Jump to content

వట్టూ బెట్టెద

వికీసోర్స్ నుండి

ఆనందభైరవి రాగం - చాపు తాళం

[మార్చు]


పల్లవి:

వట్టుబెట్టెద నా చెయి బట్ట రాకురా సామి||

అనుపల్లవి:

గట్టిగ పది వేల కరకు వరాల మూట
గట్టి నా కట్టెదుట బెట్టి మాటాడరారా ||

చరణం 1:

గారాననొక యమ్మ కని పెంచిన బిడ్డ
యూరకే వచ్చున్ తేర సరిగ చీర ||

చరణం 2:

వలచి వచ్చిన వారు విలువ బెట్టక పోరు
అలరింతు తేరా మంచి ఆణి ముత్యాల పేరు ||

చరణం 3:

భాసుర వేణు గోపాల జేజేల మిన్న
దాసు శ్రీరామ కవి దాసి యేలకయున్న ||