వృక్షశాస్త్రము/అడ్డసరపు కుటుంబము

వికీసోర్స్ నుండి

330

నువ్వులను బ్రాహ్మణకార్యములందు వాడుదురు.

పెద్దపల్లేరు ఇసుక నేలలో పెరుగును. దీని వేరు నారింజ రంగుగా నుండును ఈ మొక్క ఆరంగుళములు మొదలు రెండడుగు లెత్తు వరకు పెరుగును. ఆకులు అండాకారము, పువ్వులు పచ్చగా నుండును. దీని ఆకులను రొట్తను వేడి నీళ్ళలో నైనను, పాలలోననను వేసి కలియ బెట్టు చున్న యెడల నవి చిక్క బడును, గొల్లలు పెరుగులో నీళ్ళు బోసి గట్టిగా నుండుటకు దీని నుపయోగింతురట.

బగ్గపట్టి మొక్క చెరువు గట్లమీద నొకటి రెండడులు ఎత్తు మొలచును. వర్ష కాలములోను శీతా కాలములోనుల్నీలపు రంగు పువ్వులను బూసి అందముగా అగుపించును. వుప్పులకు సువాసన గలదు.


అడ్డసరపు కుటుంబము.


అడ్డసరముచెట్టు హిందూ డేసమునం దెల్లయెడలను పెరుగు చున్నది. దీనిని తరుచుగా తోటలయందు దొడ్లలోను పెంచుదురు.

ఇది గుబురు చెట్తు సాధారణస్ముగా 4....8 అడుగుల వరకు పెరుగును గాని అప్పుడప్పుడు 20 అడుగుల వరకు కూడ పెరుగును. బెరడు నున్నగాను బూడిదవర్ణస్ముగాను నుండును. 331

అడ్డసరము పువ్వు.

ఆకులు:- అభి ముఖ చేరిక లఘుపత్రము కణుపు పుచ్చములు లేవు. కురుచ తొడిమ వెడల్పు బల్లెపాకారముగ నుండును. సమాంచలము, విషమ రేఖ పత్రము, ఇరుపక్కల నున్నగా నుండును. కొన సన్నము.

పుష్ప మంజరి
- కంకి కణుపుసందుల నుండి పెరుగు వృంతముల మీద పుష్పములు దట్టముగా నుండును. ఉప వృంతము సందులనుండి పెరుగు వృంతముల మీద పుష్పములు దట్టముగా నుండును. ఉప వృంతములు లేవు. చేటికలు గలవు. 2 చేటికలు 9 ఉప చేటికలును గలసి పుష్పమును మరుగు పరుచును.
పుష్పకోశము
- సంయుక్తము తమ్మెలు 5. నీచము ఆకు పచ్చని రంగు
దళవలయము
- సంయుక్తము రింది భాగము గొట్టము వలెను పైభాగము ఓష్టాకారముగను నుండును. పై పెదవి యందు తమ్మెలు రెండును క్రింది పెదవి యందు మూడును గలవు. తెలుపు రంగు క్రింది పెదవి మీద నెర్రని చారలు గలవు. మొగ్గలో ఈ తమమెలు అల్లుకొని యుండును.

కింజల్కములు:-రెండుదళవలోఅయము నంతటుకొని యుండును పైపెదవికిదగ్గరగానుండును. పుప్పొడిక్రిందివైపునకోణమువలెనుండును. పుప్పొడితిత్తులు రెండుగదులు సమముగావుండక ఒకటి మీదికిని రెండవది కొంచము క్రిందకును నున్నవి. 332

అండకోశము
- అండాశయము ఉచ్చము. రెండు గదులు నాలుగు అండములు.

కీలము: అండాశయ శిఖరమునుండి పుట్టును గుండ్రము.

శీలాగ్రము గుండ్రము రెండుగా చీలి యుండుటయు గలదు.
ఫలము
రెండు గదులు గట్టిగా నుండు కాండల నంటి నాలుగు గింజలుండును. బహువిదారున ఫలము
నేలవావిలి
- తరుచుగా తోటలందు పెంచుదురు. గుబురు మొక్క. రెండు మొదలు నాలుగు అడుగుల ఎత్తు పెరుగును బెరడు కొంచెమాకు పచ్చగా నుండును.
ఆకులు
- అభిముఖ చేరిక. లఘు పత్రము కణుపు పుచ్చములు లేవు. కురుచ తొడిమ పత్రము బల్లె పాకారముగు. సమాంచలము. విషమ రేఖ పత్రము. రెండు ప్రక్కల నున్నగా నుండును. కొన సన్నము.
పుష్ప మంజరి
కొమ్మల చివరల నుండి రెమ్మకంకులు. వృంతము మీద అపుష్పములు గుత్తులు గుత్తులుగా నుండును. క్రింది గుత్తులు దూర దూరముగా నుండును. చేటికలు గలల్వు. ఇవి సన్నముగాను, దళవలయమున కంటే పొట్టివిగా నుండును.
పుష్ప పోశము
- అసంయుక్తము రక్షకపత్రములు 5 నీచము, ఆకు పచ్చని రంగు
దళ వలయము
- సంయుక్తము ఓష్టాకారము. తెల్లగానైనను గులాబి వర్ణముగానైఅనను నుండుడు. మొగ్గలో అల్లుకొని యుండును. 333

కింజల్కములు:- రెండుదళవలయములనంటి యున్నవి. కాడల క్రింది భాగము వెడల్పుగా నుండును. అచ్చట రోమములు గలవు. పుప్పొడి తిత్తుల గదులు సమముగా లేవు. క్రింది గదికి వాలము గలదు.

అండ కోశము
- అండాశయము ఉచ్చము. సంయుక్తాండాశయము నాలుగు అండములు.
కీలము గుండ్రము కీలాగ్రము రెండు చీలికలుగ నున్నది.
నేల వేము
- నేల వేము మెట్టతావులయందు చెట్ల నీడలను ఒకటి మొదలు మూడు అడుగుల వరకు తుప్పల వలె పెరుగును.
ప్రకాండస్ము
- నాలు పలకలుగా నున్నది.
ఆకులు
- అభిముఖ చేరిక. లఘు పత్రము కణపు పుచ్చములు లేవు. కురుచ తొడిమ బల్లెపాకారము. సమాంచలము విషమ రేఖ పత్రము రెండు ప్రక్కల సున్నగా నుండును.
పుష్ప మంజరి
- కొమ్మల చివరలందుండి గెలలు ఉప వృంతములు గలవు.
పుష్ప కోశము
- అసంయుక్తము రక్షక పత్రములు 5 నీచము.
దళ వలయము
- ఓష్టాకారము. పై పెదవి యందు తమ్మెలు మూడు తెలుపు రంగు. అక్కడక్కడస గులాబి రంగు చుక్కలు గలవు. దశవలయము నందంతట రోమములు గలవు. మొగ్గలో అల్లుకొని యుండును. 334
కింజల్కౌలు
- రెండు కాడల పై భాగమునందు రోమములు గలవు. దళవలయము నంటి యుండును. పుప్పొడి తిత్తులు వెడల్పుగానుఅధశ్శిర అండాకారముగను నున్నవి.
అండ కోశము
- అండాశయము ఉచ్చము రెండు గదులు ఒక్కొక్క గది యందు మూడు నాలుగు అండములుండును.
కీలము
- క్రింది భాగమున రోమములు గలవు. కీలాగ్రము రెండు చీలకలు.

ఈ కుటుంబపు మొక్కలు ఉష్ణదేశములందు విరివిగా పెరుగుచున్నవి. వీనిలో గుబురు మొక్కలు, గుల్మములే గాని పెద్ద వృక్షములు లేవు. ఆకులు అభిముఖ చేరిక. లఘు పత్రములు సమాంచలము. సాధారణముగా చేటిక లుండును. దళ వలయము సంయుక్తము. ఓష్టాకారముగా నైనను, అసరాళముగా నైనను వుండును. కింజల్కములు రెండో, నాల్గో యుండును. కాని, ఎందును అయిదుండవు. అండ కోశము ఉచ్చము. రెండు గదులు. కాయ బహు విధారుణ ఫలము. కాయలెండి రెండు మూడు చోట్ల పగులును. అదివరకు గలసి యున్న డిప్పలు హఠాత్తుగ విచ్చుట చే లోపలి గింజ లెగిరి కొంచెము దూరముగా బడును. అట్లుగాక గింజలన్నియు తల్లిచెట్టునకు దగ్గరగా బడి మొలచిన యెడల అచ్చోట దొరకు నాహారము చాలక చచ్చిపోవలసిన వచ్చును. అట్టిహాని నివారిం 335

చుటకై గింజలు దూరదూరముగా బడు నట్లు కాయల యందీ ఏర్పాటు గలిగినది.

ఈ కుటుంబములోనికల్ల మిక్కిలి యుపయోగ మైనది అడ్డసరము చెట్టు. ఇది అన్ని దగ్గులకును మంచి మందు. కాని క్షయ రోగమునకంతగా బనిచేయ దందురు.

దీని ఆకులను పనస చెక్క యొక్క రంపపు పొట్టుతో గలసి కాచి యొక విధమగు పచ్చని రంగు చేసెదరు. అడ్దసరపు ఆకులతో దమ్ము చేసిన ఎడల వరి చేలు మిక్కిలి సార వంతములగును. దీని బొగ్గును తరుచుగా దుపాకి మందునకు ఉపయోగింతురు. దీని చెక్కతో గొన్ని రుద్రాక్షలు కూడ చేయు చున్నారు.

నేలవేము కూడ ఔషదములందు పనికివచ్చును. చిన్నపిల్లల కడుపు నొప్పికిని, అజీర్ణముచే కలుగు జ్వరములకును దీని ఆకుల రసము నిత్తురు. ఈ రసము మిక్కిలి చేదుగా నుండును గాన ఒక్కొక్కప్పుడు, ఏలకుల పొడుము దీనితో కలిపి మాత్రలు చేయుదురు.

నాగమల్లి అయిదారు అడుగులఎత్తు పెరుగు గుబురు మొక్క. అది సంవత్సరము పొడుగున పుష్పించును కాని 336

కాయలుగాయదు. తోటలలో దాని కొమ్మలు నాటి పెంతురు. దాని వ్రేళ్ళస్తో గాచిన పాలు వీర్య వృద్ధి చేయునందురు. ఈ వేళ్ళను నిమ్మకాయ రసముతోడును, మిరియములతోడన నూరి పట్టించిన తామర పోవును. పాము కాటునకు నాగ మల్లి మొక్క మంచి పని చేయు నందురు గాని, చేసినట్లువిన వచ్చుటలేదు.

నేలవావిలి ఒక అందమైన మొక్క, అది వర్షాకాలములో పుష్పించును.

చేబీరమొక్క డొంకల వద్ద పెరుగును. ఏడాదిలోనే పుష్పించి చచ్చి పోవును.

నేలమర మొక్క పచ్చిక బయళ్ళ మీదను చెట్ల నీడలను పెరుగును. భూమి పైన దీని ప్రకాండమనుపడదు. దీని గింజలు చిక్కుడు గింజలవాలె వంపుగానుండును.

జీమందారితీగ పువ్వులు మంచి వాసన వేయును. దీని పువ్వులు ఓష్టాకారముగ లేవు.

ముల్లుగోరింట అందముగానుండును. దీనిపువ్వుగరాటివలెనున్నది. కింజల్కములు నాలుగు, రెండు పెద్దవి. రెండు చిన్నవి. 337

నీలాంబరము యొక్క నీలపు పువ్వులందముగా నుండును గాన తోటలందు పెంచు చున్నారు.

పెద్దములుగోరింటలో ఆకుల కంటె నిలుడుపైన ముళ్ళు కలవు.

తెల్లములు గోరింట వర్షాకాలములో పుష్పించును. దీని కాయలో చాల గింజలు గలవు.

పచ్చవాడాంబరములో పై పెదవి వెనుకకు వంగి యున్నది.


టేకు కుటుంబము

టేకుచెట్టు ఎనుబది మొదలు నూటయేబది యడుగుల వరకు బెరుగు పెద్ద వృక్షము.

ఆకులు : - అభిముఖచేరిక. లఘుపత్రములు సమాంచలము అడుగున మెత్తని రోమములు గలవు. కొన సన్నము.

పుష్పమంజరి : - కొమ్మల చివరలనుండి ద్వివృంత మధ్యారంభమంజరులగు పెద్దరెమ్మ గెలలు. ప్రతిపుష్పమువద్దను చిన్న చేటిక గలదు.

పుష్పకోశము : - సంయుక్తము గొట్టమువలె నుండును. అయిదో, ఆరో, తమ్మెలుండును. నీచము. అదికాయనంటిపెట్టుకొని దానితోగూడ బెద్దదగును.

దళవలయము : - సంయుక్తము గొట్టము పొట్టి తమ్మె లైదో, ఆరో యుండును. తమ్మెలన్నియు -సమముగా నే యుండును.