వలపు తాళ వశమా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ప|| వలపు తాళ వశమా, నా సామికి
చలముసేయ న్యాయమా

అ|| అలరువిల్తుని సమానుడౌ శ్రీపద్మనాభుడు
నెలత ఇపుడు నిన్ను నిరాకరించెనే

చ1|| చిరుతప్రాయమునాడే చిగురుబోణి వాని
కరుణాసాగరుడని కలికి చాల నమ్మితి
మరునిబాణముచాత మగువ నా మనసెంతో
పరవశమాయెనే భాగ్యమిటులాయెనే

చ2|| ఇలను నా ప్రాణేశుడే మానినితో గూడి
జలజాక్షి మితిమీరి సరసాలాడుచున్నాడో
పలుమారు నను జూచి పలుకులాడినదెల్ల
తెలియవచ్చెనే ఓ చెలియరో ఈవేళ

చ3|| సోమకిరణముచాత సొగసైన నిన్నటిరేయి
రామ రామ నాకు రమణి యుగమాయెనే
కామకేళిలో నన్ను కలసియుండిన విభుడు
నామీదనున్న నెనరు నాతి మరిచెనేమో