Jump to content

వదరుబోతు/ఆధునిక కవిత్వము

వికీసోర్స్ నుండి

ఆధునిక కవిత్వము

12

భోజరాజు ముఖముఁ జూచి నంత నెట్టి మూర్ఖునకైన నవరస భరితమగు కవనము చెప్పు శక్తి తనంత వచ్చుచుఁడెడిదఁట! విద్యాగంధ మెఱుఁగని వారుగూడఁ గవులగుచుండిరఁట! అక్ష రజ్ఞాన శూన్యలగు గొల్లపడుచులును, ఎఱుక జవ్వ నులు సయితము పద్యము లాశుధారగ నల్లఁగలుగు చుండిరట! ఒకనాఁ డామహానుభావుఁడు వేట నుండి మట్ట మధ్యాహ్నమున నొంటిమై మఱలి వచ్చుచు నాతపక్లేశ భిన్నుఁడై చాలదప్పిగొని యుండఁగా నాత్రోవలో నొక గొల్లపడతుక చల్ల కుండ నెత్తి నెత్తికొని పోవుచుండెను. అతఁడది గని యాముద్దియ నడిగి చల్లపుచ్చుకొని త్రావి తృప్తుఁడై యభిమత మడుగు మనఁగా నాజవ్వని తన చిత్త మాతినిపై హత్తెనను నర్థమిచ్చు నీ హృద్యమగు పద్యముం బఠించెనఁట!

   "ఇందుం కైరవిణీవ కోకపటలీ
          వాంభోజినీవల్ల భం
    మేఘం చాతకమండలీవ మధుప
          శ్రేణీవ పుష్పంధయం
    మాకందం పికసుందరిన తరుణీ
          వాత్మేశ్వరం పోషితం
    చేతోవృత్తి రియం మమాట నృపతే
          త్వాం దుష్టు ముత్కంఠతే”
 

ఇది నిజమైనచో నామహనీయుని ప్రభావ మెట్టిదో యిప్పటి మన యలఁతియూహల కగోచరము.

కవిత్వ మంత సులభముగ లభింపఁగల పదార్థమైనపు డంతకన్న మనము గాంక్షించు కామితమేలేదు. కవనము కళ - అందును జిత్ర కళ. కళలన్నియు సభ్యాసమూలములు. స్వభావ వశమునఁ గాక బలాత్కారముగ నార్జించిన కవన శక్తి ప్రేమచేఁ గాక నిర్బంధమున మెడకంటఁ గట్టుకొన్న తరుణింబోలె రసాభాస ప్రసక్తి కాకర మగునను మాటలో నెంత సత్యమున్నను, పాండిత్య మునకు దూరమై ప్రపంచానుభవనమునకుం బాసి భావనా శిల్పముల: నెఱుంగక వ్రాయఁబడు కవిత కును గవితయనుపేరు చెల్లునేని, యిఁక ప్రపంచ- మున నూటికి నూరువంతులు కాళిదాసులే యగు దురుగదా? అపుడాడిన మాటలన్నియు నాశు ధారలై పాడిన పాటలెల్ల ప్రబంధములగును. అపుడు “నీవు బ్రహ్మాండ భాండములను సృజించినచో "నేను మంటి భాండముల సృజింతును. నాకన్న నీదేమి ఘనత?” యని “కుమ్మరియును సృష్టికర్త నధిక్షేపింప వచ్చును.

పోనిండు. భోజరాజు కాలమునాటి గొల్ల పిల్లలజోలి మన కేల. కాని, కవులును, కావ్యము లును బ్రపంచమున నంత యగ్గువగ లభించుట యసంభవము. అద్వితీయ మేధావి శేష భూషితులై యధీత సకల శాస్త్రార్థసారులై యధిగతలోకాను భవవివేకులైన మహాకవులు సయితము తమజీవిత కాలమంతయు నొకటి రెండు గ్రంథములు రచించుట యందే గడపిరి. కవనమున కక్షరలక్ష లభించు కాలములో నుండియు కవికుల శ్రేష్ఠుఁడగు భట్ట బాణుఁడు తనవ్రాయఁగడంగిన కాదంబరిలో నొక భాగము మాత్రమే తన యాయుఃపరిమితిలోఁ బూర్తిసేయ నోచుకొనియె. అష్టదిగ్గజములలో నెల్ల మేటియై యాశుధారా ప్రవీణుఁడగు నల్ల సానివాఁడును నిండుసభలో నొకనాడు తన్ననవర తము పోషించు కృష్ణరాయనివంటి మహాప్రభువు తన కొక్కకృతి యిమ్మని వేడఁగా భాగ్యముపండె నని. కానిమ్మనక,

    “నిరుపహతిస్థలంబు రమణీ ప్రియ
          దూతిక తెచ్చి యిచ్చుక.
     ప్పురవిడె మాత్మకింపయిన
          భోజన ముయ్యెల మంచ మొప్పు తె
     ప్పరయు రసజ్ఞులూహ దెలియం
          గల లేఖక పాఠకోత్తముల్
     దొరికినఁగాక యూరక కృ
          తుల్ రచియింపు మఁటన్న శక్యమే”

యని కేవల ప్రత్యుత్తర మొసంగెను కాని, పట్టుమని పదిపద్యములయిన నారాజుపై చెప్పిన పాపమునం బోలేదు.

'కాని మన కాలమున నిట్లు కాదు. భోజ రాజు దర్శన మక్కఱలేకయే సర్వులును గవులగు చున్నారు. అక్షరలక్షలు లభింపకయే గ్రంథము లసంఖ్యాకములుగ బయలుదేఱుచున్నవి. “చ - దువురాని వానికి సర్వే” యనురీతి నితర విధ జీవ నోపాయముల నెఱుంగనివారు కవిత్వమును శరణ మాశ్రయించు చున్నారు. పెద్దనకాలము నాఁటి: కన్న నిపుడీ విద్య యతిసులభము. నాఁడువలసిన సస్త సాధన సామగ్రి యిపు డక్కరలేదు. నేడు కవనమునకు వలసిన నెల్ల మూడే సాధనములు! ప్రవాహలేఖని (ఫవుంటఁన్ పేనా) యొకటి; అక్బరు సాహ చుట్టల పెట్టియ (లేక షాజహాన్ పొడుము కలకాయ) రెండు; తేనేటిచేనిండిన పాత్ర (లేక రెండు మూఁడు తులముల నల్లమందు) మూఁడు. గద్యకావ్యమున కింతచాలును. పద్య ప్రబంధము లకు సులక్షణ సారములోని యయిదారు పద్య ములు వచ్చుటకూడ మంచిదే! ఈమాత్రపు సాధన సహాయమున లెక్కకుమీఱిన గ్రంథములు.. బయలు దేరుచున్నవి. కాననే నేఁటికాలమున నిట్టి గ్రంథవర్షము! పిచ్చి బాణుఁడొక్క నవలలో నొకభాగము మాత్రమే వ్రాయఁగలిగెను కాని యిప్పటికావ్యములఁ జూడుఁడు. పూర్ణిమనాఁడారం - భమయి యమావాస్యనాఁడు కడముట్టునవి కొన్ని, మఱికొన్ని యేకాదశి యుపవాసమున నుదయ మంది ద్వాదశి పారణతో ముక్తిపడయునవి!

మఱియొక విశేషము! కృష్ణ దేవరాయఁ డాంధ్ర భోజుఁడను ఖ్యాతి గడించెనేకాని తుదకొక టియో రెండో కావ్యములకే కృతిపతికాఁగలిగెను. ఆకాలమునఁ గృతులు నంకితమిచ్చువారి సంఖ్య చాలస్వల్పము. ఇపుడో, అంబరాగ్రహాది ప్రదా నములచే నర్థింపకున్నమానెఁగాని యడుగకయ మున్న గ్రంథముల రాసులుగఁ దెచ్చి మంక్షిత మిచ్చుదాతలు వేనవేలుగలరు.క్రోసుదూరమున నుండియే కవుల కొకవేయినమస్కారములు చేయు చుంటంబట్టియే కాకున్న నీవఱకు కట్నములతోడఁ గూడఁ గావ్యకన్యకలనిచ్చి యెందఱు వరసకు నాకు మామగారగుచుండిరో 'నేనిపుడూహింపఁ జాలను

కాని యొకటిమాత్రము మరువరాదు. కావ్యము సప్తసంతానములలో నొకటిగఁ బరిగ ణింపఁబడఁదగినది. శబ్దేందుశేఖరము మంజూష యను గ్రంథములకచించిన పండితో త్తముఁడు నాగోజీ దీక్షితుని నొకరు సంతానమునుగుఱించి ప్రశ్నింపఁగా నతఁడు,

  "శబ్దేందుశేఖరః పుత్రో
  మంజూషా మమ పుత్రికా.”

అని సమాధానమిచ్చెనఁట పాండిత్యము- నకుఁ దోడు ప్రపంచానుభవముగల్గి పెద్దనా మాత్యుఁడన్నట్లు సప్తసాధనయుతుఁ డయినకవి వ్రాసిన కావ్యము సప్తవిధ సంతానములలో నుత్తమసంతానమనుట కేమిలోపము? ఇక యి- ప్పటి సాధనత్రయమున వెలువడు గ్రంథములు- అందునను పోలు పొఁదు లేని నవలలు - నూటఁ దొంబది వంతులు గ్రంధకర్తల దేహములపై మొలచిన దుర్మాంస గ్రంధులన్నను నాకు బాప - మురాదని నామాశయము.

   "విద్వత్కవయః కవయః
   "కేవల కవయస్తు కేవలం కపయః"
 

_________

నా ట క త త్వ ము

13

కావ్యములలో నెల్ల నాటకములు శ్రేష్ఠ ములని పెద్దలుపలుకుదురు. లోకమునందలి జనుల వ్యవహార వ్యాపారాదులను వానియందలి గుణ దోషములను, తత్తత్ఫలములను, అన్నియు నున్నవి యున్నటుల ప్లేక్షకుల కనుల ముందఱ నుంచి కనులారఁ జూచి యనుభవమునకుఁ దెచ్చికొండని బోధించునవి నాటకములే యగును. కావ్యశాస్త్రా దులు పండిత హృదయములకు మాత్రము గోచ రములగుటం జేసి నాటకములు పామరులకుఁ గూడ