Jump to content

వచ్చెనడుగో

వికీసోర్స్ నుండి

దరువు

[మార్చు]

వచ్చెనదుగో (భామాకలాపము)


పల్లవి:
వచ్చెనడుగో : మారుడు వచ్చెనడుగో ॥ వచ్చె ॥

అనుపల్లవి:
వచ్చెనడుగో చెచ్చెరంబున | పచ్చవిల్లుడు మచ్చరంబున
విచ్చుకత్తి తళుక్కుమనగా | నిచ్చటికి వేవేగ మిప్పుడు ॥ వచ్చె ॥

చరణం 1:
శారికలు నౌబత్తు వేయగా । గండు తుమ్మెదలు చేరి సంగీతము బాడగా |
కేకి చయము కొలువై కోవెలలు గూయగా ।
ఆసరకు మందారపగతికి| మదమరాళము। శారికలు కవ్వాడు చెప్పగ ॥
హారవములాకాశమున విస్తరముగ ఢంకాలు వేయుచు ॥ వచ్చె ॥

చరణం 2:
బారు కోవెల మూకకూయగా | దాపల సుబేదారుడు వసంతుడెచ్చగ
వెలపల జమాదారుడు చంద్రుడు చల్లగా ।
చేరి చిలుకల రధము పయిగురి |
కోరి శరములు వేశనవలో దారుడు మన్మధుండిపుడు ॥ వచ్చె ॥

చరణం 3:
తమ్మి మిధ్యడ మావిమ్రోయగ | కమ్మగాని లెమ్మని ఆపైన నిలిపైగా |
కుడిచేత పూపుటమ్ములు వెంట సంధించెగా !
కెవ్వునార్చి | హుమ్మని బాణములేసె | నమ్మరొ
నేనేమిసేయుదు | రమ్మనె కోటవల్లూరి రాజ గోపాలుని ఇచటికి ॥ వచ్చె ॥

*Note: This song (Daruvu) was identified by Padmabhushan Smt. Swapnasundari from an early 19th centu 'Bhamakalapamu' which has been in performance for over a century. The 'Makutam' which is borne at indicates that it could be a song composed by Dasu Sriramulu garu, who was known to have specially performance librettos of the tradition of Deva Dasis (Dancing girls) of Andhra.