లోకోక్తి ముక్తావళి/సామెతలు-ప్ర

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2411 పోయిన కంటికి మందువేస్తే వున్నకన్ను వూడ్చుకొని పోయింది

2412 పోయింది వర వుండేది కత్తి

2413 పోరానిచుట్టంవచ్చాడు బొడ్దువంచికోయరా తమలపాకులు

8414 పోరాని చోట్లకు పోతే రారానిమాటలు వస్తవి

2415 పోరినపొరుగు రాసినకుండలూ మనవు

2416 పోనష్టి పొత్తు లాభము

2417 పోరులెనిగంజి పోసినం తేచాలు

2418 పోలీపోలీ నీబోగం యెన్నాళ్ళేఅంటే మాఅత్త మూలవాడనుండివచ్చేవరకు అన్నదట

2419 పోలిగాడిచెయ్యి బొక్కనుపడ్డది

2420 పోల్నాటిలో పోకకుపుట్టెడు దొరికితే ఆపోకదొరకక పొర్లిపొర్లి ఏడ్చిందట

ప్ర

2421 ప్రతిష్ఠకు పెద్దినాయుడువస్తే యీడవలేక యింటినాయుడు చచ్చినట్లు

2422 ప్రయాణంఅబద్ధం ప్రసారం నిబద్ధి

2423 ప్రసూతివైరాగ్యం పురాణవైరాగ్యం శ్మశానవైరాగ్యం