Jump to content

వదరుబోతు/సత్యసంధత

వికీసోర్స్ నుండి

సత్యసంధత

11

తిమింగిలాది ఘోరజలజంతుసంతాన సంకు లమె, మైనాక ప్రముఖ శిఖరి కులదుర్గమమై జంఝామారుతో భూత కల్లోల మాలికాకులమై సలిల ప్రవాహ దురవగాహమైన మహార్ణవమునఁ దప్పుత్రోవపట్టిన కర్ణధారకుఁడు తన్నే కాక తోడివారింగూడఁ జెఱచును. తెలిసియైన, పొరఁ బాటుననైన, ఆజాగరూకతనైన నొక్కమారు, మారు త్రోవఁబడినచో నే తిమింగలముబారిపడి యో ఏ గిరిసానువుల డీకొనియో, ఏసుడిగుంతలఁ జిక్కియో, నావ యపాయముపాలు గాక గట్టు? చేరుటరిది. ఈప్రపంచము మహాసముద్రము వంటిది. భయావహరోగజాలములు, వికారవదన గహ్వర ములఁ దెఱచి కబళింప సిద్ధముగనుండుకు వ్యసన పరంపర లెంత దృఢచిత్తమునేని ప్రయ్యలు చేయఁ జాలియుందురు. విషయవ్యామోహ వీచికలు తల దిమ్ముపట్టింప దివురు చుండును. ఆశా ప్రవాహ ములు పెడదారిం బెట్టి సుడివడఁజేయుచుండును. విశేషమిందేమన, కనుచూపునఁ దోచునవన్ని- యు హృదయంగమములై నేత్రానంద దాయక ములగు రాజమార్గములే ! వానిలోఁ దగినవాని నేర్పరించుకోను జాణతనము మానవున కత్యా వశ్యకము.

కాని సన్మార్గము ననుసరించుట మనుజునకు శక్యమా? ఇది సరియైన మార్గమని యతఁడెట్లు కనుగొనగలఁడు! అగాధ సంసారాంబుధిఁబడి కొట్టు కొనుచు నానావిధములగు యాతనలచే బాధపడు నాతనికీ దరిజేరనగు మార్గ మెదరుబోధింతురు?

మహార్ణవమున నెన్నియో యోడలు ప్రతి దినమును రేయియనక పగలనక రేయనక పగలనక ప్రయాణము సేయుచునేయున్నవి. అవి తమ గమ్యస్థానమునకు నియమిత కాలమునందు తప్పక చేరుచున్నవి. మా- లియు యేతొందరలేక యెప్పుడును శాంతచిత్తుఁడై యే యుండును. వానికి దిగ్భ్రమ యెన్నడును గలుగదు. వాఁడేదిక్కునకుఁ బోవలసియుండినను దారిని చూపున దొక్కటే! అదేది? ధృవనక్షత్రము. అదిస్థిరము. ప్రపంచమున నేది మార్పు చెందినను ధృవనక్షత్రము తన చోటు మారదు. ఎట్టి చిక్కు లలో నున్న వారికీని నదేదిక్కు. దానినమ్మినవాఁ డిదివఱకును పెడత్రోవఁ దొక్కలేఁదు.

సంసార సాగరమునఁగూడ సరియైన మార్గ మును జూపుట కిట్టినక్షత్ర మేగలదు. సకలజంతు సంక్షోభకరమై భూమ్యాకాశముల నెల్ల జలమయ- ముజేయు గొప్ప తుపానుచే ధృవనక్షత్ర మగుపడక పోవుట తటస్థించిన సమయమందు గూడ నది స్పష్ట ముగాఁ గానవచ్చుచునే యుండును. ఏమూల నుంచినను ధృవమునే చూపు సూదంటు రాతిముల్లు వలె మనయంతరాత్మ సర్వావస్థలయందును ఆ నక్షత్రము వైపే జూపుచుండును. ఆనక్షత్ర మేది ? దాని పేరు సత్యసంధత. ఇదివఱ కెందఱో దాని నమ్మి కష్టముల దరిఁ జేరియున్నారు. నలహరి శ్చంద్రు లద్దాని సాహాయ్యము లేక యుండినచో, నే దుష్టమార్గమునఁ బడిపోవుచుండిరో, యూ హింపలేము.

అరబ్బీకథలలో నొక వృత్తాంతముగలదు. సిందుబాదనువాఁడు పోవుచుండిన నావ దారితప్పి అయస్కాంతపురాలచేనిండిన గుట్ట యొద్ద పోవలసి వచ్చెను. నావ యింకను కొంతదూరముండగనే దానిలోని యినుు ములుకులన్నియు దానిచే నా కర్షింపఁబడినందున. నావగూడ పర్వతమునకు దగు ల్కొని మరలి రాలేక తుపానులచే దరికికొట్టబడి పగిలిపోయెను.

మన దేహయాత్ర నౌకాయాత్ర వంటిది. విషయవ్యామోహమను నయస్కాంత పర్వత శక్తిచే చిత్తవృత్తు లాకర్షింపబడినప్పుడు, మనుజుఁ డట్టిట్టు కదలలేక సన్మార్గమునకు దూరమై దుఃఖమునకు జిక్కి నశించును. కనుక విషయము లకుఁ జిక్కక సన్మార్గమునఁ బ్రవర్తించిననే తప్ప మనుష్యుడు జీవిత పరమావధిని జేరలేడు. వేగమెంత యసదైనను నావమార్గమునందున్నచో గొంతకాలమున కేని తన రేవు చేరఁగలుగును, "కాని యించుక మార్గమును విడచిన నావకెంత వేగము - న్నను, ఆవేగము దాని రేవునుండి దూరముసేయుట కే యుపయోగించును. అట్లే మనుష్యుని శక్తి కొంచమైనను సన్మార్గమందున్నచో కొంత కాల మున కేని యది యతని పరమావధి సేర్చగలు గును. సన్మార్గమునుండి తప్పిన వానిశక్తి యెంత యున్నను నది యతని యవధినుండి క్రమక్రమ ముగా దూరస్థుని జేయును.

కులము, రూపము, ప్రాయము, పరువము, ఐశ్వర్యమును గలిగి సర్వవిధముల నొప్పిన సుయోధ నుఁడు కొంచెము విషయప్రవిష్ణుఁ డగుటచే, నాతని శక్తియు నభిమానము నాతనిఁ బెడత్రోవకీడ్చి తుదకెట్టిస్థితికిఁ దెచ్చినదో చదువరు లెఱిఁగియే యున్నారు. మఱి ఇంక సుదాముని జూడుఁడు! అతఁడు కట్టుబట్టలేక, కుచేలుఁడని పేరొందెను. తన యిరువది యేడ్వురమంది కొడుకులు నాకలిచేఁ బట్టి పీడించుచున్నప్పుడు గూడ, తన జీవితముపైఁ గాని, సృష్టించిన భగవంతునిపైఁగాని విసిగికొన లేదు. ధనార్జనమునకై న్యాయమునకు దూరమైన యేషన్నుగడను తలంపలేదు. అట్లే చిరకాలము కష్టములనొందెను. తుదకై హికాముష్మీక సుఖ ముల నొందగలిగెను.

అన్ని నీతిశాస్త్రములయు, అన్ని ధర్మ శాస్త్రములయు, అన్ని మతగ్రంథములయు, సార మీ సత్యసంధతయే. అది లేక యుండెనా మా నవుఁడెంత పండితుఁడైనను, ఎంతయాచారవంతుఁ . డై నను ఏవగింపదగినవాఁడే. 'సత్యము సర్వశ్రేయో మూల'మని పెద్దలే నుడివియున్నారు.

ఏమతాభ్యాసమునకైన నాచార్యుడవసర మేమోకాని దీనికి నాచార్యుఁడే యనవసరము. అన్ని వేళల మంచి నుపదేశించెడి మనయంతరా- త్మయే యాచార్యుఁడు. కనుక హృదయంగమము. లైనను చెడద్రోవలఁ బడనీక సన్మార్గముల నేర్ప ఱచి చూపఁగల శక్తి యొక్క సత్యమునందే యున్నది. మసజీవయాత్ర కడ తేర్పవలయునన్న సన్మార్గముననే పోవలయు. దానిఁ గనుగొనుటకు సత్యమునకన్న వేరు దీపమేలేదు. కనుకనే,

"There is no Religion higher than Truth"

అను నానుడి.