వల్లభాయి పటేల్/బారిష్టర్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఒకసారి పటేలుకు జబ్బుచేసినది. డాక్టరు క్లోరోఫాం మిచ్చి యాపరేషను చేయవలయునన్నాఁడు. "నే నెంత బాధకైన నోర్చుకొనఁగలను. క్లోరోఫార మక్కరలేదు. నా కాపరేషను చేయు'డని పటే లన్నాఁడు.

ఆ ప్రకారమే చేసి యిట్టి ధీరుని నాజన్మములోఁ జూడలేదన్నాఁడు డాక్టరు.

ధీరప్రవృత్తి యాయనకుఁ బ్రధమమునుండి పెట్టిన వెన్నయే.

బారిష్టర్

పటేలు కన్నిఁట నుత్తమశ్రేణియం దుండవలయుననియే కోరిక. తనకంటె నన్నివిధములఁ దక్కువైనవారందఱు నున్నత స్థానముల యందుండుట నాయన సహించలేకపోయెను. ప్లీడరీ వల్ల ధనము నార్జించెను. దానితో బారిష్టరీ చదివి రావలయునని సంకల్పించి యందులకుఁ దగిన యేర్పాటు లన్నిటిని సిద్ధము చేసెను. ప్యాసుపోర్టుకూడ వచ్చినది. అయితే పెద్దపటేలు పేచీలు పెట్టుటలోఁ బ్రముఖుఁడన్న సంగతి ప్రపంచ విఖ్యాతము. అట్లే యాయన తమ్మునితోఁగూడఁ బేచీలోనికి దిగినాఁడు. "నేను నీకంటెఁ బెద్దవాఁడను. నేను బారిష్టరీ చదివిన తరువాత నీవు చదువవలయు"నని తమ్ముని యొప్పించినాఁడు. ఇంగ్లీషులో నిద్దఱపేర్లును వి. జె. పటేలే గనుక నా ప్యాసుపోర్టు పనికి వచ్చినది. అనుకొన్న ట్లన్నగారు వచ్చినతరువాతఁ దమ్ముఁ డింగ్లాండునకుఁ దరలినాఁడు. ఇంగ్లాండులో వల్లభాయి యధికపరిశ్రమ చేయు విద్యార్థి యనువిఖ్యాతిఁ గాంచినాఁడు. ఆయన బసనుండి మిడిల్ టెంపిల్ పదునొకండు మైళ్ళ దూరమున నున్నది. ప్రతిరోజు నడచి యంతదూరము వెళ్ళుచుండెను. వెళ్ళటయే కాదు, అక్కడ దినమునకుఁ బదునేడుగంటలు చదువు చుండెనఁట. వేకువనే లేచి నిత్యకృత్యములు తీర్చికొని యక్కడనే యన్నపానీయముల నారగించువాఁడు. ఆయన యధ్యయనములో నిమగ్నుఁడైయుండఁ దుదకు బంట్రౌతువచ్చి టైమయిపోయిన దని చెప్పువఱకు లేచెడివాఁడుకాఁడు.

ఆయన కృషి ఫలించినది. ప్రథమశ్రేణిలో నుత్తీర్ణుఁ డగుటయేగాక యేఁబదిపౌనుల విద్యార్థి వేతనముగూడ లభించినది. ప్రశ్నపత్రముల కీయనవ్రాసిన సమాధానములు చూచి యా పరీక్షాధికారి యాశ్చర్యపడి ప్రధాన న్యాయాధిపతికి సిఫారసు ఉత్తరముకూడ నిచ్చెను.

ఆయన నాఁడు నేఁడు కూడ నన్యాయమును సహింపఁడు. ఇంగ్లాండులో నుండు రోజులలో నాయన యొకరి యింటిలో బసచేసెను. ఆ పేదరాసిపెద్దమ్మ యొక ధనవంతుని కుమార్తెను బట్టుకొని తనకుఁ గొంతమొత్తమునకు జెక్కువ్రాసి యిమ్మని బలవంత పెట్టసాగినది. ఈసంగతిఁ బసికట్టి పటేలు పోలీసు వారిని దీసికొనివచ్చి యా పెద్దమ్మను బట్టించియిచ్చి యా పిల్లను వదలిపెట్టించెను.

బారిష్టరుపరీక్ష యైనతరువాత నాయన బయలుదేరి 1913 ఫిబ్రవరి 13 తేదిన బొంబాయి చేరినాఁడు. ఆ మఱుసటి దినముననే యహమ్మదాబాదులో నడుగుపెట్టినాఁడు. అక్క డనే కాపురముపెట్టి యపారముగ నార్జింపసాగినాఁడు. ఇంతలోనే యాయన జీవితవిధానము మఱియొక విధముగ మారవలసి వచ్చినది.

తాఱుమాఱు

ఆంగ్ల విద్యాభ్యాసమువల్ల, ప్లీడరీవృత్తివల్లఁ బటేలులో క్షీణించుచు వచ్చిన జాతీయత పాశ్చాత్యదేశవాసమువల్లఁ బూర్తిగాఁ బోయినది. దొరల వేషభాషలు, రీతి రివాజులు బాగుగా నలవాటైనవి. పిల్లలనుగూడ నింగ్లండు పంపవలయునని తలంచి ముందుగఁ గాన్వెంటులోఁ జేర్చినాఁడు.

తాను జుట్టు, సిగరెట్టు, పలాస్, మధుపానముల కలవాటైనాఁడు. అన్నతో నప్పుడప్పు డనవసరమైన యర్థరహితమైన హాస్యాలకు దిగి ప్రొద్దుపుచ్చుచుండెడివాఁడు.

పదిమందితోఁ గలసి తిరుగకుండెను. పలుక కుండెను. కోరచూపులు చూచుచుండెను. ఆయన దగ్గరకు వచ్చిన వారితోఁగూడ మందహాసము చేయుటయేగాని పల్లెత్తి పలుకరించువాఁడుకాఁడు. తా నెక్కడనుండియో యూడిపడ్డ ట్లహంకారము చూపించువాఁడు. రాజభక్తి, బ్రిటను నందుభక్తి యానాఁ డాయనలో నధికముగా నుండెను.

గుజరాతు క్లబ్బులో నాయన యొకసారి యీవిధముగాఁ జెప్పెను. 'దుర్గాపూజ పండుగనాఁడు నే నంతులేని యానందములో నిమగ్నుఁడనై యుండువాఁడను. ఆ పండుగను బట్టించుకొనువాఁడనే కాదు. వినోదమే నాకెక్కువ. భారతీయులు విదేశీయుల ననుసరించుటయే యభివృద్ధికర మార్గమని