Jump to content

వృక్షశాస్త్రము/కుంకుడు కుటుంబము

వికీసోర్స్ నుండి

మారాటతీగె:- అడవులలో జెట్ల మీద బ్రాకు చుండును. ఆకులకు కణుపు పుచ్ఛములు గలవు. ఎఱ్ఱని చిన్న చిన్న పువ్వులు పూయును.

కనపతీగె:- బల్ల పరుపుగా నుండును. వువ్వులు తెలుపు.


కుంకుడు కుటుంబము

కుంకుడుచెట్లు మనదేశములో జాలచోట్ల బెరుగుచున్నవి.

ఆకులు:- మిశ్రమ పత్రములు. ఒంటరి చేరిక. కణుపు పుచ్ఛములు లేవు. చిట్టి యాకులు మూడో, నాలుగో అయిదో యుండును. సమాంచలము. విషమ రేఖ పత్రము. దట్టముగాను బిరుసుగాను నుండును. కొన సన్నము. ఒక్కొక్కప్పుడు ఖనితము.

పుష్పమంజరి:- కొమ్మల చివరల నుండి రెమ్మ గెలలు. తెల్లని చిన్న పువ్వులు. చేటికలు గలలవు. పువ్వులకు వాసన లేదు.

పుష్పకోశము:- రక్షక పత్రములు 5 సమముగా నుండును, నీచము

దశవలయము:- 5 ఆకర్షణపత్రములు, సమముగానుండును. పైన రోమములు గలవు.

కింజల్కములు:- 8 పొట్టివి. కాడల యడుగున రోమములు గలవు. పుప్పొడి తిత్తులు 2 గదులు, కింజల్కముల చుట్టు పళ్ళెరము గలదు. అండకోశము:- అండాశయము ఉచ్చము. మూడు తమ్మెలు గలవు. కీలము 1 గుండ్రము. కీలాగ్రము గుండ్రము. గిజకు బీజ పుఛ్చము గలదు.

రౌటంగచెట్టు అడవులలో పెరుగుచున్నది.

ఆకులు:- కొమ్మల చివరల నుండును, ఒంటరి చేరిక. మిశ్రమ పత్రములు 8" అం. మొ..... 16" అంగుళముల వరకు పొడుగు. చిట్టి యాకులు మూడు నాలుగు జతలుండును. వీనికి తొడిమలేదు. బల్లెపు నాకారము. సమాంచలము. రెండు వైపుల నున్నగా నుండును.

పుష్పమంజరి:- లేత కొమ్మల మీద కణుపు సందుల నుండి వచ్చు చున్నవి. వీనిలో మిధున పుష్పములో పురుష పుష్పములో గలవు.

పురుషపుష్పము.

పుష్పకోశము:- సయుక్తము. గిన్నెవలె నుండును. 5 దంతములు గలలవు. నీచము.

దళవలయము: లేదు.

కింజల్కములు:- 6 కంటె నెక్కువ యున్నవి. పొడుగుగా నుండును. పుప్పొడి తిత్తులు రెండు గదులు. కింజల్కముల చుట్టు బళ్ళెరము గలదు.

అండకోశము:- గొడ్డు అయినది.

మిధునపుష్పము:- పుష్ప కోశము, దళ వలయము, కింజల్కములు పై దాని లోపలనే యుండును.

అండకోశము:- అండాశయము ఉచ్చము 3 గదులు. అండాకారము. కీలము పొట్టి. కీలాగ్రము మూడు చీలికలు. ఫలము లో పెంకుకాయ. జాజికాయంతయుండును. రెండో, మూడోగింజలున్నవి.

ఈ కుటుంబపు చెట్లు ప్రపందమునందన్ని చోట్లను గలవు. వీనిలో చెట్లు, గుబురు మొక్కలే గాని గుల్మము లంతగా లేవు. ఆకులు ఒంటరి చేరిక, కణుపు పుఛ్చము లుండవు. పుష్పములు చిన్నవి. రక్షక పత్రములు, ఆకర్షణ పత్రములు అయిదైదు గలవు. కింజల్కములు నాలుగో, ఎనిమిదో యుండును గాని, అయిదో, పదీ యుండవు. కింజల్కముల చుట్టు నొక పళ్ళెరము గలదు. సాధారణముగ గింజలకు బీజ పుచ్ఛములుండు చుండును.

కుంకుడు:- చెట్లు మన్యము లందును, అడవుల లోను బెరుగు చున్నవి. కాని వానినెవరు శ్రద్ధతో పెంచునట్లు లేదు. కుంకుడు కాయలను చిరకాలము నుండియు దేహము రుద్దుకొనుటకు నుపయోగించు చున్నారు. సబ్బుకంటె మంచిదని వీనితోడనే శాలువలను, పట్టును ఉతుకు చున్నారు. వెండి, బంగారు నగలను కూడ మురికి వదలుటకు వీనితో తోమెదరు. మరియు ఏలక కాయలను కూడ కుంకుడు రసముతో రుద్దుదురు.

రౌటంగచెట్టు:- అడవులలో బెరుగు చున్నది. దీని గింజలనుండి విలువగు చమురు వచ్చు చున్నది. ఈచము రౌ షధములలో బనికి వచ్చును. కొబ్బరినూనె వలెనె తలకు రాసు కొన వచ్చును. దీని నూనె రాసుకొనిన దల వెండ్రుకలు బగుగ బెరుగు నందురు. లక్క (నిచ్చు) పురుగు దీని యాకుల దిని జీవించగలదు.

ఉల్లెనతీగె:- గుల్మము. కొమ్మల సహాయమున పెద్ద చెట్లపై నెగబ్రాకును. ఆకులు మిశ్రమ పత్రములు. వీనికి నిద్ర గన్నేరు ఆకుల వలె స్పర్శ జ్ఞానము గలదు. గింజ పై హృదయాకారముగ తెల్లని అచ్చ యుండును. ఈ మచ్చను బట్టి దీనిని సులభముగా గుర్తింప నగును.

అరిష్ట:- చెట్టు పెక్కు చోట్ల నిరువది యడుగులెత్తు పెరుగు చున్నది. దీని కాయలను గుంకుడు కాయలవలెనే వాడుదురు.

విష రాసి:- కొండల మీద పెరుగును. దీని మాను చాల పొడుగుగాను లావుగాను నుండును. కలపయు గట్టిగా నుండును గాన అన్ని పనులకు బనికి వచ్చును.

తాటకి:- చెట్టు కొండలమీద పెరుగును. దీని పండ్లు తిందురు. వేళ్ళతో విరేచనములు కట్టుటకు మందు చేతురు.

కొరవి:- చెట్లు కొండలమీద నుండును. కీని కలప తెల్లగా నుండును గాని అంత మంచిది గాదు.

మామిడి కుటుంబము


మామిడిచెట్టు మనదేశమునం దంతటను బెరుగు ముఖ్యమౌ వృక్షములలో నొకటి. ఈచెట్లలో జాలరకములు గలవు. మ్రాను, ఎత్తుగను లావుగను బెరుగును. అడుగున నున్న కొమ్మలు అడ్డముగ వ్యాపించును. బెరడు కొంచెము నల్లగానుండును.

మామిడిపువ్వు పెద్దదిగా జూపబడినది.


ఆకులు:- ఒంటరి చేరిక. లఘుపత్రములు. కణుపు పుచ్చములు లేవు. బల్లెపాకారము, కొన్ని సమగోళాకారము, కొన్ని, అండాకారముగ గూడ కలవు. బిరుసుగాను, నున్నగాను నుండును. సమాంచలము, కొన సన్నము, కొన్నిటిలో గుండ్రముగను, కొన్నిటి యందు నాలమును గలదు.

పుష్పమంజరి:- కొమ్మల చివరనుండి రెమ్మగెలలు. పువ్వులు చిన్నవి. కొంచెము పచ్చగను గొంచెము ఎరుపు రంగుగను నుండును. మిధున పుష్పలును, ఏక లింగ పుష్పములును గలవు.