Jump to content

లోకోక్తి ముక్తావళి/సామెతలు-కూ

వికీసోర్స్ నుండి

కూ

972 కూచమ్మ కూడబెడితే మాచమ్మ మాయంచేసినది

973 కూటికి పేదయైతే కులానికి పేదా

974 కూటికివ్వలేని వేటకాని పోటెందుకు

975 కూడు ఉడికిన వెనుక పొయ్యిమండుతుంది కులంచెడిన వెనుక బుద్ధివస్తుంది

976 కూడుగుడ్డ అడుగకపోతే బిడ్డను సాకింట్లు సాకుతాను

977 కూడైతే కద్దుగాని కులస్థులకు వెరచి వచ్చినాను

978 కూత కరణము

979 కూతలార్భాటమేగాని కుప్పలో గింజలేదు

980 కూతురని కుంచెడిస్తే తల్లి అని కంచెడు పెట్టినది

981 కూతురికి మంగళవారం, శుక్రవారం, కోడలుకు దియ్యలు దియ్యలు

982 కూతుళ్ళను గన్నమ్మకు కుర్చీపీటలు, కొడుకులగన్నమ్మకు గోడపంచలు

983 కూటికి గింజలేక కొరముట్లులేక సేద్యముచేసేది చెడ్డరోత

984 కూర్చుండి తింటూవుంటే కొండైనా సమసిపోతుంది

985 కూర్చుండి పడుకోవలెను

986 కూర్చుండి లేవలేడుగాని ఎగసితాటికాయలుతన్నుతాడాట

987 కూర్చుండి లేవలేడుగాని వంగుండి తీర్ధంవెళ్ళుతాడట

988 కూలికివచ్చి పాలికి మాట్లాడి నట్లు

989 కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరచినది

990 కృతఘ్నునికి చేసిన మేలు