లోకోక్తి ముక్తావళి/సామెతలు-బా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2459 బర్రెకొమ్ము అంటే యిర్రికొమ్ము అంటాడు

2460 బఱ్ఱెచస్తే పాడిబయట పడుతుంది

2361 బఱ్ఱె దూడవద్దా పాతప్పుల వానివద్ద వుండరాదు

2462 బఱ్ఱెపాడెన్నాళ్లు బాగ్యమెన్నాళ్ళు

2463 బఱ్ఱె పెంటతింటే పాలు చెడుతున్నవా

2464 బలవంతాన పిల్లనిస్తానంటే కులమెమి గోత్రమెమి అని అడిగినట్లు

2465 బలవంతమాఘస్నాన

2466 బలవంతుని సొమ్ముగాని బాపడిసొమ్ముగాదు

2467 బెలిజె పుట్టుక పుట్టవలె బతాయి బుడ్డి కొట్టవలె

2468 బలుస పండితే వడ్లు పండును

2469 బలుస పండితే గొలుసులవలె నుందును

బా

2470 బాపడికి పప్పాశ అత్తకు అల్లుడాశ

2471 బాపనవాడి కొలువు తెల్లగుఱ్ఱపుకొలువూ కూడదు

2472 బాపనవావి బడింతిపివాని

2473 బాపనసేద్యం బడుగులనష్టం కాపులచదివు కాసులనష్టం

2474 బాపనసేద్యం బాలవైధవ్యం ఒకటి

2475 బాపనసేద్యం భృత్యము చేటు

2476 బాపలు తప్పినా వేపలు తప్పము

2477 బాపళ్ళ వ్యవసాయము కాపుల సమారాధనా

2478 బార కాడివలె పడ్డావు నీవెవరు రామా యింటి దేవుడికి మ్రొక్కను 2479 బాలనాయకం బహునాయకం స్త్రీ నాయకం

2480 బాలలేని యింట్లో వృద్ధు డంబాడెనట

2481 బావమరిది బ్రతక గోరును దాయాది చావగోరును

2482 బావా నీభార్య ముండమోసిందోయి అంటే మొర్రోఅనియేడ్చెనట

2483 బావి తవ్వబోగా భూరము బయలు దేరెనట

2484 బావి లోతు చూడవచ్చును కాని మనసులోతు చూడరాదు

2485 బాస తప్పినవాదు బడిందిగినవాడు ఒక్కటే

బి

2486 బిచ్చపుకూటికి పేదరిక మా

2487 బిచ్చపు కూటికి శనైశ్వర మడ్డం పడ్డట్టు

2488 బిచ్చపువాణ్ణి చూస్తే బీదవానికి కోపము

2489 బిచ్చమువేయకున్నమానె కుక్కనువిడువకు మన్నట్లు

2490 బిచ్చానికిపోయినా బిగువుతప్పలేదు దుప్పటిపోయినా వల్లెవాటుతప్పలేదు

2491 బిఒడ్డను వేసి లోతుచూచినట్లు

2492 బిడ్డయెదిగితే కుండయెదుగుతుంది

2493 బిడ్డలేనిముద్దు వానలేనివరద

బీ

2494 బీడునకు కురిసినవర్షం అడివిని కాచినవెన్నెల

2495 బీదవాడు బిచ్చపువానికి లోకువ