లోకోక్తి ముక్తావళి/సామెతలు-నొ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నే

2022 నేర్పుగలమ్మ నేతితో అతిరసాలుచేస్తే, ఓర్పుగలమ్మ నొళ్ళో కట్టుక ఫోయిందట

2023 నేలకు మూడామడ బిళ్ళపెట్టుగా నదిచేవాడు

2024 నెల తక్కువైనా రాజు యింట పుట్టమన్నట్టు

2025 నెలబాలుడికి నూలుపోగు

2026 నేతగాని కేలరా కోతిపిల్ల

2027 నేతికుండ నేలబెట్టి వట్టికుండ పుట్టిమీద పెట్టేవాడు

2028 నేతిగూన చేతబూని నిచ్చెన యెక్కేవాడు

2029 నేతిబీరకాయ సామ్యము

2030 నేను పుట్టకపోతే నీకు పెండ్లాము లేకపోను, అంటే, నీను పుట్టకపోతే మీఅమ్మకూతురు పెండ్లాడి వుందునన్నాడట

2031 నేలవిడిచి సాము చేసినట్లు

నొ

2032 నొచ్చిపోయినవాడా నువ్వులు చల్లుము అన్నట్లు

2033 నొయ్యకుండా చేస్తే కోయకుండా పండును

2034 నొసట వ్రాసిన వ్రాలు తప్పదు

2035 నొసలు బత్తుడు నోరు తోడేలు

2036 నొసటన్ వ్రాసిన వ్రాలుకన్నగలదా నూరేండ్లు చింతించినన్