లోకోక్తి ముక్తావళి/సామెతలు-పో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2392 పొదుగు చింపిన పసరం పోతును యీనుతుంది

2393 పొదుగుకోసి పాలుత్రాగినట్లు

2394 పౌయ్యిఅరిస్తే బంధువులు కుక్క అరిస్తే కరువులు

2395 పొయ్యిలో పిల్లి లేవలేదు

2396 పొయ్యివూదమంటే కుండలు బ్రద్దలు కొట్టినాడు

2397 పొరుగింటచూడరా నాపెద్దచెయ్యి

2398 పొరుగింటి కలహము విన వేడుక

2399 పొరుగింటి పుల్లకూర రుచి

2400 పొరుగు పచ్చగావుంటే పొయ్యిలోనీళ్లు పోసుకున్నట్లు

2401 పొరుగూరి చాకిరం పొరుగూరి వ్యవసాయం తనను తినేవే గాని తినేవిగావు

2402 పొల్లుదంచి బియ్యము చేసినట్లు

2403 ప్రొద్దుటిది పొట్టకు మాపటిది బట్టకు

2404 పొమ్మనలేక పొగపెట్టినట్లు


2405 పొయ్యి వూదినమ్మకు బుక్కెడైనా దక్కదా

2406 పొర్లించి పొర్లించి కొట్టుతూవుండగా మీసాలకు మన్నుతగుల లేదన్నట్లు

పో

2407పోకలకుండ చట్రాతిమీద పగులగొట్టినట్లు

2408 పొడు బాము సామెత

2409 పోగాపోగా పైగుడ్డ బరువవుతుంది

2410 పోతేపల్లివారికి పప్పే సంభావన 2411 పోయిన కంటికి మందువేస్తే వున్నకన్ను వూడ్చుకొని పోయింది

2412 పోయింది వర వుండేది కత్తి

2413 పోరానిచుట్టంవచ్చాడు బొడ్దువంచికోయరా తమలపాకులు

8414 పోరాని చోట్లకు పోతే రారానిమాటలు వస్తవి

2415 పోరినపొరుగు రాసినకుండలూ మనవు

2416 పోనష్టి పొత్తు లాభము

2417 పోరులెనిగంజి పోసినం తేచాలు

2418 పోలీపోలీ నీబోగం యెన్నాళ్ళేఅంటే మాఅత్త మూలవాడనుండివచ్చేవరకు అన్నదట

2419 పోలిగాడిచెయ్యి బొక్కనుపడ్డది

2420 పోల్నాటిలో పోకకుపుట్టెడు దొరికితే ఆపోకదొరకక పొర్లిపొర్లి ఏడ్చిందట

ప్ర

2421 ప్రతిష్ఠకు పెద్దినాయుడువస్తే యీడవలేక యింటినాయుడు చచ్చినట్లు

2422 ప్రయాణంఅబద్ధం ప్రసారం నిబద్ధి

2423 ప్రసూతివైరాగ్యం పురాణవైరాగ్యం శ్మశానవైరాగ్యం