వల్లభాయి పటేల్/నాగపూరు సత్యాగ్రహము

వికీసోర్స్ నుండి

కలకత్తా, నాగపూరు కాంగ్రెసులలో నసహాయోద్యమ మంగీకరింపఁబడినది. అసహాయోద్యమానుగుణముగఁ దన బారిస్టరువృత్తిని మాని తన పిల్లల నున్నత విద్యకై విదేశములకుఁ బంపించుట విరమించుకొని గుజరాతులోఁ బటే లసహాయోద్యమ ప్రచారము ప్రారంభించెను. ప్రభుత్వమువారి దండన విధాన మతి కఠోరముగా నుండెను. ప్రజలు దీనిని లెక్కసేయక యధికోత్సాహముతో నిందుఁ బాల్గొనజొచ్చిరి. గాంధిజీ వల్లభాయులు గుజరాతులో సత్యాగ్రహము ప్రారంభింప నహర్నిశలు కృషి చేయసాగిరి. బార్డోలీ, ఆనంద్ తాలూకాలు సత్యాగ్రహమునకై సర్వవిధముల నాయత్తము చేయఁబడినవి. బార్డోలీ నామము భరతఖండ మంతట విఖ్యాతిఁగాంచినది. చౌరాచౌరి హత్యాకాండ కారణముగా సత్యాగ్రహ మాపివేయఁబడెను. గాంధిజీ యరెస్టు చేయఁబడెను. దీని యనంతరము గుజరాతు భారమంతయు వల్లభాయి భుజస్కంధముల పైఁబడెను. ఆయన గుజరాతు కేకైక నాయకుఁడు. ఆ దినములలో నాయన గుజరాతు విద్యాపీఠమునకై బర్మాకుఁ గూడ వెడలి దాదాపు పదిలక్షల రూపాయలు వసూలు చేసెను.

నాగపూరు సత్యాగ్రహము

1923 ఏప్రిలు 13 న జబల్‌పూరులో జాతీయవారము జరిపినారు. ఆ సందర్భములోఁ కాంగ్రెసు యువకులు మ్యునిసిపలు భవనముపై జాతీయ పతాకమును బ్రతిష్ఠించిరి. పోలీసువారు దానిని లాగివేసి చించి పాఱవేసిరి. ఒక యూరపియను డిప్యూటీ కమీషన రప్పుడు మ్యునిసిపల్ అధ్యక్షుఁడుగా నుండెను. అతఁ డీ సందర్భమునఁ జాల గర్హ్యముగాఁ బ్రవర్తించెను. అందుచేతఁ గౌన్సిలర్లందఱు వెంటనే రాజీనామాల నిచ్చిరి. జిల్లాకాంగ్రెసుసంఘము సత్యాగ్రహము ప్రారంభించెను.

యువజనులు జట్లుజట్లుగా వచ్చి జాతీయపతాకము నా భవనముపైఁ బ్రతిష్ఠించుటయుఁ బోలీసులు లాగివేయుటయు జరుగుటయేగాక, వాలంటీర్లను ఖైదుచేయుటయు జరుగుచుండెను.

ఈ సంఘటనలే నెమ్మదిగా నాగపూరు ప్రాకెను. 1931 మే 1 వ తేదీన నాగపురములో నా నగరములోని సివిలు లైనులలోనికిఁ బోఁగూడదని 144 సెక్షను జారీచేసిరి. కాంగ్రెసు వాలంటీలర్లు తమ యిష్టము వచ్చినవీధికి జాతీయపతాకమును దీసికొని పోవుటకు హక్కు కలదని పట్టు పట్టిరి. పోలీసులు వారి నరెస్టు చేసిరి. క్రమానుగతముగ నదియొక యుద్యమముగా నభివృద్ధి చెందినది. కాంగ్రెసు కార్య నిర్వాహకవర్గమువారు నాగపూరు వాలంటీర్ల నభినందించిరి. నాగపుర సత్యాగ్రహోద్యమ సంఘమువారికి సహాయము చేయుటకుఁ దీర్మానించిరి. ఈ యుద్యమ సందర్భమున సేట్‌జమ్నాలాల్ బజాజ్ కూడా నరెస్టు చేయఁబడెను. అందువలననే యఖిలభారత కాంగ్రెసుసంఘము నాగపురములో సమావేశమై పతాకోద్యమమునకు హృదయపూర్వకముగ సహాయముచేయుటకుఁ దీర్మానించిరి. నాగపురసత్యాగ్రహమునందుఁ బాల్గొనుటకు వివిధ ప్రాంతములనుండి వాలంటీర్లు వచ్చి ఖైదులో నంతులేని బాధల నొందిరి.

పటేలు సోదరులు ముఖ్యముగ నా యుద్యమమున కండఁగా నిలఁబడిరి.

జులై 18 వ తేది పతాకాదినముగా నిర్ణీత మయ్యెను. కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గము వా రా నాఁడు దేశమంతటఁ బతాకోత్సవములు, నూరేగింపులు జరుపవలసినదిగా రాష్ట్ర కాంగ్రెసు సంఘములకుఁ దాఖీదులు పంపించిరి.

తదాజ్ఞానుసార మన్ని ప్రాంతముల యందును బతాకోత్సవము విజయోపేతముగ సాఁగెను. వల్లభాయి పటేలు కూడ జులై 18 తారీఖునఁ ప్రభుత్వము వారిచే నిషిద్ధప్రదేశముగా నిర్ణయింపఁబడినచోటఁ బతాకోత్సవము జరిపించెను. ప్రభుత్వము కిమ్మనలేదు. తరువాతఁ బ్రభుత్వమువారు సత్యాగ్రహుల నందఱను బేషరతుగా విడుదలచేసిరి.

బోర్సద్ సత్యాగ్రహము

బోర్సద్ గ్రామ మరాజక వాదులకు దోపిడిగాండ్రకు నిలయమని చెప్పి ప్రభుత్వము ప్రత్యేకపుఁ బోలీసు సిబ్బంది నక్కడఁబెట్టి, వారిపై 1922లో రెండులక్షల నలుబదివేల రూపాయల యదనపుపన్ను శిక్షార్థము విధించిరి. ఇది చాల నక్రమమైన యారోపణము. ఈ దోపిడులు పోలీసువారి యిషారావల్ల జరుగుచున్నవిగాని మఱియొకటికాదు. (పోలీసుల తుపాకులుకూడ దోపిడిగాండ్ర యొద్దనుండెను. పటే లీ విషయ