వామన రూప వందనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాపి - అట[మార్చు]

ప వామన రూపా వందనము వందనము||
ఆ.ప స్వామిగణ ప్రదీపా చారుతర ప్రతాపా ||

చ 1 విక్కిన బొజ్జగుంట విద్యలకెల్ల దంట
ముక్కంటి కడుపు పంట ముఖ్యుడ వీవన్నింట ||

చ 2 కుడుములు మెక్కి కొక్కు గుర్రము మీద నెక్కునడయడ
నీవే దిక్కు గొడవల నడగ ద్రొక్కు ||

చ 3 దాసు కులాభిరామ భాసుర శ్రీరామ దాసుని బ్రోవు
ప్రేమ దైవకుల లలామ ||