వికీపీడియా స్వయంశిక్షణ అనుబంధం-2
కంప్యూటర్ లో తెలుగు అమరిక
[మార్చు]విం డోస్
[మార్చు]- Control Panel తెరవండి
- Regional and Language Options తెరవండి
- Languages టాబ్ తెరవండి
- Install files for complex script and right-to-left languages option ఎంచుకోండి
- OK నొక్కండి
- Install files for complex script and right-to-left languages option ఎంచుకోండి
- Languages టాబ్ తెరవండి
లినక్స్ (ఉబుంటు)
[మార్చు]- System —> Administration —>Language support లో తెలుగు, Keyboard Input System లో Ibus ఎంచుకోండి
- Ibus Preferences->Input Method లో కావలసిన తెలుగు టైపు చేయు పద్దతి ఎంచుకోండి.
తెవికీలో కీ బోర్డులు
[మార్చు]లిప్యంతరీకరణ
[మార్చు]ఆంగ్ల అక్షరాలను తెలుగు ఉచ్ఛారణప్రకారం టైపు చేస్తే తెలుగు అక్షరాలు ఏర్పడతాయి. మనం మన పేరుని ఆంగ్లములో ఎలా రాస్తామో అలాగే. ఇది ఇది రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్ ఫై ఆధారబడినది.
a | A = aa = aaa | i | I = ee = ii = ia | u | oo = uu = U = ua | R | Ru | ~l | ~L |
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఌ | ౡ |
e | ea = ae = E | ai | o | oe = O = oa | au = ou | ||||
ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ |
ka | kha = Ka = Kha | g | gha = Ga = Gha | ~m |
క | ఖ | గ | ఘ | ఙ |
ca = cha | Ca = Cha | ja | jha = Ja = Jha | ~na |
చ | ఛ | జ | ఝ | ఞ |
Ta | Tha | Da | Dha | Na = nha |
ట | ఠ | డ | ఢ | ణ |
ta | tha | da | dha | na |
త | థ | ద | ధ | న |
pa | fa = Pa = pha = Pha | ba | bha = Ba = Bha | ma |
ప | ఫ | బ | భ | మ |
ya | ra | la | va = wa | Sa | sha | sa | ha | La = lha = Lha | xa = ksha | ~ra |
య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ప్రత్యేక అక్షరాలు
[మార్చు]- ఌ = ~l
- ౡ = ~L
- అరసున్నా (ఁ) = @M
- సున్నా = M
- విసర్గ (ః) = @h
- అవగ్రహ (సంస్కృతం) = @2
- నకార పొల్లు = @n
- ఖాళీ స్పేసు = _ (అండర్‌స్కోర్)
- కలుపు నిరోధించు(ZWJ(0x200C) దీని ఇంగ్లీషు అర్థానికి (zero width joiner) కు భిన్నమైన వాడుక అంటే గ్లిఫ్ లు కలవకుండా చేయు : ఉదా:క్ష్ లో క్ష్ గా రాయుటకు ksh& ఇది వచ్చినపుడు ఓపెన్ టైప్ లో జిసబ్ అనే మార్పులు నిలిపివేయబడతాయి)= & [1]
- శూన్యవెడల్పువిడదీయు(ZWNJ (0x200D) పారిభాషికపదాలలో వత్తులువచ్చినపుడు విడదీయటకు ) = ^
- చాప లోని చ = ~c (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
- జాము రాతిరి లోని జ = ~j (యూనీకోడ్ వచ్చే వర్షన్‌లో)
కొన్ని క్లిష్టమైన పదాలు
[మార్చు]- విజ్ఞానము vij~nAnamu
- రామ్ rAm&
- ఫైర్‌ఫాక్స్ fair^faaks
- హోమ్‌పేజీ hOm^pEjI
- ఎంజైమ్ eMjaim
- ఆన్‌లైన్ An^lain
- లిమ్కా limkA
- ఎక్స్‌ప్లోరర్ eks^plOrar
- వ్యాఖ్యానం vyAkhyAnaM
- అనిశ్చితి aniSciti
- దుఃఖసాగరం du@hkhasaagaram
- తెలుఁగు telu@Mgu
- ఆమ్లం aamlaM లేదా AmlaM
- పాన్పు paan&pu
- అన్వేషణ an&vEshaNa
- ఇన్ఫోసిస్ in&FOsis
ఇన్స్క్రిప్ట్
[మార్చు]ఇన్‌స్క్రిప్టు (Inscript) అనే పదం ఆంగ్లంలోని ఇండియన్ స్క్రిప్టు (Indian Script) నుండి వచ్చింది. ఈ కీ బోర్డు అమరికను భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్సు విభాగం (Department of Electronics) 1986లో తయారు చేసింది[2]. ఈ కీ బోర్డు అమరికలో, భారతదేశంలోని అన్ని భాషల అక్షరాలు అమర్చి ఉంటాయి. అయితే ఈ అక్షరాలనన్నిటినీ ఐఐఎస్‌సిఐ (IISCI) అనే ఒక ప్రామాణికంలో నిర్వచించారు. అంతేకాదు భారతీయ భాషలలో అతిత్వరగా టైపు చేయగలిగేటట్లు ఈ అమరికను తయారు చేసారు. భారతీయ అక్షరాలలో ఉన్న స్వారూప్యత వలన ఒక్క భారతీయ భాషలో టైపు చేయడం నేర్చుకుంటే మిగతా భాషలలో కూడా టైపు చేయడం సులువుగా ఉంటుంది.
QWERTY కీ బోర్డు తో దీనిని వాడవచ్చు. ఎడమవైపున ఇంగ్లిషు అక్షరాలు కుడివైపున ఇన్‌స్క్రిప్టు అక్షరాలు గల ఓవర్ లే వాడాలి.
విండోస్ 7 లో మరియు ఉబుంటు లలో సాధారణంగా Left ALT+Shift ని QWERTY నుండి ఇన్‌స్క్రిప్టు లోకి మారటానికి Toggle కీ గా వాడతారు. తాత్కాలికముగా ఒక ఇన్‌స్క్రిప్టుఅక్షరము టైపు చేయటానికి ALT+SPACE (IBM enhanced keyboard)లేక SYS-REQ (PC-AT 88 key keyboard) వాడతారు.
అన్ని భారతీయ భాషలని విశ్లేషించి, ఒకేలా వుండేలా ప్రామాణీకరించారు. దీనిలో ఎడమవైపు అచ్చులు కుడివైపు హల్లులు వున్నాయి. అచ్చుల కీ ల లో గుణింతాలు మామూలుగాను, షిఫ్ట్ తో అచ్చులుగాను వస్తాయి. హ్రస్వ అచ్చులు ప్రధాన వరుసలో, దీర్ఘ అచ్చులు పై వరుసలో వున్నాయి. 'd' కు మామూలుగా హలాంత్ (్ : న కార పొల్లు) వస్తుంది. దీనిని సంయుక్త అక్షరాలకు వాడతారు.
చాల హల్లులకి హలాంత్ చేర్చినపుడు, లేకహల్లులకి గుణింతాలు రాసేటప్పుడు, ఎడమచేతి వేళ్ళు,తరువాత కుడిచేతి వేళ్ళు వాడాల్సి రావటంతో త్వరగా టైపు చేయటం కుదురుతుంది.
హల్లుల కీలలో 5 వర్గాల మొదటి అక్షరాలు ప్రధాన వరుసలో వున్నాయి. షిఫ్ట్ తో వాటి రెండవ అక్షరాలు వస్తాయి. ముక్కుతో పలకని హల్లులను అ వర్గానికి దగ్గర కీ లలో ఇచ్చారు. ముక్కుతో పలికే హల్లులను ఎడమవైపు చివరి వరుసలో ఇచ్చారు. మిగతావి కుడివైపు ఇచ్చారు. పై వరుసలో ఎక్కువగా వాడే సంయుక్త అక్షరాలని ఇచ్చారు. ఇవి నొక్కినపుడు, వాటి మూల అక్షరాల సమూహము వస్తుంది.
టైపింగ్ ఉదాహరణలు
[మార్చు]సాధారణ అక్షరాలు, పదాలు
[మార్చు]- D=అ, E= ఆ, F= ఇ,... Q=ఔ
- h=ప,he=పా,hf= పి...hx=పం
- hd=ప్, hdj=ప్ర, hdje=ప్రా,... hdjx= ప్రాం
- hd/s=ప్యే, h-=పృ
- లక్ష్మి = nkd<dcf
ఆపిల్ లేదా వేరిటైప్ కీబోర్డు లే అవుట్
[మార్చు]నాన్-యూనీకోడ్ జెనరేషన్ అప్లికేషన్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన లేఅవుట్లలో రెండవది - యాపిల్ లే-అవుట్. అయితే దీన్ని యూనీకోడ్ లేఅవుట్ గా కూడా ఉపయోగించడం ప్రారంభించారు. ప్రస్తుతం తెలుగు వికీ ప్రాజెక్టుల్లో వాడుతున్న అయిదు ప్రధాన లేఅవుట్లలో ఆపిల్ లేదా వేరిటైప్ ఒకటి.
కీ బోర్డు ఎంపిక
[మార్చు]లిప్యంతరీకరణ (ఇంగ్లీషు అక్షరాల కీ బోర్డు) లేక ప్రామాణిక ఇన్‌స్క్రిప్ట్ కొరకు వేరే సాఫ్టువేర్ స్థాపించనవసరము లేకుండా తెలుగు టైపు చేసే విధానము. ఇది మొదట్లో విహరిణిలో నడపబడే జావాస్క్రిప్ట్ ద్వారా పనిచేసేది. మే 2012 లో సర్వర్ పై పనిచేసే నరయం అనే మీడియావికీ పొడిగింత వాడబడింది. 11 జూన్ 2013 న యూనివర్సల్ లాంగ్వేజ్ సెలెక్టర్ (ULS) అనే సాఫ్ట్ వేర్ వాడుకలోనికి వచ్చింది. దీని ద్వారా భాషల ఎంపిక సులభమైంది. మరియు వ్యాసాలను చూపించేటప్పుడు ఇతర భాషల వ్యాసాల లింకులను భౌగోళికంగా దగ్గరి భాషలను ప్రారంభంలో చూపెట్టటం వీలైంది. వికీలో టైపు చేసేటప్పుడు కుడివైపు భాష ఎంపికల బొమ్మ కనబడుతుంది. దాని ద్వారా భాష అమరికలను ఎంచుకోవచ్చు. శాశ్వత అమర్పులకొరకు ప్రవేశించిన వాడుకరులు అభిరుచులు విభాగంలో నా అభిరుచులు వాడాలి. వాడుకరి వివరాలు టేబ్ లో అంతార్జాతీకరణ విభాగంలో అడ్వాన్స్డ్ లాంగ్వేజీ సెట్టింగ్స్ లో భాష ప్రదర్శన మరియు ప్రవేశపెట్టు పద్ధతులు చేతన స్థితి మరియు అమర్పులు చేయవచ్చు. ప్రవేశపద్ధతులలో లిప్యంతరీకరణ మరియు ఇన్స్క్రిప్ట్ పద్ధతులు కలవు. అప్రమేయంగా వ్యవస్థ కీబోర్డు పద్దతి చేతనం చేయబడి వుంటుంది.
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఒపెన్ టైప్ షేపింగ్ వాడుక
- ↑ భారతదేశంలో భాషల సాంకేతికతను అభివృద్ది కోసం తయారు చేసిన ప్రభుత్వ వెబ్‌సైటులో ఇన్‌స్క్రిప్టుపై ఒక వ్యాసం. సేకరించిన తేదీ: జూలై 13, 2007