విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ)/చతుర్థాంశము
శ్రీరస్తు
విష్ణుపురాణము
భావనారాయణకృతము
చతుర్థాశ్వాసము
| 1 |
గీ. | మఱియు నప్పుడు మైత్రేయమౌనివరుఁడు, హర్షసంభ్రమపరిపూరితాత్ముఁ డగుచు | 2 |
చ. | ధీరకులాగ్రగణ్య సముదీర్ణభవద్వచనంబుల న్సదా | 3 |
వ. | అని విన్నవించిన శ్రీపరాశరుం డిట్లనియె. | 4 |
చ. | కమలజుఁ డాదియై యశము గల్గి మహత్తరశూరయజ్వరా | 5 |
గీ. | వసుధ బ్రహ్మాద్యమగు మనువంశ మెవ్వఁ, డేని నిత్యంబు విను దృఢంబైన భక్తి | 6 |
వ. | సకలజగదనాదియై ఋగ్యజుస్సామాదిమయుండై భగవద్విష్ణుమయ | |
| నికి నదితి, యదితికి వివస్వంతుఁడు, వివస్వంతునకు మనువు, నామనువున కిక్ష్వా | 7 |
గీ. | మనువు మిత్రావరుణులకు మఘము చేసి, తనకుఁ దనయులు గావలెనని తలంప | 8 |
క. | ఆయిల మిత్రావరుణుల, యాయతకృప మగుడఁ బురుషుఁడై సుద్యుమ్న | 9 |
వ. | ఇట్లు సుద్యుమ్నుండు క్రమ్మఱం గాంతయై సోమపుత్రుండగు బుధుని | 10 |
చ. | కుసుమశరాశుగప్రచయకుంఠితుఁడై శశిపుత్రుఁ డప్పు డ | 11 |
వ. | ఇట్లు రమించి బుధుం డిలయందుఁ బురూరవుం గనియె నంత | 12 |
చ. | ఇలకుఁ బురూరవుండు జనియింప మహర్షులు యజ్ఞపూరుషుం | 13 |
వ. | ఇట్లు సుద్యుమ్నునకు నుత్కల, గయ, వినతులను మువ్వురు కొడుకులు | 14 |
క. | మనుపుత్రుండగు పృషధృఁడు, తనగురువులగోవుఁ జంపి తా శూద్రుండై | 15 |
వ. | కరూషునివలన కారూషులను బలపరాక్రమసంపన్నులైన క్షత్రియులు కలి | 16 |
గీ. | అతనియధ్వరములఁ బోలు నధ్వరంబు, గలుగనేరదు భూమిచక్రంబునందు | 17 |
చ. | సురపతి సోమపానమునఁ జొక్కి మదించె ధరామరేంద్రు లు | 18 |
వ. | అమ్మరుత్తునికీర్తి నేడునుం జెప్పంబడు. చక్రవర్తియగు నమ్మరుత్తునకు నరిష్యం | 19 |
ఉ. | ఆతృణబిందుభూవిభుని నచ్చరలేమ యలంబుసాఖ్య కా | 20 |
వ. | ఆవిశాలునకు హేమచంద్రుండు, నతనికిఁ జంద్రుండు, నతనికి ధూమ్రా | 21 |
గీ. | వినుము తృణబిందునిప్రసాదమున నృపాలు, రందఱును నుర్వి వైశాలు లనఁగఁ దగిరి | 22 |
వ. | శర్యాతికి సుకన్యయను కుమారికయు, నానర్తుండను కుమారుండును గలిగిరి. | 23 |
క. | రేవతుఁడు తండ్రి యేలిన, భూవిదితానర్తవిషయములు పాలించెన్ | 24 |
వ. | రేవతునకు రైవతుండనఁ గకుద్మియనఁ బర్యాయనామంబులుగల పుత్రుండు | 25 |
ఉ. | రైవతుఁ డాత్మపుత్రికిఁ గరగ్రహణార్థము రాజపుత్రుఁ డీ | 26 |
వ. | ఇట్లు సత్యలోకంబునకుం బోయి తదంతికంబున హాహా హూహూనామ | 27 |
గీ. | వసుధ నీకు మనసు వచ్చిన యల్లుఁడే, పగిదివాఁ డటన్నఁ బార్ధివుండు | 28 |
సీ. | వనజగర్భు డొకింతవడి విచారించి, భూపాగ్రణిఁ జూచి యిట్లనియె నీవు | |
గీ. | బలము లెవ్వియు లేవు నీ కిల నటన్న, సాధ్వసము నొంది యారాజు జలజభవుని | 29 |
వ. | నీ విచ్చటికి వచ్చినవెనుక నష్టావింశతిచతుర్యుగంబులు చనియె నని పలికి | 30 |
సీ. | ఎఱుఁగలే మెప్పుడు నేజగన్మయుని, స్వభావస్వరూపసంపద్బలములు | |
గీ. | జంద్రసూర్యాకృతులు దాల్చి జగతితమము సకలమును బాఱఁద్రోలు నేస్వప్రకాశుఁ | 31 |
వ. | జగంబులు తానయై గలుగఁజేసి రక్షించి త్రుంచునట్టి శ్రీవిష్ణుదేవుం డిప్పుడు | |
| దేవుండన నఖండప్రభావంబున నున్నవాఁడు. అమ్మహానుభావునకుఁ గన్యా | 32 |
గీ. | కుఱుచలై యల్పతేజులై గుణవివేక, బలసమృద్ధులఁ దక్కులై ప్రబలు ప్రజలఁ | 33 |
చ. | బలుఁడు నతిప్రమాణయగు పద్మదళాయతచారులోచనన్ | 34 |
క. | అనురూపవరున కాత్మజ, ననువొందఁగ నిచ్చి ప్రముదితాత్మకుఁడై యా | 35 |
వ. | రైవతుండు బ్రహ్మలోకంబునకుం బోయి రాకయున్న వెనుకఁ బుణ్యజనసంజ్ఞ | 36 |
క. | క్షుత మొనరింపఁగ మనువున, కతులఘ్రాణమునఁ బుట్టె నాత్మజుఁడు బలా | 37 |
వ. | వారిలోపల మువ్వురు వికుక్షినిమిదండాఖ్యులు శ్రేష్ఠులు. శకునిప్రముఖు లేఁ | 38 |
సీ. | అష్టకాశ్రాద్ధకర్మారంభ మొనరించి, యర్హమాంసంబు తెమ్మనుచుఁ దనదు | |
గీ. | కులగురుండు వసిష్ఠుఁ డక్కొదవ యెఱిఁగి, కనలి యీమాంస మర్హంబు గాదు వీఁడు | 39 |
వ. | గురుండు కోపించి శశాదుం డని పలుకుటం జేసి వికుక్షి శశాదుం డనంబరఁగి, | 40 |
సీ. | మునుపు త్రేతాయుగంబున దేవదానవ, తతులకు ఘోర యుద్ధంబు కలిగె | |
గీ. | నాదరించి గభీర వాక్యముల ననియె, నాత్మ నెఱుఁగుదు నేను మీయభిలషితము | 41 |
వ. | అతని శరీరంబున స్వాంశంబునం బ్రవేశించి యశేషదోషాచరులం జంపెద. | 42 |
ఉ. | క్షత్త్రియవర్య ప్రార్థనము గైకొను మిప్పుడు ఘోరనిర్జరా | 43 |
క. | సకలలోకాధినాథుఁ డీశతమఖుండు, స్కంధమున నన్ను మోవఁగాఁ గదలిపోయి | 44 |
వ. | ఇవ్విధంబున కొడంబడిన సహాయంబు చేసెద | 45 |
గీ. | అనిన నొడఁబడి రమరు లయ్యచలభేది యపుడు వృషభాకృతి వహించి నతనిమూఁపు | 46 |
వ. | ఇట్లింద్రుఁడు వృషభంబైనఁ దత్కకుదారోహణంబు చేసి వైష్ణవతేజోవిశే | 47 |
చ. | అమలచరిత్ర యాకువలయాశ్వుఁ డుదంకునకు న్మహాపకా | |
| ర్గమతరవిష్ణుతేజమున రంజిలి యిర్వదియొక్కవేయుధై | 48 |
వ. | ఇట్లు యుద్ధంబు చేయునప్పుడు దుందుముఖనిశ్వాసాగ్నిదగ్ధులై యేకవింశతి | 49 |
క. | ఆయువనాశ్వుఁ డపుత్రకుఁ, డై యతివిహ్వలత మునుల యాశ్రమములకున్ | 50 |
వ. | మదిం దలంచి పుత్రోత్పాదనంబునకు నిష్టి గావించి యదియు మధ్యరాత్రం | 51 |
ఉ. | ఎవ్వరు ద్రావి రీసలిలమేధితవైదికమంత్రభావితం | 52 |
చ. | జనపతి యేగుదెంచి మునిసత్తములార మదీయమౌఢ్య మి | 53 |
వ. | మహామును లబ్బాలకుం డేనామంబు ధరియింపంగలండని పల్క. | 54 |
గీ. | పాకశాసనుఁ డరుదెంచి బాలుఁ జూచి, “ఏషమాంధాస్యతి" యటంచు నెంచుకతన | 55 |
వ. | అబ్బాలకునివక్త్రంబున నింద్రుం డమృతస్రావిణియైన నిజప్రదేశిని యిడిన | |
| ద్వీపంబుల నేకాతపత్రంబుగా ననుభవించె, తదీయశ్లాఘావరంబైన | 56 |
గీ. | అర్కునుదయాస్తమయము లౌనంతమేర, యవనియెల్లను యువనాశ్వకువలయేశ | 57 |
వ. | ఏవంవిధప్రభావుం డగుచు రాజ్యంబు సేయుచుండి | 58 |
గీ. | బిందుమతి పేరుగల శశిబిందుతనయఁ, బరిణయంబయి మాంధాతృధరణివిభుఁడు | 59 |
వ. | మఱియు నేబండ్రుకన్యకలు గలిగిరి వినుము. | 60 |
సీ. | వేదవేదాంతసంవేది సౌభరియను, ముని జలంబులయందు మునిఁగియుండ | |
గీ. | మౌని యేకాగ్రతాసమాధాన ముడిగి, బళిర యీమీనవిభునిసౌభాగ్య మఖిల | 61 |
వ. | ఏను నిట్టిసుఖం బనుభవింపవలదే యని జలంబులు వెల్వడి మాంధాతృమహీ | 62 |
క. | తిరముగ సంసారంబున, నరవల్లభ నిలువఁదలఁచినాఁడ న్నీకున్ | 63 |
వ. | కన్యార్థినై వచ్చితి. మదీయయాజ్ఞాభంగంబు చేయకుము. కకుత్స్థవంశసం | 64 |
ఉ. | ఉచ్ఛూనతరసిరాప్రచ్ఛాదితశరీరుఁ బరికంపమానదుర్భరశిరస్కు | |
గీ. | భూరినిర్భరతరజరాభారజర్జ, రావయవు నమ్మునీంద్రుఁ గన్నారఁ జూచి | 65 |
వ. | ఇట్లు చింతించు మాంధాతృమహీమండలేశ్వరునకు మునీశ్వరుం డి | 66 |
గీ. | ఏల చింతించె దింత భూపాలవర్య, తగని మాటలు వల్కంగదా యెటైనఁ | 67 |
మ. | అన మాంధాతృఁడు శాపభీతమతియై యయ్యా! మదీయాన్వయం | 68 |
వ. | ఇప్పుడును దత్సమయపరిపాలనంబే కర్తవ్యం బని తలంచెద ననిన మునిపతి | 69 |
ఉ. | బాలిక నీయలేక తడఁబా టొనరించి వచించె నీమహీ | 70 |
వ. | నన్నుం గన్యాంతఃపురంబునకు ననిచిన కన్యకలలో నెవ్వతెయైన వరించిన మేలు. | 71 |
క. | మారునిరూపము ధనదకు, మారునిసౌందర్యమును సమంచితనాస | 72 |
వ. | ఇట్లు దేవగంధర్వమనుష్యాతిశాయియైన రూపంబు దాల్చి యంతఃపురంబు | 73 |
క. | మహనీయరూపవిభ్రమ, సహితుని నమ్మౌనిఁ గాంచి జనపతిసుత ల | 74 |
గీ. | ఇతఁడ నాపతి యితఁడు నాహృదయనాథుఁ, డితఁడే నాప్రాణవల్లభుఁ డితఁడు నామ | 75 |
చ. | వనజదళాక్షులందఱు నవారితలై చనుదెంచి యత్తపో | 76 |
క. | మంగళసమాచరణ మొక, భంగి న్నడచుటయు నంతఁ బ్రతిభాన్వితుఁడై | 77 |
వ. | అచ్చటికి నశేషశిల్పకల్పనానల్పశర్మయగు విశ్వకర్మ రావించి తన | 78 |
శా. | మాంధాతృక్షితిపాలశేఖరుఁడు శుంభత్పుత్రికాస్నేహసం | 79 |
గీ. | హారివస్త్రాన్నపురసౌధవారసార, తూలతల్పంబు లొందు నాదుహితలకును | 80 |
వ. | అని చింతించి యత్తపోధనవర్యుని యాశ్రమంబునకు వచ్చి యతిరమ్యోప | 81 |
గీ. | అమ్మ సౌఖ్యంబు కలదె మహామునీంద్రుఁ, డెలమిఁ జనవచ్చునే మమ్ము నెప్పుడైనఁ | 82 |
మ. | మునిశార్దూలుని సత్కృపామహిమ సొము ల్చీర లాస్వాదవ | |
| దు నవీనద్యుతిసౌధముల్ గల వొకండుం దక్కువా యెంత యై | 83 |
ఉ. | సంతతభోగసంపదలు సంభృతవైభవసంభ్రమంబు ల | 84 |
వ. | అని పలికిన నమ్మహీపతి యచ్చటనుండి మఱియునొక్కప్రాసాదంబునకు వచ్చి | 85 |
గీ. | మౌనికులనాథ నీతపోమహిమకొలఁది, తలఁప శక్యంబె దేవతాతతులకైన | 86 |
చ. | అని కొనియాడి భూమిపతి యమ్మునిచేఁ బ్రతిపూజ నొంది య | 87 |
గీ. | అంతఁ గొంతకాల మరుగ నారాజక, న్యకలయందు వరుస నత్తపోభి | 88 |
| నందనులఁ గాంచి పరమా, నందంబున నుండె మౌనినాథుఁడు వనితా | 89 |
సీ. | బాలురనునుముద్దుఁబల్కు లెన్నఁడు వినఁ, గలుగునో యని కోరఁ బలుకనేర్చి | |
గీ. | సుతులు గనఁజూతురో యన సుతులఁ గనిరి, ప్రోదిమనుమల నెత్తుదురో యనంగ | 90 |
వ. | ఇవ్విధంబున దినదినప్రవర్ధమానవిషయలాలసుండై యమ్ముని యిట్లని చిం | 91 |
గీ. | లక్షవర్షంబులకు నైననక్షయత్వ, గరిమ గైకొని క్రొత్తలై కడలుకొనియె | 92 |
చ. | నిపుణతఁ బుత్రకు ల్నడవనేర్చిరి బాల్యము వీడనాడి ర | 93 |
క. | మనుమల మనుముల మమతలు, పెనుపంగాఁ గంటి మిగులఁ బెరుగంజొచ్చెన్ | 94 |
చ. | అనఁ బని లేదు గాకశకులా, గ్రణి జోకయె కాదె మోహసం | 95 |
వ. | కాంతాపరిగ్రహంబునంగాదె పుత్రపౌత్రాదులు గలిగిరి. వీరివలన మోహంబు | 96 |
సీ. | నిర్ద్వంద్వవృత్తిమానితసుదుశ్చరతపశ్చర్య పూనితి నేల జలములోన | |
గీ. | ప్రజలు పుట్టిన నేమి నిర్భరమనస్స, మాధిగిరిభిదురీభవన్మహితమోహ | 97 |
చ. | చతురత ముక్తి నొందు, దుర సంగమునన్ యతిపుంగవు ల్మహా | 98 |
గీ. | ఘనబలిష్ఠపరిగ్రహగ్రాహగళిత, బుద్ధినై మోసపోయినఁ బోదుఁ గాని | 99 |
వ. | సర్వంబునకు ధాతయై యచింత్యరూపకుండై యణువునకు నణువై యతి | 100 |
గీ. | ధన్యుఁ డవ్యక్తవిస్పష్టతనుఁ డనంతుఁ, డఖిలరూపుఁ డశేషతేజోతిశాయి | 101 |
క. | గురువులకుఁ బరమగురువగు, సరసీరుహపత్రనేత్రు శరణార్థిజనో | 102 |
వ. | అని యివ్విధంబున సౌభరి తనుదాన యుపశమించుకొని పుత్రగృహాసన | 103 |
ఉ. | ప్రేమఁ దలిర్ప సౌభరిచరిత్రము విన్నఁ బఠించి చెప్ప ను | 104 |
వ. | ఇంక మాంఛాతృపుత్రసంతతి వివరించెద. మాంధాతృపుత్రుండైన | 105 |
సీ. | అఖిలదేవేశు నుద్యత్పుండరీకలో, చను యోగనిద్రావసానసుప్ర | |
గీ. | దుష్టగంధర్వతతి నెల్లఁ ద్రుంతుఁ బోయి, యతనిఁ బురికొల్పుఁ డనుచు దేవాదిదేవుఁ | 106 |
మ. | జగతీశర్మదనర్మదన్ భుజగరాజన్యాగ్రణు ల్వంప శీ | 107 |
వ. | ఇట్లు. | 108 |
క. | పురుకుత్సుఁడు గంధర్వో, త్కరముల వధియించి చనియెఁ దనపురమునకున్ | 109 |
వ. | సకలపన్నగపతులును నర్మదం జూచి యెవ్వండేని నిన్నుఁ బేరుకొను వానికి | 110 |
శ్లో॥ | నర్మదాయై నమః ప్రాతర్నర్మదాయై నమో నిశి। | 111 |
వ. | ఇట్లని యుచ్చరించుచు నంధకారంబు ప్రవేశించిన సర్పంబులు కఱవవు. | 112 |
క. | ధరణి భవత్సంతానము, పరఁగు నవిచ్ఛిన్నమై శుభస్థితి నంచున్ | 113 |
వ. | ఆపురుకుత్సుండు నర్మదయందు త్రసదశ్వునిం గనియె. త్రసదశ్వునకు ననర | 114 |
సీ. | ధరణిపై ద్వాదశాబ్దంబు లనావృష్టి, యైన నన్నము లేక గ్లాని పొంది | |
గీ. | తనతపశ్శక్తి నాతని తనువుతోన, స్వర్గమున నిల్పె నిట్టి యాశ్చర్యమహిమ | 115 |
వ. | ఆత్రిశంకునకు హరిశ్చంద్రుండు, నతనికి లోహితాశ్వుండు, నతనికి హారీ | 116 |
గీ. | సవతి తనయీర్ష్యచేత రాజన్న్యుసతికి, గర్భసంస్తంభనమునకై గరము వెట్టె | 117 |
సీ. | బాహుకుం డతిజరాభారపీడితుఁడయి, యౌర్వాశ్రమము చేర్ప ననుచయ౦బు | |
గీ. | తనయుఁ డుదయించి శాత్రవతతులఁ | 118 |
ఉ. | సాహస మేల నాపలుకు సత్యము నమ్ముము నీవనం దదు | 119 |
గీ. | గరముతోఁ గూడఁ బుట్ట సగరుఁ డటంచు, నామధేయం బొసంగి మాణవకునకును | 120 |
వ. | ఆగ్నేయాస్త్రభార్గవాస్త్రాదు లొసంగిన బుద్ధిమంతుండై యొక్కనా డక్కుమా | 121 |
గీ. | అమ్మ మన మేల యుంటి మీయడవిలోన, మజ్జనకుఁ డెందుఁ బోయె సమ్మద మెలర్పఁ | 122 |
వ. | సగరుండు పితృరాజ్యాపహరణామర్షితుండై హైహయతాలజంఘాదివధంబు | 123 |
క. | పాపఁడ జీవన్మృతు లీ, యాపన్నులు వీరిఁ గావవయ్య ద్విజత్వ | 124 |
వ. | వీరలు స్వధర్మపరిత్యాగులైన నీప్రతిజ్ఞ చెల్లెనని నందద్గురువచనం బభినందించి | |
| స్వాధిష్ఠానంబు నొంది యస్ఖలితచక్రుండై సప్తద్వీపవతియైన వసుంధర నే | 125 |
క. | సుమతియుఁ గేశినియును నను, ప్రమదలు కశ్యపవిదర్భపతిసుత లాభూ | 126 |
వ. | ఆసుమతికేశిను లిరువురు పుత్రార్థినులై యౌర్వునిం ప్రార్థించిన నత్తపోధ | 127 |
సీ. | పురుషోత్తమాంశసంభూతుండు నిర్దోషుఁ, డఖిలవిద్యామయుండైన కపిల | |
గీ. | మంతయును విన్నవించితి మనిన నల్పదివసములలోన సాగరు ల్తీరిపోవఁ | 128 |
క. | అంతటిలో సగరమహీ, కాంతుఁడు హయమేధమఖము కావించి సుదు | 129 |
క. | తురఁగము మ్రుచ్చిలి మాయా, పురుషుఁడొకఁడు ధరణిఁ జొచ్చిపోయిన నత్యు | 130 |
ఉత్సాహ. | ధర రసాతలంబుదాఁకఁ ద్రవ్వి యచ్చటం బరి, | 131 |
క. | కని వీఁడె హయమలిమ్లుచుఁ, డనుకంపఁ దొఱంగి పొడువుఁ డడువుఁడు చంపుం | 132 |
క. | స్వకృతాపరాధతనుభవ, వికటదవానలశిఖాభివృతరాజకుమా | 133 |
క. | తనతనయు లెల్ల నీవిధిఁ, జనినతెఱం గపుడు వచ్చి చారులు చెప్పన్ | 134 |
చ. | మహితగుణాభిరాముఁ డసమంజసపుత్రకుఁ డంశుమంతుఁ డ | 135 |
ఉ. | పాపఁడ సాగరుల్ స్వకృతపాపముఁ జే సిటులైరి వీర లు | 136 |
వ. | భవత్పౌత్రుండు మందానికిం దెచ్చి భస్మీభూతులైన సాగరులం దడిపి స్వర్గంబు | 137 |
గీ. | మ్రొక్కి యశ్వరత్నముం గొని వేగంబె, తాతకడకుఁ బోవ ధరణివిభుఁడు | 138 |
వ. | ఆసగరుండు పుత్రవాత్సల్యంబున సాగరంబుం బుత్రునిగాఁ జేసికొనియె. | 139 |
ఉ. | ఆనృపుఁ డొక్కనాఁడు మృగయారతుఁడై వనభూమిఁ ద్రిమ్మరం | |
| క్కానఁ మృగవ్రజం బణఁగెఁ గాన వధించుట మంచి దంచుఁ జేఁ | 140 |
క. | మృతిఁ బొందె రక్కసుండై యితరవ్యాఘ్ర మనె మంచి దిది మఱవకు నేఁ | 141 |
ఉత్సాహ. | అంత గొంతకాలమునకు నరివిభేది యమ్మహీ | 142 |
క. | చనుదెంచి మాంసయుతభో, జన మొసఁగుము నాకు ననిన జనపతి యౌఁగా | 143 |
సీ. | మనుజేంద్రుననుమతి మానవమాంసంబు, తెచ్చి పక్వము చేసి దీప్తకనక | |
గీ. | డై శపించె నృపాలకు ననిశమును మ, నుష్యమాంసంబు దినుచునుండుదువుగాక | 144 |
వ. | ద్వాదశాబ్దంబులకు శాపనివృత్తి యయ్యెడమనియె. అమ్మహీపతియును, | 145 |
క. | మదయంతి యనెడు నవ్విభు, సుదతి కడున్వెఱచి భర్తఁ జూచి కులగురున్ | 146 |
వ. | శపించుట ధర్మంబు గాదని ప్రార్థించిన శపియించుట మాని జగద్రక్షణార్థంబు | 147 |
క. | ఒకనాఁ డొకముని ఋతుకా, లకృతస్నానన్ స్వభావలావణ్యవతిన్ | 148 |
చ. | కనలుచు నార్చి పట్టుకొనఁగాఁ బఱతెంచిన వారు భీతులై | 149 |
గీ. | అకట యిక్ష్వకువంశంబునందుఁ బుట్టి, నట్టినృపతులు ధర్మమార్గైకరతులు | 150 |
వ. | నీవు మిత్రసహుండను మహారాజవు, రాక్షనుండవుగావు; స్త్రీధర్మసుఖాభిజ్ఞుం | 151 |
గీ. | నామనోరథమునకు విఘ్నంబు చేసి, భర్తఁ జంపితి వీపాపఫలముకతన | 152 |
వ. | ఇట్లు శపించి పతి ననుగమించె. నంత ద్వాదశాబ్దంబులు నిండిన శాపకృత | 153 |
క. | అనపత్యుఁడై నృపాలుఁడు, తనగురుని వశిష్ఠమౌనిఁ దగఁ బ్రార్థింపన్ | 154 |
గీ. | కాంత మదయంతి యేడేండ్లు గర్భభరము, పూని వేసరి యొకఱాతఁ బొడిచికొనిన | 155 |
వ. | అయ్యశ్మకునకు మూలకుండగు పుత్రుండు కలిగె. అతండె కదా పరశు | 156 |
సీ. | ఖట్వాంగమేదినీకాంతుండు దేవాసు, రాహవంబున సమభ్యర్థితుఁ డయి | |
| వరము గోరుము ధరావర యన వర మీయ, నాత్మ గోరితిరేని యస్మదాయు | |
గీ. | దెంచి యిట్లని తలఁచె భూదివిజు లడుగఁ, దాల్మిమై దేహమైనను దాఁపకిత్తు | 157 |
వ. | ఎప్పుడును నిట్టివాఁడనై చరింతు నింకను. | 158 |
చ. | మునిజనభాగధేయము సమున్నతవేదశిఖావతంస మా | 159 |
వ. | వాసుదేవబ్రహ్మంబునందు లీనుండై ముహూర్తంబున ముక్తుఁ డయ్యె. | 160 |
గీ. | పుడమిఁ ఖట్వాంగభూపతిఁ బోలునృపతి, కలఁడె దివముననుండి భూస్థలికి వచ్చి | 161 |
వ. | ఆఖట్వాంగునకు దీర్ఘబాహుండును, దీర్ఘబాహువునకు రఘువు, రఘువునకు | 162 |
సీ. | శ్రుతిశిరోవ్యాహారవితతి కింతింతని, కొలఁది పెట్టగరానియలఘుమహిమ | |
గీ. | మమల మవితర్క్య మక్షయ్య మప్రమేయ, మైన నారాయణబ్రహ్మ మవతరించె | 163 |
వ. | రామలక్ష్మణభరతశత్రుఘ్ను లన నాలుగురూపంబుల నుదయించి. | 164 |
చ. | జనకునియాజ్ఞఁ గౌశికునిజహ్నము గావఁగఁ బోవఁ ద్రోవలో | 165 |
సీ | కఠినశిలీభవద్గౌతమప్రేయసి, కలుషవహ్నికిఁ దొలుకారుమొగులు | |
గీ. | అడుగు నెత్తమ్మిరజము బాహాబలంబు, చక్కఁదనము పరాక్రమసౌష్ఠవంబు | 166 |
గీ. | జనకసత్యవచఃప్రతిష్టాపనమున, కనుజసీతాసమేతుఁడై యటవి కేగె | 167 |
చ. | అహరధిపప్రతాపుఁడు జనాధిపుఁ డాదరణీయవైఖరిన్ | 168 |
సీ. | కౌసల్య మొదలుగాఁ గల్గుతల్లులతోడ, వరమూలబలముతో గురులతోడ | |
గీ. | భవ్యపాదూద్వయం బిచ్చి పంపి మగిడి, మగిడి వచ్చెద రిం దుండి మనుట గూడ | 169 |
వ. | కతిపయప్రయాణంబుల దక్షిణపథంబు పట్టి చనిచని. | 170 |
సీ. | గంధదంతావళోత్కరకరోచ్చైఃక్షిప్త,వమధువర్షత్రసద్వనచరంబు | |
గీ. | ప్రోల్లసత్పాదపోల్లలద్భల్లుకేంద్ర, సాంద్రతనుమేచకప్రభాశంకనీయ | 171 |
వ. | తఱియం జొచ్చి చనునప్పుడు. | 172 |
శా. | స్వర్ణావణ్యవతీవిహారఘనవిస్రంభార్హగోదావరీ | 173 |
ఉ. | ఆరవివంశవర్ధనుఁ, డుదారధనూరవభిద్యదుగ్రకాం | |
| స్మేరముఖాబ్జఁ జేయుచు గమించుచుఁ దార్కొనఁ ద్రుంచెఁ గల్పిత | 174 |
క. | శరభంగ సుతీక్ష్ణమునీ, శ్వరపుణ్యాశ్రమములకు వివస్వద్వంశో | 175 |
పంచచామరము. | అగస్త్యమౌని యున్న పావనాశ్రమంబు చేర నా | 176 |
వ. | పరిగ్రహించి యచ్చట నివాసంబు చేసి యుండునంత. | 177 |
సీ. | జటిలులు వల్కలాచ్ఛాదను ల్కృష్ణాజి, నోత్తరీయాంతరీయోరుతనులు | |
గీ. | యాయజూకులు బ్రహ్మవిద్యానిపుణులు, దండకారణ్యసతతవాస్తవ్యు లవని | 178 |
చ. | ఎదురుగ నేగి వారికి నభీష్టత సాగిలి మ్రొక్కి భక్తి లోఁ | 179 |
వ. | పెక్కుదెఱంగుల నాశీర్వదించుచు నిట్లనిరి. | 180 |
గీ. | విశ్వవిశ్వంభరాచక్రవిపుల భార, మాని ప్రజనెల్లఁ బ్రోచు మీయభ్యుదయము | 181 |
సీ. | త్రిషవణవ్రతులఁ గాఱియ పెట్టి నీళ్లఁ ద్రొ, క్కుదురు ముక్కున నూర్పు మెదలకుండ | |
గీ. | పలితదీర్ఘజటావల్లిభరము పట్టి, పట్టి బెడ్డలపై నెత్తు రుట్ట జరఠ | 182 |
మ. | భయదవ్యాఘ్రమదేభసింహకిటిరూపంబుల్ దగంచాల్చి దు | 183 |
సీ. | దర్భ గుప్పెఁడు మోవఁదాళని, జీర్ణసన్మునులు గుఱ్ఱపుగడ్డి మోసిమోసి | |
గీ. | విసిగి యీడ్గిలఁబడ మెడ ల్విఱుగ గ్రుద్ది, దిక్కులేమికి నగుదురు రక్కసులు ని | 184 |
ఉ. | ఈసున బాసఁ దిట్టి మెడలెల్ల బడల్ పడ గ్రుద్ది గెంటుచున్ | 185 |
వ. | యాగంబు లాగంబు లయ్యె, యోగంబులు వియోగంబు లయ్యె, సాంఖ్యం | 186 |
గీ. | పరమఋషిపుంగవుల విన్నపములు విన్న, యన్నరాధీశువదననభోంగణమున | 187 |
క. | శ్రీరాముఁడు కారుణ్య, శ్రీరామారమణుఁడై ఋషిప్రవరులకున్ | 188 |
గీ. | శంబదంభప్రహేళసారంభశుంభ, దాత్మదోస్స్తంభఖడ్గధారాంచలమునఁ | 189 |
వ. | ఇవ్విధంబునఁ బరమఋుషుల నాదరించి. | 190 |
క. | చొక్కు మదిలోఁ దలంచుచు, రక్కెస చనుదేర హాస్యరసముగ నసిచే | 191 |
చ. | అరితతి వేఁటలాడు వసుధాధిపసూనుఁ డనల్పనైపుణీ | 192 |
శా. | మారీచాంతకుఁడై కబంధవధశుంభత్సాయకుండై చమ | 193 |
చ. | భవుకసితాబ్జపత్రరుచి పక్కున నవ్వు నృపాలువాలుఁగ | 194 |
సీ. | స్నానకృత్యముఁ దీర్చె సంచరన్మకరాక్ష, రాక్షసోదరమహాస్రస్రవంతి | |
గీ. | సుఖశయన మొందె మణివిభాశోభమాన, మాననీయనిషంగధామంబునడుమ | 195 |
వ. | ఇట్లు రావణవధంబు చేసి లంకారాజ్యంబున విభీషణునిఁ బట్టము గట్టి సీతాసమే | 196 |
గీ. | కడఁగి మూఁడుకోట్లు గంధర్వనాథుల, బాహుబలము మెఱయఁ బట్టి చంపి | 197 |
మ. | అరిజైత్రు న్మధుపుత్రకున్ లవణు మద్యద్బాహుసాహాయ్యకో | 198 |
వ. | ఇట్లు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు జగంబులకు సుఖస్థితి సంపాదించి | 199 |
సీ. | ధన్యుఁ డిక్ష్వాకునందనుఁ డైననిమి సహ, స్రాబ్దయజ్ఞం బొక్క టాహరింపఁ | |
గీ. | గౌతమాదులఁ గూర్చి యాగంబు చేయు, చుండె నంతటిలో వశిష్ఠుండు మఘవు | 200 |
క. | జన్నము సేయించుటకై, నన్ను నొడంబఱిచి పిదప నాయాగమనం | 201 |
వ. | అని కోపించి. | 202 |
క. | మోహతిరేకమున సం, దేహింపక యిజ్య కొకరిఁ దెచ్చుకొనినయీ | 203 |
చ. | అనుచు శపింప మేలుకని యక్కట యేమరి నిద్ర నున్ననన్ | 204 |
వ. | నిమిశాపంబున వసిష్ఠునితేజంబును మిత్రావరుణులతేజంబునం బ్రవేశించె | 205 |
గీ. | మాననీయాత్ముఁడగు యజమానునకును, వర మొనంగుఁ డటన్న దేవతలు వేఁడు | 206 |
సీ. | కఠినకీకససముత్కరనిరంతరకీర్ణ ముల్లసద్బహుసిరావేల్లితంబు | |
గీ. | పాతకము దేహ మిది పాయుభాగ్య మబ్బె, నొల్ల నిఁక దానితోడును నే నుండఁగోరి | 207 |
వ. | అనిన దేవతలును నతఁడు కోరిన వరం బిచ్చిరి. నిమియును సకలప్రాణులలో | |
| నతనికి సీరధ్వజుండును గలిగె. అతండు పుత్రార్థంబు యజనభూమి దున్ను | 208 |
చ. | వరగుణశాలులైన రవివంశనృపాలురఁ జెప్పి మన్మనో | 209 |
వ. | అని యడిగిన శిష్యున కాచార్యుం డిట్లనియె. | 210 |
గీ. | మునికులోత్తంస పరఁగ సోముని పవిత్ర, వంశమందు జనించిరి వరగుణాఢ్యు | 211 |
వ. | అట్టి చంద్రవంశంబు చెప్పెద వినుము. అఖిలజగత్స్రష్టయై భగవంతుఁ | 212 |
గీ. | అనుపమితవైభవస్ఫూర్తి యాధిపత్య, గర్వసంపూర్తియును గూడఁగాఁ బ్రకాశ | 213 |
చ. | అపరిమితాధిరాజ్యవిభవాతిశయంబున రాజసూయయా | 214 |
గీ. | బలిమి నాంగీరసునిభార్యఁ బట్టి, తెచ్చి, నగరిలో వేసికొని నిరంతరము మదన | 215 |
క. | మోహితుఁడై హిమధాముఁడు, ద్రోహ మనక యాచరించెఁ దోడ్తో గురుప | 216 |
క. | రాజంట చక్కనివాఁడఁట, రాజస మది యౌవనంపురహియఁట విభవ | 217 |
సీ. | కాలకంఠకఠోరకంఠకోటరస ము, ద్భటవిషానలకీల ప్రాపుచూపు | |
గీ. | రాజు లేయూరు పూజ్యవర్గప్రసన్న, దృష్టి యేయూరు తిమిరౌఘతేజములకుఁ | 218 |
వ. | అది యట్లుండె. | 219 |
చ. | అంటినయార్తిచేఁ బొగిలి యాంగిరసుం డతిదీనవృత్తి నిం | 220 |
వ. | వినకున్నం గోపించి. | 221 |
సీ. | పవి ఝుళిపించె జంభసురారిదమనుండు, కెరలి కీలలు చూపెఁ గృష్ణవర్త్మ | |
గీ. | సురలు పెనుబొబ్బ లిడిరి యక్షులు ధనుర్గు, ణధ్వనులు చేసి రఖిలగంధర్వగరుడ | 222 |
వ. | ఇట్లు కడంగిన నింద్రాదులం గూర్చుకొని బృహస్పతి చంద్రునిపై నడిచె. నంత. | 223 |
గీ. | అంగిరునివద్ద రుద్రుఁ డభ్యస్తసకల, విద్యుఁడైనకతంబున విప్రవర్య | 224 |
వ. | బృహస్పతిమీఁది ద్వేషంబున శుక్రుండు చని యింద్రుని పార్క్ష్ణి | 225 |
గీ. | అంబురుహనేత్ర నాభార్య వకట యొరుని, కొడుకు నీగర్భమునఁ బెట్టుకొనఁగవలెనె | 226 |
వ. | ఇట్లు గర్భం బొక్కయీషికాస్తంబంబుపై విడిచె. ఆ క్షణంబున సకలజన | 227 |
ఉ. | నిక్కము చెప్పు మంబురుహనేత్ర యపత్రప యేల నీకు నీ | 228 |
క. | అని సుర లడిగిన నయ్యం, గన లజ్జాసాధ్వనములఁ గడచెప్పకయుం | 229 |
గీ. | తరిమి యెం తడిగినను మాతండ్రిపేరు, చెప్ప వటుగాన నిన్ను శిక్షింపవలయు | 230 |
వ. | ఇట్లు శపియించెను నంత. | 231 |
ఉ. | తా నపు డబ్జసూతి వనితామణి నల్లన చేరఁ బిల్చి యో | 232 |
వ. | అని బుజ్జగించి యడిగిన. | 233 |
గీ. | తార కేల్దమ్మిదోయి మస్తకముఁ జేర్చి, మోము వాంచి పాదాంగుష్ఠమున ధరిత్రి | 234 |
వ. | ఇట్లు తార తేరనాడిన నానందాశ్రుధారాసారంబు జార నుదారపులకావారంబు | 235 |
ఉ. | దానపరుండు యజ్వ విశదస్థిరకీర్తి ఘనుండు సత్యవా | 236 |
సీ. | ధరణిసురేంద్ర మిత్రావరుణుల శాప, మున నూర్వశీకాంత మనుజలోక | |
గీ. | మానియుండి రంత మనుజాధిపుఁడు దేవ, వనితఁ జూచి పలికె మనసిజాస్త్ర | 237 |
చ. | అనుటయు హావభావలలితాకృతియై సురకాంత వల్కె నో | 238 |
గీ. | వసుమతీశ్వర బిడ్డలవలెనె పెంచు, కొంటి నీమేషముల రెంటి నంటి వాయ | 239 |
క. | విను నగ్నత్వముతో నా, కనుఁగవకుం గానఁబడుట గా దీవు ఘృతా | 240 |
వ. | ఇట్టిసమయంబు చేసిన నీకు భార్య నగుదు, సమయభంగం బయినం బోవుదాన | 241 |
సీ. | అలకాపురాదిదివ్యపురీమణీహేమ, కమనీయతుంగసౌధములయందుఁ | |
| మానసాదిసరోవరానూనతరదర, న్నవపుండరీకషండములయందు | |
గీ. | బహువిధవిచిత్రసురతసంబంధబంధ, బంధురత్వంబు దీపింపఁ బార్థివుండు | 242 |
వ. | ఇవ్విధంబున ననేకవర్షంబు లూర్వశి యయ్యుర్వీశ్వరునితో సంభోగక్రీడలం | 243 |
గీ. | సురపురీభోగ్యసౌభాగ్యగరిమకెల్ల, నూర్వశీకాంత లేకున్న నొప్పు దఱిగె | 244 |
వ. | ఊర్వశీపురూరవులసమయం బెఱింగినవాఁడై, విశ్వావసు డొక్కనాటినిశా | 245 |
గీ. | మోహమునఁ బెంచుకొన్న నాముద్దుకొడుకు, నకట యెవ్వఁడు గొనిపోయె ననద నైతి | 246 |
వ. | అని పలుకు నూర్వశివచనంబులు విని రాజు తద్దర్శనభయంబునం బోకయున్న | 247 |
చ. | అకట యనాథ నైతిఁ బురుషార్థము చేపడి శౌర్యహీనుఁ డీ | 248 |
వ. | ఇ ట్లార్తయై పలుకుచున్న యన్నలినానన పలుకులు విని కోపించి కించిదరుణాయ | 249 |
ఉ. | క్షత్రియవర్యుఁ డీగతి దిశ ల్వరికించుచుఁ బోయి యాకురు | 250 |
ఉ. | చూచి నృపాలుఁ డోమృగకిశోరవిలోచన! జాయ వీవు నా | 251 |
వ. | మహారాజా యీయవివేకచేష్టితంబు చాలింపుము, ఇప్పు డేను గర్భిణియై | 252 |
గీ. | అచ్చరలు విస్మయం బంది యడుగ, నూర్వశీలతాతన్వి చెప్పెఁ దెచ్చిత్రచరిత | 253 |
వ. | సంవత్సరంబు పూర్ణంబైన పురూరవుం డచ్చటికిం బోయిన నూర్వశియు నాయు | 254 |
గీ. | అఖిలరిపుకోటి గెలిచితి నమితకోశ, బంధుబలసంయుతుండ నెప్పట్టునందుఁ | 255 |
వ. | కావున నీయూర్వశిసాయుజ్యంబు గలుగు వరం బిం డనిన గంధర్వు లతనికి | 256 |
క. | ఆలలన లేనియగ్ని, స్థాలి యి దేమిటికి డించి చనియెద నిచటన్ | 257 |
వ. | నిద్ర లేక యిట్లని తలపోయు. అక్కటా! యూర్వశిసాలోక్యార్థంబు గం | |
| ఇదియే పురంబునకుం గొనిపోయి యరణి చేసి మథించి యిందు నుత్పన్నంబైన | 258 |
క. | వరగురుఁడైన పురూరవు, చరితం బిది చెప్పితిం బ్రసన్నహృదయతా | 259 |
వ. | పురూరవున కాయువు, ధీమంతుండు, నమావసుండు, విశ్వావసుండు, శ్రుతా | 260 |
సీ. | నుతకీర్తియైనజహ్నుఁడు పరస్మాత్పరు యజ్ఞపూరుషు కమలాధినాథుఁ | |
గీ. | మునులు చనుదెంచి యారాజముఖ్యు నధిక, వినయమున వేఁడి గంగ నీతనయ దీని | 261 |
వ. | ఆజహ్నునకు సుమంతుండు, నతనికి నజకుండు, నతనికి బలాకాశ్వుండు, నతనికిఁ | 262 |
చ. | శతమఖతుల్యుఁడైన సుతుఁ జయ్యనఁ గాంచెద నంచుఁ గోరియున్ | 263 |
వ. | కుశాంబపుత్రుండైన గాధికి సత్యవతియను కన్యక పుట్టె, భృగువంశోత్త | 264 |
గీ. | వృద్ధుఁ డీబ్రాహ్మణుండు సమృద్ధరూప, శీలసౌభాగ్యయైన యీచిగురుఁబోఁడి | 265 |
వ. | ఒక్కచెవి నలుపును, శరీరంబెల్ల తెల్లనయు, వాయువేగంబునుం గల యశ్వ | 266 |
గీ. | బ్రహ్మతేజోఘనుండైన పట్టి నీకుఁ, గలుగు నిందుల నిందుల నలఘువీర్య | 267 |
వ. | అని చెప్పి వనంబునకుఁ బోయినఁ జరూపయోగకాలంబున సత్యవతి జూచి | 268 |
గీ. | పుత్త్రి విను మెవ్వరైనను బుత్త్రుఁ డధిక, గుణునిఁగోరుట యెందు నిక్కువముసుమ్ము | 269 |
వ. | బ్రాహ్మణునకు బలవీర్యసంపద లేల? క్షత్రియునకైన సర్వభూమండలం | 270 |
ఉ. | పాతకురాల యేమి తడఁబా టొనరించితి వత్యుదగ్రరౌ | 271 |
క. | అనఘంబు బ్రహ్మతేజో, భినుతము నీచరువు దానిఁ జెడచేఁత భవ | 272 |
చ. | అన విని కంపమానహృదయాంబుజయై లలితాంగి భర్తప | 273 |
వ. | పుత్రుండు క్రూరుం డౌట కోప నవ్విధంబు వాఁడు మనుమండుగా ననుగ్ర | |
| యనునది యయ్యె, జమదగ్నియు నిక్ష్వాకువంశోద్భవుండైన రేణుకుని పుత్రిక | 274 |
సీ. | క్షత్రియసానుమత్సమితి కెవ్వనికోప, మదయనిష్ఠురఘోరభిదురధార | |
గీ. | మవనినాథాంధతమససంహతికి నెవ్వ, నిమహితోద్దండభుజదండనిహితపరశు | 275 |
వ. | భార్గవుండైన శునశ్శేఫుండు విశ్వామిత్రునకు దేవతలచేత నియ్యంబడి దేవ | 276 |
గీ. | ప్రచురవిజ్ఞాన విను పురూరవునియగ్ర, నందనుం డాయు వతఁడు కన్యాలలామ | 277 |
వ. | వారలు నహుష, క్షత్రవృద్ధ, రంభ, రజ్యసేనులను నైదుగురు. అందు క్షత్ర | |
| సుకుమారునకు దృష్టకేతుండు, దృష్టకేతునకు వీతిహోత్రుండు, నతనికి భార్గుండు, | 278 |
క. | రజికిఁ దనూభవు లాహవ, విజయులు సత్కీర్తిధనులు విఖ్యాతమహా | 279 |
వ. | అక్కాలంబున దేవాసురులు పరస్పరజిగీషువులై యుద్ధంబునకు నుపక్రమించు | 280 |
క. | సరసిజసంభవ దేవా, సురులము మే మాహవమ్ము చోద్యభుజావి | 281 |
వ. | అని యడిగిన దేవాసురులకుఁ జతురాననుం డిట్లనియె. | 282 |
క. | రజి యెవ్వరికిం దోడై, భుజవిస్ఫురణంబు చూపుఁ బోర న్వారిన్ | 283 |
వ. | ఇట్లు చని తమకు సహాయంబు కోరిన నసురలకు రజి యిట్లనియె. | 284 |
ఉ. | మీకు సహాయమై యతిసమృద్ధభుజాబలలీల దేవతా | 285 |
వ. | ప్రహ్లాదుం డుండ ని న్నింద్రుఁ జేయనొల్లము. తదర్ధంబ యుద్ధంబును నని యసురులు | 286 |
గీ. | అసురతతుల గెల్తు నాహవంబున నను, నింద్రుఁ జేసి కొలువుఁ డీర లనిన | 287 |
ఉ. | అంత శచీవిభుండు వినయంబున నన్నరనాథుఁ బాదపీ | 288 |
వ. | అని చాతుర్యపురస్సరంబుగాఁ బ్రార్ధించిన రజియు మందస్మితవదనారవిం | 289 |
ఉ. | నారదుఁ డొక్కనాఁడు నరనాథతనూభవు లున్నచోటికిన్ | 290 |
ఉ. | నీవును నేము నారజికి నెయ్యపుఁబుత్త్రుల మౌట మాకు సం | 291 |
వ. | ఇంద్రుండు పరాజితుండై తొలంగిపోయె. బహుకాలంబు చనిన నొక్కనా | 292 |
గీ. | క్రతువు చొరనీయ రేలాగ బ్రతుకవచ్చు. దాఁచ నేటికి మొకమెల్ల వాఁచె నిట్టి | 293 |
వ. | అనిన బృహస్పతి యిట్లనియె, ఇత్తెఱంగు మున్నును నెఱింగించితివి. అందులకు | 294 |
సీ. | అతులతేజుండు యయాతి రాజై కావ్యు, నితనూజ దేవయానియును దనుజ | |
గీ. | నంత కావ్యుఁ డలిగి యల్లుని నతిజరా, పీడ నొందుమని శపించుటయును | 295 |
వ. | కొడుకుల రావించి యందు నగ్రనందనుండైన యదువున కిట్లనియె. | 296 |
ఉ. | తామసుఁడై యకాలము గదా యని యెంచక మించి నీదుమా | 297 |
వ. | యదుండును జరాగ్రహణంబున కంగీకరింపకయున్న రాజ్యంబున కర్హత లే | 298 |
ఉ. | సాగిలి మ్రొక్కి లేచి కరసారసము ల్ముకుళించి యోమహా | 299 |
వ. | ఇట్లు పూరుండు యౌవనం బిచ్చిన బుచ్చుకొని యయాతి తనజర పూరున కిచ్చె, | 300 |
చ. | విసువక యెన్నినా ళ్లనుభవించిన శాంతి వహించ దెంతక | 301 |
క. | దంతములు వదలె కేశము, లెంతయు పలితంబు లయ్యెఁ దృష్ణయు బ్రతుకన్ | 302 |
ఉ. | పూనిక భూరివైషయికభోగమహానుభవంబు చేయఁగా | 303 |
వ. | కావున నీతృష్ణం బరిత్యజించి వాసుదేవబ్రహ్మంబునందు మానసంబు చేర్చి | 304 |
చ. | అనుపముఁ డాయయాతిసుతుఁడైన యదుండు తదన్వయంబు పా | 305 |
చ. | కలగొనఁ బద్మజాండమునఁ గల్గు సురాసురమర్త్యపన్నగా | 306 |
వ. | అట్టి యదువునకు సహస్రజిత్, క్రోష్టు, నల, నహుష సంజ్ఞలుగల నలు | 307 |
ఉ. | బాహుసహస్రసంభృతివిభాసి మహాసివినిర్దళద్రిపు | 308 |
వ. | అక్కార్తవీర్యార్జునుండు సప్తద్వీపాధిపతియై భగవదంశభూతుండును నత్రి | |
| సకలధరాస్థలంబులుం బాలించి యజ్ఞసహస్రంబులు చేసి రాజులెవ్వరు | 309 |
సీ. | కాంతాసమేతుఁడై కార్తవీర్యుఁడు వేడ్క, నర్మద నవగాహనంబు చేయ | |
గీ. | చెలఁగఁ జేతులు వెనుకకు నులిచి తీసి, మొఱ్ఱపెట్టంగ లాకలు మోయవిఱిచి | 310 |
వ. | పంచాశీతివర్షసహస్రోపలక్షణకాలావసానంబున శ్రీమన్నారాయణాంశ | 311 |
మ. | శశిబిందుం డలరున్ సమస్తధరణీచక్రేశుఁడై పూర్ణిమా | 312 |
వ. | ఆశశిబిందుపుత్రులలోఁ బృథుయశుండు, పృథుకర్ముండు, పృథుజయుండు, | 313 |
గీ. | అవనిలో భార్యలకు వశులైన భూత, భావిభవదధిపతులతో నేవిధమున | 314 |
వ. | ఆజ్యామఖుండు భార్యయైన శైబ్యకు వశుండై యుండు. అతం డనపత్యుం | 315 |
ఉ. | జ్యామఖుఁ డొక్కనాఁడు చతురంగబలంబులు గొల్వ జైత్రయా | 316 |
వ. | తదీయనగరంబులు సొచ్చి సర్వధనంబులు గొల్లగొట్టుకొని విజయంబు గైకొని | 317 |
సీ. | భయచంచలీభవన్నయనాంచలాంచిత, ద్యుతి చంచలల దిశల్ దొంగలింపఁ | |
గీ. | నన్న రక్షించు కావంగదయ్య తండ్రి, తల్లి ప్రోవుమటంచు నార్తస్వరమున | 318 |
వ. | ఇట్లు గాంచి యనపత్యుండైన నాకు దైవయోగంబున నిక్కాంత గలిగె. దీనిం | 319 |
గీ. | అతిచపలచిత్త నీ వీమృగాయతాక్షి, నెచటఁ దెచ్చితి విది యెవ్వ రేల యనిన | 320 |
క. | మనుజవర పుత్రకుని నే, గనుటయె లే దన్యకాంత కలుగదు నీకున్ | 321 |
వ. | నిజప్రేయసీకోపకలుషితవివేకుండై భయంబున దురుక్తిపరిహారార్థంబుగా | 322 |
గీ. | కాంత నీవు సుతుని గనియెద వింక నా, తనికిఁ బెండ్లి చేయఁదలఁచి దీనిఁ | 323 |
వ. | వయఃపరిణత యయ్యును, నల్పదినంబులలోన శైబ్య గర్భంబు దాలిచి కుమా | 324 |
క. | మునివర సాత్వతవంశము, వినుము తదీయశ్రవణము వివిధాఘహరం | 325 |
వ. | సాత్వతునకు భజన, భజమాన, దివ్యాంధక, దేవాపృథ, మహాభోజ, వృష్ణి | 326 |
క. | దేవాపృథుఁడును బభ్రుఁడు, నేవిశ్వములోన నధికు లెన్నినచోటన్ | 327 |
వ. | దేవాపృథుండు దేవసముండు. అక్కాలంబునఁ బదునాల్గువేలున్నఱువ | 328 |
క. | జలనిధితీరమునకు నిశ్చలమతితో నేగి యచట సత్రాజితుఁ డ | 329 |
క. | స్తవమునకు మెచ్చి భానుం, డవనీపతియెదుట నిలిచె నపుడ స్పష్ట | 330 |
గీ. | వహ్నిపోగు వోయువడువున నభమున, సంచరింతు రెపుడు స్వామివారు | 331 |
వ. | స్పష్టంబుగా దేవరవారిదివ్యదేహంబు నాకన్నులకుం గానంబడదేని మీరు | 332 |
గీ. | హ్రస్వమై తప్తతామ్రాభమై సమంచ, దీషదాపింగళాతక్షమై యెసఁగుభాను | 333 |
క. | వర మడుగు ధరణివర యన, సరసిజహితుఁ జూచి నృపుఁడు స్వామీ నా కీ | 334 |
వ. | సత్రాజితుండును నమ్మహామణి కంఠంబునం ధరించి యాదిత్యుండునుంబోలె | 335 |
చ. | కమలదళాక్ష మాధవ జగత్పరిరక్షణదక్ష, కృష్ణ య | 336 |
క. | ఇతఁడు రవి గాఁడు సత్రా, జితుఁ డింతేకాని భాను సేవించి తదూ | 337 |
వ. | పౌరులెల్ల విశ్వసించి చని రంత, సత్రాజితుం డంతఃపురంబు ప్రవేశించి స్యమం | 338 |
సీ. | పుండరీకాక్షుఁ డెప్పుడు కోరు నద్దివ్య, మణి యుగ్రసేనభూమండలేశ్వ | |
గీ | అదియుఁ దన్ను దాల్చునతఁడు శుద్ధుండైన, సర్వసంపదలు నొసంగు నట్లు | 339 |
వ. | ఆప్రసేనుండును నమ్మణి కంఠంబున ధరించి తురగారూఢుండై యటవికి మృగ | 340 |
క. | సింగంబొక్కటి తుంగా, భంగత్వరఁ బాఱుదెంచి పార్థివసుతునిన్ | 341 |
గీ. | నోటఁ గఱచుకొని మనోవేగమునఁ బోవ, నడుగుజాడ వట్టి యంటి దానిఁ | 342 |
ఉ. | భల్లుకవల్లభుండు రవిభాస్వరమౌమణిఁ గొంచు నంధకా | 343 |
వ. | మణిసమాలోకనోత్సుకుండై బాలుండు క్రీడించుచుండె. | 344 |
గీ . | హరికి మణిమీఁద స్పృహగల దడిగికొనుట, లాఘవంబని తఱి వేచి లాఁచియుండి | 345 |
వ. | అని సమస్తయదులోకంబును మెల్లన గుజగుజలం బోవ లోకాపవాదంబు | 346 |
మ. | అనివార్యద్విపవైరినిష్ఠురచపేటాఘాతనిర్భిన్నసం | 347 |
క. | హరిజాడ నేగి యాముం, దర కుప్యద్భలుకేంద్రనఖనిర్దళిత | 348 |
వ. | భల్లుకేంద్రునిజాడఁ బట్టి చనిచని ముందర నొక్కమహాశైలంబుఁ గాంచిత తత్త | 349 |
ఉత్సాహ. | సింగమొకటి వెంటఁబడి ప్రసేను జంపి దాని ను | |
| ప్పొంగి చంపె నీకు మణి ప్రభుత్వ మమరఁజేరె నే | 350 |
వ. | సుకుమారునిదాది జోల పాడ నాలించి పాంచజన్యధరుండు స్యమంతకంబు | 351 |
గీ. | ఎన్నఁడును విని కనియును నెఱుఁగనట్టి, భూరిసౌందర్యనిధియైన పురుషమణినిఁ | 352 |
వ. | ఇట్లు దాది మొఱయిడిన. | 353 |
చ. | ఉదుటున నచ్ఛభల్లపతి యోడకుమేఁ గలుగంగ నీకు నీ, | 354 |
వ. | అట్లు దాఁకినఁ బరస్పరజయకాంక్షులై మహారోషంబున నిరువదియొక్కదినం | 355 |
గీ. | బంధువర్గం బతిశ్రద్ధఁ బాత్రముల స, మిద్ధమృష్టాన్నపానంబు లిడుటఁ జేసి | 356 |
క. | ఋక్షాధిపతికి లోకా, ధ్యక్షునిముష్టి ప్రహరతతులకతమునన్ | 357 |
సీ. | మదిలో వివేకసంపదపెంపు దీపింప, జాంజవంతుఁడు జగత్స్వామిపాద | |
గీ. | లైన నోపవ టన్నఁ దిర్యక్కులప్ర, జాతమద్విధజంతుప్రసక్తి యెంత | 358 |
వ. | అని ప్రార్థించిన జాంబవంతుని శరీరంబు కరంబున నిమిరి విగతవేదనునిం జేసినఁ | |
| "గృహంబునకు వచ్చిన దేవరకు నర్ఘ్యంబు సమర్పించుటకు నర్హవస్తువులు | 359 |
క. | శ్రీ విలసిల్లె గృహంబుల, భావంబులు పరమహర్షభరితము లయ్యెన్ | 360 |
వ. | ఇవ్విధంబునఁ బురప్రవేశంబు చేసి జాంబవతి నంతఃపురప్రవేశంబు చేయించి | 361 |
గీ. | హృదయముననే పరాత్పరు నిడిన నిఖిల, పాపములు వాయు నప్పద్మపత్రనేత్రు | 362 |
వ. | అని సత్రాజిత్తు నిర్వేదించి యపరాధక్షమార్పణంబునకై తనకూఁతు సత్య | 363 |
సీ. | జతగూడి యక్రూర కృతవర్మ శతధన్వ, వజ్ర ప్రముఖయదువరులు పరులు | |
గీ. | నయనుఁ డిందుల కల్గె నాభయము వలదు, సూడు దీరిన చాలు నీచొప్పు చేయు | 364 |
చ. | లఘుగతిఁ బాండునందనులు లక్క నొనర్చిన యిండ్ల నగ్నిచే | 365 |
సీ. | హరి వారణావతపురి కేగ శతధన్వుఁ, దర్థరాత్రమున నిద్రాప్తి నుండ | |
గీ. | కంటి రేనాఁడు పెంటలోఁ గాలవశత, నణఁగిపోయెఁ బ్రసేనుఁడు గ్రాసిధారఁ | 366 |
వ. | శతధన్వునిం జంపవలయు రథం బెక్కుఁ డనిన నట్ల కాక యనియె. ఇట్లు రామ | 367 |
గీ. | రామకృష్ణులఘనరోషరభస మెఱిఁగి, తలఁకి కృతవర్మకడ కేగి తనకుఁ దోడు | 368 |
వ. | ఇట్లు కృతవర్మచేత నిరాకృతుండై యక్రూరునికడకుఁ బోయి తోడు పిలిచిన. | 369 |
చ. | పదకమలప్రహారమునఁ బద్మభవాండము బ్రద్దలై పడున్ | 370 |
గీ. | ప్రబలహలముఖనిర్భిన్నభానుజామ, హాప్రవాహుండు బలుఁడు మహామహుండు | 371 |
క. | చను మెచ్చటికైనను నీ, వని యక్రూరుండు పలుక నాశతధన్వుం | 372 |
క. | అన విని ప్రాణాంతంబై, నను నెక్కడఁ జెప్పవేని నాకడ నిడు మీ | 373 |
వ. | ఇట్లు. | 374 |
ఉ. | తామసవర్తనుండు శతధన్వుఁడు బెగ్గిలి యొక్కనాఁట నూ | 375 |
వ. | శతధన్వునిగోడిగయు నూఱామడ చనియె. మఱియుం దఱిమిన మిథిలాపురోప | 376 |
గీ. | శైబ్యసుగ్రీవమేఘపుష్పప్రధాన, మైన యీరథ్యనికురుంబ మలసినట్లు | 377 |
వ. | ఈరథంబుపై మీ రిచ్చట నిలువుండు, పగఱు పదాతియై పాఱిపోయె. ఏనును బదా | 378 |
క. | అరినికరభయదతేజ, స్స్ఫురణ నుహాదివ్యచక్రమునఁ దల ద్రుంచెన్ | 379 |
వ. | ఇట్లు శతధన్వుం జంపి వానిశరీరాంబరాదులయందు బహుప్రకారంబుల వెదికి | 380 |
గీ. | ద్రోహి శతధన్వుఁ డూరకే త్రుంగె వాని, చేత రత్నంబు లే దన సీరపాణి | 381 |
వ. | నన్నుఁ బ్రమోషించి మణి యపహరించితివి. భ్రాతవు గాన ని న్నే మనవచ్చు | 382 |
గీ. | నాకు ద్వారక యేల బాంధవులతోడి, కూట మది యేల నీతోడి గొడవ యేల | 383 |
వ. | ఇట్లు బలదేవుండు కోపించి పోయిన వాసుదేవుండు ద్వారకానగరంబున కరు | 384 |
ఉ. | శ్రీలు చెలంగ సద్గుణవశీకృతుఁ డాజనకుండు నిచ్చలున్ | 385 |
వ. | సుయోధనునకు గదాకాశలంబు శిక్షించుచున్నంత వర్షత్రయంబు నిండిన | 386 |
సీ. | అక్రూరపక్షీయులైన భోజులు సాత్వ, తుని ప్రపౌత్త్రకుని శత్రుఘ్ననాముఁ | |
గీ. | ఘోరదుర్భిక్షముఖదోషకోటి యొక్క, మాటుగా వచ్చె నిది యేమిమాడ్కియొక్కొ | 387 |
క. | వినుడు శ్వఫల్కుం డనఁగా, ఘనుఁ డీయక్రూరుతండ్రి గలఁ డతఁ డెం దుం | 388 |
క. | మును కాశీపతిదేశం, బున వానలు లేక కరువు ముంచుకొనిన న | 389 |
క. | పెళపెళ నుఱుముచు మెఱపులు, తళతళ మన సాంద్రకరకతతు లెల్లెడలన్ | 390 |
సీ. | మునుపు కాశీపతివనిత గర్భము దాల్పఁ, గన్యక యందుండి కాలమైన | |
గీ. | కడుపులోనుండి పలుకు నిప్పుడు మొదలుగ, దినము నొకగోవు చొప్పున ద్విజుల కిమ్ము | 391 |
వ. | అనినఁ గాశీపతియును నట్ల చేసిన సంవత్సరత్రయంబు గడచిన కన్యక పుట్టిన | 392 |
చ. | పనివడి యెన్ని చూచిన శ్వఫల్కునిగౌరవ మల్ప మెట్టు లీ | 393 |
చ. | అని వనజాతనేత్రుఁడు నిజాత్మగతంబున నెన్ని యొక్కనాఁ | 394 |
ఉ | మందరశైలధారి మతిమంతుఁడు భక్తుఁడు నైన గాందినీ | 395 |
వ. | బలదేవునకుఁ బ్రత్యయంబైనవెనుక నీవ పరిగ్రహించెదవు గాని మణి చూపు | 396 |
క. | లేదని బొంకిన మాటలు, గాదని శోధించి మానికము గొను నీదా | 397 |
వ. | అని నిశ్చయించుకొని యక్రూరుం డిట్లనియె. | 398 |
గీ. | నేఁట రేపట నెల్లుండి నీరజాక్ష, నయనుఁ డడిగెడు నిచ్చెద నాకు దాఁపఁ | 399 |
వ. | దివ్యరత్నప్రభాప్రభావితులై సభాసదులు సాధువాదంబుల నగ్గించి రప్పుడు | 400 |
సీ. | ఓదానపతి విను నుగ్రాంశుకారుణ్య, దత్తమౌ నీస్యమంతకము దాల్చు | |
గీ. | షోడశసహస్రవనితలజోడు వదల, నెన్ని విధముల మేము వహింపలేము | 401 |
వ. | అనిన నగుంగాక యని యక్రూరుండు నిర్భయంబున మణి కంఠపథంబునం ధరించి | 402 |
గీ. | జలజలోచన మిథ్యాభిశస్తిహరణ, మైనయీచరితము విన్న యనఘమతికి | 403 |
వ. | అనమిత్రునకు శని, శనికి సత్యకుండు, సత్యకునకు సాత్యకి కలిగె. అతండ యు | |
| ముఖ్యులు పుత్త్రులు గలిగిరి. అంధకునకుఁ గుకుర, భజమాన, శుచి, కంబల, | 404 |
చ. | భరితయశోవిశాలుఁడగు పాండునృపాలుఁడు పెండ్లియాడె భా | 405 |
గీ. | కన్య యగుచుఁ దండ్రికడ నుండి యాపృథా, వనిత కమలబంధువరమువలన | 406 |
క. | ధవళాయతాక్షి యాపృథ, సవతికి మాద్రికి సురూపసంపన్నులు సం | 407 |
వ. | శ్రుతదేవను వృద్ధధర్మ యనుకారూశుండు పెండ్లియాడె. అయ్యంగనయందు | 408 |
సీ. | ఆదిపూరుషుఁ డొక్కఁ డాది హిరణ్యక, శిపునామదైత్యుఁడై విపులబుద్ధి | |
గీ. | సురలఁ బీడింప హరియు దాశరథి యగుచు, తలలు ద్రుంచిన దమఘోషధరణిపతికి | 409 |
వ. | భగవంతుండు ప్రసన్నుండై భక్తుని కభిలషితంబు లేవిధంబున నొసంగు నవ్వి | 410 |
మ. | అరవిందాక్షునిచే హిరణ్యకశిపుండై రావణుండై మహా | 411 |
క. | మునుపటి రెండుభవంబుల, వనజాక్షుఁడు చంపె నపుడు వరసాయుజ్యం | 412 |
వ. | ఈయర్థంబు సమర్థింప మీరె సమర్థులని ప్రార్థించిన శ్రీపరాశరుండు మైత్రే | 413 |
చ. | పురుబలుఁ డాహిరణ్యకశిపుండు రణాంగణభూమి శ్రీనృకే | 414 |
వ. | ఇట్లు హిరణ్యకశిపుండు శ్రీనరసింహదేవుని జంతుమాత్రంబుగాఁ దలంచి రావ | |
| హతైశ్వర్యసంపన్నుండగు శిశుపాలుండై పుట్టి భగవన్నామంబులందు విరో | 415 |
సీ. | సజలజీమూతభాస్వరదేహు నురువిధాలాలితాజానుప్రలంబిబాహు | |
గీ. | శంఖచక్రగదాహస్తు సకలలోక, సుప్రశస్తుని శ్రీకృష్ణుఁ జూచి చైద్యుఁ | 416 |
వ. | ఇత్తెఱంగు నీకుం జెప్పితి, వినుము. | 417 |
గీ. | పలుకఁ దలపోయ వైరానుబంధకలనఁ, జలము గొని తూలనాడ నేచందమైన | 418 |
వ. | వసుదేవునకుఁ బౌరవీ, రోహిణీ, మదిరా, భద్రా, దేవకీప్రముఖలు బహు | 419 |
సీ. | స్థావరజంగమాత్మకజగత్తరుమూల, మసమవేదాంతవేద్యాభిధాన | |
గీ. | మాద్య మవ్వాసుదేవాఖ్యమైన బ్రహ్మ, మజుఁడు ప్రార్థింప భూమిభారాపహార | 420 |
చ. | హరిమహితప్రభావమహిమాతివివర్ధితయోగనిద్ర సుం | 421 |
గీ. | భూమిభారంబు వారింప భూతలమున, నవతరించినఁ బుండరీకాక్షునకును | 422 |
వ. | అందు రుక్మిణీసత్యభామాజాంబవతీప్రముఖ లెనమండ్రు పట్టమహిషు లైరి. | 423 |
గీ. | ఘనుఁడు ప్రద్యుమ్నుఁ డధికవిఖ్యాతి మేన, మామ రుక్మితనూభవ మహితసద్వి | 424 |
వ. | వారలకు ననిరుద్ధుండు పుట్టె. ఈయనిరుద్ధుండు రుక్మిపౌత్త్రి సుభద్రం పెండ్లి | 425 |
క. | యదువంశం బెఱిఁగించితిఁ, బదపడి దుర్వసునివంశపద్ధతి నీకున్ | 426 |
వ. | తుర్వసునకు వహ్ని, వహ్నికి భార్గుండు, భార్గునకు భానుండు, భానునకుఁ గరం | |
| ......ర్ముండు పుట్టె. నతఁడు ధర్మబహుళులైన యుదీచ్యమ్లేచ్ఛులకు | 427 |
క. | ...యాతికిఁ గలఁ డనుఁడను నాలవకుమారుఁ డతనికిఁ బుత్రుల్ | 428 |
వ. | ......నల చక్షుఃపరమేషుసంజ్ఞులు. అందు సభానలునకుఁ గాలానలుండు | 429 |
క. | ......గల్గె బుత్త్రుఁడు, ధీరుఁడు జనమేజయుం డుదీర్ణత నతఁ డ | 430 |
వ. | ప్రచిన్వంతుతునకుఁ బ్రవీరుండు ప్రవీరునకు మనస్యుండు, మనస్యునకుఁ | |
| షునకు నంతినారుండు నంతినారునకు సుమత్యప్రతిరథధ్రువులను మువ్వురు | 431 |
శా. | ఆదుష్యంతధరాతలాధిపతి కుద్యద్భాహుశౌర్యోజ్జ్వల | 432 |
వ. | ఆభరతునకు మువ్వురు భార్యలయందుఁ దొమ్మండ్రు పుత్త్రులు గలిగిన భర | |
| యాడె. అయ్యనుహునకు బృహదత్తుండు నతనికి విష్వక్సేనుండు నతనికి నుద | 433 |
సీ. | దేవాభుఁడగు సత్యధృతి యొక్కనాఁ డప్స, రశ్రేష్ఠమైన నూర్వశి నిజాగ్ర | |
గీ. | కృపకతంబున వారికిఁ గృపియుఁ గృపుఁడు, ననుచుఁ బేరిడి ముదమునఁ బెనిచె నందుఁ | 434 |
వ. | అశ్వత్థామ యనుపే రిడియె. దివోదానునకు మిశ్రాయువు మిశ్రాయువునకుఁ | |
| చరవసువు నతనికి బృహద్రథ, ప్రత్యగ్ర, కుశాంబ, కుచేల, మాత్స్య | 435 |
క. | వినుము మునీంద్ర! పరీక్షి, జ్జననాథున కాత్మజులు విశాలయశస్కుల్ | 436 |
వ. | పరీక్షితునకు జనమేజయశ్రుతసేనోగ్ర సేనభీమసేనులు నల్వురుపుత్రులు | 437 |
క. | శంతనుఁ డశేషశాత్రవ, కృంతనుఁడై జలధివృతనిఖిలభూవలయా | 438 |
గీ. | చేతనంటినవృద్ధుండు చిఱుతవయను, నొంది మహనీయశాంతిఁ బెంపొందుకతన | 439 |
వ. | ఇట్లు రాజ్యం బేలుచున్నంత. | 440 |
ఉ. | శంతనుఁ డేలుదేశము ప్రజల్ బెగడొందఁగ వృష్టి మాన్చె జం | 441 |
క. | అని తము నడిగిన యాశం, తనుఁ గనుగొని విప్రవరులు నరనాయక! యీ | 442 |
| అన్న దేవాపి యాది రాజ్యార్హుఁ డుండ, నీవు మేదిని నేలుచున్నావు దీన | 443 |
వ. | అనిన శంతనుం డింక నే నేమి చేయవలయుననిన నెంతకాలంబు దేవాపి | 444 |
గీ. | రమ్ము నృపవర యింత నిర్బంధ మేల, శాంత మయ్యె నవగ్రహాక్రాంతిదోష | 445 |
వ. | అన్న పతితుండైనఁ దమ్మునికిఁ బరివేతృత్వంబు లేదు, రమ్మని పిలిచిన శంతనుండు | |
| లుండు రేణుమతియందు నిరమిత్రునిం గనియె. అర్జునుం డులూపి యను | 446 |
క. | ఉత్తర పెండిలియై లో, కోత్తరుఁ డభిమన్యుఁ డురుగుణోజ్వలు ధరణీ | 447 |
వ. | అప్పరిక్షితుండు తల్లిగర్భంబున నున్నయప్పు డశ్వత్థామ యపాండవంబుగా | 448 |
క. | భరితవివేక భవిష్య, న్నరపాలుర వినుము సజ్జనస్తవనీయో | 449 |
వ. | ఇప్పుడు భూమండలం బేలు పరిక్షిత్తునకు జనమేజయశ్రుతసేనోగ్రసేనభీమ | 450 |
గీ. | వరతపోధన యిక్ష్వాకువంశ్యులైన, భావిభూతలపతుల నేర్పఱుతు వినుము | 451 |
వ. | ఆబృహద్బలునికి బృహత్క్షణుండు నతనికి నురుక్షయుండు నతనికి వత్సవ్యూ | 452 |
గీ. | పరమసువ్రత యిక్ష్వాకువంశ మవని, కలియుగమున సుమిత్ర౦డు కడపలగను | 453 |
వ. | మగధవంశప్రభుండగు జరాసంధునకు సహదేవుండు, సహదేవునకు సోమాపి, | 454 |
గీ. | మునివవరేణ్య మహాపద్ముఁ డనెడురాజు, ధరణి యేకాతపత్రమై తనరుచుండఁ | 455 |
వ. | ఆమహాపద్మునకు సుమాల్యాదు లెనమండ్రు పుత్రులు పుట్టి నూఱేండ్లు భూ | |
| గలరు. అనంతరంబ యెనమండ్రు యవనులు, పదునలుగురు తురుష్కారులు | 456 |
సీ. | అల్పప్రసాదులు నధికకోపులు సర్వకాలానృతాధర్మలోలమతులు | |
గీ. | పతులకైవడి నన్యాయపథచరిష్ణు, లగుచు మ్లేచ్ఛులనడవడి నధికకలుష | 457 |
వ. | అనృతకార్యంబులే వ్యవహారహేతువులుగా స్త్రీత్వంబే యుపభోగహేతువుగా | |
| మాత్రంబే ప్రసాధనహేతువుగా, స్వీకరణమాత్రంబే వివాహహేతువుగా, | 458 |
క. | ఏజాతియైనఁగానీ, భూజనములలోన బలిమి పొదలినవాఁడే | 459 |
వ. | ఇవ్విధంబున. | 460 |
ఉ. | లోలవిహారశీలు లతిలోభులు క్రూరులునై ననీచభూ | 461 |
క. | తరువల్కపర్ణచీరా, వరణు లగుచు శీతవాతవర్షాతపదు | 462 |
గీ. | ఏడనైనను నిరువదిమూఁడువత్స, రములు బ్రతుకఁడు నరుఁడు ధరాస్థలమునఁ | 463 |
వ. | శ్రౌతస్మార్తధర్మంబులు విప్లవంబు నొందిన నచరాచరంబైన జగంబు క్షీణ | 464 |
సీ. | అఖిలజగత్స్రష్టయై చరాచరగురుండై సర్వమయుఁడయి యప్రమేయుఁ | |
గీ. | కాఖిలమ్లేచ్ఛతతుల దీవ్యత్కరాగ్ర, జాగ్రదుగ్రలసన్మండలాగ్రఘోర | 465 |
వ. | అనంతరం బశేషకల్యవసాననిశావసానంబున జనపదంబులయండు శేషించిన | 466 |
గీ. | అబ్జుఁ డర్కుండు తిష్యంబు నమరగురుఁడు, నేకరాశిస్థు లయ్యెద రెన్నఁడేని | 467 |
వ. | అతీతవర్తమానానాగతభూపాలుర నీ కెఱింగించిని. పరీక్షిత్తుజన్మంబు మొదలు | |
| లోపలను బూర్వోదితులగు నిద్దఱినడుమ సమంబుగా నేనక్షత్రంబు గానం | 468 |
చ. | నవసరసీజనేత్రుఁడు జనస్తవనీయుఁడు కృష్ణుఁ డెన్నఁ డే | 469 |
వ. | భగవంతుండైన పుండరీకాక్షుండు దినంబునకుం బోయిన కలి ప్రవేశించిన | 470 |
క. | అరయఁగ లక్షత్రయమును, నఱువదివేలుఁ నగు మానుషాబ్దంబులు నీ | 471 |
వ. | ఏతత్పరిణామంబగు కలియుగంబు నిశ్శేషంబైన కృతయుగంబు ప్రవేశించు. | 472 |
సీ. | పౌరవవంశసంభవుఁడు దేవాపియు, నిక్ష్వాకుకులజుఁడై యెసఁగు మరుఁడు | |
గీ. | కలియుగంబున నితరజాతులు ధరిత్రి, యేలుదురు నీకుఁ జెప్పితి నెల్లనృపుల | 473 |
వ. | పృథివిగీతల యర్థంబు వినుము. | 474 |
మ. | ఇది నాభూమి మదీయపుత్రకుఁడు వీఁ డేలంగలం డింకఁ జం | 475 |
గీ. | ధరణిపై ఘోరసంగరస్థలములందు మడియురాజులఁ జూచి యిప్పుడమి నవ్వు | 476 |
ఉ. | ఎంతని యెంచవచ్చు ధరణీశులమోహమహాతమంబు వి | 477 |
వ. | సాగరసంవృతంబైన భూమండలం బాక్రమించినను జిత్తశాంతి కల్గునే, చిత్త | 478 |
గీ. | తాతతండ్రు లొకింతయుఁ ద్రవ్వి నన్నుఁ గొంచుఁబోవుట లేదుగాఁ గుటిలు లగుచుఁ | 479 |
క. | ఎన్నక తండ్రులఁ దమ్ముల, నన్నలనైన న్వధింతు రక్కట నాకై | 480 |
గీ. | మమత నఖిలోర్వి యేలిన మనుజపతులు, పోవఁజూచియు నిలిచిన భూమిపతులు | 481 |
ఉ. | నామహి నీకు నేలనగునా, యిదె వేగ నతిక్రమించి నా | 482 |
వ. | అని యిట్లు తొల్లి యంసకుండనుముని జనకునకుం జెప్పిన పృథివీగీతార్థంబు | 483 |
క. | ధరణిగీతార్థము విను, పురుషులహృదయముల మమత పొలియు నుదయభూ | 484 |
వ. | ఇమ్మనువంశంబు నీకుఁ జెప్పితి. ఇందు భగవదంశభూతులైన రాజులు పుట్టిరి. | 485 |
గీ. | క్రతువు లొనరించి దానధర్మములు చేసి, ఘోరరణముల వైరులఁ గూల్చి సర్వ | 486 |
సీ. | అఖిలలోకముల నవ్యాహతగతియైన, వైన్యుండు నిలిచెనే వసుధమీఁద | |
గీ. | గురుయశస్కులు సగరకకుత్స్థరామ, రావణయుధిష్ఠిరాదిభూరమణు లిపుడు | 487 |
వ. | ఇది యెఱింగి పండితుండు సమస్తవస్తువులయందు మమత్వంబు నొందండని | 488 |
శా. | శ్రీమద్దారవదేహ దేహభృదతిక్షేమాపవర్గప్రదో | 489 |
క. | శాండిల్యకండుమునిమా, ర్కండేయాదికమునీంద్రరక్షణచణమా | 490 |
వనమయూరము. | భాసురమణీవిసరబద్ధమహితోద్య | 491 |
గద్య. | ఇది శ్రీసుభద్రాకరుణాకటాక్షవీక్షలబ్ధకవిత్వతత్వపవిత్ర వేంకటామాత్య | |
| చరితంబును, నహుషయయాతులచరిత్రంబును, యదువంశావతారంబును, | |
మంగళమహశ్రీ
శ్రీకృష్ణార్పణ మస్తు
శ్రీసీతారామార్పణ మస్తు
- ↑ “నతనికి నేకశతపుత్రు లైరి మునీంద్రా.” ?