వృక్షశాస్త్రము/గుఱ్ఱపుబాదము కుటుంబము

వికీసోర్స్ నుండి

చి బాగున్నదని దెలిసి కొని ఇప్పుడుప్పుడే పైరు చేయు జూచుచున్నారు.

తుత్తురుబెండ:.. ఆకులను నీళ్ళలో గాచిన జిగురు వంటి పదార్థము వచ్చును. ఈ కషాయముతో నొప్పులకు బట్లు వేయుదురు. గింజల పొడుము శగ మొదలగు వానికి వాడుదురు.


గుఱ్ఱపుబాదము కుటుంబము.


గుర్రపు బాదము చెట్టు:- పొడుగుగా బెరుగును. బెరడు పెచ్చులు పెచ్చులుగా వచ్చును. లేత కొమ్మల మీదను ఆకుల మీదను దట్టముగా రోమములు గలవు.

ఆకులు:- ఒంటరి చేరిక. మిశ్రమ పత్రములు. తాళ పత్ర వైఖరి. కణుపు పుచ్చములు గలవు. విషమ రేఖ పత్రము.

పుష్పమంజరి:- కొమ్మల చివరనుండి గుత్తులు గుత్తులుగా మధ్యారంభ మంజరులు గలవు. పుష్పములు చిన్నవి., సరాళము, ఆకు పచ్చ రంగు.

పుష్పకోశము:- ఈ రక్షక పత్రములు 5. వానిమీద దట్టముగ రోమములు గలవు. మొగ్గలో నొక దాని నొకటి తాకు చుండును.

దళవలయము:- లేదు.

కింజల్కములు: అన్నియు గలసి యొక గొట్టము వలె నైనవి. గొట్టము పైన గిన్ని వలె వెడల్పుగానున్నది. దీని మీదరెండు గదులుగల్గిన 12 పుప్పొడి తిత్తులుగలవు. అండకోశము:- పుప్పొడితిత్తులచే నావరింపబడియున్నది. 5 తమ్మెలున్నవి. కీలము 1. లావుగ నుండును. కాయలో నొక గదియే గలదు. అండాశయము నందున్న మిగిలిన నాలుగు గదులు పెరుగవు.


ఈ కుటుంబ ముష్ణ ప్రదేశమూలో గలదు. దీనిలో చిన్న మొక్కలౌ మొదలు పెద్ద చెట్ల వరకు నున్నవి.

ఈ కుటుంబపు ప్రతి మొక్క యొక్కలేత కొమ్మమీదను లేత యాకుల మీదను దట్టముగా గోధుమ వర్ణముగల రోమములుగలవు. ఈ రోమములు ఆముదపాకుల మీద నున్న తెల్లిని పొడివలె లేత యాకులను ఎండకు వాడి పోకుండ గాపాడును. వీనిలో ఆకులు అభిముఖ చేరిక, లఘు పత్రములు లేదా, తాళ పత్ర వైఖరినున్న మిశ్రమ పత్రములు. కణువు పుచ్చములు గలవు. వువ్వులు చిన్నవి. ఆకర్షణ పత్రములు కొన్నిటియందు లేవు. కింజల్కలములన్నియు గలిసియుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు. అండ కోశము 5 గదులు. ఒక్కొక్కప్పుడు కాయలోని గదులు విడిగా నుండును.

కావలిచెట్టు:- కొండ ప్రదేశముల నుండును;. ఆకులు లఘుపత్రములు. పచ్చని పువ్వులు, పురుష పుష్పములు మిధునపుష్పములు గలసియుండును. ప్రతి పుష్పము 5 కాయలు కాచును. దీని కలప మెత్తగా నుండుటచే నంతపనికి రాదు.

కాకర.

కాకర చెట్టు:- పెద్దవృక్షము. ఆకులు చాల వెడల్పుగా నుండును. పుప్పొడి తిత్తులు 30 వరకు గలవు. పువ్వులు ఎర్రగా నుండును.

గుర్రపు బాదము:- చెట్టు తోటలలో బెరుగు చున్నది. దీనిగింజలనుండి చమురు తీయుదురు. చమురు కొంచెము పచ్చగా నుండును గాని వాసన యుండదు. దీనిని ఔషదములలో నుపయోగించెదరు.

ఉద్రిక చెట్టు:- తోటలలోను అడవులలో కూడ బెరుగు చున్నది. పువ్వులు చిన్నవి. పచ్చని రేకులు గలవు. దీని బెరడుతో గషాయము కాచి ఔషధములలో వాడుదురు.

వలంబారి చెట్టు:- అడవులలో బెరుగును. దీనికాయలు పొడుగుగా మెలిపెట్టి కొనియుండును. ఈ మెలి, గింజలను వెదజల్లుట కొక సాధనమగుచున్నది. కాయలెండి మెలి విడిపోవు నప్పుడు లోపలి గింజలు కదలి బైట పడును. ఈ కాయలను బొడుము చేసి ఔషధములలో వాడుదురు.

బంధూకము:- వరిచేలవద్ద బెరుగును. ఆకులు సన్నముగా పువ్వు లెర్రగా నుండును.

కోకో.

కర్ణికార వృక్షము: దీని ఆకులు యొక్క తొడిమ పత్రముతో నంచునందు గలియక, ఆముదము, తామర యాకుల యందట్లు మధ్య గలియుచున్నది.

కోకో చెట్టు: మనము కాఫీ తేయాకు వలె గాచి త్రాగు కోకో ఈ కుటుంబపు చెట్టు యొక్క గింజలనుండి చేయుచున్నారు. కోకో చెట్లను మన దేశములో నాటి పెంఫ జూచిరి గాని విరివిరిగా బెరుగుట లేదు. మలబారు ప్రాంతముల కొన్ని కొండలమీద మాత్ర మీ చెట్లు పెరుగు చున్నవి. వీనిని 15 అడుగుల దూర దూరముగ గింజలు నాటి పెంచెదరు. 4..5 ఏండ్లకు గాపునకు వచ్చి పెక్కేండ్లు ఫలించును. కాయలు 6.....9 అంగుళముల పొడుగుగా నుండును. ఒక్కొక్క కాయలో 40 గింజలుండును. ఈ గింజలను దీసి, పులియబెట్టి పిదప నెండ బెట్టి వేయించెదరు. తరువాత వానిని బొడుము గొట్టి ఆ పొడుములో బంచదారయు కొన్ని సువానస పదార్థములను గలుపుదురు. కోకో పంట విస్తారము బెలిజియము దేశములో గలదు. అచ్చట నుండియే చాల దేశములకు ఎగుమతి యగుచున్నది. కాఫీ, తేయాకు వలె గోకోకు నిద్రబోగొట్టు గుణము లేదు. వాని వలే గాక ఇది బలము నిచ్చు నాహార పదార్థము. కాని దీనిని విశేషముగ వాడినచో మల బద్ధము కలుగుట కూడ కలదు.