Jump to content

రాఘవపాండవీయము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః

రాఘవపాండవీయము

సవ్యాఖ్యానము

ప్రథమాశ్వాసము

కథాప్రారంభము

ఆ.

వెలయు నఖిలభువనములలో నవారణ
నగరిపురమతల్లి నాఁ దనర్చి
రాజ్యలక్ష్మి మిగులఁ బ్రబల నయోధ్య నాఁ
రాజవినుతి గనిన రాజధాని.

1

రామాయణార్థము. అఖిలభువనములలోన్ = సకలజగత్తులలోపల, 'విష్టపం భువనం జగత్', అని యమరము. అవారణ = అనర్గళమైన, నగరిపు = ఇంద్రునియొక్క, రమ = సంపదకు - అవారణపదము రమకు విశేషణము. తల్లి = పోషించునది, నాన్ = అనఁగా - ఉ. 'శ్రీ యన గౌరి నాఁబరఁగు చెల్వ' యని సోమయాజి ప్రయోగము. తనర్చి = ప్రకాశించినదై - రాజ్యలక్ష్మి మిగులఁ బ్రబలఁగా, ఇది యత్యుక్తి. ఇందుకు లక్షణము చంద్రాలోకమందు, "అత్యుక్తిరద్భుతాతథ్యశౌర్యాచార్యాదివర్ణనమ్, త్వయి దాతరి రాజేంద్ర యాచకాః కల్పశాఖినః" అని. 'భువనములలో నవారణ' అనుదిక్కున సంధికి ఆంధ్రభాషాభూషణమందు, క. 'మానుగ విభక్తులందుం, బూనిన నురులులకు నచ్చు వోయినఁబోవు' నను లక్షణమువలన నుకారము లోపము. రమ తల్లి యనుదిక్కున, గీ. 'క్షమ నకారాంతరూపప్రకాశికంబు, లైన పుంలింగములు దక్క నన్నిటికిని, బరఁగ సంబంధషష్ఠిపైఁ బ్రథమ యగును, దంతికన్నులు రమపల్కు తరువుకొమ్మ.' అను లక్షణమువలన షష్ఠ్యర్థమందుఁ బ్రథమాంతరూపము. అయోధ్య నాన్ = అయోధ్య యనెడిపేరు గలదై, రాజవినుతి గనిన రాజధాని, వెలయున్ = సర్వోత్కృష్టమై వర్తించును. క. 'కృతిముఖమున దైవనమ, స్కృతి యొండె నభీష్టవస్తుకీర్తన మొండెన్, వితతాశీఃపద మొండెను, బ్రతిపాదింపంగ వలయు భద్రాపేక్షన్.' అను న్యాయమున వస్తునిర్దేశరూపమంగళము. క. 'శుభసుఖరుక్క్షయధనకన, కభయైశ్వర్యములఁ జేయుఁ గవులకుఁ గావ్య, ప్రభులకుఁ గృతులకు మొదల, న్మభజసనయరతగణాళి మల్లియరేచా.’ అని భీమునిఛందమందుఁ జెప్పి యున్నది గనుక నాదియందు నగణప్రయోగము వెలయు ననునది శుభపదము నకార మమృతబీజమును.

భారతార్థము. అఖిలభువనములోనన్, వారణనగరి = హస్తిపురము, పురమతల్లి = పురశ్రేష్ఠమైనది, నాన్ = అనఁగా. ని. “మతల్లికామచర్చికాప్రకాండముద్ఘతల్లజౌ ప్రశస్తవాచకాన్యమూని” అని అ. అవారణనగరిపురమతల్లి యనుదిక్కున, క. 'పొసఁగం బల్కెడునెడఁ బొ, ల్పెసఁగిన ప్రథమాంతములపయిం గదిసి కడుం, బసనారు కచటతపలను, గసడదవల్ ద్రోచివచ్చుఁ గవిజనమిశ్రా.' అని యాంధ్రభాషాభూషణమందును, క. 'ప్రథమాంతవిభక్తులపైఁ, గథితము లగుకచటతపలు గసడదవ లగుం, బృథివి నవి గజడదబ లగుఁ, బ్రథమపుసున్నలు గణాంతపదమున మీఁద' నని యనంతునిఛందమందును జెప్పినలక్షణమువలన, పకారమునకు వకారము రావలసినందుకుఁ దాతంభట్టుగారు కవిలోకచింతామణియందు. క. 'భిన్నపదప్రథమలపై, నున్న పకారంబు నత్వ మెందును వళులన్, ము న్నిజరూపము ప్రాసము, నన్నవరూపంబు దాల్చు నాళీకాక్షా.' అని విశేషవిధులుగాఁ జెప్పిరి. శా. 'ఆవాలుంగనుదోయి యా నగుమొగం బాగుబ్బపాలిండ్లపెం, పావేణీరుచి నూతనూవిలసనం బాయొప్పులేఁ జెప్పినన్, గైవారం బగుఁగాని యయ్యెడ శిరఃకంపంబుతోఁ గూడ నా, హా పుట్టింపదె పుష్పధన్వునకు నయ్యబ్జాక్షి నీక్షించినన్.' అని పిల్లలమఱ్ఱి వీరన్నగారిప్రయోగమును. ఉ. 'భూనుతకీర్తిబ్రాహ్మణుఁడు పుట్టఁగఁ దోడనె పుట్టు నుత్తమ, జ్ఞాన' మని యివి మొదలయిన కవిత్రయమువారి ప్రయోగములును వ్రాసినందువలనఁ బ్రథమాంతముమీఁది పకారమునకు వకారాదేశము ప్రాసస్థానమందు నిత్యముగా వచ్చును. యతిస్థానమం దుండరాదు. ఇతరత్ర యేదైనఁ జెప్పవచ్చునన్నట్టాయెను గనుక, వారణనగరిపురమతల్లి యని చెప్పవచ్చును, కాఁగానే, సూరపరాజుగా రీమీఁదటిపద్యమందును విముఖతసమదాటోపారిపంక్తిరథుఁ డని, రామాయణార్థమందుఁ జెప్పినారు. ప్రకృతము, తనర్చి = ప్రకాశించినదై, అయోధ్య = యుద్ధము చేయ శక్యము గానిది, యోద్ధు మశక్యా = అయోధ్యా యనునర్థమందు, “ఋహలోర్ణ్యత్ " అని సూత్రమున ణ్యత్ప్రత్యయాంతము. నిడుపులుడుపఁ దెనుఁ గగును. నాన్ = అనంగా, రాజ = దిగ్దేశరాజులచేతనైన, వినుతి గనిన, రాజధాని = సింహాసనస్థలమైనది, వెలయును, క్రియ.

క.

ఆపట్టణ మేలెడిపృథి, వీపాలుఁడు భ్రుకుటిమాత్రవిముఖితసమదా
టోపారిపంక్తిరథుఁ డు, ద్దీపించు నుదారనీతి ధృతరాష్ట్రుఁ డనన్.

2

భారత. భ్రుకుటిమాత్ర = బొమముడిచేతనే, “మాత్రం కార్త్స్న్యేవధారణే" అని అ. విముఖత = పరాఙ్ముఖములుగాఁ జేయఁబడిన, సూ. తత్కరోతీతిణ్యం తాత్కర్మణిక్త అనిక్తప్రత్యయాంతము, “సువర్ణదండైకసితాతపత్రిత జ్వలత్ప్రతాపావళి కీర్తిమండలః" అని నైషధము. సమదాటోప = గర్వాతిశయముతోఁ గూడిన, అరి = శత్రువులయొక్క, పంక్తి = శ్రేణులయొక్క, రథుఁడు = రథములుగలవాఁడు, విముఖితపదము రథవిశేషణము, ఉదారనీతి = ఘనమైన నీతి గలవాఁడు, "ఉదారో దాతృమహతోః” అని అ. ధృతరాష్ట్రుఁ డుద్దీపించును.

రామ. భ్రుకుటిమాత్రవిముఖితులయిన సమదాటోపారులుగలవాఁడు, పంక్తిరథుఁడు = దశరథుఁడు, “పంక్తిస్స్యాద్దేశమచ్ఛందోదశసంఖ్యావళీషుచ " అని విశ్వనిఘంటు. ఉదారనీతిచేత, ధృత = ధరింపఁబడిన, రాష్ట్రుఁడు = దేశము గలవాఁడు, అనన్= అనఁగా, ఉద్దీపించును, క్రియ.

చ.

తెలివి నతిప్రగల్భుఁ డసదృగ్బలుఁ డాతఁడు భీష్మచాపకౌ
శలమె సహాయమై యమరశత్రుల నేపడఁపన్ వలంతి యై
నిలుకడ నేలె విశ్వధరణిం దనమిత్త్రకులంబు వైభవో
జ్జ్వలతఁ దలిర్పఁ బౌరవసుసంతతి రాజుల కెల్ల హెచ్చుగన్.

3

రామ. అసదృగ్బలుఁడు = సరి లేనిబలము గలవాఁడు, “సదృక్షస్సదృశస్సదృ” క్కని అ. అతఁడు = దశరథుఁడు, భీష్మ = భయంకరమైన, చాపకౌశలమె = వింటియందలి నేర్పే - ధనుర్విద్య యనుట, సహాయమై, ఆమరశత్రులన్ = అసురులను, ఏపడఁపన్ = కొంచము పఱుచుటకయి, వలంతియై = సమర్థుఁడై, తనయొక్క, మిత్త్రకులంబు = సూర్యకులము, “ద్యుమణిస్తరణిర్మిత్ర" అని అ. వైభవములయొక్క, ఉజ్జ్వలతన్ = ఆధిక్యముచేత, తల్ప్రత్యయాంతము, తలిర్పన్ = ప్రకాశించునట్టుగా, పౌర=పట్టణమువారియొక్క, వసు = ధనములయొక్క, “వసురత్నే ధ౽నేపిచ” అని అ. సంతతి = సమూహము, రాజుల కెల్ల, హెచ్చుగ = అరుదగునట్లుగా, విశ్వధరణిన్ = సమస్తభూమిని, "విశ్వం కృత్స్నమశేష” మని అ. నిలుకడన్, వంశపారంపర్యముగా, ఏలెను, రాజులయొక్క సంపద యనుక్తసిద్ధము. ఇది కావ్యార్థాపత్త్యలంకారము, “ కైముత్యేనార్థసంసిద్ధిః కావ్యార్థాపత్తిరిష్యతే” అని.

భారత. తెలివిన్ = బుద్ధిచేత, అతిప్రగల్బుఁడు, అసదృగ్బలుఁడు, దృష్టిబలసహితుఁడు కానివాఁడు, ధృతరాష్ట్రుఁడు, భీష్మునియొక్క చాపకౌశలమే సహాయమై యమ రఁగా శత్రులను, ఏపడఁపన్ = మట్టు పెట్టుటకు, వలంతియై, మిత్రకులంబు = బంధువులయొక్క కులము, తలిర్ప, పౌరవ = పూరునిసంబంధమైన, సుసంతతి = సత్కులమందుఁ గల - "సంతతిర్గోత్రజననకులాని” అని అ. రాజుల కెల్లన్ = యయాతి భరతుఁడు మొదలయిన రాజులకందరికిని, హెచ్చుగ, ఏలెను, క్రియ.

క.

సుబలతనయగుణమహిమన్, బ్రబలి తన కుదారధర్మపాలనలీలన్
సొబ గొంది వన్నె దేఁగా, విబుధస్తుతుఁ డవ్విభుండు వెలసెన్ ధరణిన్.

4

భారత. సుబలతనయ = గాంధారి, గుణ = సౌశీల్యాదిగుణములయొక్క, మహిమన్ = మహిమచేత, క. 'వినుతద్ద్వితీయసప్తమి, కిని మఱిమూఁడవవిభక్తికిని నిడఁగానౌ, విన నింపుపుట్టుపట్టున, నను వెఱిఁగి ప్రబంధములఁ బయోంబుధిశయనా.' అని కవిలోకచింతామణియందు, ప్రబలి తనకు, దారధర్మ = స్మృత్యుక్తమైన భార్యాధర్మముయొక్క, పతివ్రతాచారముయొక్క యనుట, “ఆర్తార్తే ముదితే హృష్టా ప్రోషితేమలినాకృశా, మృతేమ్రియేత యా నారీ సాస్త్రీజ్జేయా పతివ్రతా” అని స్మృతి. "ధర్మఃపుణ్యేయమే న్యాయే స్వభావాచారయోః క్రతౌ" అని అ. పాలనలీలచేత, "ప్రదిత్సతస్స్వం పితురం ధమాత్మనో నిశమ్య భర్తారమగూఢసమ్మదా, అరుంధతీకీర్తిమసౌ నిరుంధతీ బబంధ పట్టేన దృశౌ ప్రతివ్రతా” అని బాలభారతమందును జెప్పియున్నది గనుక, సొబగొంది = ఒప్పినదై, వన్నె దేఁగా “అనుకూలాం విమలాంగీం కుశలాం కులజాం సుశీలసంపన్నామ్, పఞ్చలకారాంభార్యాం పురుషః పుణ్యాధికో లభతే" అని చెప్పుదురు. విబుధస్తుతుఁడు = పెద్దలచేత స్తోత్రము చేయఁబడినవాఁడు, “విబుధః పండితే దేవే” అని వి. అవ్విభుండు = ఆధృతరాష్ట్రుఁడు, వెలసెను.

రామ. సుబలత = బలిమి, బహువ్రీహిమీఁది తల్ప్రత్యయాంతము, నయగుణమహిమచేతఁ బ్రబలి యుదారధర్మపాలనలీలచేత, సొబగొంది తనకు వన్నె దేఁగా, ఈయర్థమున సుబలత యనునది కర్తృపదము. విబుధ = దేవతలచేత, స్తుతుఁడు, అవ్విభుండు = దశరథుండు, వెలసెను, అర్థాంతరము. సుబలతన్ = బలిమిచేతను, అయగుణ = భాగ్యలక్షణములయొక్క, “అయశ్శుభావహోవిధిః" అని అ. "గుణః ప్రధానేశబ్దాద్ మౌర్య్వాం సూదే వృకోదరే” అని వి. మహిమచేతఁ బ్రబలి, ఉదారధర్మపాలన = దుష్టనిగ్రహశిష్టానుగ్రహాదిధర్మములయొక్క సంరక్షణము, ణ్యాసశ్రంభోయుచ్చని యు చ్ప్రత్యయాంతము గనుకఁ బాలనాశబ్దము స్త్రీలింగము. ఉ. 'పాండవసైన్యసంఘపరిపాలన సేయు, నితండయంచుఁ గృష్ణుం డభిషేకసంపదుపశోభితుఁ జేయఁగ' నని సోమయాజియు స్త్రీలింగముగాఁ బ్రయోగించినాఁడు. ఇటువంటి శబ్దములు ల్యుట్ప్రత్యయాంతము లైనపుడు నపుంసకలింగములు నవును గనుక రెండులింగములును గలవని ముందును దెలిసికొనునది, వన్నె దేఁగా, ఈయర్థమున ధర్మపాలన యనునది కర్తృపదము, వెలసెను పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/49 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/50 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/51 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/52 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/53 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/54 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/55 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/56 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/57 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/58 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/59 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/60 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/61 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/62 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/63 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/64 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/65 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/66 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/67 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/68 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/69 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/70 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/71 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/72 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/73 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/74 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/75 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/76 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/77 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/78 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/79 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/80 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/81 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/82 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/83 పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/84