లోకోక్తి ముక్తావళి/సామెతలు-నో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నో

2037 నోటికి చేతికి అడ్డులేదు

2038 నోటికి చేతికి యెంగిలిలేదు

2039 నోటిముత్యాలు పోతవా

2040 నోట్లో ఆవగింజ దాగదు

2041 నోటికివట్టం గంజికి పెడమంట

2042 నోరూంబాళపుపండు, చెయ్యి బలుసుముల్లు

2043 నోరుగలిగితే బ్రతుకువాడు

2044 నోరుంటే పోరుగెలుస్తాడు

2045 నోరుకొవ్వి నీళ్లుకారడం

2046 నోరు మంచిదైతే వూరుమంచి

2047 నోదున్న తలగాచు

2048 నోరు మాట్లాడుతూవుంటే నొసలు వెక్కిస్తుంటుంది

2049 నోరుమూస్తేమూగ నోరు తెరిస్తే రాగ

2050 న్యాయం తప్పనివాని కాచార్య కటాక్షమెందుకు

2051 నేర్చుకున్నదాకా బ్రహ్మవిద్య నేర్చుకున్న తరువాత కోతివిద్య

2052 నిమ్మకర్మ నిత్యకర్మ నమ్మకర్మ సష్టకర్మ

2053 నిరక్షర కుక్షి విరూపాక్ష దీక్షితులు వారి కిరవైయొక్క భక్ష్యమొక లక్ష్యమా అన్నట్లు

2054 నేరేండ్లు పండితే నేలలు పండును

2055 నవాబు పాతుల్లాఖాన్ అవ్వనాటిది

2056 నిజం నిలకడమీద తెలుస్తుంది 2057 నీళ్లుమూట కట్టినట్లు

2058 నమ్మితిరామన్నా అంటే నాఅంతవాణ్ణీ చేస్తానన్నట్లు

2059 నానారుచులుపారి నాలికమీద కొరివిపెట్టుకున్నట్లున్నది

2060 నీవత్తుపణం పాడుగాను నావొతుపణం కుప్పలు కుప్పలు పెట్టు

2061 నీళ్ళలో నిమ్మలు బ్రతికినవి అడవిలో తుమ్మలు బ్రతికినవి

2062 నేడుచస్తే రేపటికి రెండు

2063 నాభిలో పుట్టిన పురుగువంటివాడు

2064 నూటికిపొడిచి శెలగో అనేవాడు

2065 పంచ పాండవులు మంచంకోళ్లులా ముగ్గురంటారేగాని యిద్దరే అని ఒకటిచూపి సున్న చుట్టినట్లు

2066 పంచశుభం పంచాశుభం

2067 పంచాంగం పోతే నక్షత్రాలు పొతవా

2068 పంచాగ్ని మధ్యం

2069 పంజుకేలరా పత్తిధర

2070 పంట పెంటలోనేవున్నది, వాడి వూరిలోనే వున్నది

2071 పండుగ తొల్నాడు గుడ్డలకరువు, పండగనాడు అన్నం కరువు, పండగమర్నాడు మజ్జిగకరువు

2072 పండగనాడు పాతమొడుడేనా అంటే, దొరక్క పోతే యేంజేస్తాము అందిట