Jump to content

వినాయకా వినాయకా

వికీసోర్స్ నుండి

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

వినాయకా వినాయకా విఘ్న వినాశక వినాశక వినాయకా 
సౌఖ్య విధాయక వినాయకా

విఘ్న వినాశక సౌఖ్య విధాయక విశ్వ విభావక వినాయకా

గౌరీ తనయా వినాయకా శంకర పాలిత వినాయకా 
గజవదనా హే వినాయకా మూషిక వాహన వినాయకా

పితృ సద్భక్తా వినాయకా సూక్ష్మ సుబుద్ధీ వినాయకా
విఘ్నాధీశ్వర వినాయకా విశ్వారాధ్యా వినాయకా

మోదక హస్తా వినాయకా మోదవిధాయా వినాయకా
చంద్రోల్లాసక వినాయకా శాసిత చంద్రా వినాయకా

పునరుజ్జీవిత వినాయకా పూర్ణకృపాలయ వినాయకా
దానవ సంహార వినాయకా దైవత రక్షక వినాయకా

భాహుచతుష్కా వినాయకా భావమనోజ్ఙా వినాయకా
పాశాంకుశధర వినాయకా రదవరదాఢ్యా వినాయకా

చందన రంజిత వినాయకా రక్తాంబర ధర వినాయకా
లంభోధర హే వినాయకా వామన రూపా వినాయకా

నాగాలాంకృత వినాయకా నానా రూపా వినాయకా
గురు సద్రూపా వినాయకా శిష్యావన హే వినాయకా

గం బీజాక్షర వినాయకా గంభీరార్థా వినాయకా
ఓంకారాఖ్యా వినాయకా వక్రసుతుండా వినాయకా
సర్వాదే శ్రీ వినాయకా సచ్చిదానందా వినాయకా