వరవిక్రయము/కోరికల చిట్టా అగ్రిమెంటు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పెండ్లికొడుకు తండ్రి వ్రాసియిచ్చిన అగ్రిమెంటు:- బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. మీ కుమార్తె చి||సౌ|| కాళిందిని నా కొమారుడు చి|| బసవరాజునకు చేసికొనుటకు అందులకై మీరు మాకు కట్నము క్రింద నైదువేల రూపాయల రొక్కమును (చిక్కిన నేటి రూపాయలు లక్ష), రవ్వల యుంగరము, వెండి చెంబులు, వెండి కంచము, వెండి పావకోళ్ళు, పట్టు తాబితాలు, వియ్యపురాలు వియ్యంకుల లాంఛనలములు యథావిధిగా నిచ్చుటకును. ప్రతిపూట బెండ్లివారిని బ్యాండుతోఁ బిలుచుటకును, రాక పోకలకు బండ్లు, రాత్రిలు దివిటీలు నేర్పాటు చేయుటకును, రెండుసారులు పిండి వంటలతో భోజనములు, మూడుసార్లు కాఫీ, ఉప్మా, ఇడ్డెనులు, దోశె రవ్వలడ్డు, కాజా, మైసూరు పాకాలతో ఫలహారములు మా ఇష్టానుసారము అయిదు దినములు మమ్ము గౌరవించుటకు, అంపకాలనాడు మాకు పట్టుబట్టలను, మాతో వచ్చువారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకును నిర్ణయించుకొని బజానాక్రింద 10 రూపాయలు ఇచ్చినారు గాన ముట్టినది.

--సింగరాజు లింగరాజు వ్రాలు.