రామ నీకు నామీద

వికీసోర్స్ నుండి

సింధు భైరవి రాగం - ఆది తాళం[మార్చు]

పల్లవి: రామ నీకు నామీద రాదటరా దయ ||

అనుపల్లవి:
వేమారు నే నిన్ను వేడిన లేదయా ||

చరణం 1:
కరి రాజు నీకేమి కానుక లిచ్చెరా
వర విభిషణుడే వరుస మెచ్చెరా ||

చరణం 2:
ద్రౌపది తానెంత ధర్మము జేసెరా
భు ప్రహ్లాదు డెంత పుణ్యము జేశెరా ||

చరణం 3:
వేసారి నిన్నే కోరి విన్న వించెనురా దాసు
శ్రీరామ కవి ధన్యుని జేయరా ||