Jump to content

వృక్షశాస్త్రము/ఉప్పుపొన్న కుటుంబము

వికీసోర్స్ నుండి

ను పిడేళ్ళు, పిల్లంగోరులు మొదలగు సంగీత సాధనములు చేయుటకు బాగుండును. దీని పప్పు మనము తినము గాని ఐరోపా దేశస్థులు నిలువ చేసి తిందురు. దీని నుండి జిగురును వచ్చు చున్నది. అది మంచిది కాదు.


ఉప్పుపొన్న కుటుంబము.


ఈ కుటుంబపు చెట్టు నీటితీరముల బురదలో పెరుగును. ఆకులు అభిముఖ చేరిక, కణుపు పుచ్చములుండును. ఈ కణుపుచ్చములు తొగరు చెట్టు నందున్నట్లు రెండాకులకు మధ్యగా నుండును. మిధున పుష్పములు. పుష్పకోశము అండాశయము నంటి స్థిరరముగా నుండును. ఆకర్షణ పత్రము రక్షక పత్రములన్ని యుండును. కింజల్కములు వానికి రెట్టింపు. అండకోశము ఉచ్చము. కాయ బ్రద్దలవదు. ఈ చెట్టు మెత్తని బురద నేలలో బెరుగును గాన గాలికి బడి పోకుండ నుండుటకు మాను నుండియు గొమ్మల నుండియు గూడ వ్రేళ్ళు క్రిందికి దిగు చుండును. కొన్ని చెట్లలో గింజలు కాయ నుండి బయటకు బడకమునుపే, గింజలలో నుండి వ్రేళ్ళు క్రిందకు వచ్చుచున్నవి.

ఉప్పుపొన్న చెట్లు బెరడు నుండి యొక రంగును తోలు బాగు చేయు పదార్థమును దీయ వచ్చును. కాని ఈ పదా


ఉప్పుపొన్న.


విత్తనము కాయలోపల నుండగనే వేరు బయటకు వచ్చుచున్నది. ర్ధమొక చెట్టు నందెక్కువయు మరియొక దాని యందు తక్కువయు నుండుట చేతను, ఏ చెట్టు నందెక్కువ యున్నది వానిని కోసి వేసిన గాని తెలియ రాకుండుట చేతను ఈ చెట్టు లాభకారకము లగుట లేదు. దీనిపండ్లు తినుటకు బాగుండునందురు. కలపయు బాగుగనే యుండును కాని ఎందుచేతనో వాడుకలో లేదు.


మద్ది కుటుంబము.


నల్లమద్ది:- చెట్టు పలుతావుల బెరుగు పెద్ద చెట్టు.

ఆకులు: కొంచమించు మించు అభిముఖ చేరిక, పైనున్నవి ఒంటరి చేరికయే. లఘు పత్రములు, సమ గోళకారము. అందాకారము. అడుగున రోమము లుండును. సమాంచలము విషమ రేఖ పత్రము. కొన సన్నము. తొడిమ చివర గ్రంధి కోశములు గలవు.

పుష్పమంజరి:- కణుపుసందులనుండి రెమ్మ కంకులు. మిధున పుష్పములు, ప్రతి పువ్వు వద్దను ఒక చేటీక గల్దు.

పుష్పకోశము:- సంయుక్తము. గొట్టమున వలె నుండును. అండాశయమున కంటె పొడగు. తమ్మె త్రిభుజాకారము. ఒక దాని నొకటి తాకు చుండును.

దళవలయము:- లేదు.

కింజల్కములు:- 10. పుష్ప కోశము నంటి యున్నవి. వీని మధ్యనొక పళ్ళెరము గలదు.

అండకోశము: అండాశయము నీచము. ఒకగది. రెండోమూడో అండములు వ్రేలాడుచు నుండును.