వద్దు వద్దురా
Appearance
రాగం ఫరజు - చాపు తాళం
[మార్చు]
పల్లవి:
వద్దు వద్దుర ఇక వదలర సామి
పొద్దు పోయెరా నీ పుణ్యము పోపోరా ||
చరణం 1:
కోపగించకు మగని కోత కోర్వను సామి
రేపు వచ్చెద చాల సేపాయె పోపోర ||
చరణం 2:
కంటగించకు నేగానా నీ దాన సామి
ఇంటికి పోవలె నిప్పుడే పోపోర ||
చరణం 3:
వినుము నా మనవి వేణుగోపాలా
ఘన దాసు శ్రీరామ కవిపాల పోపోర ||