వికీసోర్స్:ఫ్రూప్‌రీడ్ ఎక్స్టెన్షన్ వాడుకమెళుకువలు
ఫ్రూప్‌రీడ్ ఎక్స్టెన్షన్ వాడి ప్రజోపయోగపరిధిలోనున్న తెలుగు గ్రంథాలను పాఠ్యీకరణ చేయటం సులభం. దీని వాడుకలో ముఖ్యమైన అంశాలు.
- పాఠ్యీకరణ చేయవలసిన ప్రజోపయోగపరిధిలో గల గ్రంథం లేక భారతడిజిటల్ లైబ్రరీ ద్వారా చదువుకొనుటకు అనుమతించబడిన గ్రంథం ఎంపిక. దీనికి అర్కీవ్ డాట్ ఆర్గ్ లేక భారతడిజిటల్ లైబ్రరీ సంప్రదించండి. స్వేచ్ఛానకలుహక్కులుగలదని నిర్ధారణచేయండి, లేక హక్కుదారులనుండి స్వేచ్ఛానకలుహక్కుల నమోదు తీసుకోండి.
- ఈ గ్రంథంపై ఆసక్తిగల వారిని కూడగట్టండి.
- భారతడిజిటల్ లైబ్రరీ గల గ్రంథాన్ని పిడిఎఫ్ లేక డిజెవ్యూ తీరులలో కామన్స్ లోకి చేర్చండి. కాపీరైట్ తీరినట్లైతే {{PD-India}} తీరనట్లైతే లైసెన్స్ గా {{Non-free DLI}} అని చేర్చండి.
- గ్రంథం పేరుతో తెలుగులో వికీ పేజీని చేర్చండి. దీనిలో అవసరమైన తలకట్టు మూస వాడండి.
ఉదాహరణ {{తలకట్టు | శీర్షిక = [[ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము]] | రచయిత = చిలుకూరి వీరభద్రరావు | విభాగము =ముఖపత్రం | ముందరి = | తదుపరి =[[/రచయిత చిత్రపటం|రచయిత చిత్రపటం]] | వివరములు = |సంవత్సరం=1910 }} <pages index="Andhrula_Charitramu_Part-1.pdf" from=1 to=1 />
- సూచిక పేజీని సూచిక:గ్రంథం పేరుతో ( పేరు ముందు వెనుకడబల్ కోట్ గుర్తులు(")వాడకూడదు. సృష్టించండి అపుడు కనబడే పెట్టెలలో వివరాలు రాయండి.
- మొదటి పేజీని పాఠ్యీకరణంచేయండి లేక కనీసం ఒక ఖాళీ(blank)తో సృష్టించండి. ఇప్పుడు మీకు గ్రంథం పేజీలో మూలము అనే టేబ్ కనపడుతుంది.
- మూలాన్ని ఛాయాగ్రహణం చేసినపుడు కొన్ని దోషాలు ఏర్పడవచ్చు. సూచికపేజీలో సరియైన పెట్టెలో రెండవ నకలుగల పేజీలను లెక్కలోకి తీసుకోకుండా వుండటానికి పేజీ సంఖ్యలను అచేతనం చేయటం(-)లేక తొలిపేజీలకు పొట్టిపేరులు ఇవ్వడం, తరువాత పేజీలకు రావలసిన సంఖ్యలను చేర్చండి.
ఉదాహరణ <pagelist 1to1="ముఖ" 2to10="తొపే" 10to13="విసూ" /> పై దానిని pagelist widget తో సులభంగా చేయవచ్చు.
- ఒక అధ్యాయం పూర్తిగా పాఠ్యీకరించండి. దానిని అధ్యాయం పేజీలో (ఉపపేజీ ఉదాహరణ:ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము/మొదటి ప్రకరణము) వచ్చేటందుకు తగిన తలకట్టు మూస చేర్చండి.
{{తలకట్టు | శీర్షిక = [[ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము]] | రచయిత = చిలుకూరి వీరభద్రరావు | విభాగము =మొదటి ప్రకరణము | ముందరి =[[../విషయసూచిక|విషయసూచిక]] | తదుపరి =[[../రెండవ ప్రకరణము|రెండవ ప్రకరణము]] | వివరములు = |సంవత్సరం=1910 }} <pages index="Andhrula_Charitramu_Part-1.pdf" from= 25 to=35 />
- పాఠ్యీకరించేటప్పుడు అధ్యాయంలో విభాగాల శీర్షికలకు విషయసూచికనుండి వికీలింకు అవసరమైతే {{Anchor}} వాడి రూపు దిద్దండి. రూపానికి ప్రాథమిక వికీఫార్మాట్ <b> ...</b> లాంటివి అవసరమైతే {{x-larger}} {{xx-larger}} లాంటి మూసలు వాడండి.
- విషయ సూచిక పేజీలలో క్రింద చూపిన విధంగా మూసలు వాడి అధ్యాయపు పేజీలకు లింకులు
{{dotted TOC page listing| | {{sc|[[<అధ్యాయం పేరు>#<విభాగం శీర్షిక>|<విభాగం శీర్షిక>]]}} |{{DJVU page link| <కనబడే పేజీ సంఖ్య>|< కనబడే పేజీకి సూచిక పేజీ రావటానికి కలపవలసిన పేజీల సంఖ్య>}} }} గా మార్చండి.
- గ్రంథంలో బొమ్మలను ప్రత్యేకంగా బొమ్మ రూపంలో గ్రహించి కామన్స్లో చేర్చి. సాధారణబొమ్మల లాగా పాఠ్యంలో చేర్చండి. క్రాప్ ఇమేజి (Cropimage) అనబడే ప్రయోగాత్మక ఉపకరణాలు కూడా వాడవచ్చు.
- బొమ్మ రూపంలో వున్న పేజీ స్పష్టత లేకపోతే పుటస్థితిని మార్చండి.
- పాఠ్యం టైపు చేసేటప్పుడు కొన్ని అక్షరాలు స్పష్టతలేకపోతే వాటి ప్రక్కన కుండలీకరణములో ప్రశ్నార్థకం చిహ్నం చేర్చండి.
- మూల అచ్చు దోషాలు గమనించితే {{SIC}} వాడి సరియైన పదం చేర్చండి. చదివేవారికి ఆ పదం పై మౌస్ వుంచినపుడు సరియైన పదం కనబడుతుంది.
- మూలము రెండు పేజీలు ఒకేసారి గ్రహించినట్లయితే వాటిని వేరుచేయడానికి BRISS వాడండి. ఆ తరువాత అడోబి అక్రోబాట్ తో ముద్రించి 300 dpi లో తక్కువ పరిమాణం వుండేటట్లు ముద్రించండి.ఆ తరువాతనే పాఠ్యీకరణ చేయడం మంచిది.