిగానె యుండును. దూలములకు, స్థంభములకు రోళ్ళు, రోకళ్ళు మొదలగు వానికి తుపాకులకు కూడ వుపయోగించెదరు. దీని బెరడన్న అడవిపందులకు ప్రీతిమెండు గావున వేట కాండ్రు దీనినినెర వెట్టు చుందురు.

యూకలిప్టసు
- కెజపుటినూనె లీకుటుంబపు చెట్ల నుండియే వచ్చు చున్నవి. ఈ చెట్లు మన దేశములో నంతగా పెరుగుట లేదు.


గోరింట కుటుంబము.


గోరింట చెట్టు
- చాల చోట్ల పెరుగు చున్నవి. వానికి ముండ్లున్నవి.
ఆకులు
- అభిముఖ చేరిక, లఘు పత్రములు. బల్లెపాకారము సమాంచలము. కొనసన్నము.
పుష్ప మంజరి
- కొమ్మలచివరలనుండి మధ్యారంభ మంజరులగు రెమ్మలు గెలలు పువ్వులుచిన్నవి. సువాసన గలదు.