వృక్షశాస్త్రము/మద్ది కుటుంబము

వికీసోర్స్ నుండి

ర్ధమొక చెట్టు నందెక్కువయు మరియొక దాని యందు తక్కువయు నుండుట చేతను, ఏ చెట్టు నందెక్కువ యున్నది వానిని కోసి వేసిన గాని తెలియ రాకుండుట చేతను ఈ చెట్టు లాభకారకము లగుట లేదు. దీనిపండ్లు తినుటకు బాగుండునందురు. కలపయు బాగుగనే యుండును కాని ఎందుచేతనో వాడుకలో లేదు.


మద్ది కుటుంబము.


నల్లమద్ది:- చెట్టు పలుతావుల బెరుగు పెద్ద చెట్టు.

ఆకులు: కొంచమించు మించు అభిముఖ చేరిక, పైనున్నవి ఒంటరి చేరికయే. లఘు పత్రములు, సమ గోళకారము. అందాకారము. అడుగున రోమము లుండును. సమాంచలము విషమ రేఖ పత్రము. కొన సన్నము. తొడిమ చివర గ్రంధి కోశములు గలవు.

పుష్పమంజరి:- కణుపుసందులనుండి రెమ్మ కంకులు. మిధున పుష్పములు, ప్రతి పువ్వు వద్దను ఒక చేటీక గల్దు.

పుష్పకోశము:- సంయుక్తము. గొట్టమున వలె నుండును. అండాశయమున కంటె పొడగు. తమ్మె త్రిభుజాకారము. ఒక దాని నొకటి తాకు చుండును.

దళవలయము:- లేదు.

కింజల్కములు:- 10. పుష్ప కోశము నంటి యున్నవి. వీని మధ్యనొక పళ్ళెరము గలదు.

అండకోశము: అండాశయము నీచము. ఒకగది. రెండోమూడో అండములు వ్రేలాడుచు నుండును.

ఈకుటుంబములో పెద్ద చెట్లును గుబురు మొక్కలును గలవు. ఆకులు లఘు పత్రములు. పువ్వులు మిధున పుష్పములే గాని, కొన్నిటిలో ఆకర్షణ పత్రములు లేవు. కొన్ని పువ్వుల పుష్ప కోశపు తమ్మెలు అల్లుకొని యుండును. కొన్నిటివి తాకు చుండును. అండాశయము నీచము. ఒక గది. కొన్నిటిలో నొక గింజయే కలదు. మరి కొన్నిటిలో నంతకంటే ఎక్కువ యుండును. పుష్ప కోశము యెక్క తమ్మెలనను బట్టియు గింజల సంఖ్యను బట్టియు ఈ కుటుంబమును జాతులను తెగలను, విభజించియున్నారు.

నల్లమద్ది:- చెట్ల కలప మిక్కిలిబలమైనది. స్థంభములకును, దూలములకును, రోళ్ళు రోకళ్ళు నాగళ్ళు మొదలగు వానిని చేయుటకును, పదవలకును ఉపయోగించుచున్నారు. ఈ చెట్లనుండి వచ్చెడు జిగురును గొందరు తెనెడి వారు దానిని గాల్చిన మంచి వాసన వచ్చును. చెట్ల బెరడు ఔషధములలోను, రంగులు చేయుటలోను, ఎక్కువగా చర్మములు బాగు చేయుటలోను వాడు చున్నారు. చర్మములు బాగు చేయుటలో కాయలు కూడ పనికి వచ్చును కాని కరక్కాయ లంత మంచివిగావు. దీని ఆకులను పట్టుపురుగులు తినును.


తెల్లమద్ది.


తెల్లమద్ది:- చెట్టుసాధారణముగ నీటి వార పెరుగును. దీని ఆకులు సన్నముగ నిడివి చౌకముగను, నున్నగను నుండును. పై చెట్టు వలెనే నిదియు నుపయోగించును.

ఏరుమద్ది చెట్టును పెద్దదియే. దీని కొమ్మలు అడ్డముగా వ్వాపించును. దీని కలపయు గట్టిగానె యుండును.

కరక్కాయిచెట్టు:- కొండలమీదను, బయలు ప్రదేశములందును కూడ పెరుగు చున్నది. కరక్కాయల వ్యాపారము మెండుగా గలదు. కరక్కాయ బెరడును పటికయు కలిపి నీళ్ళు గాచి ఆనీళ్ళలో బట్టలు వేసిన పచ్చని రంగు పట్టును. కాని తరచు నల్ల రంగు, తోపు రంగు అద్దుటలో ఎక్కువగ దీనినుపయోగింతురు. అన్న భేదితో కూడ కలిపి కాచిన యెడల నల్లని సిరా వచ్చును. ఈ కాయలను చర్మములు బాగు చేయుటలో ఎక్కువగా ఉపయోగించు చున్నారు. వీని నౌషధములలో కూడ ఉపయోగించు చున్నారు. ఈచెట్ల కలపయు గట్టిగానె యుండును.

బాదముచెట్టు:- చాల చోటులనే పెరుగు చున్నది. పువ్వుల కంకుల మీద పైన మిధున పుష్పములును, అడుగున పురుష పుష్పములున్నవి. ఇవి త్వరగా రాలి పోవుచుండును. ఈ చెట్టు నుండియు జిగురు వచ్చును. లేత ఆకులను బెరడును ఔషధములలో ఉపయోగింతురు. ఆకులు పెద్దవిగా నుండుట చే విస్తళ్ళు కుట్టు కొనుటకు బాగుగనే యుండును. కాని, ఎండి నిలవ యుండమిచే లాభములేదు. కాయలు సీమ బాదము కాయల వలెనే యుండును గాని, పప్పు అట్లుండదు. దీని నుండి తీసిన చమురు సీమ బాదము నూనెను బోలి యుండును.

తొండ్ల చెట్టు అడవులలోను గొండల మీదను పెద్దదిగా బెరుగును. ఆకులు కొమ్మల చివర గుబురుగా పెరు గుచున్నవి. పువ్వులుచిన్నవి. దురువాసనగలదు. కాయలనుదిందురు గాని చాల తినినచో మత్తు కలుగ జేయును. వీనిని ఔషధములలోను, రంగు చేయుటకును చర్మములు బాగు చేయుటకును వాడుదురు. ఈ చెట్టు నుండి వచ్చు జిగురు తుమ్మ జిగురు వలె నుండును గాని నీళ్ళలో కరుగదు. కలప పెళుసుగా నుండును గాన సన్న పనులకు బాగుండదు. నాగళ్ళు మొదలగునవి చేయవచ్చును.

తాండ్ర చెట్టు నలుబది ఏబది అడుగుల ఎత్తు పెరుగును. కాయలు గుండ్రముగాను ఎర్ర్గగాను యుండును.

చిరిమాను:- చెట్టు ఎత్తుగా పెరుగును. పువ్వులు పచ్చగా నుండును. కలప గట్టిగా నుండుటచే దూలములుగ నుపయోగింతురు.

నిమిరి చెట్టు నుండియు మంచి కలప వచ్చు చున్నది.

వెల్లనాగ:- చెట్టు చాలచోట్లనే పెరుగుచున్నది. దీని బెరడును చర్మములు బాగు చేయుటలో పనికి వచ్చును. కలపయు గట్టిగానేవుండును. గొడ్డలి మొదలగు వాటి కాములకును, ఓడలుకట్టుటలోను, రైలుపట్టాల క్రింద బరుచుటకును బనికి వచ్చును.

పాంచన చెట్టు:- చిరిమాను చెట్టువలెనే యుండును గాని మాను అంత పొడుగుగాను సూటిగను వుండదు. మరియు నీరుదగిలిన పుచ్చుట నారంభించును.

బొద్దు తీగె పెద్దది. అడవులలో చెట్ల మీద ప్రాకును. కాయలకు ఐదు రెక్కలు గలవు.

బండిమురుదుడు: శీతాకాలములో పుష్పించును.


నేరేడు కుటుంబము.


నేరేడు చెట్టు: పెద్దది. అది చాల చోట్లనే పెరుగు చున్నది.

ఆకులు:- అభిముఖచేరిక, లఘుపత్రములు. తొడిమకలదు. కణుపు పుచ్చములు లేవు. నిడివి చౌక పాకారము. సమాంచలము. నున్నగాను దట్టముగాను నుండును. కొన యందు చిన్న వాలముగలదు. అంచు చుట్టు ఈనెగలదు.

పుష్పమంజరి:- కణుపుసందుల నుండి రెమ్మ గెలలు, పుష్పములు సరాళము సంపూర్ణము.

పుష్పకోశము:- చిన్న చిన్న రక్షకపత్రములు. ఇవి ఒక్కొక్కప్పుడు అడుగున కలసి యుండును. ఉచ్చము.

దళవలయము:- అసంయుక్తము. ఆకర్షణపత్రములు నాలుగు చిన్నవి. గుండ్రముగాను ఆకుపచ్చగాను నుండును. పుష్పకోశము నంటి యున్నవి.