వృక్షశాస్త్రము/కుక్కగొడుగు, బూజు

వికీసోర్స్ నుండి

496

ములు, సూక్ష్మబీజములు సంయోగము బొందు చున్నవి. వీని గురించి పూర్తిగ తెలిసికొనుట సూక్ష్మ దర్శని యున్న యెడల గాని సాధ్యము గాదు కనుక, ఎక్కువగా వ్రాయ లేదు.

నీటి పాచి లాభము గానె యగుచున్నది. అది నీటిలో నుండు జంతువులకు కొన్నిటి కాహారము. దానిని కాల్చి బూడిదనుండి ఆయెడిను చేయు చున్నారు.


వంశము
- అవయవరహితము: ఉప వంశము:

కుక్కగొడుగు, బూజు

వందల కొలది అడుగులెత్తు పెరుగు మహా వృక్షములతో గలిసి వ్రేలెడెత్తు లేని కుక్క గొడుగులును, దెప్పల మీద బుట్టు బూజును కూడ మొక్కలే యనిన నవ్వుల మాటల వలె దోచునేమో కాని, యివియు మొక్కలే. కాని అన్ని మొక్కల యందు నుండు ఆకు పచ్చని రంగు గాని, వేరు కొమ్మ ఆకు అనుభేదము గాని వీని యందు లేదు. వీని స్థితి గతులే వేరు.

బూజునకు పెరుగ వచ్చు చోటు, పెరుగ రాని చోటు అని లేదు. ఎచ్చట ఆహార పదార్థము దొరుకునో, అచ్చట కొంచెము చోటు చిక్కిన యెడల ప్రవేసించి నాటుకొని విజృంభించును; చెట్ల మీద, దూలముల మీద పేడ కుప్పల 497

మీదను, చెప్పుల మీద, పురుగుల మీద, అన్ని చోట్లను నివి పెరుగ గలవు. బూజు చూటుటకంత నొక రీగిగ నున్నను దాని లోను చాల జాతులు గలవు. కొన్ని యెచ్చట నైన పెరుగ గలవు. కొన్ని జీవ పదార్థములు మీదనే గాని పెరుగ జాలవు. మరి కొన్ని పురుగుల మీదనే గాని జీవింపలేవు. బూజులో కొన్ని జాతులు సదా పరాన్న భుక్కులే. అనాగా నితర ప్రాణుల మీద మొలచుచు అవి సంపాదించుకొనిన ఆహారమును దినును గాని తాము పాటు పడి సంపాదించు కొన లేవు. మరి కొన్ని చచ్చి కుళ్ళు చున్న పదార్థముల మీదను తోలు మొదలగు నొకప్పుడు సజీవములైన పదార్థముల మీద గాని పెరుగ లేవు.

బూజును కొంచెము తీసి సూక్ష్మ దర్శినితో జూచిన యెడల నూలు పోగులవలె సన్నముగను, పోగులు పోగులుగను అగు పడును. ఈ పోగులకు తంతువులని పేరు. ఈ తంతువులలో కొన్ని అహార పదార్థము నంటి కొని దానిపై బడి యున్నవి గాని మరికొన్ని పైకి లేచి యున్నవి. పైకి లేచిన వానికి ఊర్థ్వ తంతువులనియు, అడుగున నున్న వానికి నదస్తంతువులనియు పేరు. కొన్ని తంతువులలో గదులు గదులుగనున్నవి. 498

మరికొన్నిటిలో మధ్యనొకగోడమైననులేదు. కొన్ని పొడుగుగానె యుండును. మరి కొన్ని చీలి రెమ్మలుగా నుండును. ఈ రెమ్మలును కొన్ని సన్నముగాను కొన్ని గుండ్రముగాను, కొన్ని మేకుల వలెను నుండును. ఆహార పదార్థమును నంటుకొనిటయే, కణకవచముల ద్వార జొచ్చి ఆహార ము కొని వచ్చుటయో నూనె కొవ్వు వంటి వానిని నిలువ చేసి కొనుటయో వీని పని. ఈ తంతువులలో నాకార భేదమంతగా లేదు. కొన్ని లావుగను కొన్ని సన్నముగను, కొన్నిటి గదులు దగ్గిరిగను, కొన్నిటివి దూర దూరముగను నుండును.


బూజులో నిలువుగ లేచిన ఆ తంతువులు సిద్ధబీజములు కానున్నవి. ఇవి విత్తనముల వంటివి. ఇవెక్కడ రాలిన అక్కడ బూజుగ బెరుగును. తంతువులు పైకి పెరిగిన తరువాత వాని చివర నొక గోడ ఏర్పడి దది వలె నగును. దానిలో మూల పదార్థము చాల గలదు. అట్లు గది యేర్పడిన పిదప నురివేసి నట్లు క్రింద సన్నగిలి, తెగి రాలి పోవును. లేదా, అది యట్లుండగనే దాని క్రింద నీరీతినే మరికొన్ని ఏర్పడును. ఒక్కొక్కప్పుడు గది యేర్పడిన తరువాత దాని మీద పలువ లేర్పడి, అపలువల మీద పై ప్రకారంమేర్పడు చుండును. ఇ వేర్పడునపుడే బూజునకు పలురంగులువచ్చును. మనచేతికంటు 499

కొను పొడియు వీనిదే. ఇట్లేర్పడు సిద్ధబీజములకు చూర్ణ భీజములని పేరు.

ఆవాలు మొదలగు కొన్ని విత్తుల నొత్తుగ జల్లి నీరు విస్తారము బెట్టినచో ఒక్కొకప్పుడు లేత మొక్కలు వాడి పోవుట తటస్థించును. అట్టి దాని నొకటి దీసి పరీక్షించితిమా, ఆకులు, వ్రేళ్ళు సరిగా నుండును గాని, మొక్క అడుగున తిని వేసి నట్లు కనబడును. మొక్క వాడి పోవుట కదియే కారణము. అచ్చట బూజు ప్రవేశించి మొక్కను తిని ధ్వంసము చేసినది. దానిలో తంతువులు పైన చెప్పిన విధమున చూర్ణ బీజములుగ నేర్పడు చున్నవి.

అట్లు కానిచో కొన్ని తంతువుల చివరల లావెక్కును. దానిలోనికి మూల పదార్థము మెండుగ చేరును. పిమ్మట వాని నుండి గసిక వలె నొకటి బయలు దేరి క్రమక్రమముగ గుండ్రముగా నగును. ఇదివరకు కొనలోనికి చేరిన మూల పదార్థము ఇందులోనికి ప్రవేసించి చిన్న చిన్న భీజముల క్రింద విడుచును. వీనికి రెండేసి మృథు రోమములు కూడ గలవు. ఇవి మృదు రోమ బీజములు. ఈ మృదు రోమముల మూలమున నీదులాడుచు పోయి ఎతర మొక్కలను చేరి పెరిగి నాని నట్లే ధ్వంసము చేయును. ఒకప్పుడు చాల కాలము పొలము ఎండ తట్టి తరువాత జల్లిన విత్తనముల మొ 500

క్కలలో కూడ బూజుపట్టుటగలుగుచున్నది. ఈబూజెక్కడ నుండి వచ్చును? ఒక వేళ గింజలలోనె యుండిన నుండ వచ్చును. కాని సాధారణముగ భూమిలో నుండియే వచ్చు చున్నది. భూమిలోనుండి యప్పటి కప్పుడు పుట్టుట లేదు కాని ఎండ దెబ్బల కాగుట కదివరకే ఏర్పాటు గావించుకొని యున్నది. నీరు సమృద్ధిగ నుండ నపుడు మరి యొద విధముగ సిద్ధ బీజముల నేర్పడును. ఊర్థ్య తంతువుల కొనలు వెనుకటి రీతినే లావై మూళ పదార్థమును చేర్చును.

ఈ తంతువులలో మగ, ఆడు భేదములు గలుగు చున్నవి. ఈ కొనలందుండు గదులలో మొదటి పలు జీవ స్థానములుండగాని సంగమమునకు పూర్వమెక్కటియే యుండును. ఇది స్త్రీ తంతువు. ఇది యట్లుండగ దగ్గరగా నున్న మారియొకటి కూడ చివర నొక గది నేర్పరుచు కొనును. ఇవి రెండును దగ్గరగా వచ్చి కలిసి కొనును. రెండ వాని నుండి ఒక గొట్టము వంటి దేర్పడి దాని ద్వార మొతడి దానిలోనికి మూల పదార్థమును జోవ స్థానమును బోయి యచ్చట నున్న జీవ స్థానముతో కలియును. అట్లు గలసిన పిమ్మట వెంటనే దాని నుండి తంతువులైన పుట్టును లేనిచో, పెరుగుట కంత వీలుగ నుండస్ని యెడల చాల కాలము పెరుగకయే, నీళ్ళు లేకున్నను చచ్చి పోక బ్రతి యుండును. ఇట్లు దాగి యుండి అవకాశము చిక్కి నపుడు తిరిగి పెరుగును. 501

ఒక్కకప్పుడు బంగాళదుంప కుళ్ళి నల్లబడుట గనుచున్నాము. దానికి ఇట్టి బూజే కారణము. ఈ బూజు మొదట ఆకులలో ప్రవేసించి మాను ద్వారా దుంపలలోనికి దిగును. దుంపలు ముదురువై పైచర్మము గట్తిగా నున్నచో లోపల ప్రవేసింప లేవు గాని లేత వానిలో ప్రవేసించును. కొట్లలో నిలువ యుంచిన దుంపలు కుళ్ళుట కొట్లులోనున్నపుడు బూజు పట్టుట చేతనే గాదు, ఆదుంపలలో నదివరకే బూజు ప్రవేసించియున్నది.

ఈబూజుబాధ వదల్చుకొనుట సులభముకాదు. కొన్ని రకముల దుంపల చర్మము దళసరిగా నుండును. వానిలోనికి బూజు సులభముగ ప్రవేసింపలేదు. కాన అట్టి వాని నేరి వానితోడనే సేద్యముచేయుట మంచిది. బూజు చచ్చునని సున్నము, గంధకము మొదలల్గు వానిని జల్లుట వలన లాభమంతగా నున్నట్లు తోచదు. ఇవి యొకప్పుడు బూజునే కాకుండ మొక్కలను కూడ నాశనము చేయును. ఈ బూజు ఆకుల ద్వార ప్రవేసించును గావున నిది చేరి నట్లు చిహ్నములు దోచగనే ఆకులను త్రుంపుట మంది దగుట నిజమే. కాని, మొక్క కంతయు ఆహారపదార్థము ఆకులమూలముననే ఏర్పడుచున్నది. ఆకులను త్రుంచి వైచిన ఇక ఆహార మెట్లేర్పడును? ఇట్ల 502

బూజు సిద్ధబీజములున్న చేలలో ఆబూజునకు సరిపడిని మరియొక పైరును జల్లుట మంచిది. లేదా, కొంత కాలము వరకు అచ్చట ఏమియు జల్ల కుండినను మంచిదియె. ఈ లోపున సిద్ధ బీజములు బూజుగ పెరిగి ఆహార పదార్థమేమియును దొరకమిచే నశించి పోవును. ఇంతకు నశింప కున్నచో ఒకప్పుడు పొలములో నంతటను మంటవేయుదురు.

కొన్ని జాతులబూజులందు కొన్ని ఊద్ర్వతంతువులు రెండు రెండు దగ్గరగా వచ్చి, వాని చివరలు పెద్దవై గుండ్రముగా నగును. వాని లోపల నొక గోడ యేర్పడుచున్నది. పిమ్మట నీ తంతువుల చివరల రెండు గలిసి కొని, ఒకదానిలోనికి బోవును. కావున మొదటి దానిని పురుష తంతువుగను, రెండవానిని స్త్రీ తంతువుగను నెన్ను చున్నాము. తరువాత నా మిళితమైన దాని నుండి తంతువులు బైలు దేరును. లేదా పలువలు సిద్ధ జీజాశయములు కూడ ఏర్పడును.

మరి కొన్ని బూజులలో స్త్రీ పురుష వివక్షత తగ్గి పోయినది. వీనిలో గొన్నిటిబీజములు సంచుల వంటి వానిలో నుండును. ఒక్కొక సంచియందు సారారణముగ ఎనిమిదియుండును. కాని యన్నడు ఎనిమిదికం టె ఎక్కువయుండవు. ఈ బూజులలో సిద్ధబీజాశయముల కూడ గలుగుచుండును. ఈ సిద్దబీ 503

జాశయములు రెండుతంతువులు గలియుచోట నేర్పడుచున్నవి. లేదా, కొన్ని తంతువులచివరల రెండుగదులేర్పడును. ఇవి పురుష తంతువులుగ నెన్న బడు చున్నవి. ఇవి చివర లావెక్కిన మరికొన్ని తంతువుల నావరించు కొని యుండ వానిలోని పదార్థమడ తంతువుల లోనికి జేరి, మిళితమగు మూల పదార్థము న్యూతేఅశయముగ ఏర్పడు చున్నది. ఈ న్యూతాశయమునుండి న్యూత బీజము లేర్పడి సిద్ధ భీజముల వలెనె బూజును వ్యాపింప జేయును. ఈ బీజము లెనిమిదియో అంతకు దక్కువయో ఒక్కొక సంచి వంటి వాని లోపన నుండుటచే వీనికీ పేరు కలిగెను. అట్లు రెండు తంతువుల యందలి పదార్థము ఒక దానిలో జేరగనే దాపున నున్న తంతువులు చుట్టు చేరి వాని నావరించుకొనును. ఇట్లావరించు కొనుట దాని సంరక్షణ కొరకే. కొన్ని టిలో స్యూత బీజములు బహిరంగముగానే యుండును. వాని ప్రక్కను మాత్రము కొన్ని గొడ్దు తంతువు లుండును. కొన్నిటిలో అట్లు గొడ్డుతంతువులుండవు.

ఒకొక్కప్పుడు రాగులు మొదలగునవి పంటకు సిద్ధముగా నున్నప్పుడు కంకులలో నుండి నల్లని గింజల వలె కొన్ని గనపడును చున్నవి. వానిని చల కాలము వరకును చెడి పోయన గింజలే యనుకొనిరి. తరువాత కొంత కాలమునకవియు బూజె 504

గుట గ్రహించిరి. ఈగింజలవంటివి చేను కోయునపుడు రాలి భూమిలో దాగి యుండును. వాని మీద నుండు నల్లని గట్టి పడిన తంతువులు సంరక్షించుచుండును. గావున అవి రెండు మూడు నెలల వరకు కూడ నట్లుండ గలవు. తరువాత వాని నుండి కొన్ని పలువలు బయలు దేరును. అవి రాలి డోలు వాయించు కర్రల వలెనుండును. వాని తలపైన పొక్కులు పొక్కుల వలె గొన్నిటిని జూడ వచ్చును. ఈ పొక్కులపైన రంద్రములు గలవు. దీనిని సూక్ష్మ దర్శిని క్రింద బెట్టి చూచినచో ఆ రంధ్రముల క్రింద సందుల వంటివి యున్నట్లు , దానిలో న్యూత వీజములున్నట్లు గాన వచ్చును. ఈ న్యూత బీజములు గాలి మూలముననో, పురుగుల మూలముననో బైటకు వచ్చి పుష్పముల కడుగున చేరి యచ్చట బూజుగ పెరుగును. ఈ బూజు పుష్ప భాగముల నావరించు కొనును. దీని నుండి సిద్ధ బీజాశయములు కూడ పుట్టును. మరియు నివి పుట్టినపుడు తేనె వంటి ద్రవముకూడ వీని నుండి స్రవించును. ఈగలు ఈ తేనెకు ఆశపడి దానిని గ్రోల రాగా వానినంటు కొని సిద్ధ బీజాశయములు వ్యాప్తి నొందు చున్నవి. అవి మరియొక పుష్పమును చేరగనే యచ్చట మరల బూజును బెంచుచున్నవి.

అట్లు క్రమక్రమముగ బూజు పుష్పమునందంతయు వ్యాపించి ధాన్యముపండ బోవునపుడె పైనల్లని గట్టి పొరనేర్పరుచు కొను చున్నవి. 505

కల్లుపులియట, దాని నుండి చిక్కబడుట మొదలగు వానికి కారణ మగు మధుశిలీంద్రకణములు నిట్టివే., వానికిని న్యూతబీజములు గలవు.


ఒక్కొకప్పుడు గోదుమ చేలు పాడగునపుడు వాని ఆకుల మీద పచ్చనివి గోదుమ వర్ణము గలవి చారలగు పడును. ఈ చారలలో నుండి పొడి పొడి వంటి పదార్థము వచ్చుట చూడ నగును. దీనిని భూత దర్పణము క్రింద బెట్టి పరీక్షించితిమా అచ్చోట బూజు గలుగుటయు, ఆబూజు పలు గదులు గలది యగుటయు, తంతువులు సరిగ నుండక, కొమ్మలు రెమ్మలుగ నుండుటయు కనబడును. ఆకు లోపల నీ బూజును పొడి వంటి సిద్ధ బీజములు నేర్పడుట చేత ఆకు అచ్చోట పగులు చున్నది. అపగులులో నుండియే సిద్ధ బీజములు బైటకు వచ్చు చున్నవి. అవి అండాకారముగ నున్నవి. వాని కవచము దట్టముగా లేదు గాని మూడు చోట్ల మిక్కిలి సన్నముగా నున్నది. ఇది నీళ్ళలో బడినపుడు ఈసన్నముగానున్నచోటులనుండి కాడలు వచ్చును. ఆమూడింటిలోను నొక్కటియే పొడుగుగా నెదుగును. ఇట్లుండగా నిది యేఆకుమీదనైన బడని యెడల బెరుగక చచ్చిపోవును. 506

ఆకులమీదనున్న పచ్చనిచారలు దోదుమ వర్ణముగ మారుటయు దాని నుండియు సిద్ధ బీజములు వచ్చుటయు జూచినదే కాని, మొదటివియు నివియు నొకటేనా యను సందియముమాత్రము కలుగును. ఈ సిద్ధ బీజముల కవచము మిక్కిలి దట్టముగ నున్నది. మరియు నివి రెండేసి కలసి యేర్పడి నట్లున్నవి.

మరియు నివి గోదుమమొక్కల మీద తిరిగి బూజుగా నేర్పడునేమో యని జూచిరి గాని, గోదుమాకుల మీద నెన్ని దినములుంచినను చలనము లేదు. కానీ మొదటిదియు, నిదియు నొకటి కాదని చాల మంది నమ్మి యుండిరి.

గోదుమచేలట్లు ధ్వంశమగుచుండగా, దగ్గిరనొకజాతి గడ్డిమొక్క యున్నచో పైరునకు తెగులు పూర్తిగ బట్టునని రైతులు నమ్మి యుండిరి. అది పరమ చాందస మని కొందరు ఎగతాళి చేసిరికాని, అట్లగుట స్పష్ట పడియెను. అందు చేత అప్పుడు గోదుమ చేలకు దాపున నట్టి గడ్డి దుబ్బల నుంచ రాదని ఇంగ్లాండు నందు రాజాజ్ఞ యు గలిగెను. నిజముగా నీగడ్డి మొక్కలందు కూడ బూజుగలదు.

ఈసంగతంతయు నెరిగిని యొకవృక్షశాస్త్రవేత్త గోదుమమొక్కల మీద గలిగిన రెండవరకము సిద్దబీజములను 507

ఈగడ్డిమొక్క మీద వేసిచూచెను. అచ్చట అది గడ్డి మొక్క మీద నున్న బూజు వలెనే బెరిగెను. ఇట్లు ఈ బూజు కొంత కాల మొక మొక్క మీదను మరి కొంత కాలము మరి యొక మొక్క మీదను బెరుగు చున్నది.

కుక్కగొడుగు బూజుని ఈ బూజు వలెనే దదులు గదులుగా నుండును. కుక్కగొడుగునకు బూజెక్కడందు రేమో, అది కూడ బూజు మూలమున నేర్పడినది. అది వృక్షమునకు కాయ ఎట్టిదో బూజులకది యట్టిది. ఇదియే సిద్ద బీఅములను భరించును. కాయలో గింజలుండినట్లు దీనిలో సిద్ధ బీజములున్నవి. దాని కాడలను చీల్చి చూచిన యెడల బూజు వలె నుండుట స్పష్టపడును. అది మెదట బూజు నంటి పెట్టుకొని పెరుగు చున్నది. మొదట కాడ అడుగు భాగమును గుండ్రని తలయు గలసియుండును. కాని మధ్య నున్న కాడ ఎదుగుట చేతను ఇతర కారణముల వలనను అది విడి ఎదుగును. దాని అడుగు వైపున గొడుగు బెత్తములున్నట్లు చాల రేకులవలె గలవు. వీని మధ్యనే సిద్ధబీజాశయములున్నవి. కాడలోను పైనున్న అతంతువులు లోపలనున్న తంతువు లొకతీరును లేవు. 508

మూలలను, కుళ్ళుచున్నచోట్లను నుండు బూజును కూర్చి చదువ నేలని కొందరందురేమో. కాని దీనిని గూర్చి చదువుట జాలయగత్యమే. వీని మూలమున కోట్లకొలది రూపాయల పంట నష్టమగు చున్నది. వరి, గోదుమ, పోక, చెరకు, బంగాళ దుంప మొదలగు ఎన్నో ముఖ్యమైన పయిరులకు తెగుళ్ళు వీని వలన పుట్టు చున్నవి. కావున వాని సంగతెరిగి వానిని రూపు మాప యత్నింప వలసి యున్నది. చేయునది ఇట్టి పాడు పనియే కాదు, అదికొంచెము మంచి పని కూడ చేయుచున్నది. కుళ్ళు చున్న పదార్థముల పయిన బెరిగి త్వరగ వానిని మంటిలో గలిపి వేయును. మరియు ఐరోపినియునులు, మరి కొందరు కుక్క గొడుగులను కొన్నిటిని తిందురు.

............................................. సమాప్తము......................................................