వారి వారి జోలి
స్వరూపం
ద్విజావంతి రాగం - మిశ్ర చాపు తాళం
[మార్చు]
పల్లవి:
వారి వీరి జోలి నా కేల రా సామి
వద్దు వద్దు చాలురా ||
అనుపల్లవి:
నోరు మూసు కొని యూర కున్న గాని
తీర దాయె దాని పోరు నే నేమి సేతు ||
చరణం 1:
అల దానితో నీవు కలసి కులుకు చున్న
నదె నాకు పది వేలు రా
వలపు నాపై నీకు కలుగ కున్న నేమి
తొలి నోము ఫలమని తలచితి నే కాని ||
చరణం 2:
వల వల కన్నీరు వరద లై పారగా
తల వ్రాసె గా దైవము
నిలచి నీతో నింక పలుకు లేమిటికిరా
అలరు తేనియ విస మైన గ్రోలెద గాని ||
చరణం 3:
వారక శ్రీ తోట్ల వల్లురి వేను గోపాల
మ్రొక్కెద మ్రొక్కెద
ధీరు డైన దాసు శ్రీ రామ కవి కృతి
సార మైన విని సామి నన్నే లరా ||