రాఘవపాండవీయము/చతుర్థాశ్వాసము
శ్రీరస్తు
శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః
రాఘవపాండవీయము
చతుర్థాశ్వాసము
| 1 |
| వ. | అవధరింపు మక్కాలంబున. | 2 |
| క. | తనయేలికసానికడకుఁ | 2 |
భారత. ఘనైశ్వర్యమును, రక్షి = రక్షించెడువాఁడు, తదనుజుఁడు = సుధేష్ణతమ్ముఁ డయిన కీచకుఁడు, ఏతెంచిన అప్పావని = ద్రౌపది, మిగులనడఁగి వర్తిలెన్ = అణఁకువతో నుండెను.
రామ. తనయేలికసానికడకున్ = సీతవద్దికి, ఘనైశ్వర్యముచేత, రక్షిత = రక్షింపఁబడిన, దనుజుఁడు= రాక్షసులు గలవాఁడు, అఘవర్తనుఁడు = పాపకర్ముఁ డైనరావణుఁ డని, ఏతెంచినన్ = రాఁగా, పావని = పవనపుత్రుఁడైన హనుమంతుఁడు, పతిహితవృత్తిన్ = నడఁగి వర్తిల్లెను - పతిహితవృత్తి యైనవానికిఁ దద్భార్య చిత్తశుద్ధిని శోధించెడుచోట నణఁగియుండుట ధర్మమే గనుక, రావణునియొక్కయు నాసీతయొక్కయు సంభాషణప్రకారము వినఁగోరి యెఱింగించుకొనక యుండెననుట.
రెంటికి సరి.
| వ. | అప్పుడు. | 3 |
| చ. | అతనుఁడు తత్సతిద్యుతిసహాయత నెంతయుఁ గ్రొవ్వి యవ్విని | 4 |
రామ. అతనుఁడు = మన్మథుఁడు, దేహసారముచేత, తర్జిత = జయింపఁబడిన, శతకోటిసింహములయొక్క బలముగలవాని, ఇంద్రజిద్గురున్ = రావణుని, గాసి చేసెను.
భారత. ఇంద్రుని, జిత్ = గెలిచిన, గురు = అధికమౌనట్టుగా, విజృంభిత = విస్తరించిన, వైభవము గలవాని, దేహసారతర్జితమైన, శతకోటిన్ = వజ్రాయుధముగలవాని, సింహబలున్ = కీచకుని, గాసిచేసెను, ఈపద్యమునం దర్థాంతరన్యాసము.
| సీ. | అట్లనంగుఁడు నొంప నద్దురాత్ముండు పా | |
| తే. | తనకు ననుకూల మయిన చందంబు నడపెఁ | 6 |
భారత. అట్లనంగుఁడు, అద్దురాత్ముండు = కీచకుఁడు, పాతివ్రత్యనిధిన్ = ద్రౌపతిని, దీని నెట్లైన, సాధించి = చేకూర్చి, నాదుప్రాణంబు రక్షింపుఁడని, ప్రాణశబ్దమునకు - ప్ర. ఉపసర్గము గనుక యతికి సత్వమే చెల్లెను, దూతికలను. స్వసన్ = అక్కయైన సుధేష్ణను, “భగినీ స్వసా” అని అ. సద్బుద్ధులు = మంచిబుద్ధులను, అప్ప = అక్క, ఆకెన్ = ఆయమను, వికారవర్తనలు సలిపెను.
రామ. అట్లనంగుఁడు, అద్దురాత్ముండు = రావణుఁడు, ఆసతీలలామన్ = సీతను, దూతికలను, సన్మాన = అభిమానముయొక్కయు, గాంభీర్య = గాంభీర్యగుణముయొక్కయు, హీనతచేత, ఎరఁగుచు ననుట. సద్బుద్ధులు = మంచిబుద్ధులును, అప్పనిన్ = ఆప్రయోజనమును, మనోజవికారవర్తనలు సలిపెను.
| వ. | అప్పు డప్పతివ్రతాతిలకంబు. | 7 |
| సీ. | ఓరిమూఢాత్మ దుశ్చారిత్ర నీత్రుళ్లు | |
| | బ్రతికెడు చందంబు భావింప వేవురు | |
| తే. | దత్పరాక్రమ మిదె నీమదంబు నడఁప | 8 |
రామ. ఓరి మూఢాత్మ, బ్రతికెడుచందంబు, భావింపన్ = విచారించుకొనుటకు, ఎఱుంగవని క్రిందటి కన్వయము. వేవురు = వేలసంఖ్యలైన, నాకీశులైనన్ = దేవేంద్రులైనఁగాని.
భారత. బ్రతికెడుచందంబు భావింపవు, నీవురు అయిదుగురు, నాకు, ఈశులైన గంధర్వవరులు, కడమ యేకార్ధము సులభము.
| వ. | అనుమాటలు విని వాఁ డనాదరదుర్విలాసంబున వెడనవ్వు నివ్వ | 9 |
రెంటికి సరి.
| ఉ. | బేలవు గావె నీవు వెఱపించెదు వీరిని వారిఁబోలె న | 10 |
రెంటికిని సరి.
| చ. | విను మిఁకఁ బెక్కు లేల యలివేణి నిజంబుగ నీకృపావలో | 11 |
భారత. వినుము, అలివేణి = ఓద్రౌపదీ! పలుకన్ = పలుకఁగా, పావని = పవిత్రురాలయిన, ఆసతి = ఆద్రౌపది, వాఁడు = కీచకుఁడు, బల్మిఁ బట్టునను శంక పొడమ, తనయాత్మలోపలను, ముందరిపద్యమున కన్వయము.
| క. | తతభీమభుజబలంబున | 12 |
రామ. భీమ = భయంకరమైన, అను = అనెడి, మతినిఁ బూని, దమితమన్యుత్వరతన్ = అణఁపఁబడిన రోషాతిశయముగలవాఁడౌటచేత, మరల్చెన్ = ఆతలంపును ద్రిప్పుకొనియెను.
భారత. భీమ = భీమునియొక్క, భుజబలంబున, అనుమతిన్ = అంగీకారమును, పూని, మితమైన, మన్యుత్వరతన్ = కోపము గలదాననౌటచేత, మరల్చెదన్ = కీచకుని దిరుగనంపెదను, ఇప్పు డంగీకరించి భీమునిచేత సంహరింపించెద ననుట.
| క. | అనివార్యమాణరోషం | 13 |
భారత. అని = ఈలాగు ద్రౌపది మనస్సులో ననుకొని, వార్యమాణరోషంబునన్ = కోప మణఁచుచును, నవ = నూతనమైన, యుక్తిధార్ష్ట్యము = మాటలదిట్టతనము, తలిర్పఁగా, మనసిజవశున్ = మన్మధవశుఁడైనవాని, మగుడించి, అతనిచేఁతకు, అడలెన్ = విచారపడెను.
రామ. అనివార్యమాణ = నివారింపశక్యముగాని, రోషంబుచేత, అవనిజ = సీత, కడమ సరి. రావణునిఁ దిట్టిపొమ్మనె ననుట.
| ఆ. | సూపకారవృత్తి దీపింప మారుతి | 14 |
రామ. సు = లెస్సైన, ఉపకారవృత్తి = ఉపకారవర్తనము, దీపింపన్ = ప్రకాశించునట్టుగా, మారుతియున్ = హనుమంతుఁడును, నవమైన, అసమ = అధికమైన, ఆర్తిన్ = పీడచేత, "ఆర్తిః పీడాధనుఃకోట్యోః” అని అ. చెన్నుదొరుఁగు = ఖిన్నురాలైన, అగ్గుణాభిరామన్ = సీతను, తద్దర్శనము చేసి.
| వ. | నిజవృత్తం బెల్ల నెఱింగించి తనరాకచందంబు వివరించి యి | 15 |
| శా. | కల్యాణీభవదీశ్వరాజ్ఞమహిమం గల్గె న్నిరాఘాటబా | 16 |
భారత. కల్యాణీభవత్ = శుభమవుచున్నట్టి, వనవాసమనెడి, ఉదన్వత్ = సముద్రముయొక్క, దాఁటుట యనెడి కల్యాణాతిశయంబు, కల్గెనని క్రిందటి కన్వయము. నాకు వాక్సంకోచనం బేల, త్వత్ = నీయొక్క, వర = శ్రేష్ఠమైన, శక్తి = సామర్థ్యము, కల్గ, అసాధ్య = సాధింపశక్యము గాని, అర్థముల్ = ప్రయోజనములు, లేవు.
రామ. కల్యాణీ-సంబుద్ధి. భవదీశ్వర = నీపతియైన రామునియొక్క, ఆజ్ఞమహిమచేత, నిరాఘాట = తడలేని, బాహుళ్యముచేత నత్యుద్ధతములైన జంతువులచేత ఘోరమైన, వన = ఉదకమునకు, "జీవనం భువనం వన” మ్మని అ. వాసస్థానమైన, ఉదన్వత్ = సముద్రముయొక్క, ఉల్లంఘనా = దాఁటుట యనెడి, కల్యాణ = శుభముయొక్క, అతిశయంబు నాకు, కల్గెనని యన్వయము. త్వద్వర = నీకుఁ బ్రియుఁడైనరామునియొక్క, కడమ సరి.
| క. | అతిశీఘ్రమె తెగఁజూడుము | 17 |
రామ. హతగుణున్ = చెడ్డగుణముగలవాని, ఈద్రోహిన్ = రావణుని, తెగజూడుము = చావంజూడుము, అతివ-సంబుద్ధి, భవత్ప్రియునియొక్క, బాహూద్ధతి = భుజబలము, దస్యుల = శత్రువులయొక్క, చేఁతలు = దుశ్చేష్టలను ఓర్చునదియే.
భారత. ఈపద్యమందును ద్రౌపది భీమునితో ననెడుమాట, ఈద్రోహిన్ = కీచకుని, తెగఁజూడుము = సంహరింపుము, భవత్ప్రియ = నీప్రియురాలైన, అతివ, బాహూద్ధతిచేత దురహంకారులైన, కడమ సరి.
| సీ. | ఇదియొండు నాపల్కు మదిఁ జేర్చు మాత్మబ | |
| | మనతోడఁగూడఁ గ్రమ్మఱ నగణ్యమహావ | |
| ఆ. | మఱువ కోయవార్యమానసతీవ్రతా | 18 |
భారత. ఆత్మ = నీయొక్క, బలముచేతనైన, ఖ్యాతిసంపదల్ = అధికప్రసిద్ధులు, తనరన్ = ప్రకాశము కాఁగా, ఈద్రోహిన్ = కీచకుని, తెగటార్చు = సంహరించునట్టి, నీయొక్క వార్త వినఁబడినప్పుడ, మనవిభుండు = ధర్మరాజు, మహత్ = ఘనములైన, వనీరాజీ = వనపంక్తులయం దగు, అసౌఖ్య = సౌఖ్యరహితమయిన, సంచారములకుఁ జనుట ధ్రువంబు, ఇది సమయంబు గావునన్ = మనము చేసికొన్న కట్టడ యిది గనుక, మఱువక = ఎచ్చరిక దప్పక, ఓయవార్యమానసతీవ్రతాధిక్య - సంబుద్ధి, వారింపశక్యము గాని మానసమందలితీవ్రతయొక్క యాధిక్యము గలవాఁడా, లోలోనన్ = రహస్యముగా, అన్యు = సింహబలునియొక్క, సంభ్రమాతిశయమును దునుమవలయుఁజుమ్ము.
రామ. మనవిభుండు = రాముఁడు, ఈవార్త = నీ విక్కడ నుండెడువార్త వినఁబడినప్పుడ, ఆత్మ = తనయొక్క, బల = సేనలయొక్క, ఖ్యాతిసంపదలు తనరవచ్చి, ఈద్రోహిన్ = రావణుని, తెగటార్చును, అని యన్వయము. అవనీరాజ్యముయొక్క సౌఖ్యసంచారములకు, సమయంబు గావున, పదునాలుగేండ్లు కావచ్చెఁ గనుక, మఱువక, ఓ, అవార్యమైనమానసమును, సతీవ్రత = పాతివ్రత్యముయొక్క, ఆధిక్యముగలదానా! మేరమీఱుతెగువకున్ = మరణసాహసమున కనుట. చొరక, మన్యు = శోకరోషములయొక్క, “మన్యుర్దైన్యే క్రతౌ క్రుధి” అని అ. సంభ్రమ = తీవ్రతయొక్క, “సమౌ సంవేగసంభ్రమౌ" అని అ. అతిశయము = ఆధిక్యమును, లోలోనఁ దునుమవలయునని యన్వయము.
| ఆ. | తగదు మిగుల నిచటఁ దడయఁగ సంకేతి | 19 |
రామ. తగదు, సంకేతితంబగుసమయంబు = రాముఁడు మితి పెట్టిన సమయము, తప్పకుండఁ దిరిగి నే నరిగెదను నీవు, ఆవెంబడిన్ = నేఁ జెప్పినప్రకారమునఁ దెగువకుఁ జొరక యనుట. తాల్మి సడలనీక నడువవలయును.
| ఆ. | అని పలికి భవద్వరాత్మకు నామాట | 20 |
భారత. అని పలికి, భవత్ = నీయొక్క, వరమైనయాత్మకు, నామాట యొప్పగుటకున్ = నేఁ జెప్పినమాట సమ్మతి యగునందులకు, ఒక, గుఱుతొసఁగుమనియెన్ = అడయాలము నిమ్మనియెను, తత్ఫతి = ఆభీమునిచేత, ప్రహితమైన = ఇవ్వఁబడిన, నమ్మికయున్ = నమ్మకమును, కరంబు = మిక్కిలిని, సతికి = ద్రౌపదికి, ఉబ్బు = సంతోషమును, మెఱయఁగా, ఇచ్చెనని క్రిందటి కన్వయము, గుఱుతిమ్మని ద్రౌపది యడిగినను భీముఁ డిచ్చిననమ్మిక ద్రౌపదికి సంతోషము చేసెననుట.
రామ. అనిపలికి, భవద్వర = నీపతియైన రామునియొక్క, ఆత్మక = మనమునకు, నామాట = నేఁ జెప్పినమాట, ఒప్పగుటకున్ = నమ్మిక యగుటకు, ఒకగుఱుతు నొసఁగుమనియెను, తత్పతి = ఆసీతాపతిచేత, ప్రహితమైన = అంపఁబడిన, నమ్మిక = నమ్మకముకొఱకైన, ఉంగరంబు = ముద్రికను, సతికిన్ = సీతకు, ఇచ్చెను. అనియెను, ఇచ్చెను, అను రెండుక్రియలకును హనుమంతుఁడే కర్త.
| క. | అనిలజుఁ డధికతమస్థితి | 21 |
రామ. అనిలజుఁడు = హనుమంతుఁడు, అధికతమ = మిక్కిలినధికమైన, స్థితిన్ = మర్యాదచేత, “మర్యాదాధారణాస్థితీ" అని అ. ఒనరెడి, తమిన్ = వేడుకచేత, రామునియొక్క దుఃఖ ముడుపుటకు, తత్సతీ = ఆసీతయొక్క, శిరోమణిని గొని, చనఁగని = పోవువాఁడై, ఆమితమైన, దర్ప = గర్వముచేత, గురు = ఘనమైన, సంభ్రమము గలవాఁడై, అరిగెనని మీఁదటిపద్యమునఁ గ్రియ.
భారత. అనిలజుఁడు = భీముఁడు, అధికమైన, తమః = అంధకారముయొక్క, స్థితిన్ = నిలుకడచేత, తమిన్ = రాత్రియందు, “రజనీ యామినీ తమీ” అని అ. రామ = ద్రౌపది యొక్క, తత్సతీశిరోమణిన్ = ఆపతివ్రతారత్నమైన ద్రౌపదిని, నియమిత = అణఁపఁబడిన, కడమ సరి.
| క. | పోరికిఁ దివిరి యరిగె బ, ల్బీరముచే వనవిఘాతలీల నెరపుచున్ | 22 |
భారత. బల్బీరముచేవన్ = అహంకారసారమును, అవిఘాతలీల నెరపుచును, కలంక = అపవాదమునకు, అద్వార = ప్రవేశహేతువు గాని, గతుండు = గమనము గలవాఁడు, అగుచు, గూఢగమనుఁడై యనుట, అపవాద మనఁగా భీమునిచేతఁ బాండవులకుఁ దిరుగ వనవాసప్రాప్తి యనెడి యపవాదము. అది ప్రకాశగమనమైన వచ్చును. వైరివధమందగు, రతిని = వేడుకను, పేర్చెన్ = పెంచెను.
రామ. బల్బీరముచే, వనవిఘాతలీల = అశోకవనభంగక్రియను, నెరపుచు, తనరఁగ, లంకా = లంకయొక్క, ద్వారమును, గతుం డగుచున్ = పొందినవాఁడై, కడమ సరి.
| వ. | అంత. | 23 |
| ఉత్సాహ. | తమముచే నొకించుకయును దలము గానమి న్నితాం | 24 |
రామ. తమముచేన్ = అజ్ఞానముచేత, తలము గానమిన్ = స్వరూపమును దెలియమిచేత, నిజాంగ = తమశరీరములయొక్క, నాశనము ఫలముగాఁగల, దర్భ = గర్వముచేతను, కోపముచేతను, కౢప్త = చేయఁబడిన, సంభ్రమముతోడన్ = సంభ్రమము గలవారై, చెనకఁ బరఁగు, సింహబలులన్ = సింహములయొక్క బలమువంటి బలము గలవారిని, సత్సమరమతులన్ = లెస్సయుద్ధమందుల బుద్ధిగలవారైనరాక్షసులను, చంపెను.
భారత. తమముచేన్ = చీఁకటిచేత, తలము గానమిన్ = స్త్రీపురుషులస్వరూపము గానరాకుండుటచేత, “అధస్స్వరూపయోరస్త్రీ తలం స్యా" త్తని అ. నిజాంగనా = ద్రౌపదియందుల, ఆశను = అపేక్షచేత, ఫల = నిష్ఫలమైన, దర్పకోపకౢప్త = మన్మథకృతమైన, సంభ్రమముతోడన్ = అధికభ్రమముతోడఁ గూడి, తన్నుఁ జెనకఁబరఁగు సింహబలుని, లసత్సమరము, అతులలీలచేత మెఱయ, చంపెను.
| వ. | తదనంతరంబ మఱియును. | 25 |
| ఆ. | శక్తిమత్త దనుజసంఘ మక్షాంత మై | 26 |
భారత. శక్తిమత్ = బలిమిగల, తదనుజసంఘము = కీచకు ననుజసమూహము, ఆక్షాంతమై = ఓర్పు లేనిదై, అతనికాంతకున్ = భీమునిస్త్రీ యైనద్రౌపదికి, కీడు చేసి, పవనపుత్త్రుభుజబలమునన్ = భీమునిబలముచేత, పొలిసెను.
రామ. శక్తి = బలిమిచేత, మత్త = మదించిన, దనుజ = రాక్షసులయొక్క, సంఘము = సమూహము, అంతమై = అక్షకుమారుఁడు కడగాఁగలదై, పవనపుత్త్రు = హనుమంతునియొక్క, భుజబలమునన్ = పరాక్రమముచేత, పొలిసెన్ = నొచ్చిపోయెను. అక్షకుమారసహితముగా నొచ్చెననుట, అంతక = యమునిసంబంధమైన, ఆగ్రహముయొక్క, ప్రేరణంబుచే = యమప్రేరణచేత, అతనికిన్ = ఆహనుమంతునికి, కీడొనర్చుకడఁకఁ జేసి = కీడు చేసెద ననుయత్నము నడపుటచేత, పొలిసె నని యన్వయము.
| తే. | విబుధకంటకకీచకవిపినమునకు | 27 |
రామ. విబుధకంటక = రాక్షసు లనెడి, కీచకవిపినమునకున్ = వెదురుటడవులకు, "వేణవః కీచకాస్తే స్యుర్యే స్వనంత్యనిలోద్దతాః” అని అ. దావవహ్నిగా వాయుజుఁడు ప్రతాపమహిమను నెఱపెను, బుధోత్కరంబు = దేవసమూహమును, “జ్ఞాతృ చాంద్రిసురా బుధాః” అని వై. అన్యులకున్ = శత్రువులైన రాక్షసులకు, ఎఱుకపడకుండ లోలోనఁ బొగడెను, రావణభీతులు గనుక.
భారత. విబుధకంటక = సజ్జనద్వేషులైన, కీచకులనెడి, విపినమునకున్ = అడవికి, దావాగ్నిభంగిని నాత్మప్రతాపమహిమను నెఱపెను, వాయుజుఁడు, అన్యు లెఱుఁగకుండ, లోలోన = రహస్యముగా, నెఱపెను, పొగడెను బుధోత్కరంబు.
| తే. | తత్సహోదరసంప్రవర్తనము జరిగె | 28 |
భారత. తత్సహోదర = ఆభీమునితోఁబుట్టులైన ధర్మరాజాదులయొక్కయు, సంప్రవర్తనము = నడక, అప్పురములోనన్ = విరాటపట్టణమందు, గూఢమై = ప్రచ్ఛన్నమై, జరిగెను = నడచెను, అంతను, ఏఁడు = అజ్ఞాతవాససంవత్సరము, ముగిసివచ్చెను, దానన్ = ఆముగియుటవలన, వర = శ్రేష్ఠమైన, ఆజి = యుద్ధముచేతనైన, మోదకాలము = సంతోషకాలము, అనుచు, వాతాత్మజుండు = భీముఁడు, సంతసమందెను, అజ్ఞాతవాస సంవత్సరము ముగిసెఁ గనుక విజృంభించి యుద్ధమందు శత్రుసంహారము చేసి రాజ్యము చేకొనవచ్చునని సంతోషపడె ననుట.
రామ. తత్ = ఆహనుమంతునియొక్క, సహః = బలిమివల్లనైన, “ద్రవిణం తరస్సహోబలశౌర్యాణి” అని అ. దర = భయముయొక్క, “దరో౽స్త్రియాం భయే శ్వభ్రే" అని అ. సంప్రవర్తనము = వృత్తాంతము, అప్పురములోను = లంకయందు, అగూఢమై, జరిగెను, అంత, దానవ = రాక్షసులయొక్క, రాజి = పంక్తులయొక్క, మోదకాలము = సంతోషకాలము, నేఁడు = ఈప్రొద్దు, ముగిసివచ్చెననుచు, వాతాత్మజుండు = హనుమంతుఁడు, సంతసమందెను = సకలరాక్షసులను నేఁడే సంహరించెద నని తలంచెను.
| సీ. | వ్యధఁ జేయుతత్సత్త్వవార్తాశ్రుతినిగ్లేశ | |
| తే. | ణాదతులితాంబునిధి మేఘనాదుఁ బనిచె | 29 |
రామ. తత్ = ఆహనుమంతునియొక్క, సత్త్వవార్తా = బలవృత్తాంతముయొక్క, శ్రుతిన్ = వినుటచేత, తత్సంగర = ఆహనుమంతునియుద్ధముయొక్క, భంగపరతన్ = చెఱుచుటకొఱ కనుట, ఉత్తమమైన, ద్రవిణసంపత్తి = బలసంపత్తికలవాఁడు, దుర్యోధనుఁడు = పోరశక్యము గానివాఁడు, పౌలస్త్యుండు = రావణుఁడు, తత్పురిలోపల, ధర్మజ = వింటివలనఁ బుట్టిన, భీమ = భయంకరములైన, సంక్రందనజయములు = ఇంద్రజయములయొక్క, ఆహవకృతి = యుద్ధక్రియయందు, సు = లెస్సైన, శర్మున్ = సుఖము గలవాని, అనాయాసముగ యుద్ధములు సేయువాని ననుట, బలముచేత, ఉపచిత = వృద్ధిఁ బొందింపఁబడిన, ధనుః ప్రణాదముచేతఁ దులితమైన, అంబునిధిన్ = సముద్రము గలవాని, మేఘనాదున్ = ఇంద్రజిత్తును, పనిచెను, అతఁడును = ఇంద్రజిత్తును, హరిన్ = హనుమంతుని, నుతమై, యుగ్రమునైన, ఆజిన్ = యుద్ధమందు, పట్టు కొనెను, తత్ = ఆహనుమంతునియొక్క, మహా, ఆగః = అపరాధములయొక్క, “ఆగోపరాధో మంతుశ్చ” అని అ. గణ = సమూహముయొక్క, గ్రహోద్భట = ప్రాప్త్యతిశయము, నడువన్ = ప్రవర్తింపఁగా, భటులు, అటు డాసి = హనుమంతునియొద్దకుఁ బోయి, నవ్విరి.
భారత. తత్ = ఆపాండవులయొక్క, సత్త్వ = సత్వముయొక్క, ఉనికియొక్క యనుట, వార్తా = వృత్తాంతముయొక్క, అశ్రుతి = వినకుండుటచేత, తత్సంగర = ఆపాండవప్రతిజ్ఞయొక్క, "ప్రతిజ్ఞాజిసంవిదాపత్సు సంగరః” అని అ. భంగ = చెఱుచుటయందుఁ గల, పరతత్ = తాత్పర్యముచేత, ఉత్తమద్రవిణ = శ్రేష్ఠద్రవ్యములయొక్క, “ద్రవిణం తు బలం ధన" మ్మని అ. సంపత్తిచేత, పౌలస్త్యుండు = కుబేరునివంటివాఁడు, దుర్యోధనుఁడు, తత్పురిలోపలన్ = మత్స్యనగరమందు, ధర్మజ, భీమ, సంక్రందనజ = అర్జునునియొక్కయు, యముల = నకులసహదేవులయొక్కయు, కలిమి = ఉండుటను, ఎంచి, ఆహవ = యుద్ధమందు, కృతిని = నేర్పరియైనవాని, సుశర్ముని = సుశర్మను, ధనుః = వింటియొక్క, ప్రణాద = ధ్వనిచేత, తులిత = సరిపోల్పఁబడిన, అంబునిధి = సముద్రునియొక్కయు, మేఘములయొక్కయు, నాద = ధ్వని గలవాని, సుశర్మకు విశేషణము, పనిచెను = పంపెను, అతఁడును = సుశర్మయు, హరిత్ = దిక్కులయందు, నుత = స్తోత్రము చేయఁబడిన, ఉగ్రాజిని = ఘనయుద్ధమందు, డాసి, అవ్విరటుక్ = ఆవిరాటరాజును, పట్టెను = పట్టుకొనెను, తత్ = ఆవిరటునియొక్క, మహా, గోగణ = గోసమూహముయొక్క, గ్రహ = పట్టుటచేతనైన, ఉద్భటతన్ = ఔద్ధత్యముచేత, నడువన్ = ప్రవర్తింపఁగా, పట్టెనని యన్వయము. తనసేన విరాటరాజుయొక్క గోసమూహమును బట్టుకపోఁగాఁ దాను విరటునిఁ బట్టుకొనెననుట.
| వ. | అంత. | 30 |
| ఉత్సాహ. | సర్వపూజ్య యైనిజాజ్ఞ జరుగు నాతనిం జటా | 31 |
భారత. సర్వపూజ్య = సకలజనపూజ్యమైన, ఐనిజ = యమపుత్త్రుఁడైన ధర్మరాజుయొక్క, ఆజ్ఞ, అతనిన్ = విరటుని, జటాయుర్విఘాతి = జటాసురవైరియయిన భీముఁడు, యమ = నకులసహదేవులయొక్క, రణ = యుద్దముయొక్క, క్రియయందుఁ గల, ఉత్కతా= ఉత్సాహమే, సహాయముగాఁ గలవాఁడై, తత్ = ఆవిరటునియొక్క, విపక్ష = శత్రువులకు, మృత్యువైనవాఁడు, భీమునికి విశేషణము, ఆలము = యుద్ధమును, శుష్మ = పరాక్రమముచేత, “ద్రవిణం తరస్సహోబలశౌర్యాణి స్థామ శుష్మం చ” అని అ. దీపితముగఁజేసి, ఆతని విడిపించెనని క్రింది కన్వయము.
| సీ. | మహితధర్మనియమ మాహాత్మ్యభూతన | |
| ఆ. | సత్యనల్పదర్ప మమరవిపక్షయూ | 32 |
రామ. మాహాత్మ్యముగల, భూతనయా = సీతయొక్క, అనుగ్రహముచేత, అభిగుప్త = రక్షింపఁబడిన, అంగముగలవాఁడౌచు, వాయుసుతుఁడు = హనుమంతుఁడు, ఇలకు = భూమికి, దొరకునట్లుగా, నిశ్చలజయవైభవోదయముగల, మహా, వాలహస్త = పుచ్ఛమందున్న, "వాలహస్తశ్చ వాలధిః” అని అ. చండహేతివిలాస = తీవ్రాగ్నిప్రకాశముచేత, సరభసగ్రస్త = శీఘ్రముగా దహింపఁబడిన, సమస్తవిద్వేషులయొక్క, ధామౌఘుఁ డగుచు = గృహనమూహములు గలవాఁడౌచు, “గృహదేహత్విట్ప్రభావా ధామాని” అని అ. దర్పము = తనగర్వము, అమరవిపక్షయూధపుని = రావణుని, పట్టిని = రావణుని కుమారుఁడైన యింద్రజిత్తునును, సరకుగొనక ప్రబలఁగా, లంకపెంపు నెల్ల డీల్వఱిచెనని యన్వయము.
భారత. మహితమైన, ధర్మ = యమునియొక్క, నియమ = కట్టడయొక్క, మాహాత్మ్యమువలన, భూత = పొందఁబడిన, “భూ ప్రాప్తౌ" అని ధాతువు. నయ = నీతియొక్క, అనుగ్రహ = ఆనుకూల్యముచేత, అభిగుప్త = డాఁపఁబడిన, అంగముగలవాఁడౌచు, వాయుసుతుఁడు = భీముఁడు, అంతనిలక = ఆవిరటుని విడిపించినమాత్రాననే నిలుపక, సంఘటనచేత, దొర = విరటునియొక్క, కలంకపెంపెల్ల = విచారాతిశయమునంతయఁను, డీల్పఱిచెన్ = శమింపఁజేసెను, వైభవోదయమునకు, మహత్ = అధికమైన, ఆవాల = పాదయిన - స్థాన మైనదనుట. “స్యాదాలవాలమావాల” మ్మని అ. హస్తమందున్న, చండహేతివిలాసముచేత, “రవేరర్చిశ్చ శస్త్రం చ వహ్నిజ్వాలా చ హేతయః” అని అ. సరభసమౌనట్లుగా, గ్రస్త = మ్రింగఁబడిన, విద్వేషిధామౌఘుఁ డగుచు = శత్రుప్రతాపసమూహము గలవాఁ డగుచు, విపక్షయూధపుని = సుశర్మను, పట్టి = పట్టుకొని, కలంక పెంపెల్ల డీల్పఱిచెనని క్రిందటి కన్వయము.
| క. | ఈగతి దక్షిణదిశయం, దాగోగ్రహదుష్టచేష్టు నధిపప్రమదై | 83 |
భారత. ఈగతిని = ఈప్రకారమున, దక్షిణదిశయందు, ఆగోగ్రహదుష్టచేష్టుని = ఆదక్షిణగోగ్రహణము చేసినసుశర్మను, అధిప = ఏలికయైన విరటునియొక్క, ప్రమదమునకు, ఐకాగారికుని = చోరుఁడయినవాని, "చోరైకాగారికస్తేనదస్యుతస్కరమోషకాః” అని అ. నిర్ధామునిఁగా = నిస్తేజస్కునిఁగా, గర్వమడంచి విడిచెను, గాడ్పుకొడుకు = భీముఁడు.
రామ. ఈగతి, దక్షిణదిశయందు = అన్నిదిక్కులను గపులు వెదకఁబోయినారు గనుక నందులో దక్షిణపుదిక్కునం దనుట, ఆగః = పాపమనెడి, గ్రహ = భూతావేశముచేత, దుష్టమైన చేష్టగలవాని, అధిప = రామునియొక్క, ప్రమదకు = సీతకు, “ప్రమదా భామినీ కాంతా" అని అ. ఐకాగారికుని చోరుఁడైనవాని, సీత నపహరించినవాని ననుట, నిర్ధామునిఁగా = గృహరహితునిఁగా, లంకను గాల్చెఁ గనుక, గర్వమడంచి విడిచెను, గాడ్పుకొడుకు = హనుమంతుఁడు.
| తే. | ఇట్లు రిపుభయంకరబలోదీర్ణుఁ డగుచు | 34 |
రామ. అవనిజ = సీతయొక్క, శుభప్రవృత్తిని = శుభవార్తచేత, పురికి = లంకకు, హర్ష మొదవంగన్ = తిరిగిపోఁగంటిఁగా నని సంతోషము రాఁగా, సప్రభుం డగుచు = ప్రభాసహితుఁడై, మరలెను = క్రియ.
భారత. నవమైన, నిజ = తనయొక్క, శుభప్రవృత్తి = శుభప్రవర్తనము, వంటలు గాక యుద్ధమును జేయుననుట వింత యనఁగా, సప్రభుం డగుచు = ప్రభువుతోఁ గూడుకొని, పురికి మరలెను.
| వ. | అట్టిసమయంబున. | 35 |
| క. | ఉత్తరగోగ్రహరిపుసుమ, హత్తరవార్తాప్రచార మప్పురిప్రజకున్ | 36 |
భారత. ఉత్తరగోగ్రహరిపు = ఉత్తరగోగ్రహణము చేసిన దుర్యోధనునియొక్క, వార్తాప్రచారము = వృత్తాంతము, అప్పురిప్రజకున్ = ఆవిరాటరాజు పట్టణములోనుండుజనులకు, దత్త = ఇయ్యఁబడిన, అమోదంబై = సంతోషరహితమై, బలవత్తరతాపమును, మదిని, వర్తిలఁజేసెను, మనసు కలఁగఁజేసె ననుట.
రామ. ఉ త్తరగ = ఉత్తరపుదిక్కుఁ గూర్చి పోవునట్టి, ఉగ్ర = భయంకరుఁడైన, హరిపు = వానరశ్రేష్ఠుఁడైన హనుమంతునియొక్క, సుమహత్తర= మిక్కిలిఁ దఱుచైన, వార్తాప్రచారము = ప్రసంగము, అప్పురిప్రజకున్ = లంకలోనివారికి, దత్తమైన, ఆమోదంబై = హర్షము గలదై, “ఆమోదో హర్షగంధయోః" అని అ. తాపమును, నివర్తిలఁజేసెను = పోఁజేసెను.
| ఉ. | ఆతతవేగయానమున నంతట నావిలసద్బలుండు గో | 37 |
రామ. ఆతతవేగ = అధికవేగము గల, యానమున = గమనము చత, ఆ, విలసద్భలుండు = లెస్సబలిమి గల హనుమంతుఁడు, గోత్రాతనయా = సీతయొక్క, “గోత్రా కుః పృథివీ పృథ్వీ" అని అ. అభిదర్శనవిధాన = సందర్శనవిధిచేతనైన, ముత్ = సంతోషముచేత, అంచిత = ఒప్పెడి, వృత్తియై = వర్తనగలవాఁడై, సముద్యోతిల = సముద్యోతించునట్టు, నృపాలసూనుని = రాముని, నుత్త = పోమొత్తఁబడిన, రుక్ = తాపముగలదై, ఉరు = ఘనమునై, స్ఫుటమైన సంభ్రమము గలచిత్తము గలవానిఁగాఁ జేయుచును బల్కెను.
భారత. ఆతతవేగ, యానమునన్ = రథముచేత, “యానం గతౌ వాహనేచ” అని వి. ఆవిల = మందమైన, సద్బలుండు = సత్త్వముగలవాఁడు, గోత్రాత = గవాధ్యక్షుఁడు - కీలారము పారుపత్తెము గలవాఁ డనుట, నయ = నీతిచేతనైన, అభిదర్శనవిధానము, నయ మనఁగా ద్వారపాలాదుల యవసరణము, ఉదంచితమైనవృత్తియై = మర్యాద గలదై, సముద్యోతిలక్ = శోభిల్లగను, ఏగి, కాంచి = పొడగని, నిర్ధూతతర = మిక్కిలి లేని, అఘు = దుఃఖము గలవాని, ఉత్తరుఁడనెడు విరాటపుత్త్రుని, గురుస్ఫుట = మిక్కిలిఁ బ్రకాశమైన, సంభ్రమ = ఆగ్రహముగల, “సమౌ సంవేగసంభ్రమా" అని అ. చిత్తము గలవానిఁగాఁ జేయుచును పల్కెను.
| సీ. | వ్యధ లెల్లఁ దీఱ దేవరమహామహిమ వి | |
| ఆ. | బాఱుతెంచితి నని ప్రత్యభిజ్ఞానస | 38 |
భారత. దేవరమహామహిమను విలోకింపఁగంటిని, భూమిజనాధిపతనయా-సంబుద్ధి. ఆకలంక మౌనట్లుగా, నున్న = పోమొత్తఁబడిన, దిశాంత = దిగంతములయందుఁ గల, ద్విషన్నికాయ = శత్రుసమూహము గలవాఁడా, ఇది స్తోత్రరూపముగా యుద్ధమునకుఁ బురిగొల్పుట, మనమొదవులు = ఆవులు, అలసమాన = మిక్కిలియుఁ బ్రకాశింపుచున్న, కురుబలయత్నములచేత నవరుద్ధంబు లగుచు, చనన్ = పోఁగా, నితాంత = మిక్కిలిని, ఆకులీభవత్ = తొట్రుపడుచున్న, ప్రాణవాయువులతో, వనరెడు = వనరుచున్న, నేను, ప్రత్యభిజ్ఞాన = గుఱుతులయొక్క, సమర్పణమునన్ = తెలుపుటచేత ననుట, నానావిధములైన, అరి = శత్రువులయొక్క, వృత్త = వర్తనలయొక్కయు, అభిధాన = పేళ్లయొక్కయు, కథలు నడపెను, తానెఱిఁగిన కొలఁదిని గురుబలముగా గుఱుతులు సెప్పెననుట.
రామ. దేవరయొక్క మహిమచేత, భూమిజను = సీతను, విలోకింపఁగంటిని = చూచితిని, "దృష్టా సీతేతి తత్వతః" అన్నాడు గనుకఁ గంటి ననెడిపదము ముందుగాఁ జెప్పినాఁడు, అధి = మనోవ్యధయందు, పతన = పాటు గలది, తన్మగ్న యనుట, ఆయక = ఆయమసిత, లంకను = లంకయందు, శాంతద్విషన్ని కాయ = అణఁపఁబడిన శత్రుపుంజము గలవాఁడా——సంబుద్ధి. మనము, వెసను = వేగిరముగ, ఒదవులాలసను = ఒదవెడికొఱకే, మానక, ఊరు, బల = బలవంతమైన, యత్నముచేత నవరుద్ధంబు లగుచుఁ జనని, తాంత = బడలినవై, ఆకులీభవత్ = వ్యాకులములౌచున్న, ప్రాణవాయువులతోడఁగూడ, వనరెడును = విలపించుచున్నది, మనము వత్తుముని బలవంతమునఁ బ్రాణమును బెట్టుకొని యున్నదనుట, ఏను = నేను, ప్రత్యభిజ్ఞాన = గుఱుతుయొక్క - ఆయనశిరోరత్నము యొక్క, అభిధాన = చెప్పెడునందుఁగల, కథలు = మాటలును, ఒకింతతడవు = ఆయనకు సమ్మత మయ్యెడుపర్యంతము, నడపెను.
| వ. | పదంపడి యిట్లనియె. | 39 |
రామ. మఱియు హనుమంతుఁ డనెడుమాట.
భారత. కీలారమువాఁడు మఱియు నుత్తరునితో ననెడుమాట.
| ఆ. | అలఘుమాననీయబల విడిపింపుమా | 40 |
భారత. అలఘుమాననీయబల-సంబుద్ధి. తదపహారిని = ఆయావుల నపహరించినవాని, సుయోధనుని = దుర్యోధనుని, వధించి యాయావులను విడిపింపుమా యని యన్వయము.
రామ. అలఘుమాన-సంబుద్ధి, మాయావులబలుమేటి = మాయావంతులలో శ్రేష్ఠుఁ డయినవాని, సుయోధ = మంచియోధులను, నుత్ = ఓడించెడునట్టి, మదముచేత విమూఢుఁడయినవాని, తదపహారిని = సీతాపహారియైన రావణుని, వధించి నీయబలను విడిపింపుము.
| ఆ. | విను మొకింతదడసినను గార్య మిఁకఁ దప్పుఁ | 41 |
రామ. వేగన్ = ఉదయాననే, కదలి, గర్వయుక్తులయినదనుజులకు, కర్ణభీష్మ = శ్రవణకఠోరమైన, ఇష్వాస = వింటియొక్క, గురురణ = అధికగుణధ్వనియొక్క, “రణో స్త్రీయుధినాధ్వనౌ” అని నానార్థరత్నమాల. అతిమహిమచేత, వాని, రావణుని, గెలుము.
భారత. వేగఁ గదలి = శీఘ్రముగాఁ బోయి, గర్వయుక్ = గర్వముతోఁ గూడిన, తదనుజ = దుశ్శాసనునియొక్కయు, కర్ణ, భీష్మ, ఇష్వానగురు = ద్రోణునియొక్కయు, రణాతిమహిమను మించి, వాని = దుర్యోధనుని, గెలుము.
| క. | అకట భవద్గురుసేనా | 42 |
భారత. అకట, భవద్గురు = నీతండ్రియు, సేనాదికము, సేన మొదలైన చతురంగబలములును, పురస్థితింబరఁగమిని = పట్టణములో లేకయుండుటచేత, అతఁడు = దుర్యోధనుఁడు, ఇమ్మెయిఁ జెనకి = ఈలాగు చెనకియు, తలఁకఁడు.
రామ. అకట, భవత్ = నీయొక్క, గురు = ఘనమైన, సేనాదికము, పురస్స్థితిం బరఁగమిని = ముందరఁ గనిపింపకుండుటచేత, ఇమ్మెయిఁ జెనకి = ఈలాగు ద్రోహముచేసియు.
| ఆ. | అని యతండు దీపితౌద్ధత్యభాషలు | 43 |
రామ. అని, అతఁడు = హనుమంతుఁడు, పలుక, తనబలంబుకొలఁది, కానకు = అడవికి, అధికమై తనర్ప, రాచపట్టి = రాముఁడు, ఆహవోత్సాహంబును బూనెను.
భారత. అతఁడు = గొల్లవాఁడు, పలుక, బలంబుకొలఁది గానక = బలాబలచింత లేక, రాచపట్టి = ఉత్తరుఁడు, పూనెను.
| సీ. | ఈరీతిఁ బగఱపై నేగ ససంభ్రమ | |
| తే. | నానృపాలకుమారకు నంతట రణ | 44 |
భారత. యంతను “యంతా సూతః క్షత్తా చ సారథిః” అని అ. అరయఁగా, తత్ = ఆయుత్తరునియొక్క, శుభ = శ్రేయస్సునందు, లగ్నమైనమతి గలవాఁడు, జిష్ణుఁడు దొరకెను, మహనీయమైన, శుద్ధాంత = అంతఃపురమందు, మంజు = మనోహరమైన, లాస్యప్రవర్తన = నృత్తగీతాదిప్రచారములకు, గురుభావ = గురు వౌటకు, అర్హమైనతను వికారముగలవాని = పేడివాని ననుట, ఆనాకీశసంతతిని = అర్జునుని, క్షత్తృ = సారథియొక్క, ఆచారమునను, కొని = చేకొని, ఉత్తరుఁడు జయయాత్రఁ గదలెను, అంతట, ఆనృపాలకుమారకుని = ఉత్తరుని, రిపుల = దుర్యోధనాదులయొక్క, బలశ్రేణి మెఱయఁగా, సాధ్వసము, సంశ్రయించెను = పొందెను.
రామ. అంతనరయన్ = లెస్సగా విచారింపఁగా, తత్ = ఆయాత్రకు, శుభలగ్నము దొరకెను, అతి, జిష్ణుఁడు = జయశీలుఁడు, ఆయుత్తరుఁడు = శ్రేష్ఠుఁడయిన రాముఁడు, యాత్రఁ గదలెను, మహనీయమైన, శుద్ధాంత = సీతయొక్క యనుట, ఇందుకుఁ బ్రయోగము. “కుందస్మితం కుటిలకుంతల మిందుచూడం ఛందశ్శిఖాభరణచారుపదారవిందం, కందర్పదర్పకలికాంకురకాలమేఘ మంతఃపురం పురరిపోరవలోకయామః" అని శ్రీ శంకరాచార్యులశ్లోకము. మంజుల మైనయాస్యప్రవర్తనచేత, గురు = వ్రేఁగైన, భావ = అభిప్రాయమునకు, అర్హ = తగిన, తనువికారము గలవాని, సీతావిరహమునఁ గృశత్వపాండుత్వములు గలవాని ననుట, క్షత్రాచారమునకు = యుద్ధమునకు, నానా = బహువిధమైన, కీశసంతతిఁ గొని = వానరసమూహమును జేర్చుకొని, “మర్కటో వానరః కీశః” అని అ. యాత్ర సలుపువాని, ఆనృపాలకుమారకుని రాముని, రణమునకు, సాధు = సమర్థమైన, అసమశక్తికతమున, ఒకవింతతేజము, అమరరిపు = రాక్షసులయొక్క, లయ = సంహారమందు, ఔద్ధత్యవంతమైన, బలశ్రేణి = సేనాసమూహము, మెఱయఁగా, తేజము సంశ్రయించెను.
| సీ. | అతనిసముద్వేగ తతచేష్టమాననా | |
| తే. | పూన్కితో వీరరసలక్ష్మి వొదల నడచె | 45 |
రామ. అతని, సముద్వేగ = సంతోషవేగముతో ఁ గూడునట్టుగా, తత, చేష్టమాన = చేష్టింపుచున్న, నానా, కీశసంతతి = వానరసమూహము, ఆరాచకొమరుని, నియంతఁ గాఁగన్ = నియామకునిఁగా, శివాఖ్యతరుని = మిక్కిలి శుభమైన నామధేయము గలవాని, నిజధర్మమును = మర్కటజాతిధర్మమును, చూపి, తత్ = ఆరఘునాథునియొక్క, పరిగ్రహము మెఱయ నడచెను, కడమ సులభము.
భారత. అతని = ఉత్తరునియొక్క, సముద్వేగ = భయముయొక్క, తత = ఘనమైన, చేష్ట, మానన్ = మానుటకై, ఆనాకీశసంతతి = ఇంద్రజుఁడు, రాచకొమరుని, యంతఁ గాఁగన్ = సారథినిగా, ఆయనఘవర్తనుని = ఉత్తరుని, శివాఖ్యతరు = శమీవృక్షమందు, నిహితమైన, నిజధర్మమును = గాండీవమును, చూపి, తత్పరిగ్రహము మెఱయన్ = ఆవిల్లు పుచ్చుకొని యనుట, నడచెను, కడమ సరి.
| ఆ. | రామవిభుఁడు జిష్ణుఁ డీమాడ్కిఁ జని యను | 46 |
భారత. రామవిభుఁడు = రామునివంటి విభవము గలవాఁడు, మంచికాంతి గలవాఁడు గాని, జిష్ణుఁడు = అర్జునుఁడు, అనుసృత - అనుసరింపఁబడిన, మనస్సుగల = మనస్సున కనుకూలమైనదనుట, రథహరిగతిని = రథాశ్వగమనముచేత, అలరుచు, డాసె = చేరెను.
రామ. జిష్ణుఁడు = జయశీలుఁడు, రామవిభుఁడు, అనుసృత = అనుసరింపఁబడిన, మనోరథము గల, హరి = వానరులయొక్క, గతి నలరుచు, త్వరితగతివిరోధియైన, వాహినీవర = సముద్రునియొక్క, విజృంభణము = ఉప్పొంగుట, కానఁబడఁగ డాసెను.
| సీ. | ఇట్లు సువ్యక్తిఁ బొల్పెసఁగునాతనిరాక | |
| ఆ. | శాలి యతఁడు యుద్ధకేళికాలం బని | 47 |
రామ. ఇట్లు, అతనిరాక, పొల్పుమీఱఁగ, లంకఁబుణ్యజనులు = లంకయందలి రాక్షసులు, అనెడుమాట, “యాతుధానః పుణ్యజనః" అని అ. సమయన్ = సమయుటకు, ఈనరుఁడు వచ్చుచున్నాఁడు, రక్షః = రాక్షసులయొక్క, అపహతి = సంహారమును, యుద్ధకేళికా = యుద్ధవిహారమునకు, ఆలంబని = ఆధారమైన, కడమ సులభము.
భారత. ఇట్లు, సువ్యక్తిఁబొ ల్పెసఁగు = వేషాంతరము లేక వ్యక్తముగాఁ బ్రకాశించెడి, అతని = అర్జునునియొక్క, రాక పొల్పు మీఱ, కలంక = విచారముచేత, పుణ్యజనులు = ద్రోణాదులు, అనెడుమాట, ఈనరుఁడు = అర్జునుఁడు, సమయరక్షా = అజ్ఞాతవాసరక్షణముయొక్క, యుద్ధకేళికి, కాలంబని = సమయమని, కడమ సరి.
| వ. | ఇత్తెఱంగున. | 48 |
| తే. | ముసగసలఁ బోరుగురుభీష్మముఖులసఖుల | 49 |
భారత. అధిపతి = దుర్యోధనుఁడు, సైన్యరక్ష = సేనారక్షకులలోపల, శ్రేష్ఠులైన, కడమ సరి, సులభము.
రామ. గురు = అధికమైన, భీష్మముఖులన్ = భయంకరముఖములు గలవారిని, రక్షఃశ్రేష్ఠులైన = రాక్షసవరులైన, అధిపతి = రావణుఁడు, కడమ సరి.
| వ. | ఆకర్ణించి వెండియుం బలువురు పలుదెఱంగుల గుజగుజ లాడుచందం | 50 |
రెంటికిని సరి.
| ఆ. | ఎన్నఁగానరాద్యపేక్షితార్థమ కాదె | 51 |
రామ. నరాది = నరుల భక్షించెడి రాక్షసులకు, అలరవలయు.
భారత. ఎన్నఁగానరు = విచారించుకొనలేరు, ఆదియందు = మనము వచ్చునపుడు, ఆపేక్షితార్థమ కాదె, నరునిరాక = ఆర్జునుఁడు వచ్చునది, కడమ రెంటికిని సులభము.
| తే. | అసమయాత్మోద్ధతిపిశాచియన్ను గొల్ప | |
| | పోఁగలాఁ డిదిగోఁ దనపోతరమునఁ | 52 |
భారత. అసమయమందయిన యాత్మోద్ధతి యనెడిపిశాచి, అన్నుగొల్ప = ఒడలెఱుఁగ రాకుండఁ జేయఁగా, కానకు = అడవికి, సభ్రాతృకముగఁ బోఁగలాఁడు.
రామ. అసమ = సరి లేని, ఆత్మోద్ధతిపిశాచి, పొడవడంగి = అడంగి యనుట, సభ్రాతృకముగ = తమ్మునితోఁగూడ, క్రమ్మఱంగానక = తిరిగిపోలేక, పోఁగలాఁడు.
| సీ. | అన నప్పు డెన్నిక నమరశత్రువిభీష | |
| ఆ. | మాఱ్కొనుట భరంబు మహితనయాత్యాగ | 53 |
రామ. అన నప్పుడు, అమరశత్రుని = రావణుని, విభీషణుఁడు, భీష్ముఁ డనుశంక = భయంకరుఁ డనెడివిచారమును, నులిమివైచి = మాని, పలుకును, మనకు, సమయము = చావము, అనుమాట లేదు, ఎంచవలదు = నిశ్చయము, నీవు, అజ్ఞాతవా = ఎఱుఁగనివాఁడవా, “జ్ఞాతా తువిదురో విందుః" అని అ. సముచితమగు = ఉచితమైన, ఆజికి, అఱమెదవు = యత్నముఁ జేసెదవు, మహితనయాత్యాగమునన్ = సీతను విడుచుటయందు, చలింపక = సీతను నిచ్చి యనుట, మన = మనయొక్క, మనికి = బ్రతుకు, జాడగాద.
భారత. అననప్పుడు, ఎన్నికనమరన్ = లెక్క పెట్టినవాఁడై, శత్రువిభీషణుఁడు భీష్ముఁడు, అను = పల్కును, సమయమన్మాట = అజ్ఞాతవాసమర్యాద యనెడుపలుకు, లేదు, అజ్ఞాతవాసమును, ఉచితమగు, నీతిని = నీతిచేత, నఱమెన్ = నడచెను, దవ = దావానలముభంగిని, ఆభీల = భయంకరమైన, రణతేజుఁడు = యుద్ధప్రతాపము గలవాఁడు, మహితమైన, నయ = నీతియొక్క, ఆత్యాగమునన్ = విడువకుండుటయందు, చలింపక, స్థితమైనవాఁడై, మనము, అనికి నిలువ = యుద్ధమునకు నిలుచునట్లు, ఆచరింపుము.
| చ. | తొలుతటనుండియు న్వలదు దుర్జయవైరము మాను మంచు ని | 54 |
ఉభయసమము.
| వ. | అనుటయు నతనిం గటాక్షించి. | 55 |
| తే. | ఇనతనూభవుఁ డధిపున కిచ్చకముగఁ | 56 |
భారత. ఇనతనూభవుఁడు = కర్ణుఁడు.
రామ. ఇనతనూభవుఁడు = ప్రభుపుత్త్రుఁ డింద్రజిత్తు, కడమ రెంటికి సరి.
| క. | ఒకనరునివిక్రమము మా, టికిఁ బొగడెద వింత కడుఁ గడిందిగమనయే | 57 |
రామ. ఒక, నరుని = మనుష్యునియొక్క.
భారత. ఒకనరుని = ఒకయర్జునునియొక్క, కడమ సరి.
| ఆ. | ఇట్టిమాటలాడునట్టి మాన్యులనిండ్ల | 58 |
రెండింటికి సరి.
| వ. | అనవుడు నతం డతని నధిక్షేపించి యధిపతి కి ట్లనియె. | 59 |
భారత. అతండు = భీష్ముఁడు.
రామ. అతండు = విభీషణుఁడు.
| ఆ. | ఇట్టిపడుచుమాట లెడదఁ గైకొనక నీ | 60 |
భారత. గురుకృపాదులయిన = ద్రోణకృపులు మొదలయిన, రాజనందనులన్ = ఏలికను సంతోషపఱచువారిని, ఆశ్రయింపు = వారు చెప్పినమాట వినుమనుట, కడమ సులభము.
| వ. | వార లిట్టియవివేకివచనంబులకు వశవర్తివై వర్తిల్లునీయపరాధంబునం గ్రోధించి వచ్చుచున్నవా రమ్మహానుభావులు గావరేనిఁ దత్తాదృగ్దివ్యబాణధనంజయప్రతాపంబున భవద్భలాంగంబులకుం గరంబు గీడ్పాటు వాటిల్లె నని తలంచెద నని పలికి వెండియుం బెక్కుఁదెఱంగుల బుద్ధి సెప్పి యప్పుడు. | 61 |
భారత. వారలు = ద్రోణకృపాదులు, క్రోధించి వచ్చుచున్నవారు = కోపము దెచ్చుకొంచున్నారనుట, తత్తాదృక్ = అలాగు ప్రసిద్ధమైన, దివ్యబాణ = పాశుపతాదిదివ్యాస్త్రములుగల, ధనంజయ = అర్జునునియొక్క, ప్రతాపంబున.
రామ. వారలు = రామలక్ష్మణులు, కావరేని = సహింపరేని, దివ్యబాణము లనెడి, ధనంజయ = అగ్నియొక్క, ప్రతాపంబునన్ = ఆధికమైన సెగచేత, కడమ సులభము.
| తే. | అతని బహుకర్ణపరుషవాక్యముల నెడసి | 62 |
రామ. అతని = రావణునియొక్క, బహు = బహుళములైన, కర్ణపరుష = కర్ణకఠోరములయిన, వాక్యములచేత, ఎడసి, ఉన్నత = ఘనమైన, నుత = స్తుతమైన, అచల = చలింపని, ఉత్సాహముతోడ, యుక్తున్ = కూడినవాని, ధర్మగురుని = కోదండదీక్షాగురువైనవాని, రఘువీరవరునిఁ జేరికొలిచి, తత్ = ఆరఘునాథునియొక్క, కృపచేతియాదరము, చెందన్ = తన్నుఁ బొందఁగా, అంచిత = ఒప్పుచున్న, ఆమోదము = సంతోషమును, ఒందెను.
భారత. అతని = దుర్యోధనుని, కర్ణునియొక్క పరుషవాక్యముల నెడసియున్న, తనుతా = లఘుత్వముచేత, చల = చలించిన, ఉత్సాహముతోఁ గూడినవాని, నిరఘు = నిష్కల్మషుని, ధర్మగురుని = ద్రోణుని, చేరి కొలిచి, తత్కృప = ఆకృపునియొక్క, ఆదరమును జెందన్ = ద్రోణాచార్యుని గొల్చి యాకృపుని యాదరమును జెందెడికొఱకు, అంచి = అంపి, తాన్ = తాను, మోదమొందెను.
| వ. | అంత. | 63 |
భారత. దుర్యోధనాదుల యాలోచనసమయమందు.
రామ. విభీషణుఁడు కొల్వవచ్చినతర్వాత.
| తే. | మృదుతఁ బని గామి గని రోసి పొడివె నంప | 64 |
రామ. గోత్రను, “గోత్రా కుః పృథివీ పృథ్వీ" అని అ. అరికట్టుకొని = అబలించుకొని, విడువని, వాహినులఱేనిక్ = సముద్రుని, పొదివెను.
భారత. ఆదిత్యకులరాజ = ఇంద్రునియొక్క, వరసుతుండు = అర్జునుఁడు, గోత్రను = గోసమూహమును, "ఇనిత్రకట్యచశ్చఖలగోరథేభ్యః, క్రమాదేతే స్యుస్సమూహార్థే, గవాం సమూహో గోత్రా” అని ప్రక్రియ. ఱేని = దుర్యోధనునియొక్క, గుండియ కలంగ, వాహినుల = సేనలను, అంపవానచేతఁ బొదివెను.
| వ. | అప్పుడు. | 65 |
| క. | అవి దితవిఘ్ననరవరా | 66 |
భారత. అవి = ఆసేనలు, దితవిఘ్న = ఖండింపఁబడిన విఘ్నముగల - వారింపరాని వనుట, నర = అర్జునునియొక్క, వరాస్త్రములచేత, విభగ్న = తునిగిన, అంగములయిన రథతురగాదులు కలవౌచును, రహిత = విడువఁబడిన, మహత్ = అధికమైన, గోనివహము గలవౌటచేత, తత్ = ఆయర్జునునియొక్క, ఉగ్రములయిన, కాండ = బాణములను, దృఢమైన సత్త్వమును, ద్వంద్వమందు బహువచనము, వెలయఁగా, ఆకులమైన గతిని జెందెను.
రామ. అవిదిత = ఎఱుఁగఁబడని, విఘ్నముగల, నరవర = రామునియొక్క, అస్త్రములచేత, విభగ్నాంగము లగుచు, తత్ = ఆసముద్రునియొక్క, ఉగ్ర = భయంకరమైన, కాండ = ఉదకమందున్న, "కాండో స్త్రీ దండబాణార్వవర్గావసరవారిషు” అని అ. దృఢములయిన, సత్త్వంబులు = జంతువులు, రహిత = విడువఁబడిన, మహత్ = ఘనమైన, ఆగోనివహతను = పాపసంఘము గలవౌటచేత, నాకుల = దేవకలయొక్క, గతిఁ జెందెను - దేవలోకమునకుఁ బోయె ననుట.
| వ. | తదనంతరంబ. | 67 |
| సీ. | మఱియు నుద్ధతచేష్టమానకురుబలాబ్ధి | |
| | హరివారణాధికపరిపూర్ణదిఙ్ముఖం | |
| తే. | భేదిల నతండు దనదైన బెట్టిదంపు | 68 |
రామ. మఱియును, ఉద్ధతచేష్ట, మానక, ఉరుబలముగల, అబ్ధి = సముద్రుఁడు, అసదృశమైన యాశ్చర్యమునకు, పద = స్థానమైన, అతిబహు = మిక్కిలిఁ దఱుచైన, లహరి = కరుళ్లుగల, వారి = ఉదకముయొక్క, “వార్వారీ ” అని అ. రణ = మ్రోఁతలయొక్క, “రవే రణః” అని అ. ఆధిక్యముచేతఁ బరిపూర్ణమైన దిఙ్ముఖములుగలది యగుచు, గురు = అధికమైన, భీష్మ = భయంకరములయిన, అహి = సర్పములును, మకర = మొసళ్లయొక్క సంతతులు మొదలు గాఁగఁ దనరారునట్టి, వారిసత్త్వములు = జలజంతువులు, పొలియన్ = మడియునట్టుగా, తత్ = ఆసముద్రునియొక్క, అంతర్గతములయిన, క్ష్మాభృత్ = మైనాకాదిపర్వతములయొక్క, అవయవములు భేదిల, అతండు = రాముఁడు, ఏపణఁచెను. అంత, నదీప్రభుండు = సముద్రుఁడు, కానుపించి యని ముందరిపద్యమున కన్వయము. కడమ సులభము.
భారత. ఉద్ధతమౌనట్టుగా, చేష్టమాన = వ్యాపించుచున్న, కురుబలాబ్ది = అబ్దివంటి కురుబలము, పదాతి = బంట్లచేతను, బహులములైన, హరి = గుఱ్ఱములచేతను, వారణ = ఏనుఁగులయొక్క, ఆధిక్యముచేతను బరిపూర్ణదిఙ్ముఖం బగుచు, గురు-భీష్మ-అహిమకరసంతతులు = ద్రోణభీష్మకర్ణులు మొదలుగా, వారియొక్క, క్ష్మాభృత్ = రాజులయొక్క, ఏపణఁచెను, అంత, అదీప్ర = దీపింపని, భా = కాంతి గలవాఁడు, భూవరుండని ముందరిపద్యమున కన్వయము. కడమ సరి.
| ఆ. | పురుషమూర్తితోడఁ బ్రోవైనదైన్యంబు | 69 |
భారత. పురుషమూర్తితోడఁ బ్రోవైన = పురుషాకృతియైన, దైన్యంబుపోలె = అతిఖిన్నుఁడై యనుట, భూవరుండు = దుర్యోధనుఁడు, అనీక = యుద్ధముచే, సాధ్యమొకటి లేకున్కిని, గుండె బెదరఁ బాఱెను.
రామ. పురుషమూర్తితోడ = పురుషాకారముతో, కానుపించి, సముద్రుఁ డనెడుమాట, భూవరుండ = సంబుద్ధి, నీకు నసాధ్య మొకటి లేకున్కిని, గుండె = తనగుండియ, బెదరఁ బాఱెను.
| వ. | దానం జేసి. | 70 |
| సీ. | ఇదె నీకు శరణు సొచ్చెద శాంతుఁడవు గమ్ము | |
| ఆ. | హరివిగాక నీవు నరమాత్రుఁడవె యని | 71 |
రామ. ఎదురులేరు, అపార్థమయిన దర్పముచేత, వారిదోషంబు = ఉదకదోషము, అఖండదయా-సంబుద్ధి. నేను సముద్రుండను నాయందు, కరుణనడవన్ = దయ ప్రవర్తిలఁగా, గట్టిపగఱను = క్రూరశత్రువులను, అడఁగించితి యే నేమి చెప్ప, అమోఘవాంఛితుఁడ నగుదును = సిద్ధసంకల్పుండ నగుదును. ఇంక నాకోరికలెల్ల సిద్ధించుననుట, అంతైన.
భారత. అఖండదయాసముద్రుండ - పార్థ - సంబుద్ధులు. అని, యంత = సారథి - ఉత్తరుఁడు, ప్రణుతి గావించిన, అమ్మహాత్ముఁడు = అర్జునుఁడు, ఆదరించెను, కడమ సరి సులభము.
| తే. | తదభిమతపద్ధతిని వారితరణలీల | 72 |
భారత. వారిత = వారింపఁబడిన, రణ = యుద్ధమందుఁగల, లీల = విలాసము, పెంపు మీఱఁగా, మున్నెట్లట్ల = మునుపటివలె, నిజావ్యాహతేచ్ఛచేత, యంతయై = సారథియై, హరి = గుఱ్ఱాలయొక్క, వితతిని నడపుచు, దక్షిణాభిముఖగమన మాచరించెను = ఉత్తరమునుండి దక్షిణమునకుఁ దిరిగెననుట.
రామ. తత్ = ఆసముద్రునియొక్క, అభిమతపద్ధతిని = సేతువు గట్టి యనుట, వారి = ఉదకములయొక్క, తరణ = దాఁటుటయందుఁగల, లీల, హరివితతిని = వానరసమూహమును, నియంతయై = నియామకుఁడై, నడపుచు, దక్షిణాభిముఖగమన మాచరించెను = లంకమీఁదికిఁ గదలెను.
| సీ. | సముచితసరణి ని ట్లమరవై రాటన | |
| తే. | వారినాప్తులఁ గడు నంత గారవించెఁ | 73 |
రామ. అమరవైర = దేవతలయందు వైరముగల రాక్షసులయొక్క, అటనగరిమను = సంచారాధిక్యమును, అశ్లాఘ్యంబుగాఁ గొని = లెక్క సేయక, లంక, నిరుక్తధీరతనందన్ = తల్లడిల్లఁగా, అభిద్యోతిత = ప్రకాశింపుచున్న, పాండు = తెల్లనైన, రాజు = చంద్రుఁడు, సుతుల = లెస్సపోలికగాఁ గల, ఆతతకీర్తివిభవము గలవాఁడు, తద్విభుండు = రాముఁడు, తీర్ణ = దాఁటఁబడిన, అతికృఛ్ర = మిక్కిలి ఘోరమైన, మహార్ణవము గలవాఁడు, గాను, విని = రాముఁడు సముద్రము దాఁటెనని విని యనుట, తత్పురీ = ఆలంకయొక్క, నాయకుఁడు = రావణుఁడు, అలఘుప్రగల్భవాక్కులచేతఁ బ్రకటితములైన స్వభావవర్తనలు గలవారై పేర్చునట్టి ప్రథితబలులను, ఆప్తులనుగా.
భారత. సముచితసరణిని, వైరాటనగరి = విరాటునిసంబంధమైన పత్తనమును, మనసునకు శ్లాఘ్యంబుగా, కలంక = ఎవ్వరు తెలిసినారో యనెడుభయముచేత, నిర్ముక్త = విడువఁబడిన, ధీరతను = ధైర్యముచేత, అందున్ = ఆపట్టణమందు, అనభిద్యోతిత = ప్రకాశింపని, ఆత్మసత్ప్రభావతను = తమయొక్క సత్ప్రభావము గలవా రౌటచేత, పరఁగుచు, పాండురాజసుతులు = ధర్మరాజాదులు, తద్విభుండు = ఆపట్టణమునకు రాజైన విరటుఁడు, తీర్ణ = తరింపఁబడిన, అతికృఛ = మహాపదలనెడి, అర్జవము గలవాఁడుగా, వినివారిత = మిక్కిలి నివారింపఁబడిన, రిపు = శత్రువులయొక్క, దర్పభారులైన = గర్వాతిశయము గలవారలైనను, భావము - ఇట్లు విరాటునిపట్టణము మనః ప్రియముగాఁ గైకొని నిష్కళంకమైన ధైర్యముతోడ నందుఁ బ్రకాశింపని ప్రభావము గలవారై యడంగియుండి పాండురాజసుతు లావిరటుఁడు మహాపదలను దరించునట్టు శత్రుదర్భమును హరించిరనుట, అట్లు హరింపఁగా, వారిని = ఆపాండవులను, నిజాస్థానమంటపమునన్ = తనకొల్వుకూటమునందు, ప్రగల్భవాక్కులచేత, ప్రకటిత = ప్రకాశింపఁ జేయఁబడిన, ఆత్మ = తమయొక్క, స్వభావవర్తనలు గలవారై, గారవించెను.
| వ. | ఇట్లు వివిధసంభావనాసంతోషితస్వాంతులం గావించి వారికిఁ దనకు | 74 |
రెంటికి సరి సులభము.
| క. | సమరాగమనస్ఫూర్తికి | 75 |
భారత. సమరాగ = సమానురాగముగల, మనస్స్ఫూర్తికి, నర = అర్జునునియొక్క, వరాత్మజుని = అభిమన్యునియొక్క, ప్రసంగమయి = ప్రసంగము రాఁగా, తనకన్యను = ఉత్తరను, అయయుక్తి = భాగ్యసంగతిచేత, “అయశ్శుభావహో విధిః" అని అ. మహితమైన, నయ = నీతిగలదాని, ఒసఁగ = ఈఁగ, అనుమతి దలిర్పఁగా, ముందటిపద్యములఁ గుళకము.
రామ. సమర = యుద్ధముయొక్క, ఆగమనస్ఫూర్తికి, నరవరాత్మజుని = రామునియొక్క, ప్రసంగమయి, అన్య = శత్రువైన, నయ = నీతిగల, నీతివిరుద్ధమయిన దనుట, యుక్తిచేత, మహితనయను = సీతను, ఒసఁగను = తిరుగ విడువను, అను = అనెడి, మతి = బుద్ధి, తనకుఁ దలిర్పఁగా నని యన్వయము. కడమ సరి.
| క. | తనదుహిత కార్యపథవ | 76 |
రామ. తనదు, హితకార్యపథవర్తను లయినవారును, సు = లెస్సైన, భద్ర = శుభమును, ఆనందమునుగలనవమై, రణోత్సవము = యుద్ధక్రీడ, నడపఁదగునని పలుకఁగా దృఢోత్సాహుఁ డయ్యెనని ముందరిపద్యమునఁ గ్రియ.
భారత. తనదుహితకు, ఆర్యపథవర్తను లగువారును = ఆపాండవులును, కని = తెలిసి, సుభద్రానందన = అభిమన్యునియొక్క, వరణోత్సవము = వివాహము, నడపఁ దగునని, పలుక = చెప్పినందువల్ల, కుళకము గనుకఁ దనకు ననుమతి దలిర్పంగానని క్రిందటిపద్యమునకు నన్వయము.
| తే. | తద్విధానంబునకు దృఢోత్సాహుఁ డయ్యెఁ | 77 |
భారత. తద్విధానంబునకున్ = వివాహక్రియకు, దృఢోత్సాహుఁ డయ్యెను, తత్పురీనాయకుఁడని క్రిందటిపద్యమునఁ గర్తృపదము, వారును = పాండవులును, మిత్రబంధుపరివారములయొక్క, తతి = సమూహమును, కూర్చి = పిలిపించి, తనయ = కుమారుఁడైన యభిమన్యునియొక్క, కల్యాణవిధిని, అయముతో = శుభముతో, చేసిరి.
రామ. తద్విధానంబునకున్, ఆయుద్ధక్రియకు, తనయొక్క, అకల్యాణవిధి = దురదృష్టముయొక్క, ప్రయత్నమునఁ జేసి దృఢోత్సాహుఁ డయ్యెను, కడమ సులభము.
| వ. | అంతఁ బ్రతిపక్షవిజయంబునకు నుచితసమయం బగుట భావించి. | 78 |
రెంటికి సరి.
| క. | అతులితతేజుఁడు వైవ, స్వతసంతతి రాజవరుఁడు చతురనయసమా | 79 |
రామ. వైవస్వతసంతతి = మనువంశమందుఁగల, రాజవరుఁడు = రాముఁడు, సమాహృత = కూర్పఁబడిన, ఘనతర = అత్యధికులైన, హరికుంజర = వానరశ్రేష్ఠులయొక్క, అంగవిస్ఫూర్తిచేత, శోభి = ఒప్పుచున్న, సైన్యముతోడ, విడియించెనని ముందరిపద్యమునఁ గ్రియ.
భారత. వైవస్వతసంతతి = ధర్మజుఁడు, హరి = గుఱ్ఱములయొక్కయు, కుంజర = గజములయొక్కయు, శతాంగ = రథములయొక్కయు, “శతాంగస్స్యందనో రథః” అని అ. విస్ఫూర్తిచేత, కడమ సమము.
| క. | నడచి యుపప్లావ్యపురం, బు డగ్గఱి వనప్రదేశముల బలచయముల్ | 80 |
భారత. నడచి = కదలి, ఉపప్లావ్యపురంబు డగ్గఱి.
| వ. | అమ్మహానుభావుం డప్పుడు. | 81 |
| క. | నీతిమయిఁ దనకు భూమిజ | 82 |
రామ. నీతిమయిన్ = నయమార్గమున, ఆతత = వ్యాపరించిన, పరివాదభర = అపవాదాతిశయమందు, నిరాతంక = భయము లేని, ఆత్మ గలవాఁడై, భూమిజను = సీతను, తిరుగవిడువక, ఆజికిన్ = యుద్ధమునకు, కౌతూహలియగు = వేడుకగల, విపక్షు = శత్రువైన రావణునియొక్క, గర్వమును వినియెను.
భారత. జనులచే, ఆతత = విస్తరింపఁబడిన, పరివాద, భూమిని దిరుగవిడువక, విపక్షు = దుర్యోధనునియొక్క, కడమ సమము.
| చ. | సదయతఁ జేసి హింసలకుఁ జాలక యింకను మంచిమాటఁ దే | 83 |
భారత. సంధివిధాన, చింతనను = చింతచేత, కదురు = పొందెడియనుట, చిరాభివర్ణ్యమైన శమగౌరవముచేతికీర్తి జగంబు నిండ, హరిని = కృష్ణుని, రాయబార మనిచెను.
రామ. చింతను, అంగదుని, రుచిరమైన యభివర్ణ్యమైన శమగౌరవముచేతికీర్తి = ఇటువంటి ద్రోహియందును దయదలఁచుచున్నాఁ డనెడుకీర్తి, హరివీరులలోన వరేణ్యుఁ డైనవాని, అనిచెను.
| తే. | అతఁడు నుచితగతిభ్రాజి యై చని ప్రభు | 84 |
రామ. ఆతఁడును = అంగదుఁడును, వృధను, మానక = విడువక, అరిపుర = లంకయందున్న, జనులు మెచ్చ, ఇట్టనునని ముందరిక్రియ.
భారత. అతఁడును = కృష్ణుఁడును, ప్రభుచరితదుర్ణయముచేత, వ్యధమాన = వ్యధ పడుచున్న, కరిపురమందలిజనులు మెచ్చ, కడమ సమము.
| ఉ. | సాధుకృతప్రవేశుఁ డయి సాహసవత్తరచిత్తశత్రుదు | 85 |
భారత. సాధు = సత్పురుషులచేత, కృతప్రవేశుఁడయి, సాహసవత్తర = మిక్కిలి నుద్ధతములైన, చిత్తశత్రువులు గలవాని, ఇంద్రజిత్ = ఇంద్రుని గెల్చిన, గురు = అధికమైన, మహ = ఉత్సవములచే నైన, ఉజ్జ్వలవైభవముచేత, గర్వితుని = గర్వించినవాని, బలోత్సేధ = బలౌన్నత్యముచేత, “ఉత్సేధశ్చోచ్ఛ్రయశ్చ సః” అని అ. సముద్ధతుని దుర్యోధనుని జూచి యి ట్లనును.
రామ. సాధు = లెస్సయౌనట్టుగా, కృతప్రవేశుఁడయి, సాహసవత్తర = మిక్కిలి సాహసవంతమైన, చిత్తముగల శత్రువులకు, దుర్యోధను = పోర శక్యము గానివాని, ఇంద్రజిద్గురుని= రావణుని, ఇట్లను, కడమ సులభము.
| తే. | క్షాంతిజయశోభిరాముఁ డనంతబలుఁడు | 86 |
రామ. క్షాంతిజయములచేత, శోభి = ఒప్పెడువాఁడు, రాముఁడు, ధర్మసూతి = ధర్మమునకుఁ గారణమైనవాఁడు.
భారత. క్షాంతిజ = శాంతివలనఁ బుట్టిన, యశః = కీర్తిచేత, అభిరాముఁడు, ధర్మసూతి = ధర్మజుఁడు, కడమ సమము.
| చ. | నియతముగాఁగ నీ విపుడు నిన్నును నీవిభవంబు నీమహా | 87 |
భారత. మాయచే నపహరించిన భూమిని మగుడ విడుము.
రామ. భూమిజను = సీతను, మగుడన్విడుము.
| క. | భీమార్జునబాహుబలో | 88 |
భీమ = భయంకరమైన, అర్జున = కార్తవీర్యార్జునునియొక్క, బాహుబలోద్ధామత = భుజబలిమి, నీ వెఱిఁగినదియ, ఆయనతో యుద్ధము చేసినవాఁడవు గనుక, తజ్జయ = ఆకార్తవీర్యుని జయించుటచేత, శాలిన్ = ఒప్పెడు పరశురాముని, శౌర్యోన్నతిచేన్ = బలిమిచేత, మించిన = జయించిన, మేటి రఘుపతి, అతనిఁ జెనకి బ్రతికెదే.
భారత. భీమ = భీమునియొక్కయు, అర్జునునియొక్కయు, బాహుబలోద్దామత = బలిమి, నీ వెఱిఁగినదియు, ఘోషయాత్రాగోగ్రహణాదులయందు, తజ్జయ = ఆభీమార్జునులవల్ల నైనజయములచేత, శాలిన్ = ఒప్పెడువాని, తాన్ = తాను, మిక్కిలియు శౌర్యోన్నతిచేతను, మించిన మేటి = అధికుఁడైన మేటి, అతనిన్ = ధర్మరాజును, చెనకి బ్రతికెదే.
| చ. | విను పలుమాట లేల యలవేలుపుమూఁకలలోన నేనియున్ | 89 |
భారత. విను, అల్క చూపి = ఆగ్రహించి, నకులుఁడు, సమపేక్షిత = అపేక్షింపఁబడిన, సంగరకేలియై, యతిస్థానములకు “నపేక్షిత” యనుదిక్కున ఉపరిస్వరవర్ణయుక్తిను భయముఁ జెల్లునను లక్షణమువల్లఁ బకారమే యతిస్థానమై చెల్లెను.
రామ. విను, అల్కచూపు = ఆగ్రహదృష్టిని, ఇనకులుఁడు = రాముఁడు, ఇంచుకంత, అపేక్షితసంగరకేలియై నిగుడిచ్చిన నొకవీరుఁడు సైఁపగలాఁడె, సాయకవిజృంభణమును, అన్యులకున్ = ఇతరులకు, ఓర్వ నెట్లగును.
| క. | తదనుజునిబాహుబలసం | 90 |
రెంటికి సరి సులభము.
| ఉ. | నీవు మదుక్తనీతి మదినిల్పుము జీవితరక్షణార్థి వై | 91 |
రామ. రావణ-సంబుద్ధి, దుర్భావ = దుష్టస్వభావముయొక్క, విచేష్టమానక, ఉరు = అధికమైన, రాజకుమారక = రామునియొక్క, భీమ భయంకరమైన, కడమ సులభము.
| వ. | అనుపల్కు లాకర్ణించి యాదురాగ్రహగ్రస్తుండు తత్సమయసముద్దీ | 92 |
ఉభయసమము సులభము.
| క. | కొలఁది గన కెట్టివారుం | 93 |
రెంటికిని సమము సులభము.
| వ. | అని యాదూతకృత్యధౌరేయు నుపలక్షించి. | 94 |
| చ. | బలుములు సూపి యిట్టు నటుఁ బల్కితి వెఱ్ఱిహరీ పరోక్తముల్ | 95 |
భారత. హరీ = కృష్ణా, ఉర్వి = భూమియొక్క, పాలు గావలసి = రాజ్యభాగము గావలసి యనుట, మహిన్ = భూమిని, విడువను = ఇవ్వను.
రామ. వెఱ్ఱిహరీ = వెఱ్ఱికోతీ, ని న్నతఁడు, ఉర్విపాలు గావలసి = నేల పాలగుటకు, ఆడఁబంపెను, మహిజన్ = సీతను, మమున్ = మమును, మాఱ్కొనరమ్మనుము.
| ఉ. | కొండొకయొండుచోటువలెఁ గొంకక బింకముతో నరుండు భీ | 96 |
రామ. కొండొకయొండుచోటువలె, నరుండు = మనుష్యుఁడు, భీముండు = భయంకరుఁడని, ఎన్నెదు, రాక్షసులు నరభోజనులు గారా యనుట, కర్ణభీష్మ = శ్రవణకఠోరమైన, కోదండ = వింటియొక్క, గురుప్ తాపముచేత, వితత = విస్తారమైన, ప్రథనప్రథను = యుద్ధప్రసిద్ధిచేత, ఒప్పుచున్న.
| చ. | అనుటయు నమ్మదాంధునకు నాహరి యి ట్లను నాదుమాట నీ | 97 |
భారత. బల్లిదుని, ఆవిభు = ధర్మరాజును, చూచునంతకును నామాట యొప్పగునే యని సింహావలోకనము, కడమ సులభము.
రామ. ఆహరి = అంగదుఁడు, ఇట్లను, భీమ = భయంకరమైన, ధనంజయ = అగ్నిభంగిని, భాసురమైన, ఆవిభున్ = స్వస్వామిని.
| చ. | అమితచమూసమూర్జితుఁడ నంచు నహంకృతి మానవేమొ న | 98 |
రామ. మదవిభూతి = గర్వాతిశయమును, నీ వెఱుఁగ = నీ కెఱుకపడునట్టుగా, వాసరనాయకు లమరినవారు.
భారత. మదవిభూతిచేత నహంకృతిని మానవేమొ, నరనాయకు లావిభునొద్ద నమరినవారు = విరాటద్రుపదాదులును ధర్మరాజునకు సహాయమైనవా రనుట, నీ వెఱుఁగవా.
| వ. | అని మఱియు ననేకప్రకారంబులు నీతియు బలిమియు మహోద్ధతియు | 99 |
రెంటికిని సరి సులభము.
| తే. | అకట నెఱయ నీయాత్మనాశకునికర్ణ | 100 |
భారత. ఆశకుని కర్ణులయొక్క దౌష్ట్య మెట్టిదొ నామాట నీయాత్మను దగుల దనుచు, ఆదర్పదుష్టమానసుని = దుర్యోధనునియొక్క, గురుని = తండ్రిని ధృతరాష్ట్రుని, వారణోద్యుక్తిని = యుద్ధనివారణయత్నముచేత, పలికెను.
| తే. | నీదుపిన్నతమ్ముండు సునీతివిదురుఁ | 101 |
రామ. నీదుపిన్నతమ్ముండు = విభీషణుఁడు, సునీతివిదురుఁడు = లెస్సగా నీతి దెలిసినవాఁడు, "జ్ఞాతా తువిదురో విందుః” అని అ. తెలుపఁ బూనుటను = తెలియఁజెప్పుటయందు, క. 'వినుతద్ద్వితీయసప్తమి, కిని మఱి మూఁడవవిభక్తికిని నిడఁగా నౌ, విన నింపు పుట్టుపట్టున, నను వెఱిఁగి ప్రబంధములఁ బయోంబుధిశయనా' యని తాతంభట్టు. ఆసగలదె, ఓరి = తుచ్చుఁడా.
భారత. సునీతి = మంచినీతి గలవాఁడు, తెలుపఁబూనుట నోరిచాపలము.
| వ. | అతం డేతదుపద్రవప్రారంభకాలంబున. | 102 |
| క. | అన్న వటుమీఁద రాజువు, నిన్నౌఁ గా దనుట నాదునేరమి యైనం | 103 |
రెంటికిని సమము సులభము.
| తే. | అరయ నేరి కి ట్టట్టని యాడుకొనఁగ | 104 |
భారత. అరయ, ఇట్టట్టని యాడుకొనఁగ రానియట్టిది, చెప్పినం బాపము వచ్చు ననుట, శ్రీరామరామ = ఆశ్చర్యవాక్యము, నీకుమారునియొక్క దుశ్చేష్టితంబు, దానఁ జేటు, పొందున్ = వచ్చును.
రామ. శ్రీరామరామ = సీత, ఆడుకొనఁగరానియట్టిది = నిందింపరానిది, నీకు, మారుదుశ్చేష్టితంబు, కడమ సమము.
| ఉత్సాహ. | అనయవృత్తిఁ దనకుఁ దాన యహితుఁ డగుచు సర్పదం | 105 |
రామ. అనయవృత్తిని = అవివేకముచేత, తనకు, తాన = తానే, అహితుఁ డగుచున్ = ఆత్మద్రోహి యగుచు ననుట, సర్పదంశన మొనర్చుట = పాముఁ గఱపించుకొనుట, అన్నమునఁ దనకుఁదాన, విషంబు నిడుట = విషంబుఁ బెట్టికొనుట, సింధు = సముద్రమందు, పాతనముసేఁత = పడుట, సతికిఁ గీడు దలఁచుట = పరస్త్రీవాంఛయు, ఆయవగుణములు సరి యనుట, పావనికిన్ = పరమపతివ్రతకు.
భారత. అనయవృత్తిని = అధర్మవ్యాపారముచేత, తనకుఁ దాన యహితుఁ డగుచున్ = కారణము లేకయే శత్రుఁ డగుచు ననుట, సింధుపాతనముసేఁత = మడుగులో ద్రొబ్బుటను, సతికి = ద్రౌపదికి, కీడు దలఁచుటను, అరసిచూడు = తలంచుకొమ్ము, పావనికిన్ = భీమునికి, కడమ సులభము.
| క. | విను పెక్కు లేల విడువుము | 106 |
భారత. జనసమ్మతమతివి, దేహజనన = దేహమునఁ బుట్టుక గల, ఆమయమును = తెవులును, తెవులువంటివాని ననుట, దితకీర్తిని = ఖండితమైన కీర్తి గలవాని, తనయున్ = దుర్యోధనుని, విడువుము.
రామ. జనసమ్మత = సమ్మతమైన, మతిచేత, విదేహజను = సీతను, విడువుము, అనామయమును = సుస్థితిని, తన ఉదిత = ప్రసిద్ధమైన, కీర్తిని గులవర్తనమును బ్రజలను లక్ష్మిని బ్రోచు ప్రభునకు, ఇది = సీతను విడుచుట, సీతను విడిచినను మనమందఱమును సుఖమున నుందు మనుట.
| క. | మనకురువంశక్షోభము | 107 |
రామ. మనకు, ఉరు = అధికమైన, వంశక్షోభమును గనికని, ఒక్కనిరూఢమైన దురా గ్రహముగల బుద్ధిని = చలము ననుట, విడుచుట మేలొ, కులము, తెగుట = పోవుట, మేలో.
భారత. కురువంశక్షోభము గనికని, ఒక్కనిన్ = దుర్యోధనుని, రూఢ = పాదుకొన్న దురాగ్రహబుద్ధి గలవాని విడుచుట మేలొ కులము దెగుట మేలో, దుర్యోధనుని మాటలు వినక కులమును రక్షించుకొమ్మనుట.
| క. | అని మఱియుఁ దఱిమి చెప్పఁగ | 108 |
రెంటికి సమము.
| క. | అని పలికి వెండియును నా | 109 |
భారత. అని పలికి వెండియు, ఆతని = ధృతరాష్ట్రునియొక్క, పట్టిని = కొడుకైన దుర్యోధనునినే, ఉడికించుటకు నుద్దతమనస్కుఁ డగుచుఁ బలికెను.
రామ. అని పలికి, ఆతని = ఆరావణునియొక్క, పట్టిన చలమును సైఁపక పలికెను.
| క. | సుబలాత్మజమాయాద్యూ | 110 |
రామ. సుబలాత్మజ = బలవంతుఁడైన యింద్రజిత్తుయొక్క, మాయాదుల చేత, ఊత = క్రువ్వఁబడిన వ్యాపింపఁబడినయట్టి యనుట. “ఊయీ తంతుసంతానే” అనుధాతువు బలంబునన్ = బలిమిచేత, అమర సంపదలు గొని, అది = ఆప్రాబల్యము, ప్రబలాహవమందు భీమమైన, నరవర = రామునియొక్క, భుజోద్ధతిచేత నేఁడు, నిలువదు - క్రియ.
భారత. సుబలాత్మజ = శకునియొక్క, మాయచేతిద్యూతబలంబునన్ = బలముచేత, అమర, అది = ఆద్యూతము, ప్రబలమైన, ఆహవ = యుద్ధముగల, భీమునియొక్కయు, వరభుజోద్ధతి చేత, నిలువదు - క్రియ.
| చ. | ఘనముగ నాత్మ నాఁటితనకాంతపరాభవ మల్కఁ బెంపఁగా | 111 |
భారత. నాఁటి = ఆజూదమునాఁటియందైన, తనకాంత = ద్రౌపదియొక్క, పరాభవము, అల్కను, పెంపఁగాన్ = అధికము సేయఁగా, పేర్చు = ఉగ్రుఁడౌచున్న, ఆశుగ సంతతి = భీముఁడు, నీదు పెద్దతమ్ముని = దుశ్శాసనునియొక్క, నెత్తురు గ్రోలఁగాను, నిన్నుఁ గృతమైన, ఊరుభంగునిన్ = తొడలు విఱుగుట గలవానిఁగా, ఒనరింపఁగాను జూచెదు.
రామ. ఆత్మను, నాఁటి = గ్రుచ్చుకొని, తనకాంత = సీతయొక్క, పరాభవము = తిరస్కారముచేత నైన, అల్కను, పెంపఁగాన్ = తీర్చుకొనుటకొఱకు, పేర్చురాజమణి = రామునియొక్క, ఆశుగసంతతి = బాణపరంపర, ఉరు = అధికమయిన, భంగునిన్ = పరాజయము గలవానిఁగా, ఒనరింపఁగాను జూచెదు.
| చ. | అని నమితప్రతాపుఁ డగునాతనితమ్ముని మేఘనాదభం | 112 |
రామ. ఆతనితమ్ముని = లక్ష్మణునియొక్క, మేఘనాదభంజన = ఇంద్రజిత్తువధచేత, కృతి = కృతకృత్యులైన, దేవ = దేవతలచేత, దత్త = చేయఁబడిన, జయశబ్దములచేత వర్దిత మైన, సింహనాదము = అట్టహాసము, దుస్సహ = సహింపరాని, కర్ణనిపాత = శ్రవణప్రదేశముగల, సూచియై = సూదియై, వినఁబడును.
భారత. ఆతనితమ్ముని = భీమునితమ్ముఁడైన యర్జునునియొక్క, మేఘనాదముయొక్క భంజనమందు, కృతి = సమర్థమైన, దేవదత్తముయొక్క, జయశబ్ద = జయసమయశబ్దముచేత, వివర్ధితమైన సింహనాదము, దుస్సహమైన కర్ణునియొక్క, నిపాత = పాటును, సూచించునదియై వినఁబడును, అర్థాంతరము. ఆతని = భీమునియొక్క, తమ్ముని = తమ్ముఁ డైనయర్జునునియొక్క, మేఘనాద = మేఘగర్జనముయొక్క, భంజనమందు, కృతి = సమర్థమైన, దేవదత్తముయొక్క, జయశబ్ద = జయసమయశబ్దముచేత, వివర్ధిత = వృద్ధిఁ బొందింపఁబడిన, అర్జునుదేవదత్తధ్వనిచేత వృద్ధిఁ బొందింపఁబడిన దనుట, సింహనాదము = భీముని సింహనాదమని యన్వయము. దుస్సహ = దుస్సహుఁ డనెడు దుర్యోధనుని తమ్మునియొక్కయు, కర్ణ = కర్ణునియొక్కయు, నిపాతమును సూచించునదై, అర్జునుఁడు కర్ణుని సంహరించెడు సమయమందు భీముఁడు దుస్సహుని సంహరించి సింహనాదము చేయు ననుట.
| క. | వారలసంగర మిట్టిది, యీరీతిం దెలుప నేల యెఱుఁగంబడదే | 113 |
భారత. వారల = భీమార్జునులయొక్క, సంగరము = ప్రతిజ్ఞ, ఇట్టిది, అతిక్రూర మహా, కపటభవ = కపటజన్యమైన, దురోదరవేళను = ద్యూతసమయమందు, “పణే ద్యూతే దురోదరమ్" అని అ. ఎఱుఁగంబడదే = తెలియకుండెడినా.
| వ. | అని పలికి యప్పుడు దన్నుం జుట్టుముట్టుకొని పట్ట నిగ్రహించుటకు | 114 |
రెంటికి సరి సులభము.
| చ. | తనువున సర్వలోకచయదర్శనచిత్రమహత్త్వ మెంతయుం | 115 |
రామ. సర్వలోక = సకలజనులయొక్క, చయ = సమూహముయొక్క, దర్శన = దృష్టికి, చిత్రమైన మహత్త్వము తనర, విరాట్ = పక్షిరాజుయొక్క, ప్రకారముచేత, సముదంచితుఁడై = ఎగసినవాఁడై, నభోధ్వగామితా = ఆకాశగమనముచేత, నియోక్తృపాలికిన్ =రామునివద్దికి, ఏగెను.
భారత. తనువునన్ = దేహమునందు, సర్వలోకచయ = సమస్తజగత్తులయొక్కయు, దర్శన = చూపులచేత, చిత్రమైన మహత్త్వము, విరాట్ = విరాడ్విగ్రహముయొక్క, ప్రకారముచేత, సముదంచితుఁడై = ఒప్పెడువాఁడై, నభోధ్వగ = ఖేచరులచేత, అమితమానట్టుగా నభినుతమైన, నియోక్తృపాలికిన్ = ధర్మరాజుపాలికి, ఏగెను.
| వ. | ఏగి యన్నరేంద్రునకుఁ దనపోయివచ్చినకార్యంబుతెఱం గెఱింగించి | 116 |
రెంటికి సరి సులభము.
| కవిరాజవిరాజితము. | తిరమువిపక్షుమదోద్ధతి నీవు దుదిం దెగఁ జాలవు గాని వెసన్ | 117 |
భారత. శాంతనవ = భీష్మునియొక్కయు.
రామ. గురుకృపన్ = అధికకృపచేత, తెగఁజాలవుగాని యని యన్వయము. శాంత = సరసములును, నవ = నవ్యము అనఁగా మనోహరములు నయిన, ఉక్తులను = మాటలచేత, కడమ యేకార్థము.
| వ. | అనిన విని మనకు నుచితం బైనవర్తనంబు నడపితి మిటమీఁద నతని | 118 |
రెంటికి సరి సులభము.
| తే. | తనకుదారసోదరభావమునను రణస | 119 |
రామ. తనకునుదారమైన, సోదరభావమునను = తమ్ముఁడువలెనే, భూనుతమైన, ఆజి = యుద్ధమందు, ధృష్ట = దిట్టయైన, ద్యుమ్నునిన్ = సత్త్వము గలవాని, అనలజాతు = అగ్నివలనఁ బుట్టినవాని, కాన, స్ఫుటముగా, నీలసమాఖ్యచేత మెఱయువానిన్ = నీలుని, సేనగావ, అభిషిక్తుం జేసి యని ముందరి కన్వయము.
భారత. దారసోదరభావమునన్ = బావతనముచేత, అనీలసమాఖ్యను = ధవళకీర్తిచేత, ఆజి = యుద్ధము గలవాని, ధృష్టద్యుమ్నుని, కడకు సరి.
| వ. | అభిషిక్తుం జేసి సంవిహితసకలసన్నాహుం డై. | 120 |
| ఆ. | అనికి నుగ్రమై మహారిపురాజిరా | 121 |
భారత. అనికిన్ = యుద్ధమునకు, మహారిపురాజి రాన్ = శత్రుసమూహము రాఁగా, అతఁడు = ధర్మజుఁడు, నడచెను.
రామ. అనికి, మహత్ = అధికమైన, అరిపుర = శత్రుపురమైన లంకయొక్క, అజిర = ప్రాంగణములయం దుండు, “అంగణం చత్వరాజిరే” అని అ. అనంత = బహుళములైన, వనచయంబులన్నియున్ = ఉద్యానవనాదులు, చిఱునుగ్గుగా, అతఁడు = రాముఁడు, నడచెను.
| ఆ. | తెగువ నిట్లు నడచి మిగులఁ జేరికలంక | 122 |
రామ. లంక, ముక్తధృతివిలాసముగన్ = తల్లడిల్లఁగా ననుట, మిగులఁజేరికను = అత్యంతసమీపమున, నడచి, దృఢములైన మనోరథములుగల, హరికుంజర = వానరశ్రేష్ఠుఁడైన సుగ్రీవునియొక్క, ఉగ్రబలమును, కొలిపి = పెరరేచి, పోరు నడపెను.
భారత. చేరి, కలంకముక్త =నిష్కళంకమైన, ధృతిచేత, విలాసముగన్ = ఒయ్యారముగా, దృఢమయిన మనస్సుగల రథహరికుంజరములచే నుగ్రమైన, బలము = సేనను, కడమ సమము.
| క. | అమ్మనుజేంద్రునిబలవర్గము మొదలినాఁడు భీష్మరక్షోర్జితద | 123 |
భారత. భీష్మునియొక్క రక్షచేత నూర్జితమైన దర్పముచేత, కవియు = ఎదిరించునట్టి, సుయోధనుతమ్ములన్ = దుశ్శాసనాదులను, చతురంగసైన్యతతులను జయించెను.
రామ. అమ్మనుజేంద్రుని = రామునియొక్క, బలవర్గము, భీష్మ = భయంకరులైన, రక్షస్సులచేత, ఆర్జిత = సంపాదింపఁబడిన, సుయోధ = సద్భటులచేత, నుతమ్ముల = స్తుతియింపఁబడిన, సైన్యతతులను జయించెను.
| సీ. | ఆనృపాలశ్రేష్ఠుఁ డవ్వేళనురుమాధ | |
| తే. | భాసి నుత్తమోజుఁ బరాసుఫణిశిఖండి | 124 |
రామ. ఆనృపాలశ్రేష్ఠుఁడు = రాముఁడు, అవ్వేళను = యుద్ధసమయమందు, రుమాధవ = సుగ్రీవునియొక్క, ప్రేమ = నెనరుచేత, కృతి = చేయఁబడిన, విజయ = గెలుపుయొక్క, ప్రకర్షము = అతిశయమును, ఆరయుచు, అంగద, శరభ, కేసరి, గజ, ఋషభ, శతబలి, సమీరణసుత = హనుమంతునియొక్కయు, ఆజికేళీ = యుద్ధవిలాసముయొక్క, మహత్త్వము = ఆధిక్యమును, ఈక్షించుచు, సంపాతి = సంపాతియొక్కయు, దస్రసుత = మైందద్వివిదులయొక్కయు, ఆచ్ఛభల్లరాజ = భల్లూకపతియైన జాంబవంతునియొక్కయు, “ఋక్షాచ్ఛభల్లభాలూకాః" అని అ. వేగదర్శియొక్కయు, తను = శరీరములయొక్క, దర్పంబు = బలిమిని, చూడ్కుల కొసఁగుచున్ = చూచుచును, ఉత్తమ = శ్రేష్ఠమైన, ఓజు = తేజస్సుగలవాని, పర = శత్రువులయొక్క, అను = ప్రాణములనెడి, ఫణి = సర్పములకు, శిఖండి = నెమలియైనవాని, సైన్యేశున్ = సేనాపతి యైననీలుని, కనుఁగొంచు, ద్రు = వృక్షములే, “పలాశీ ద్రుద్రుమాగమాః” అని అ. పదస్థానముగాఁ గల వానరులలోపల, ముఖ్యుల = శ్రేష్ఠులయొక్క, రణంబుఁ గనుచు సమ్మోదమందెను.
భారత. ఆనృపాలశ్రేష్ఠుఁడు = ధర్మరాజు, ఉరు = అధికమైన, మాధవ = కృష్ణునియొక్క, ప్రేమచేతఁ గృతమైన, విజయ = అర్జునునియొక్క, ప్రకర్షము = అతిశయమును, అంగదను = వేడుకచేత, అరయుచు, “అంగదనాథు మ్రింగినవృకావలి ద న్వెస ముట్టుకొన్న” యని సోమయాజుల ప్రయోగము. శరభ, కేసరి, గజ, ఋషభ, శతములభంగిని, బలి = బలముగల, సమీరణసుత = భీమునియొక్క, ఉగ్ర మౌనట్టుగా, సంపాతి = పాఱుచున్న, దస్రసుత = నకులసహదేవులయొక్క, అచ్ఛ = స్వచ్ఛములైన, భల్లరాజ = బాణశ్రేష్ఠములయొక్క, వేగ = వేగమును, దర్శితను = చూచువాఁడౌటచేత, దర్పంబు చూడ్కుల కొసఁగు, శూరతావిభాసి = శౌర్యముచేత నొప్పెడి, ఉత్తమోజుఁ డనెడుపాంచాలుని, పర = శత్రువులయొక్క, అసు = ప్రాణవాయువులకు, ఫణి = సర్పమైన, శిఖండిని, సైన్యేశున్ = ధృష్టద్యుమ్నుని కనుగొంచు, ద్రుపదముఖ్యుల ద్రుపదుఁడు మొదలైనవారియొక్క, రణంబు గనుచు సమ్మోదమందెను.
| శా. | క్షత్రాచారవిహారి యై విజయరక్షానిష్ఠఁ బెంపొందుని | 125 |
భారత. క్షత్త్ర = సారథియొక్క, ఆచారముచేత = సారథ్యముచేత ననుట, విహారియై, విజయ = అర్జునునియొక్క, విష్ణున్ = కృష్ణుని, హరియూథ = అశ్వసమూహమును, చోదకతను = త్రోలెడువాఁ డౌటచేత, కడమ సులభము.
రామ. క్షత్త్రాచార = క్షత్రియాచారముచేత, విజయరక్షా = జయసంపాదనమందుఁ గల, నిష్ఠను = ఆసక్తిచేత, విష్ణున్ = రాముని, హరియూథ = వానరకులమును, చోదకతను = పనిగొనువాఁ డౌటచేత, కడమ సరి.
| వ. | అంత. | 126 |
| సీ. | సింజినీనిర్ఘోషజితసముద్రధ్వని | |
| తే. | నాగభీషణబాణప్రయోగములను | 127 |
రామ. సింజినీనిర్ఘోష = గుణధ్వనిచేత, "మౌర్వీ జ్యా సింజినీ గుణః" అని అ. జితమైనసముద్రధ్వని గల, మేఘనాదుండు = ఇంద్రజిత్తు, సమిద్ధ = ప్రకాశింపుచున్న, శక్తిచేత, భీష్ముండు = భయంకరుఁడు, సందీప్తములయినప్పడు శౌర్యగుణము లనెడు మణులకు, వాహినీశుండు = సముద్రునివంటివాఁడు, నిజాహవదశ = స్వకీయయుద్ధావస్థగల, దివసాంత = రాత్రియందు, రచితమైన, నాగ = నాగరూపములైన, భీషణబాణప్రయోగములను, నాగపాశములచే ననుట, భీమ = ఘోరములైన, నరవర = రామునియొక్క, చేష్టలు, తదనుజు = లక్ష్మణునియొక్క, లసత్ప్రతాపంబు లొదుగువడఁగ, కట్టుపఱిచెను.
భారత. సింజినీనిర్ఘోషముచేత జితము లైనసముద్రధ్వనియు మేఘనాదములును గలవాఁడు, పృథు = మనములైన, శౌర్యగుణమణి = మణులవంటి కార్యగుణములు గలవాఁడు, శౌర్యగుణభూషితుం డనుట, వాహినీశుండు = సేనాపతి, భీష్ముండు, నిజాహవ = తనయుద్ధముయొక్క, దశదివసాంతర = పదిదివసములలోపల, చిత = సంపాదింపఁబడిన, తీవ్ర, విక్రమతను = విక్రమముగలవాఁ డౌటచేత, నాగ = సర్పములభంగిని, భీషణములైన బాణప్రయోగములచేత, భీమునియొక్కయు నరునియొక్కయు, చేష్టలు, తదనుజుల = నకులసహదేవులయొక్క, ఆజిని = యుద్ధమందు, పల్మఱుఁ గట్టుపఱిచెనని క్రిందటి కన్వయము. కుంటుపఱిచె ననుట.
| చ. | దొర ననుజాన్వితంబుగ సుదుర్దమదుర్దశఁ గుందఁజేసి యి | |
| | సరగున దాని మాన్పహరిచక్రముఁ బూని యెదిర్చె నంతనే | 128 |
భారత. హరి = కృష్ణుఁడు, చక్రముఁ బూని యెదిర్చెను, అంతనే = ఆప్పుడే, నర = అర్జునునియొక్క, అతియత్నగరిమను ప్రార్థనచే ననుట. మరలెను.
రామ. హరిచక్రము = వానరసమూహము, అరాతి = శత్రువైన ఇంద్రజిత్తుయొక్క, యత్నగరిమను = బాణప్రయోగాదియత్నములచేత, మరలెను = ఓర్వలేక వెనుక తీసెను. కడమ సులభము.
| వ. | అంత. | 129 |
| సీ. | అ ట్లవార్యప్రౌఢి నలరుపితామహు | |
| ఆ. | విశిఖవిసరనిబిడవిద్ధసమస్తమ | 130 |
రామ. పితామహు = బ్రహ్మయొక్క వరముయొక్క శక్తిచేతఁ బ్రబలెడి, దీవ్యత్ = ప్రకాశించుచున్న, ప్రతాపగుణములచేత, శాలి = ఒప్పుచున్న, విజయము గలవాఁడు, కోదండ మనెడి, ఘన = మేఘముయొక్క, నాదముయొక్క, సంపత్ = సమృద్ధిచేత, ఉల్లాసిత = సంతోషింపఁబడిన, సకలనిజచమూసంతతి యనెడి, శిఖండి = నెమళ్లు గలవాఁడు, ఆరచితమైన, సచ్ఛద్మ = కపటముతోఁ గూడిన, సంగ్రామప్రచారము గలవాఁ డగుచున్ - మేఘములలో నుండి యనుట. ఇద్ద = ప్రవృద్ధములునై, వివిధములైన, విశిఖ = బాణములయొక్క, విసర = సమూహములచేత, “సందోహవిసరవ్రజాః” అని అ. నిబిడ మౌనట్టుగా, విద్ధ = భేదింపఁబడిన, సమస్తమర్మతను = సకలమర్మస్థానములు గలవాఁడౌటను, చేసి = మర్మములు భేదించి యనుట. గురు = రావణునియొక్క, కడమ సులభము.
| క. | దీనతఁ దత్ప్రతిపక్షబ | 131 |
ఉభయసమము.
| ఉ. | అంతట నద్భుతంబు గరుడాగమనంబు నిరాకృతాహితా | 132 |
భారత. ఆద్భుతంబుగ, రుట్ = రోషముయొక్క, "ప్రతిఘారుట్క్రుధౌ స్త్రియా” మ్మని అ. ఆగమనంబు నిరాకృతమైన యహితులచేత నత్యంతము, సమార్జిత = సంపాదింపఁబడిన, ఊర్జితమైన జయాభ్యుదయము గలదై, కోపించి శత్రుజయాతిశయమును నిరాకరించె ననుట, భీష్మపాతముచేత, సంక్రాంత = సంక్రమించిన ఘనవ్యధను మఱపింపఁగాఁ బునర్మహాజియందుఁ గల, విక్రాంతికి = విక్రమమునకు, దినేశసుతాదులు = కర్ణాదులు, సంభ్రమించిరి అని ముందరివచనమునఁ గ్రియ. కడమ సులభము.
రామ. అద్భుతమయిన గరుడాగమనంబు, నిరాకృతాహితా = విడిపింపఁబడిన సర్పములు గలదౌటచేత, ఊర్జితజయాభ్యుదయంబయి = గెలుపునందలియుబ్బును రప్పించి యనుట. భీష్మ = భయంకరమైన, పాత = పాటుచేత, దినేశసుతాదులు = సుగ్రీవాదులు, కడమ సమము.
| వ. | చేరి పొడగాంచి ప్రస్తుతసమరసన్నాహసముచితప్రకారంబున సంభ్ర | 133 |
రెంటికి సరి సులభము.
| క. | గురురక్షోర్జితదర్ప, స్ఫురణముచే శత్రుసైన్యములు మార్కొనఁ జె | 134 |
రామ. గురు = ఆధికమైన, రక్షస్సులచేత, ఆర్జిత = సంపాదింపఁబడిన, దర్పస్ఫురణముచేత.
భారత. గురు = ద్రోణునియొక్క, రక్షచేత నూర్జితమైన, కడమ సరి.
| వ. | అప్పుడు. | 135 |
| క. | అత్యంతము నవనిసుతా | 136 |
భారత. అవనిసుత = నరకాసురునియొక్క, అపత్యతను = పుత్త్రత్వముచేత, పరఁగు శూరస్తుత్యుఁడు = భగదత్తుఁడు, అసమరోషముయొక్క వికృతిచేత ధూమ్రవర్ణములైన, అక్షుఁడు = కన్నులు గలవాఁడు, చరించెనని ముందరిపద్యమునఁ గ్రియ.
రామ. అవనిసుతాపతి = రామునియొక్క, అతను = అనల్పమైన, బలంబులోన, అసమమైన రోషవికృతి గలవాఁడు, ధూమ్రాక్షుఁడు, కడమ సరి.
| తే. | దళితహరికుంజరశతాంగములు ధరిత్రిఁ | 137 |
రామ. దళిత = భేదింపఁబడిన, హరికుంజర = వానరముఖ్యులయొక్క, శతములయొక్క యంగములచేత, యథామనః = మనసు నతిక్రమింపని, అవ్యయీభావసమాసము. రథగతిచేత, నిజ = తనయొక్క, ఆరూఢ = దృఢమైన, మదముయొక్క, వారణక్రియలకున్ = పోమొత్తుటలకు, నిలువలేక యపార్థబలులైన యోధులు తొలంగ, చరించెను.
భారత. హరికుంజరశతాంగములు = రథాదులచేత, నిజారూఢమైన, మదవారణమత్తేభముయొక్క, క్రియలు = యుద్ధక్రియలకు, పార్థబల = ధర్మరాజుసేనయందుఁ గల, యోధులు తొలంగ, యథామనోరథగతిన్ = యథేష్టవృత్తిచేత, చరించెను.
| వ. | అంత నంతయుం గనుంగొని. | 138 |
| క. | తమకమున మరుద్వరసుతుఁ, డమితవ్యధఁ జెదరు నిజబలాళి మగుడ దు | 139 |
భారత. మరుద్వర = ఇంద్రునియొక్క, “మరుతౌ పవనామరా” అని అ. సుతుఁడు = అర్జునుఁడు, దుర్దమ = అణఁపశక్యముగాని, రణజ = యుద్ధమువల్లఁ బుట్టిన, యశము గల భగదత్తునియొక్క, మహాశుండాలమునకు = సుప్రతీకమనెడి గజమునకు, ఎదిరించెను.
| తే. | తొలఁగ కెడ సొచ్చుమానవాదుల సుశర్మ | 140 |
రామ. మానవాదులన్ = మనుష్యుల భక్షించెడువారిని, సు = మిక్కిలియు, శర్మ = సుఖ మౌనట్టుగా - అనాయాసముగ ననుట. యోధులను = పోరెడివారిని, పాఱఁద్రోలి = పాఱఁదఱిమి, ఎదిరించెడు, ఆకపికే = ఆహనుమంతునికే, అతఁడు = ఆధూమాక్షుఁ డనెడు రావణుని మూలబలకర్త, తనును, అజిని, ఒప్పించి = అప్పగించి, మడిసెను.
భారత. మానవాదులన్ = మానములఁ బలికెడువారిని - పంతము లాడువారి ననుట, సుశర్మయోధులను = = సంసప్తకులను, ఆకపికేతను = అర్జునుని, అతఁడు = భగదత్తుఁడు, నొప్పించి, వాహనముతోడన్ = ఏనుఁగుతోఁగూడ, మడిసెను.
| వ. | మఱియును. | 141 |
| క. | బహురక్షోభయసేనలు, విహితాజిని ద్రెళ్ల నంత విలసిల్లె జగ | 142 |
భారత. బహురక్ష గలయుభయసేనలు, జగన్మహిత = జగత్ప్రసిద్ధమైన, ఆహవమందు, రుచిర = ప్రకాశింపుచున్న, క్షిప్ర = వేగవంతమైన, హస్తము గల, కోదండగురు = ద్రోణునియొక్క, తరః = బలిమియొక్క, స్ఫూర్తి విలసిల్లెను.
రామ. బహురక్షస్సులయొక్క, అభయ = భయరహితములైన, రుచి = వేడుకను, రక్షి= రక్షించెడి, ప్రహస్త = రావణునిసేనాపతి యైన ప్రహస్తునియొక్క, కోదండముచేత, గురుతరమైనస్ఫూర్తి విలసిల్లెను.
| సీ. | ఆమేటి తనదుసైన్యమును బద్మవ్యూహ | |
| | రోధించి బహుమహాయోధనవ్యాపార | |
| తే. | గెలువ నోపక మిక్కిలి నలఁగి యంత | 143 |
రామ. సైన్యమును = రాక్షససైన్యమును, పద్మవ్యూహభంగి = పద్మసమూహమువలె, చూపట్టంగ, పన్నిహతి = పాదప్రహారములచేతను, నుఱిచియాడుచున్న వీరకుంజరుఁడైన వాని, వీరకుంజరుండు గనుక సైన్యమును బద్మవ్యూహముంబలె నుఱుమాడెను. సు = లెస్సైన, భద్రసంతతిన్ = శుభపరంపరలుగలవాని, ధనంజయతనూజున్ = అగ్నిపుత్త్రుఁడైననీలుని, ఆమేటి = ప్రహస్తుఁడు, అవరోధించి యని యన్వయము. మహాయోధన = అధికయుద్ధముయొక్క, “యుద్ధమాయోధనం జన్య" మ్మని అ. అతని = నీలునియొక్క, ధర్మవిహీన = విల్లులేని, యుద్ధాతిశయముచేత, కరప్రహారమున ననుట, తను = తన్ను, తనసేనవారినిని జంపించెను, ప్రహస్తుఁడు నొచ్చెననుట.
భారత. ఆమేటి = ద్రోణుఁడు, పద్మవ్యూహభంగి, పన్ని = రక్షించి, అంతటనుండి యభిమన్యునకు విశేషణములు హతికర = నాశకరములైన, సుభద్రయొక్క, సంతతిన్ = కుమారుఁడైన యభిమన్యుని, మహాయోధులయొక్క శూరత ప్రాపుగా, ధర్మవిహీన = అధర్మమైన, అతనిన్ = అభిమన్యుని, ఆమేటి చంపించెను. కడమ సులభము.
| సీ. | అతిశౌర్యపరసుశర్మాకృష్టవిజయతఁ | |
| ఆ. | కోటి లేనినాదు కొమరున కిప్పాటు | 144 |
భారత. అతిశౌర్యపరుఁడైన సుశర్మచేత, ఆకృష్ట = వెడలఁదీయఁబడిన, విజయతఁ జేసి = ఆర్జునుఁడు గలవాఁడౌటచేత, అభిమన్యునకు విశేషణము. నానావిధములైన, పార్థసేనలు = పాండవసేనలు, రౌద్ర = రుద్రసంబంధమైన, వరముయొక్క యుల్లాసముచేత రాజితుఁడైనవాని, అక్షయధృతిన్ = అధికధైర్యము గలవాని, తీవ్రశక్తిచేత, నాకీశు = ఇంద్రునిఁ బోలినవాని, దృఢమైన రణమందగు, ఉత్సేకునిన్ = ఆధిక్యము గలవాని, సింధునాయకున్ = సైంధవుని, మించి, ఒదుగఁగా, ఆబలియుఁడు = అభిమన్యుఁడు, దుశ్శాసనతనుజ = దుశ్శాసనుకుమారుఁడైన లక్షణునియొక్క, గదాహతిచేతఁ ద్రుంగెను, నాదు, కొమరునకున్ = కుమారునికి, అనుచు, ఖండిత = ఖండింపఁబడిన, అరిపంక్తులయొక్క, కంధర = కంఠములు గలవాఁడు, జిష్ణుండు = అర్జునుఁడు, వేఁగెను.
రామ. అతిశౌర్యులైన, పర = కపులచేత, సుశర్మ = మిక్కిలి సుఖమౌనట్టుగా, ఆకృష్ణ = త్రిప్పఁబడిన, విజయతఁ జేసి, అప్రయాసముననే రాక్షససేనల గెలిచెననుట. నానావిధములైన, అపార్థసేనలు = విఱిగిన రాక్షససేనలు, రౌద్రమైన యుల్లాసముచేత, ఆక్షయధృతిచేత, సింధునాయకున్ = సముద్రునివంటివాని, తీవ్రశక్తి గలవాని, దృఢరణోత్సేకము గలవాని, ఆకీశు=వానరుఁడైన నీలుని, "వానరః కీశః" అని అ. ఒదుగన్ = సేన లొదుగఁగా, ఆబలియుఁడు = ప్రహస్తుఁడు త్రుంగెను, దుశ్శాసనతను = శిక్షింప శక్యముగానివాఁ డౌటచేతను, జగదాహతిని = జగత్సంహారముచేతను, ప్రతికోటి లేని, కొమరునకున్ = = ఒప్పిదమునకు, అనుచు, జిష్ణుండు = జయశీలుఁడు, పంక్తికంధరుండు = రావణుఁడు, వేఁగెను.
| వ. | ఇట్లు శోకసంత_ప్తమానసుం డగునతనిం గనుంగొని. | 145 |
రెంటికి సరి సులభము.
| ఉ. | ఊహ గలంగి యి ట్లడల నూరక యేటికి నాహవక్రియా | 146 |
రామ. నిషాదహేతు = ఖేదహేతువైన, వైదేహిన్ = సీతను, త్యజింపుము, కడమ సులభము.
భారత. దుర్మోహమును ద్యజింపుము. దీనితగుల్ = మోహాసక్తి, దేహిన్ = మనుష్యుని, కీడ్వఱుచును.
| క. | అని పెద్దలైనయాప్తులు | |
| | బునఁ దత్తదహితనృపవ | 147 |
రెంటికి సరి సులభము.
| ఉత్సాహ. | ఆదుకొన్న కావరమున నకట మనుజమాత్రుఁ డీ | 148 |
భారత. సింధురాజు = సైంధవుఁడు, సహాయచయమును, ఆఁగి, నాదుపట్టిన్ = అభిమన్యుని, చెఱుచువాఁడె = కూల్చువాఁడే.
రామ. సింధురాజున్ = సముద్రుని, మీఱివచ్చి భీమమైన సేనాదిబహుసహాయచయమును జెఱుచువాఁడె, నాదుపట్టినట్టి = నేఁబట్టిన, చలమును, నన్ = నన్నును, గణింపఁడు.
| వ. | అని యుగ్గడించి యందుల కేమి యన్నియుం జిక్కనయ్యెడు ననిరోష | 149 |
రెంటికి సమము సులభము.
| క. | ధృతి నేన కూల్తు నరిసం | 150 |
రామ. అరిసంహతిన్ = శత్రుసమూహమును, ఆసింధు = సముద్రపర్యంతమైన, మహీజ = భూమియందు, పతిత = పడిన, కడమ సులభము.
భారత. సింధుమహీపతి = సైంధవునియొక్క, తలను గూల్తును.
| తే. | వినుఁడు నాపంత మిదె నేఁడు వేగయుక్త | 151 |
భారత. మఱియు నర్జునునివాక్యము, నేఁడు, వేగన్ = తెల్లవారినను, నలినమిత్రు = సూర్యునియొక్క, ఆనృపుని = సైంధవుని, కడమ సులభము.
రామ. మఱియు రావణునివాక్యము, వేగయుక్తమయిన గతిచేత, నలిన్ = వేడుకచేత, అమిత్రు = రామునియొక్క, అస్తమయంబునకున్ = నాశనమునకు, మునుపుగ, భానుపుత్త్రాది = సుగ్రీవుఁడు మొదలుగాఁ గల, తత్పక్ష = ఆరామునికి సహాయమైన, “పక్షఃపార్శ్వగరుత్సాధ్యసహాయబలభిత్తిషు” అని వి. బలమును దఱిమి, ఆనృపునిన్ = ఆరామునిని, కడమ సమము.
| తే. | ఏఁ గడఁగి యిట్లు గావింపనేని బెలుచఁ | 152 |
రామ. అస్మాక = మనసంబంధులైన, సైన్యపతులు, ఉగ్రాజియనెడి భాసురమైన, జ్వలనమునకున్ = అగ్నికి, శలభత వహించి, సముత్సంతోషయుక్తమైన, వీక్ష = దృష్టిచేత, విద్విషత్ = ఆరామునియొక్క, సైనికులు చూడఁగాఁ జత్తురు, ఇంకఁ దనవల్లఁ గాని జయము రాదనుట.
భారత. అస్మాకసైన్యపతులును విద్విషత్సైనికులును, సముద్వీక్షఁ జూడ = తల లెత్తి చూడఁగా ననుట, రుక్ = దీప్తులయొక్క, రాజి = పంక్తులచేత, భాసురమైన జ్వలనమునకు, కడమ సులభము.
| వ. | అని పలికి పలికినట్ల బెట్టిదంపుఁ బెంపుసొంపు వొంపిరివోవ సన్నద్ధుండై | 153 |
భారత. సారథ్యముయొక్క యాశ్చర్యచర్యామహిమచేత మహనీయమైన, రణవిహరణమందుఁగల, రణరణిక = కాంక్షాతిశయముయొక్క యనుట, బంభ్రమ్యమాణ = మఱిమఱి పరిభ్రమించుచున్న, శరప్రయోగవేగచాతుర్యముచేత, నాశ్చర్యమైన, దశ = అవస్థగల, భుజయుగయుగళ = పూనుగాండ్లవంటి రెండుభుజములయొక్క, కడమ స్ఫుటము.
రామ. హరికుంజర = వానరశ్రేష్ఠులయొక్క, శతములయొక్క, సార= శ్రేష్ఠమైన, ధీ = బుద్ధికి, ఆశ్చర్యమైన, చర్యా = గతియొక్క, దశభుజయుగయుగళ = వింశతిహస్తములయొక్క, కడమ సరి.
| క. | వేమఱు మనగుర్వశ్వ, త్థామలకీఘోరవీరతరుబాణకదం | 154 |
రామ. మన = మనయొక్క, గురు = వ్రేఁగైన, అశ్వత్థ = రావి, ఆమలకీ = ఉసిరిక, “తిష్యఫలాత్వామలకీత్రిషు” అని అ. వీరతరు = మద్ది, “నదీసర్జోవీరతరురింద్రద్రుఃకకుభోర్జునః” అని అ. బాణ = గోరంట, “నీలీఝింటీద్వయోర్బాణః" అని అ. కదంబ = కడిమి, “నీపప్రియకకదంబాస్తుహలిప్రియే” అని అ. ఈచెట్లయొక్క, అమితవర్షము = చాలఁ బ్రయోగించుట, దుఃస్తరమై = తరింపరానిదై, మెఱసెను, ఇతండును = ఈరావణుఁడును, తత్ = ఆతరువర్షముచేత, అప్రభేద్యుఁడయ్యెను, అని పలుకుచుండ నని ముందరి కన్వయము. "ఆమలకీ” అనుశబ్దమున ఆ యనెడు నుపసర్గ మున్నది గనుక యతిస్థానమునకు తకారమే చెల్లును. ఇది ప్రాదియతి - ఇందుకు లక్షణము. కవిలోకచింతామణి యనెడు తాతంభట్టుఛందమందు, ఆ. 'ధాత్రిఁ బ్రాదియోగమాత్రంబు గలిగిన, నుభయమును వచింప నొనరు యతికి, సాతిరిక్తభక్తిశక్రసేవితకమ, లాలయానివాస లక్ష్య మిదియె' ఇందుకు విరాటపర్వమందు సోమయాజి, ఉ. 'శ్రీయన -గౌరినాఁ బరఁగుచెల్వలచిత్తము పల్లవింప భ, ద్రాయితమూర్తియై హరిహరం బగు రూపము దాల్చి విష్ణురూపాయ నమశ్శివాయ యని పల్కెడు భక్తజనంబు వైదిక, ధ్యాయితకిచ్చ మెచ్చుపరతత్త్వము గొల్చెద నిష్టసిద్ధికిన్' హరివంశమందు నాచన సోమనయు, క. 'ఆపాదశిరోలంకా, రాపాదితచారుతాభిరామాత్త్యమహా, రూపాలోకనతుష్టా, కూపారకుమారికాముకురమణిరాజా.' ఇట నుదాహరించినది గనుక, అశ్వత్థామలకీఘోరవీరతరు - అని తకారమే యతిగా సూరపరాజుగారును బ్రయోగించినారు.
భారత. గుర్వశ్వత్థామలకున్ = ద్రోణాశ్వత్థామలకును,ఈవీరతరు = వీరశ్రేష్ఠుఁ డైనయీయర్జునునియొక్క, బాణకదంబ = బాణసమూహములయొక్క, అమితవర్షము మెఱసెను, ఇతండున్ = అర్జునుఁడును, తత్ = ఆబాణవర్షముచేత, ఆప్రభేద్యుఁ డయ్యెన్ = భేదింపరానివాఁ డాయెను.
| తే. | కొంద ఱతిరయప్రేరితస్యందనాశ్వ | 155 |
భారత. అతిరయముచేతఁ బ్రేరితములైన, స్యందనాశ్వ = రథాశ్వములుగల, కర్ణముఖ్యులైన, ఉగ్రతరుల = అత్యుగ్రులయొక్క, మోఘతకున్ = ఓటమికి, నృపాలునిన్ = దుర్యోధనుని, గురుకృపకృతవర్మలయొక్క, ధర్మవర్తన = ధనుర్వ్యాపారము. రామ. ప్రేరిత = ప్రయోగింపఁబడిన, స్యందన = నెమ్మిచెట్టును, "తినిశే స్యందనో నేమిః” అని అ. అశ్వకర్ణ = మద్దిచెట్టును, “సాలేయసర్జకార్శ్యాశ్వకర్ణకాః" అని అ.` ముఖ్య = మొదలుగాఁగల, ఉగ్ర = భయంకరములైన, తరుల = వృక్షములయొక్క, మోఘతకున్ = వ్యర్థత్వమునకు, నృపాలుని = రామునియొక్క, గురుకృప = అధికదయకృతమైన, వర్మ = కవచముయొక్క, ధర్మ = ప్రకారముగల, వర్తన = వృత్తి గలది, కృపకు విశేషణము. కాచును, కడమ సులభము. =
| తే. | కొంద ఱినతనూజాదుల క్రోవిలోనఁ | 156 |
రామ. ఇనతనూజాదుల = సుగ్రీవాదులయొక్క, నీలుఁడును గజుఁడును, కడమ సులభము.
భారత. ఇరతనూజాదుల = కర్ణాదులయొక్క, నీల = నల్లనైన, గజములు, ముఖ్య = మొదలుగాఁగల.
| వ. | మఱియు ననేకు లనేకప్రకారంబులఁ దత్తద్రణసమయసముదయ | 157 |
రెంటికి సరి సులభము.
| వనమయూరము. | సారనిజచాపగుణశబ్దసమనువ్ర | 158 |
భారత. సార = శ్రేష్ఠమైన, నిజచాపగుణముయొక్క శబ్దమును, సమనువ్రప్రజ్యా = వెనుకొనుటకు, రసిక = నేర్పరియునై, శూరకర = శూరశ్రేష్ఠుఁడైన, సాత్యకియొక్క, రణాగ్ర = యుద్ధముఖమందువు, క్రూర = నిష్ఠురములయిన, శర = బాణములయొక్క, శాత్కృతి = శతృధ్వనులచేత, నిరూప్య = తెలియఁదగిన, గమనము గలవాఁడై చేరి, అవికారమైనధృతి గలవాని, సింధునృపున్ = సైంధవుని, చూచెను, తనబాణప్రయోగధ్వనులజాడను సాత్యకియుఁ గొల్చి రాఁగా నర్జునుఁడు సైంధవుని గదిసె ననుట.
రామ. సారనిజచాపగుణశబ్దమును, సమనువ్రజ్యా = వెనుకొనుటకు, రసిక = రుచి గలవియునై, శూరులయొక్క, తరస = మాంసములచేత, అతి, మిక్కిలి, అకిరణ = కిరణరహితములైన, అగ్ర = ముల్కులు గలవియునైన, శత్రుమాంసములచేతఁ గప్పఁబడినవి యనుట, క్రూరశరములయొక్క శాత్కృతులచేత, నిరూప్య= ఎఱుఁగఁదగిన, గమనుండై = గమనము గలవాఁడై, అవికారధృతిచేత, సింధుసముద్ర మైనవాని, నృపున్ = రాముని, చూచెను.
| వ. | అంత. | 159 |
| తే. | తివిరి గురుకృతవరాదిధృతివిలసిత | 160 |
రామ. తివిరి, గురు = అధికమౌనట్టుగా, కృత = చేయఁబడ్డ, వర్మాది = కవచము మొదలుగాఁ గలసాధనములయొక్క, ధృతి = ధారణముచేత, విలసితమైన, విగ్రహ = శరీరముయొక్క, “శరీరం వర్ష్మవిగ్రహః” అని అ. స్ఫూర్తిన్ = స్ఫురణచేత, విజయ = గెలుపే, సత్సహాయతా = లెస్స సహాయముగాఁ గలవాఁ డౌటచేత, అలోలుఁడయి = అచలుఁడై భయము లేక యనుట, వచ్చుచున్న, అలఘుమన్యున్ = అధికకోపము గలవాని, భీమున్ = భయంకరమైనవాని, దశముఖునిన్ = రావణుని, అర్కనందనుఁడు = సుగ్రీవుఁడు, తాఁకెను.
భారత. తివిరిగురుకృతవర్మాదులయొక్క, ధృతి = ధైర్యముచేత, విలసితమైన, విగ్రహ = యుద్ధముయొక్క, స్ఫూర్తిచేత, “రణః కలహవిగ్రహౌ" అని అ. విజయ = అర్జునునియొక్క, సహాయత్వమందు, లోలుఁడై = అపేక్ష గలవాఁడై, "లోలశ్చలనతృష్ణయోః” అని అ. అర్జునునికి సహాయముగా ననుట, అలఘు = అధికమైన, మన్యుదశ = రోషావస్థ గల, ముఖము గలవాని, భీమున్ = భీముని, అర్కనందనుఁడు = కర్ణుఁడు, తాఁకెను.
| మ. | మిహిరప్రోద్భవుఁ డిట్లు శాత్రవునిలక్ష్మిన్ సైఁప కుగ్రాచలా | 161 |
భారత. మిహిరప్రోద్భవుఁడు = కర్ణుఁడు, “మిహిరారుణపూషణః " అని అ. శాత్రవునిలక్ష్మన్ = భీముని జయలక్ష్మిని, సైఁపక యుగ్రమైన, అచల = స్థిరమైన, ఆగ్రహతం జేసి = ఆగ్రహము గలవాఁ డౌటచేత, తాఁకి, తత్ = ఆభీమునియొక్క, ఘోరబాణహతిచేత, పీడను భజియించెను.
రామ. మిహిరప్రోద్భవుఁడు = సుగ్రీవుఁడు, ఉగ్ర = ఘనమైన, అచలాగ్ర = పర్వతశిఖరముచేత, హతన్ = హతమైనదానిఁగా, శాత్రవుని = రావణునియొక్క, లక్ష్మిని జేసి, పీడను భజియించెను, కడమ సులభము.
| వ. | అంత. | 162 |
| తే. | వాయుసూనుండు ధృతకరవాలహస్త | 163 |
రామ. వాయుసూనుండు, ధృత = ధరింపఁబడిన, కర = హస్తములయొక్కయు, వాలహస్త = తోఁకలయొక్కయు, “వాలహస్తస్తు వాలధిః" అని అ. విహృతిచాతురితో = విహారచాతుర్యముచేత, ధృతశబ్దము చాతురికి విశేషణము. డీలు పఱిచెనని ముందరిపద్యమునఁ గ్రియ. కడమ సులభము.
భారత. వాయుసూనుండు = భీముఁడు, ధృతమైన, కరవాల = ఖడ్గముగల, “కరవాలః కృపాణవ” త్తని అ. హస్తముయొక్క, కడమ సులభము.
| క. | అహితుని నాశ్చర్యకర | 164 |
భారత. అహితునిన్ = కర్ణుని, ఆశ్చర్యమైన, కర = హస్తమందుఁగల, ప్రహరణ = ఆయుధముయొక్క, “ఆయుధం తుప్రహరణ” మని అ. విధిన్ = వ్యాపారముచేత, అతండున్ = కర్ణుఁడును, కరువలిపట్టిన్ = భీముని, విగ్రహచేష్టలు = శరీరచేష్టలు, అడంగన్ = మూర్ఛపోవునట్లుగా ననుట.
| క. | నొంచి తదవసరజాతా | 165 |
రామ. తదవసర = ఆసమయమందు, జాతమైన, అచంచల = స్థిరమైన, ఘనమన్యున్ = అధికకోపము గలవాని, మహాశత్రులకు, భీమున్ = భయంకరుఁడైనవాని, వహ్నిసంతతిన్ = నీలుని, పలికెను.
భారత. ఘనమన్యు = అధికశోక మనెడి, “మన్యుర్దైన్యే క్రతౌ క్రుధి” అని అ. వహ్నిసంతతి = అగ్నిసమూహముచేత, తను = తనశరీరమును, కారించుచున్ = తపింపఁజేయుచు, అలయించు = శోషిలఁజేయుచున్న, తనశోకవహ్నిచేతఁ దానే తప్తుఁడగుచున్నవాని ననుట, భీము నిట్లని పలికెను.
| క. | కానలఁ గాయలుఁ బండ్లు న | 166 |
భారత. ఓరీ= తుచ్ఛుఁడా, నీలావు = నీబలిమి, ఆనరునకున్ = ఆయర్జునునకును, నీకును గుఱియైనను, కడమ సులభము.
రామ. నీలా-సంబుద్ధి. వానరునకు నీకును = కోఁతియైన నీకును, గుఱియై = కనిపించుకొని, ననున్ = నన్నును, మద్బలమునును, ఒరయన్= చెనకుటకు, అర్హంబగునే
| చ. | ఒరయుటకు ఫలంబు దగనొందితి పొమ్మని యమ్మహాభుజుం | 167 |
రామ. పొమ్మని = చత్తువుగాక యని, మాటల = మాటలచేతను, దహనబాణ = ఆగ్నేయాస్త్రముయొక్క, హతిచేతను హృదయంబును, నొంచి = భేదించి, అమ్మహాభుజున్ = నీలుని, రహితచేష్టునిఁ జేసి విడిచెను. అయ్యెడను, రిపు = రావణునియొక్క, స్ఫురణ = స్ఫూర్తిని, కృశానుజ = అగ్నివల్లఁ బుట్టిన నీలునియొక్క, క్రియలు = మూర్ఛాచేష్టలను, చూచుచు, రామునితమ్ముఁడు = లక్ష్మణుఁడు, ససంభ్రమాకులుండై యని ముందరి కన్వయము.
| వ. | ససంభ్రమాకులుం డై. | 168 |
| తే. | చూడు మటు నరవరజయస్ఫూర్తి నార్చె | 169 |
భారత. కృష్ణుం డర్జును ననుమాట. చూడు మటు, నర = అర్జునా! భూరిశ్రవః = భూరిశ్రవసునియొక్క, దారుణమైన, రణమహిన్ = యుద్ధభూమియందు, మదనుజ = నాతమ్ముఁడయిన సాత్యకియొక్క, బలశ్రీలు, మడఁగన్క్ = అణఁగిపోఁగా, వైరిసేన, యార్చెను. ఇంతటను, రిపు = శత్రువైన భూరిశ్రవసునియొక్క, కరంబు = హస్తమును, తెగవ్రేయకునికి కీడు.
రామ. లక్ష్మణుఁడు రామునితో ననెడుమాట. నరవర-సంబుద్ధి. భూరి= అధికమునై, శ్రవోదారుణ = శ్రవణభయంకరమైన, రణ = శబ్దముయొక్క, “రణో స్త్రీయుధినా ధ్వనా” అని రత్నమాల. మహిమన్ = ఆధిక్యముచేత, వైరిసేన, ఆర్చెను = మ్రోసెను. దనుజబల = రాక్షసబలముయొక్క, శ్రీలు = విలాసములు, మడఁగన్ = అడఁగునట్టుగా, రిపున్ = రావణుని, కరంబు మిక్కిలి, తెగవ్రేయకునికి కీడు, వ్యాఖ్యయందుండు క్రమమునకు లక్షణ మిమడదని తోఁచునెడ కరము దెగునట్టు శత్రుని వ్రేయకునికి కీడని యన్వయింపనగు.
| తే. | అనుచుఁ దా నన్నమాటఁ జేకొని తడయక | 170 |
రామ. అనుచుఁ దాను, అన్నమాటను, రామునిమాటను, చేకొని = అనుమతిఁ బుచ్చుకొని యనుట. సుమిత్రయొక్క నందనుఁడు = లక్ష్మణుఁడు, నరతను = మనుష్యత్వమున, నటించు చక్రి = రాముఁడు, కడమ సులభము.
భారత. అనుచు, తా నన్నమాటను = తా నాడినమాటను, చేకొని, సుమిత్రనందనుఁడు = బంధుప్రియుఁడు, జిష్ణుఁడు = అర్జునుఁడు, అరి = భూరిశ్రవసునియొక్క, కరం బును, కుంటువడనేయన్ = తెగవ్రేయఁగా, అరతన్ = సమీపమున, నటించు = నటించెడి, చక్రి = కృష్ణుఁడు, మోదించెను. ఈ పద్యమునందును గరము కుంటుపడునట్టు లరిని నేయనని యన్వయింపఁదగు.
| వ. | మఱియుం దద్రణం బతిభయంకరం బయి ప్రవర్తిల్లె. | 171 |
రెంటికి సరి సులభము.
| ఉ. | అంతట రాముతమ్ముఁడు దిగంతసమీపగుఁ డైనయట్టిభా | 172 |
భారత. రాముతమ్ముఁడు = కృష్ణుఁడు, భాస్వంతు = సూర్యునియొక్క, తెఱంగు గాంచి, ఇంతటినుండి యర్జునవ్యాపారము. జిష్ణుని = అర్జునుని, రిపు = కర్ణాదులయొక్క, సత్త్వమును నారయుచు, తనలో ననుకొనుమాట, కడమ సులభము.
రామ. రాముతమ్ముఁడు = లక్ష్మణుఁడు, భాస్వంతుతెఱంగు = రక్తవర్ణము ననుట, కాంచి = పొంది, శత్రుని = రావణునియొక్క, కాయము సొంపుమీఱఁగాన్ = శరీరము రక్తమయమగునట్టు గాననుండి, జిష్ణురిపు = రావణునియొక్క, సత్త్వము నారయుచును మనంబున లక్ష్మణుఁ డెంచుకొనెడుమాట.
| తే. | సమదరోషాహితుల ఘోరసాయకముల | 173 |
రామ. సమదరోషాహి = క్రూరసర్పములే, తుల = పోలికగాఁగల, ఘోరసాయకములచేత, వానరానీకమును = వానరసమూహమును, భానుసుతాది = సుగ్రీవుఁడు మొదలయిన, అరాతి = రావణునియొక్క. కడమ సులభము.
భారత. సమదరోషాహితుల = క్రూరశత్రువులయొక్క , సాయకములవాన = బాణవర్షమును, రానీక, నర = అర్జునునియొక్క, అతివిపుల, కొదగానన్ = కొదవఁ గానను.
| తే. | హరులు దగదొట్టి మెలఁగ లే వనినవాజి | 174 |
భారత. హరులు = గుఱ్ఱములు, అనిన, కీలాలములు వెల్లిగొనునట్టుగా, అవనిన్ = భూమిని, శాత = వాఁడియైన, అస్త్రనిహతి = బాణప్రయోగముచేత, గ్రొచ్చి = భేదించి, వాజితృష్ణ = గుఱ్ఱాలయొక్క దప్పిని, వారించెను.
రామ. హరులు = వానరులు, దగదొట్టి, అనిన్ = యుద్ధముందు, మెలఁగలేవు. క. 'స్థావరతిర్యక్పదముల, కేవెరవునఁ గ్రియలు దలఁప నేకవచనముల్, దేవమనుష్యాదిక్రియ, భావింపఁగ నేకవచనబహువచనంబు' అని యాంధ్రభాషాభూషణము గనుక హరులు మెలఁగలేవని ప్రయోగము. నవమైన, అజితృష్ణన్ = తిరుగ యుద్ధము సేతు ననెడుకాంక్షను, వారించెను = అణఁచెను. ఈయతిప్రతాపుఁడు = రావణుఁడు, అత్యద్భుతంబుగన్ = నాకును వెరఁగవునట్టుగా, నవ = వింతలై, నిశాత = తీక్ష్ణములునైన, అస్త్ర = దివ్యాస్త్రముయొక్క, వానరప్రయుక్తపర్వతములనన్నియు నుగ్గుచేసినవి గనుక, నిహతిన్ = ప్రహారముచేత, క్రొచ్చి= గుదులుగా వ్రేసి, కీలాలములు = నెత్తురులు, “శోణితేంభసి కీలాల” మ్మని అ. వెల్లిగొన వెలార్చి, సరిలేక వారించె నని క్రిందటి కన్వయము.
| సీ. | మును పిమ్మహాయోధుఘనసంగరోత్సాహ | |
| తే. | బ్రతినయం బే నొనర్పక పార్థబాణ | 175 |
రామ. మునుపు = పూర్వమందు, ఇమ్మహాయోధు = రావణునియొక్క, సంగర = యుద్ధమందుగల, అవిరతిని = ఎడతెగకుండుటచేత, బిడౌజుండు = ఇంద్రుఁడును, రాజరాజు = కుబేరుఁడును, సింధురాజు = వరుణుఁడును, అతియత్నమునఁ బరఁగుట = ప్రచ్ఛన్నులై యుండుటననుట. తెలిసియు, జయత్ = సర్వోత్కృష్టత్వమున వర్తింపుచున్న, రథున్ = రథము గలవాని, సద్యోవధార్హునిన్ = ప్రొద్దు గ్రుంకకమునుపే చంపఁదగిన రావణుని, చంపుటకు, ప్రతినయంబు = యుక్త్యంతరమును, ఒనర్పక, అపార్థ = నిరర్థకము లైన, బాణములచేతనే, శత్రునకు దర్పకాలమై సత్త్వమెక్కన్ = రాక్షసులకు రాత్రి దర్పకాలము గనుక, కడమ సులభము.
భారత. ఇమ్మహాయోధు = అర్జునునియొక్క, సంగర = ప్రతిజ్ఞచేత నైన, “పతిజ్ఞాజి సంవిదావత్సు సంగరః” అని అ. ఆప్తసేనాది = కర్ణాదిబలములయొక్క, సంగతియొక్క, అవిరతిన్ = ఉడుగమిచేత, నిబిడౌజుండు = నిబిడమైనతేజము గలవాఁడు, రాజరాజు = దుర్యోధనుఁడు, జయద్రథు = సైంధవుని, పార్థ = అర్జునునియొక్క, విజయహాని = అర్జునునికిఁ గీడు, కడమ సులభము.
| వ. | అని తలపోసి. | 176 |
| తే. | కరము భానుబింబము మాయఁగప్పె నభము | 177 |
భారత. అని తలపోసి = కృష్ణుఁ డీలాగు విచారించుకొని, అంబకముల = నేత్రములయొక్క, రాగమునన్ = అనురాగముచేత, ప్రతిభటుఁడు = సైంధవుఁడు, నభమును = ఆకాశమును, చూచి సంరంభమును వహింపఁగా, మాయ = మాయచేత, భానుబింబమును గప్పెను.
రామ. అని తలపోసి లక్ష్మణుఁ డీలాగు విచారించుకొని, రాగమునఁ బెంపారుచూడ్కిన్ = ఎఱ్ఱనైన చూడ్కిచేత, ప్రతిభటుఁడు = రావణుఁడు, చూచి, నరుఁడు = మనుష్యుఁడు, పూన్కి విడఁడని సంరంభంబును వహింపఁగా భానుబింబము, మాయన్ = మాగుఁడువారునట్టుగా, అంబకములన్ = బాణములచేత, నభముఁ గప్పెను.
| వ. | ఇట్లు గప్పిన. | 178 |
| సీ. | మదిలోన మిత్రాస్తమయకాంక్ష మిక్కిలి | |
| తే. | బిట్టు సమయించె ధృతిఁ బాకభేదిముఖ్య | |
| | సప్రగల్భరామావరజప్రయుక్త | 179 |
రామ. మదిలోను, అమిత్రాస్తమయ = శత్రునాశమందుఁ గల, కాంక్ష = అపేక్ష, మిక్కిలి, కలిమిన్ = కలిగియుండుటచేత, తద్దిశన్ = ఆలక్ష్మణుఁ డుండెడుదిక్కున, అంబకప్రయుక్తి = బాణప్రయోగమును, తత్కాల = ఆయుద్ధకాలమందు, చాపలోప = విల్లువోవుటచేత, హతమైన, యాత్మరక్షణుండగువాని, ప్రచురబంధు = అధికబంధువయిన, సింధురాజును = సముద్రుఁడు గలవాని, బలోర్జితుని, మేఘనాదగురున్ = రావణుని, “అనచిచ” యనుసూత్రమున భారతార్థమందును న్యక్రియాశబ్దాదిని నకారపుఁబొల్లున్నది. న్యక్రియా = రావణునిచేతి తిరస్కారమును, అసహ = ఓర్వని, క్రూరములునై, భీమ = భయంకరములు నయిన, సేనా = వానరసేనలయొక్క, అతిమాత్రోరు = మిక్కిలివిరివియైన, సింహనాదములచేతఁ, అతివిశ్రుతంబుగన్ = మిక్కిలిఁ బ్రసిద్ధమగునట్టుగా, ఆక్రమించి, సప్రగల్బుఁడైన, రామావరజ = లక్ష్మణునిచేత, ప్రయుక్త = ప్రయోగింపఁబడిన, విజయమందు, పటు = సమర్థములైన, శరములయొక్క వ్యాపారవిలసనంబు, ధృతిన్ =నరావణుని ధైర్యమును, సమయించెను.
భారత. మిత్ర = సూర్యునియొక్క, తద్దిశన్ = సూర్యాస్తమయదిక్కునందు, అంబకప్రయుక్తి = దృగ్వ్యాపారమును, “అంబకం నేత్ర శరయోః” అని వి. తత్కాలమందలి చాపలముచేత, ఉపహత = చెఱుచుకోఁబడిన, ఆత్మరక్షణ గలవాఁ డగువాని, ప్రచురబంధున్ = ప్రచురబంధువులు గలవాని, సింధురాజును = సైంధవుని, మేఘనాద = "మేమధ్వనియొక్క; గురున్యక్రియా = అధిక తిరస్కారమందు, సహ = సమర్థములునై, క్రూరములునైన భీమసేనునియొక్క, సింహనాదముల చేత నాక్రమించి, ధృతిన్ = సంతోషముచేత, “ధృతిర్యోగాంశరే ధైర్యే ధారణాధ్వరతుష్ఠిషు ” అని వి. పాకభేదిముఖ్యఖేచరులు = ఇంద్రాదిదేవతలు, మెచ్చఁగా, రామావరజ = కృష్ణునిచేత, ప్రయుక్త = ప్రేరేపఁ`బడిన, విజయునియొక్క పటుశరవ్యాపారవిలసనంబు, సింధురాజును సమయించెనని యన్వయము.
| తే. | సరగున బునఃప్రకాశితచండధాముఁ | 180 |
రామ. పునఃప్రకాశితమైన, చండధాముఁ డగుచున్ = ఉగ్రప్రతాపము గలవాఁడై, విజయప్రతిజ్ఞచొప్పు = శత్రుసంహారము చేసెదనని లంకలో నాడుకొన్నప్రతిజ్ఞచొప్పు, అవియకుండ, ఆ, సురకులవైరి = రావణుఁడు, నిజ = తనయొక్క విచిత్రమైన, శక్తిన్ = శక్తియను నాయుధముచేత, శత్రున్ = లక్ష్మణుని, అడఁచి = పడవేసి. కడమ సులభము.
| వ. | అప్పుడు. | 181 |
| మ. | నునుమేచాయలనాదుకూర్మి యనుజన్మున్ బాధ స్వప్నంబునం | 182 |
రామ. అనుజన్మున్ = లక్ష్మణుని, ప్రియున్ = ప్రియమైనవాని, అనుచు, రాజులరాజు = రఘుపతి, రవిపుత్రాదులు = సుగ్రీవాదులు, తేర్పఁగాఁ గుందెను.
భారత. మున్ = ఇటకుమును పెన్నఁడును, బాధ = దుఃఖమును, స్వప్నంబునన్ = స్వప్నమందైనఁ గాని, కనక యొప్పారెడుపుణ్యమూర్తి యయినదాని, అనుజన్ = చెల్లెలైనదుస్సలను, ప్రియున్ = పతిని, ఇవ్విధంబున, ఏయించి = చంపించి, మూర్ఛాబ్ధిలో, అనుజను మునుంగఁజేసితినని యన్వయము. అనుచు, రాజులరాజు = దుర్యోధనుఁడు, కుందెను.
| వ. | తదనంతరంబ తద్దయు నుద్దీపితం బగుకోపాటోపంబున. | 183 |
రెంటికి సరి సులభము.
| క. | వాయుజవనచరవాహనుఁ | 184 |
భారత. వాయుజవన = వాయఁవుభంగి వేగము గలవై, "ప్రజనీ జవనో జవః" అని అ. చరి = చరించెడి, వాహనుఁడై = అశ్వములు గలవాఁడై, పరిపంథిబలమున్ = శత్రుసేనను, కడమ సులభము.
రామ. వాయుజుఁ డనెడివనచరము వాహనముగాఁ గలవాఁడై, పరిపంథి = రావణునియొక్క , బలమున్ = లావును.
| క. | ఆవీరుఁడు మును దనబా | 185 |
రామ. ఆవీరుఁడు = ఆపరిపంథి - రావణుఁడు, పవనసుతున్ = హనుమంతుని, నృపవర్యుఁడు = రాముఁడు.
భారత. ఆవీరుఁడు = దుర్యోధనుఁడు, పవనసుతున్ = భీముని, నృపవర్యుఁడు = ధర్మజుఁడు. కడమ సరి.
| ఉ. | ఈవిధి నల్గి యానృపతి యేయుశరంబులఁ దద్విరోధి దాఁ | 186 |
భారత. ఆనృపతి = ధర్మరాజు, ఏయుశరంబులచేత, తద్విరోధి = దుర్యోధనుఁడు, మే నెఱుఁగక, కుందెనని క్రింది కన్వయము. తత్ = ఆమూర్ఛావృతియొక్క, ప్రతిబోధలబ్ధిచేన్ = ఎఱుకకలిమిచేత, అతనిమూర్ఛ తెలియుటచేత ననుట. తదీయులకున్ = కర్ణాదులకు, భావములో, కలంక = అళుకు, చొరఁబాఱెనని క్రింది కన్వయము.
రామ. ఆనృపతి యేయు = రాముఁడు వ్రేసెడి, శరంబులచేత, తద్విరోధి = రావణుఁడు, కుందెను. తత్ప్రతిబోధలబ్ధిచేన్ = ఆమూర్ఛ తెలియుటచేత, భావము, లోఁగన్ = చిన్నఁబోగా, తదీయులకున్ = లంకనుండెడివారికి, ఆర్తి హెచ్చఁగాను, లంకను జొరఁబాఱెను.
| ఆ. | అంతలోఁ బ్రదీప్త మైనయక్షపితశ | 187 |
రామ. అక్షపిత = అక్షునితండ్రి యైనరావణునియొక్క, శక్తిని = శక్తి యనెడు నాయుధముచేత, మూర్ఛ మునిఁగినట్టి రాకొమరుఁడు = లక్ష్మణుఁడు, రణమత్తుఁ డయ్యెను.
భారత. అక్షపిత = చెఱుపఁబడనటువంటి, శక్తిని = బలముచేత, లేచి యన్నందు కన్వయము, రణమందు, మత్తుఁ డయ్యెన్ = ఆన్యవిచారము లేనివాఁ డాయెను.
| తే. | తెలివి చేకొని యతఁ డంతఁ బలువురఁ గడుఁ | |
| | నుక్కు మడఁగఁ దత్తద్ద్వంద్వయుద్ధవిధిని | 188 |
భారత. తెలివి చేకొని = మూర్ఛ దెలిసి, అతఁడు = దుర్యోధనుఁడు, తనయొక్క యోధవీరవరులను దత్తద్ద్వంద్వయుద్ధవిధిచేత, రిపులు = పాండవులు, ఆడఁచుచుఁ బేర్చుట = జయించుట ననుట. అరసి = చూచి, పనిచెనని ముందరిపద్యమునఁ గ్రియ.
రామ. తెలివి చేకొని = వివేకము దెచ్చుకొని, అతఁడు = రావణుఁడు. కడమ సులభము
| వ. | ప్రతివిధానం బన్వేషించి. | 189 |
| ఆ. | అతివిశాలదృతిమహాద్రినిభానుజు | 190 |
రామ. అతివిశాలధృతి గలవాని, అద్రినిభుఁడైన, అనుజున్ = కుంభకర్ణుని, బహురణ = పెక్కుమ్రోఁతలయొక్క, “రవే రణః” అని అ. ప్రయత్నభరముచేత, వినిద్రున్ = మేల్కొన్నవానిఁగా, చేసి, అట్ల = ఆయెంచినప్రకారముననే, పనిచెను.
భారత. అతివిశాలధృతిచేత, మహాద్రిని = అద్రిని బోలినవాని, భానుజున్ = కర్ణుని, రణ = యుద్ధముయొక్క, ప్రయత్నభరమందు, నిన్నిద్రున్ = జాగరూకుని, చేసి పనిచెను.
| వ. | పనిచిన నతండును నతిభయంకరసన్నాహంబుతోడ నాహవక్రీడకు | 191 |
రెంటికి సరి సులభము.
| చ. | ప్రకటత నేఁడు నీ వనిభరంబు వహించితె కించిదంచిత | 192 |
భారత. పరివారము కర్ణునితో ననెడుమాట. కించిదంచితమైన, భ్రుకుటి = బొమముడిచేతనే, విమాక్తికీకృత = హారవిరహితములుగాఁ జేయఁబడిన, విరోధివధూ = శత్రుస్త్రీలయొక్క, కుచకుంభములు గలవాఁడా! కర్ణ - సంబుద్ధి. భీష్మునియందలి రోషమున, తత్ = ఆభీష్మునియొక్క, దశవాసరంబులు = యుద్ధదినములు పదింటిని, చనఁజేసితివి, ఇఁక నైనఁ గావవే.
| చ. | నరుఁ డని లెక్క సేయఁడు మనంబున శాత్రవు నమ్మహాత్ముచే | 193 |
రామ. నరుఁడని = మనుష్యుఁడని, మననాయకుఁడు = రావణుఁడు, నిద్దుర = నిద్రను, మునుమున్నుగాఁ దెలిపి, భీష్మ = భయంకరమైన, హానిచేత. కడమ సులభము.
భారత. నరుఁడు = అర్జునుఁడు, అనిన్ = యుద్ధమందు, శాత్రవుని లెక్కసేయఁడు = ఎటువంటి శత్రువునైనఁ దృణీకరించుననుట. మననాయకుఁడు = దుర్యోధనుఁడు, ఇద్దురమును = ఈయుద్ధమును, మున్నుగాఁ దెలిపి ని న్నెటులైన, యుద్ధమునకుఁ దోడుకరాక, భీష్మునియొక్క హానిచేత దుర్బలుఁ డయ్యెను. కడమ సరి.
| వ. | అని మఱియుం దమదొరలచావు లుగ్గడించి యివి యన్నియు మన | 194 |
రెంటికి సరి సులభము.
| సీ. | ప్రత్యర్థిభద్రవారణఘటోత్కచలస | |
| తే. | దివసనాయకుపట్టిపైఁ గవిసి తత్ప్ర | |
| | దివ్యబాణచక్రప్రాస తీక్ష్ణశక్తి | 195 |
భారత. కృష్ణుఁ డనెడుమాట. ప్రత్యర్థిభద్రవారణ = శత్రుశుభముల నివారించెడువాఁడా! ఘటోత్కచ - సంబుద్ధి. లసత్ = ఒప్పుచున్న, కంఠీరవమురీతిన్ = సింహముభంగిని, పొదలెడు నీవీరు = కర్ణుని, కుదియించి మనసేనఁ గావుము. అను = అనెడి, హరి = శ్రీకృష్ణునియొక్క, సార్థ = ప్రయోజనసహితములైన, వాక్యములు, రవిజున్ = కర్ణుని, తలపడఁ దెలుపునంతన, ఆనిశాటుఁడు = ఘటోత్కచుఁడు, అంగదన్ = వేడుకచేత, ధర్మనందనుఁడును, గంధవహజ = భీముఁడును, నాసత్యసుత = నకులసహదేవులును, చమూనాథ = ధృష్టద్యుమ్నుఁడును, ఆదిక = మొదలుగాఁ గలవారికి, పులకస్ఫూర్తి = రోమాంచమునకు - సంతోషాతిశయమున కనుట, కారణమైన, పొలుపుతోడ = వికాసముతోడ, దివసనాయకుపట్టిపైన్ = కర్ణునిమీఁద, కవిసి, ప్రాస = ఈఁటెలును, “ప్రాసస్తు కుంతః” అని అ. శూలమును, ముఖ్య= మొదలుగాఁ గల యాయుధములయొక్క, ప్రయోగవిస్ఫురణను నెరపెను.
రామ. ప్రత్యర్థి = శత్రువు లనెడి, భద్రవారణ =మత్తేభములయొక్క, ఘటా = సమూహములయందు, ఉత్క = వేడుకగలదై, చల = లంఘించుచున్న, సత్కంఠీరవమురీతిని. అను = అనెడి, హరిసార్థ = వానరసమూహముయొక్క, “సంఘసార్థౌతు” అని అ. రవిజున్ = సుగ్రీవుని, అంగద = అంగదుఁడును, ధర్మనందన = సుషేణుఁడును, గంధవహజ = హనుమంతుఁడును, నాసత్యసుత= మైందద్వివిదులును, చమూనాథ = నీలుఁడును, ఆది = ఆదిగాఁగల, కపులకు, అస్ఫూర్తికారణము = విచారహేతువు, దివ్య = దేవతలయొక్క, బాణచక్ర = బాణసమూహముయొక్క, ప్రాస = పోమొత్తుటయందు, తీక్ష్ణమైనశక్తిగల, శూలముఖ్య = శూలశ్రేష్ఠముయొక్క, కడమ సరి.
| వ. | అతండును దానికిఁ జలింపక సుస్థిరుం డయ్యె నప్పుడు. | 196 |
రెంటికి సరి సులభము.
| తే. | అంతరమునంద యాశుగ సంతతివడి | 197 |
రామ. అంతరమునంద = నడుమనే, ఆశుగసంతతి = హనుమంతుఁడు, దైత్య = కుంభకర్ణునిచేత, ఈరిత = ప్రయోగింపఁబడిన, ఆయుధమును = శూలమును, త్రుంచెను. అపరిమేయపలాశి = అధికమాంసభక్షకుఁడు, దనుజుఁడు, కుంభకర్ణుఁడు, ఉగ్రమన్యున్ = అధికకోపము గలవాని, ఇనజున్ = సుగ్రీవుని, మూర్ఛితుని జేసెను.
| ఆ. | అంత నిలక యమ్మహాబలునిగృహీతుఁ | 198 |
భారత. అంత నిలక, అమ్మహాబలున్ = కర్ణుని, నిగృహీతుఁ జేసి = నిగ్రహించి - అణఁచి యనుట. కడమ సులభము.
రామ. అంత నిలక, అమ్మహాబలునిన్ = సుగ్రీవుని, గృహీతుఁ జేసి = పట్టుకొని, హరింతున్ = కొంపోయెదను. కడమ సరి.
| తే. | రాక్షసుండు ఖేలాగతి భ్రాజి యగుచు | 199 |
రామ. రాక్షసుండు = కుంభకర్ణుఁడు, ఖేలాగతి = లీలాగమనముచేత, భ్రాజి యగుచున్ = ఒప్పుచున్నవాఁడై, అర్కనందనున్ = సుగ్రీవుని, ఎత్తి, బాహాంతరమునన్ = రొమ్మున, అనఁగన్ = నిలుపుకోఁగా, తత్ = ఆసుగ్రీవునియొక్క, బలశ్రేణి, మహత్ = అధికమైన, శుక్ = శోకముచే నగు, “మన్యుశోకాతుశుక్ స్త్రియా” మ్మని అ. అంబుల = ఉదకములయొక్క - కన్నీళ్లయొక్క యనుట. వాన గురిసెను.
భారత. రాక్షసుండు = ఘటోత్కచుండు, ఖ = ఆకాశమందును, “గగనమనంతం సురవర్మ ఖ” మ్మని అ. ఇలా = భూమియందునగు, గతి = సంచారముచేత, భ్రాజి యగుచు, క్రమముననే, అర్కనందను = కర్ణునియొక్క, నెత్తిన్ = శిరమునందును, బాహాంతరమునన్ = వక్షస్థలమందును, ఆనఁగన్ = ఆనునట్టుగా, తత్ = ఆకర్ణునియొక్క, బలశ్రేణిమనములు తల్లడిలఁగ, మహాశుగంబులవాన = బాణవర్షమును, కురిసెను.
| సీ. | అరికిన ట్లగపడి యనిషేధనీయమా | |
| | గడు నంతఁ దెలినొంది కటకటా వీఁ డింత | |
| ఆ. | దనతలఁచినయట్లు దనుజశార్దూలున | 200 |
భారత. అనిషేధనీయ = మానుపశక్యముగాని, మానుండై = అభిమానము గలవాఁడై, వివస్వత్తనూభవుండు = కర్ణుఁడు, తెలివొంది = ధైర్యముఁ దెచ్చుకొని, అత్యంతవిశ్రుతి = అత్యంతప్రసిద్ధి, నా, సత్త్వమును = బలిమిని, చెందునట్లుగా, నాశౌర్యమునకుఁ గీర్తి వచ్చునట్లుగా ననుట. వీనిఁ జెండివైతుననుచు, సరభసమైన, ఉత్థాన = ఉత్సాహము గలవాఁడై, కరము = మిక్కిలి, లసత్ = ఒప్పుచున్న, దశన్ = అవస్థను - భంగి ననుట. అమ్ములనైపుణి = బాణచాతుర్యము, ముమ్మరముగ, దనుజశార్దూలున్ = ఘటోత్కచుని, మన్యు = క్రోధముచేత, వికృతవదనుఁ గాఁగ, అభ్రమ్మునకున్ = ఆకాశమునకు, పాఱనడఁచెన్ = పాఱఁగొట్టెను.
రామ. అనిషేధ = అడ్డపెట్టుట లేకుండునట్లుగా, నీయమానుండై = కొంపోఁబడుచున్నవాఁడై, వివస్వత్తనూభవుండు = సుగ్రీవుఁడు, తెలివొంది = మూర్ఛఁ దెలిసి, అత్యంతమును, విశ్రుతినాసత్వమును = విగతములైన కర్ణనాసికములు కలవాఁడౌటను, చెందునట్టుగా, సరభస = వేగముతోఁ గూడిన, ఉత్థాన = ఎగయుట కలవాఁడై, కరములన్ = హ స్తములచేతను, సద్ధశనమ్ములన్ = వాఁడిపండ్లచేతను, అవార్యమైన, మన్యున్ = కోపము గల, దనుజశార్ధూలున్ = కుంభకర్ణుని, వికృతవదనుఁ గాఁగ, వ్రచ్చి, అభ్రమ్మునకు, పాఱన్ = ఎగయఁగా, వాఁడు = ఆకుంభకర్ణుడు, అడఁచెను= గ్రుద్దెను.
| వ. | అప్పు డప్పద్మబంధునందనుండు. | 201 |
| తే. | ఈతెఱంగున ఘనదైత్యుచేత నొవ్వఁ | 202 |
రామ. క్రమ్మఱఁ బొదువనీక = మఱిఁ బట్టువడక, అనిభృత = వ్యక్తమైన, ప్రీతితో, తనబలము, కూడన్ = కూడునట్టుగా, చనియెను, దనుజుండు = కుంభకర్ణుఁడు, కనలెను.
భారత. క్రమ్మఱఁ బొదువ = తిరుగ వాని జయించుటకు, నీక చనియె = నీకొక్కనికే చెల్లెను. అని = ఇట్లని, భృత = భరింపఁబడిన ప్రీతితో, వినుతి సేయన్ = స్తోత్రము చేయఁగా, తనబలము = తనసేనను, కూడఁగా, దనుజుండు = ఘటోత్కచుఁడు, కనలెను.
| ఉత్సాహ. | కనలి యసుర ప్రళయకాలు కరణిఁ బేర్చి పగఱ బ | 203 |
భారత. ఆ, శుభలక్షణంబునన్ = శుభమైనయుత్సవముననే, “నిర్వ్యాపారస్థితౌ కాలవిశేషోత్సవయోః క్షణః" అని అ. శూరునికి యుద్ధమే యుత్సవము గనుక, వనజమిత్రసంతతిన్ = కర్ణుని, చేరెను.
రామ. కనలి, అసుర = కుంభకర్ణుఁడు, ఆశు = శీఘ్రమైన, భక్షణంబున, వనజమిత్రసంతతిన్ = సూర్యవంశము గల, అనవద్యున్ = రాముని, చేరెను. కడమ సరి.
| వ. | చేరి యి ట్లనియె. | 204 |
| సీ. | విను నీవు వాండ్రవీండ్రను జయించితి నని | |
| తే. | వైభవాలంబసదనుజ వధవిధి నిను | 205 |
రామ. కుంభకర్ణుఁడు రామునితో ననెడుమాట. భూరిప్రతాప మనెడిసిందూరముచేతను. యశః = కీర్తి యనెడి, చామరములచేతను, అత్యలంకృత = మిక్కిలి నలంకరింపఁ బడిన, కకుబంత = దిగంతములయందున్న, దంతి = గజములు గలవాఁడు, భీమ = భయంకరమైన, సు = లెస్సైన, తుండ = ముఖమందు, “వక్త్రాస్యేవదనంతుండ” మ్మని అ. హుత = వ్రేల్వఁబడిన, త్వత్ = నీయొక్క, ఉద్దండబలము గలవాఁడు, పృథు = అధికమైన, రణవైభవమునకు, ఆలంబ = అవలంబమైన, సత్ = లెస్సైన, అనుజ = నీతమ్ముఁడైన లక్ష్మణునియొక్క, వధవిధిచేత, అని = యుద్ధమందుఁగల, ప్రౌఢి గనుటకు, తగన్ = తగునట్టుగా, నిను మ్రింగఁగదిసితిని, దాశరథివరేణ్య-సంబుద్ధి. నీశౌర్యకథలు సభలను, కర్ణకఠినములు = వినఁగూడకున్నవి.
భారత. కర్ణునితో ఘటోత్కచుఁ డనెడుమాట. అత్యలంకృతములైన దిగంతదంతులయొక్క, కుంభకర్ణ = కుంభస్థలములును జెవులును గలవాఁడు, క్రమముననే యలంకార మిది, భీమసుతుండు = భీమునికుమారుఁడు, ఆహుత = భస్మము సేయఁబడిన, త్వత్ = నీయొక్క, ఉద్దండబలములు గలవాఁడు, పృథు = అధికమైన, రణవైభవము గల, అలంబసదనుజునియొక్క వధవిధిచేత నినుఁ గలఁచి మ్రింగఁ గదిసితిని = ఆలంబాసురుని జంపితిని, నిన్నును మ్రింగఁగదిసితిననుట. నిలునిలుము, అని = ఇటని, ప్రౌఢి గనుటకు, ఆశ తగదు, తొల్లింటివలె రణప్రౌఢి నాముందరఁ జెల్లదనుట. రథివరేణ్య = కర్ణ - సంబుద్ధి. నీశౌర్యకథలు = పంతములు, ఇవి చెల్లవని తాత్పర్యము.
| క. | అని చూపఱ కద్భుతముగ | 206 |
భారత. తత్ = ఆకర్ణునియొక్క, శక్తిన్ = ఇంద్రదత్తశక్తిచేత.
రామ. తత్ = ఆరామునియొక్క, శక్తిన్ = బలిమిచేత, కడమ సులభము.
| తే. | అంత నత్యుగ్ర మగుపోరు గొంత జరుగ | 207 |
రామ. అఖిలరణకళాధికులైన, అరి = శత్రువులయొక్క, గాంభీర్యమనెడి, తోయధి = సముద్రమునకు, ఘటోద్భవుండు = అగస్త్యుఁడైనవాఁడు, అతికాయాభిఖ్యుఁడు = అతికాయుఁ డనువాఁడు, ద్రుపదముఖ్యులన్ = వనచరశ్రేష్ఠులను - వానరముఖ్యుల ననుట. వధించెను.
భారత. అంతన్ = ఘటోత్కచుండు నొచ్చినతరువాత, అతి = అత్యంతమును, కాయాభిఖ్య = దేహకాంతిగలవాఁడు, "అభిఖ్యా నామశోభయోః" అని వి. అశ్ర ముఁడు గనుక దేహకాంతి తఱుగ దనుట. రణకళాధికారి, గాంభీర్యతోయధి, ఘటోద్భవుండు = ద్రోణుఁడు, ద్రుపదముఖ్యులన్ = ద్రుపదుఁడు మొదలయినవారిని, వధించెను.
| మ. | అనివార్యుం డతఁ డంతటం దనయమిథ్యామృత్యువార్తాప్రవ | 208 |
భారత. అతఁడు = ద్రోణుఁడు, అంతటను, తనయ = కుమారునియొక్క - అశ్వత్థామయొక్క, మిథ్యా = అసత్యమైన, మృత్యువార్తాప్రవర్తనచేత, తను, తనునిర్ముక్తునిన్ = దేహనిర్ముక్తునిఁగా, చేయుచున్ - తనకుఁ దానే దేహము విడుచుచు ననుట. విశిఖ = బాణములయొక్క, సంధానమందు నతివేగమైన, ప్రపంచన = ప్రయోగమందును, సౌమిత్రి = లక్ష్మణుండైనవాఁడు, అనేకయుద్ధములయందు, కృతి = నేర్పరియైనవాఁడు, ధృష్టద్యుమ్నుఁడు, ఏపారఁగా, గురు = అధికమౌనట్టుగా, పెద్దలయొక్కయనికాని, మానసమందు, ఆర్పిత= పెట్టఁబడిన, విషాదముచేతిగ్లాని గలవాఁ డయ్యెను.
రామ. అతఁడు = అతికాయుఁడు, తన = తనయొక్క, విశిఖసంధానమందలి యతివేగముయొక్క, ప్రపంచనన్ = విస్తరించుటచేత, “పచివిస్తారే” అని ధాతువు. సౌమిత్రి = లక్ష్మణుఁడు, యుద్ధకృతి = యుద్ధక్రియయందు, ధృష్ట = దృఢమైన, ద్యుమ్న = సత్త్వము గలవాఁడు, “ద్యుమ్నం స్యాచ్చ బలే ధనే” అని వి. ఏపారఁగా, తనున్ = తన్ను, తనునిర్ముక్తునిఁ జేయుచు, తనయొక్క, అమిథ్యా = సత్యమైన, మృత్యువార్తయొక్క, ప్రవర్తనచేత = వినిపించుటచే, గురు = తండ్రియైన రావణునియొక్క, మానసమం దర్పితవిషాదగ్లాని యయ్యె నని యన్వయము. అతికాయుఁడు నొచ్చెను, ఆవార్త విని రావణుఁడు కస్తిపడెననుట.
| వ. | అంత. | 209 |
| సీ. | గురుదివ్యబాణచాతురిని మీఱినవాని | |
| | కత్యాదరతఁ బంచె నస్త్రనైపుణిఁ జూపె | |
| తే. | చేష్టు లైరి తద్బ్రహ్మాస్త్రవిజృంభణమున | 210 |
రామ. గురు = అధికమైన, దుర్యోధనుండని = యుద్ధము సేయ శక్యము గానివాఁడని, బహుభ్రాతృనాశముచేతఁ గఠోరతరములైన, మన్యున్ = శోకక్రోధములు గలవాని, దశముఖుఁడు = రావణుఁడు, పంచెను = అంపెను. తత్ = ఆయింద్రజిత్తుయొక్క, బ్రహ్మాస్త్రవిజృంభణమున కెదురులేక, మూర్ఛన్ = మూర్ఛచేత, మానమదము లడఁగఁగా, ప్రతివీరులు = రామాదులు, అపగతరణచేష్టులైరి, తత్ = ఆబ్రహ్మాస్త్రముయొక్క, ప్రతివిధాన = ప్రతిక్రియకు, కుశల= సమర్థమునై, అచ్యుత = స్థిరమైన, ప్రయత్నముచేత.
భారత. గురున్ = ద్రోణుని, మీఱినవాని, ద్రోణునియొక్క గారాపుబట్టిని, ఉగ్రుఁడైనవాని, ఆతీవ్రబలుని, ఇవి యశ్వత్థామకు విశేషణములు. దుర్యోధనుండు, అనిన్ = యుద్ధమందు, గెల్చును, ఒనర్పఁగ జాలునని, బహుభ్రాతృనాశముచేతఁ గఠోరతరమైన మన్యుదశ గల ముఖము గలవాఁడు - ఇది దుర్యోధనునికి విశేషణము. అరివధమునకుఁ బంచెను. తద్బ్రహ్మ = ఆబ్రాహ్మణునియొక్క, అస్త్రవిజృంభణమునకు, మూర్ఛత్ = వ్యాపించుచున్న, “మూర్ఛామోహసముచ్ఛాయయోః” అని ధాతువు. మానమును మదము నడఁగఁగా, తత్ = ఆబ్రాహ్మణునిబాణముయొక్క, ప్రతివిధానమునకు, కుశల = సమర్థుఁడైన, అచ్యుత = కృష్ణునియొక్క, ప్రయత్నమున, ప్రతివీరులు, అపగత = విడువఁబడిన, రణచేష్ట గలవార లైరి యని క్రిందటి కన్వయము. కృష్ణునిమాటవలన నాయుధములు పడవైచి యానారాయణాస్త్రమునకు నమస్కరించి రనుట. అపుడు, ఆనిలసుతుఁడు = భీముఁడు, బిరుసు డింపక యొప్పెను = నమస్కరించక యుండెననుట.
| వ. | అంత. | |
| ఆ. | అతఁడు సకలసైన్యవితతిని సంజీవ, నౌషధీసమాన యన విహితపు | 211 |
రామ. అతఁడు = హనుమంతుఁడు, సకలసైన్యవితతిని, సంజీవనౌషధులయొక్క, సమానయన = తెచ్చుటచేత, విహితమైన, పునఃప్రతిష్ఠగాన్ = తిరుగ బ్రతుకుట గలదానిఁగా, ఒనర్చి, శౌర్యముయొక్కయు, విక్రమ = అధిక సామర్థ్యముయొక్కయు, నయ = నీతియొక్కయు, చర్యను నడపెను.
| తే. | అపుడు మనుజేంద్రముఖ్యు లాహరి నుతించి | 213 |
రామ. హరిన్ = హనుమంతుని, నారాయణ - ఆశ్చర్యవాక్యము, మహాస్త్ర = బ్రహ్మాస్త్రముయొక్క.
భారత. మనుజేంద్రముఖ్యులు = ధర్మరాజాదులు, రెంటికి సరి. కడమ సులభము.
| చ. | అలఘువిపన్మహార్ణవము నట్లు తరించి పునర్మహోద్ధతిన్ | 214 |
భారత. తద్రజని = ఆరాత్రి, వేగన్ = వేగఁగా, అందు= ఆయుద్ధమందు.
రామ. తద్రజనిన్ = ఆరాత్రియందు.
| మ. | రవిపుత్రుం డని కిట్లు పూని ప్రతిగర్జద్వీరసంహారకౢ | 215 |
రామ. రవిపుత్రుండు = సుగ్రీవుఁడు, ప్రతిగర్జత్ = మాఱుమలయచున్న, వీర = శత్రువులయొక్క, సంహారముయొక్క, కౢప్తి = చేఁతచే, విరాజత్ = ప్రకాశింపుచున్న, భీష్మ = భయంకరుఁడైన, కుంభ = కుంభుఁ డనెడి కుంభకర్ణునికుమారునియొక్క, జయము చేత, శోభి = ఒప్పుచున్న, వ్యాప్తిన్ = వ్యాపారముచేత, మనుష్యవిభుండు = రాముఁడు, ఉబ్బఁగ, మీఱెను. ఆప్రబలదోషాచారి = ఆప్రబలుఁడైన నక్తంచరునియొక్క, “దోషానక్తంచరజనీ" అని వి. తోఁబుట్టుగున్ = తమ్ముఁడైన నికుంభుని, దుశ్శాసన = ఆణఁపరాని, అభిఖ్యునిన్ = కాంతి గలవాని, "అభిఖ్యా నామశోభయోః” అని అ. పవనాత్మజుండు కూల్చెను.
భారత. రవిపుత్త్రుండు = కర్ణుఁడు, విరాజచ్ఛరములు గల భీష్మునియొక్క, కుంభజ = ద్రోణునియొక్కయు, యశోభివ్యాప్తిని, మనుష్యవిభుండు = దుర్యోధనుఁడు, ఉబ్బఁగ మీఱెన్ = భీష్మద్రోణులకంటెను లెస్సగా జగడము చేసెననుట. ఆప్రబలదోషాచారి = మిక్కిలి దురాచారియైన దుర్యోధనునియొక్కతోఁబుట్టుగును, దుశ్శాసనాభిఖ్యునిన్ = దుశ్శాసనుఁ డనెడుపేరు గలవాని, పవనాత్మజుండు కూల్చెను.
| వ. | అంత. | 216 |
| సీ. | ఆహవమహిమకరాక్షయాతులసత్ప్ర | |
| ఆ. | స్వశ్రితనికురుంబవనశిఖిమేఘనా | 217 |
భారత. ఆహవ = యుద్ధముయొక్క, మహిమకర = ప్రభావమును జేయుచున్న, అక్షయ = అక్షయము నయి, అతుల = సరిలేని, సత్ప్రతాపము తనరునట్టుగా, సూర్యసంతతినరవర్యుండు = కర్ణుఁడు, వృత్తిచేతఁ బ్రబలువాని ధర్మరాజును వీడుఁ జొరఁగఁ దఱిమెను. తత్ = ఆ, భ్రాతృభంగమంతయు నప్పు డరసి, వాసవి = అర్జునుఁడు, స్వశ్రిత = నిజాశ్రితు లనెడు, వనశిఖి = అడవినెమళ్లకు, “శిఖావళశ్శిఖీ కేకీ" అని అ. మేఘనాదమువంటి, అభిధాన = పేరుగలవాఁడు, అర్జునునికి విశేషణము. ఆబలాఢ్యుమీఁద నడచి, సాయకములన్ = బాణములచేత, నభమున నుండి = ఆకాశమం దుండి, నిర్జరులు బెగడునట్టుగా దుర మొనర్చెను.
రామ. ఆహవమహిన్ = యుద్ధభూమియందు, మకరాక్షయాతు = మకరాక్షుఁ డను ఖరాసురుని పుత్త్రునియొక్క, “నైరృతో యాతు రక్షసీ" అని అ. లసత్ప్రతాప మత్యంతము తనరుచుండఁగాఁ గనలి, సూర్యసంతతినరవర్యుండు = రాముఁడు, వృత్తిచేతఁ బ్రబలెడువానిని = ఆమకరాక్షుని, ధర్మరాజువీడు = యమలోకమును, చొరంగఁ దఱిమెన్ = చంపె ననుట, తద్భ్రాతృభంగము = ఆమకరాక్షునిమరణమును, అరసి, వాస = గృహము వల్లనుండి, వినిర్గతుండయి, స్వశ్శ్రిత = దేవత లనెడి, వనమునకు, శిఖి = అగ్నివంటివాఁడు, మేఘనాదాభిధానుఁడు = ఇంద్రజిత్తు, ఆబలాఢ్యుమీఁదన్ = సేనతోఁ గూడిన రామునిమీఁద, నడచి నభముననుండి దురమొనర్చెను.
| వ. | ఇట్లు పోరిపోరి. | 218 |
| ఉత్సాహ. | వెరవు నేపుఁ జూపెడు ప్రతివీరువిక్రమక్రియా | 219 |
రామ. గరిమ = మహత్త్వమును, మును = మునుపు.
భారత. గరిమమును = అతిశయమును. కడమ సరి.
| మ. | బలదీప్తాశుగసంతతిప్రబలితస్ఫారప్రతాపోదయో | 220 |
భారత. బలదీప్తమయిన, ఆశుగసంతతి = బాణజాలముచేత, ప్రబలితమైన, స్ఫార = ప్రకాశింపుచున్న, ప్రతాపోదయముచేత నుజ్జ్వలమయిన, సంయత్ = యుద్ధమందుఁ గల, “సంయత్సమిత్యాజిసమిద్యుద్ధ” మని అ. రభసంబు= ఆటోపము, రుద్రునియొక్క, మఖసంచారక్రియన్ = దక్షాధ్వరక్రీడను, మీఱఁగా నట్టియెడను, ఆనాకీశసంతానము = అర్జునుఁడు, ప్రతివీరుని = కర్ణుని, నలఁగించెను. అయ్యలఘుస్థేముఁడున్ = కర్ణుఁడును, తత్ = ఆయర్జునునియొక్క, ప్రతాపశిఖిన్ = ప్రతాపాగ్నిని, మాయం జేసి యార్చెను.
రామ. బలదీప్తుఁడైన, ఆశుగసంతతి = హనుమంతునిచేత, ప్రబలిత = ప్రబలముగాఁ జేయఁబడిన, స్ఫారప్రతాపోదయముచేత నుజ్జ్వలమైన, సంయత్ = యుద్ధముయొక్క, రభసంబు = వేగము, ఉరు = అధికమైన, ద్రుమ = వృక్షములయొక్క, ఖసంచారక్రియన్ = ఆకసమున విసరివేయుటచేత, మీఱఁగాన్ = మిక్కి_లియు నొప్పఁగా, నానా, కీశసంతానము = వానరసమూహము, ప్రతివీరున్ = ఇంద్రజిత్తును, నలఁగించెను, అయ్యలఘుస్థేముఁడున్ = అధికస్థైర్యముగల యాయింద్రజిత్తును, మాయం జేసి = మాయచేత, తత్ = ఆవానరసమూహముయొక్క, ప్రతాపశిఖిని, ఆర్చెన్ = చల్లార్చెను.
| వ. | అంత. | 221 |
| క. | మాననిధి జిష్ణుఁడు సుమి | |
| | మానసధృతిఁ బెనుపఁగ నరి | 222 |
రామ. జిష్ణుఁడు = జయశీలుఁడు, సుమిత్రానందనుఁడు = లక్ష్మణుఁడు.
భారత. సుమిత్ర = బంధువులను, ఆనందనుఁడు = సంతోషపెట్టెడువాఁడు. మానసమందుఁ గల, ధృతిన్ =సంతోషమును, కడమ సరి.
| క. | శరవర్ష మిట్లు గురియుచుఁ | 223 |
భారత. మహత్ = అధికమైన, బలజయములయొక్క, అనుభావస్థైర్యస్ఫురణచేతనాఢ్యుని, అతనిన్ = అర్జునుని, అతఁడు = కర్ణుఁడును, నారాచవృష్టి చత, సంవృతుఁ జేసెన్ = ఆవరింపఁబడ్డవానిఁగాఁ జేసెను.
రామ. మహాబలజ = హనుమంతుఁడు, యానున్ = వాహనముగాఁ గలవాని, అతనిన్ = లక్ష్మణుని, అతఁడున్ = ఇంద్రజిత్తును, చేసెను, కడమ సులభము.
| వ. | ఇట్లు దలపడి. | 224 |
| ఆ. | సరిగఁ బోరి రక్కజపుజోదు లిరువురుఁ | 225 |
రెంటికి సరి సులభము.
| సీ. | ఒండొరులసరోషహుంకృతిఁ గెరలుచుఁ | |
| తే. | లలి నొకరొకళ్లకడకల లక్ష్మణేంద్ర | |
| | సలిపి రొకకొంతతడవు వాసవవిరోచ | 226 |
రామ. లక్ష్మణేంద్రజిత్తులు, ఆభీలశౌర్యులై, వాసవ = ఇంద్రునియొక్కయు, విరోచనాత్మజ = బలియొక్కయు, సామ్యవిస్ఫూర్తి యావహిల్లఁ జిత్రరణమును జలిపిరి.
భారత. లక్షణునియొక్కయు, ఇంద్రజిత్ = మేఘనాదునియొక్కయు, తులా = సామ్యముచేత, ఆభీల = భయంకరమైన, శౌర్యము గలవారై, వాసవవిరోచన = ఇంద్రసూర్యులయొక్క, ఆత్మజులు అర్జునకర్ణులు, "ద్వంద్వాంతే శ్రూయమాణం పదం ప్రత్యేక మభిసంబధ్యతే" అనున్యాయమువల్ల వాసవాత్మజుఁడును విరోచనాత్మజుఁడు ననుట.
| వ. | అంత. | 227 |
| ఆ. | చతురశల్యరచితసారథ్యయోగాధి | 228 |
భారత. చతురుఁడైనశల్యునిచేత రచితమైన సారథ్యయోగమువల్ల, అధిగత = పొందఁబడిన, మదాతిశయము గలవాని, ప్రతిభటునిన్ = కర్ణుని, వధించెను, విజయుండు, రాముతమ్ముఁడు, కృష్ణుఁడును.
రామ. చతుర, శల్య = బాణములచేత, 'శల్యంవంశశలాకాయాంశంకుతోమరయోరపి, శల్యఃకశ్చిన్మహీపాల శ్శ్వానిన్మదనపాదపః' అని రత్నమాల, రచితమైన సారథియొక్క, అయోగ = వియోగముచేత నయిన, అధి = మనోవ్యధచేత, గత = పోయిన, మదాతిశయము గలవాని, ప్రతిభటునిన్ = ఇంద్రజిత్తును, ప్రథితమైనట్టి యాజివిజయము గలవాఁడు, రాముతమ్ముఁడు = లక్ష్మణుఁడు, వధించెను.
| సీ. | అతిదుర్జయుం డైన ప్రతివీరు నిట్లు రూ | |
| తే. | బ్రాణములు వెచ్చవెట్టక బ్రతికి పోవ | 229 |
రామ. ఆమఱునాఁడు, ప్రౌఢిమత్ = ప్రకాశముగల, రవి = సూర్యునియొక్క, భ = కాంతివంటికాంతి గలవాఁడు, ప్రదళిత, బహువైరి, పంక్తిగళుఁడు = రావణుఁడు, నాకు, నరుఁడు = మనుష్యుఁడు, ఏమి లెక్క యనుచుఁ దనకు, ఉరుబలౌఘ = అధికసేనాసమూహముయొక్క, రక్షావిధానమహిమ, కడఁకన్ = రోషమును, పెనుపంగ, అతనిపైన్ = రామునిమీఁద,.
భారత. ప్రౌఢిచేత, ప్రదళితములైన బహువైరిపంక్తులయొక్క గళములు గలవాఁడు, మద్రవిభుండు = శల్యుఁడు, సేనానియై = దళవాయియై, తనయొక్క కురుబలౌఘముయొక్కయు, అతనిపైన్ = ధర్మరాజుమీఁద, పోరెను, కడమ సులభము.
| వ. | అప్పుడు. | 230 |
| తే. | ఆనృపతి సైన్యమును గదనాతిలోలు | 231 |
భారత. అనృపతి = ధర్మరాజు, కదన = యుద్ధమందు, అతిలోలుభ = అతిప్రియులైన, “లోలుపో లోలుభో లోలః" అని అ. అనుజుల = తమ్ములయొక్క, సద్భుజాశక్తిని బ్రాపుగఁ గొని, తత్ = ఆశల్యునియొక్క, తేజంబు నాఁగెను. అనిన్ = యుద్ధమందు, విరూపాక్షుఁ డనన్ = రుద్రుఁ డనఁగా, పర్వు = ఒప్పెడి, అతఁడు = శల్యుఁడు, అతనిన్ = ధర్మరాజును, నొంచెన్ = నొప్పించెను.
రామ. ఆనృపతి = రాముఁడు, సైన్యమును, కదనాతిలోలుఁడైన, భానుజున్ = సుగ్రీవునిని, లసద్భుజాశక్తినిఁ బ్రాపుగఁ గొని, తత్ = ఆరావణునియొక్క, శల్య = బాణములయొక్క, తేజంబు నాఁగెను, అతనిన్ = సుగ్రీవుని, విరూపాక్షుఁ డనఁ బర్వునతఁడు = విరూపాక్షుఁ డనెడు రాక్షసుఁడు, మెఱసి నొంచెను.
| వ. | ఇట్లు నొప్పించిన నిప్పులు గురియుకోపంబునం జూపు దీపింప నాసమర | 232 |
రెంటికి సరి సులభము.
| ఆ. | ఇతఁడు మామకాజి చతురతఁ దెగకపోఁ | 233 |
రామ. ఇతఁడు = విరూపాక్షుఁడు, ామక = నాసంబంధమైన, ఆజిచతురతన్ = యుద్ధచాతుర్యముచేత, తెగకపోఁడు, అనుచు, కినుకఁగెరలు = కోపోద్రిక్తుఁడైన, రవిసూనునందున్ = సుగ్రీవునియందు, అనుభావము = ప్రభావము, వెలింగెను.
భారత. ఇతఁడు = ధర్మరాజు, మామకున్ = శల్యునిపట్లను, ఆజిచతురత = ఆజిచాతుర్యముచేత, తెగకపోఁడు = ఆగ్రహింపకమానఁడు, అనుచు నాప్తులెల్లఁ జెలఁగ, రవిసూనునందను = ధర్మజునియొక్క, భావము వింతయై వెలింగెను.
| వ. | అవ్వీరశార్ధూలంబు పెద్దయుం బ్రొద్దు దద్దయు నుద్దీప్తశౌర్యుండై. | 234 |
రెంటికిని సరి.
| క. | అని సేసి చేసి యంతట | 235 |
భారత. యుద్ధమహియందు, మాతులునిక్ = మేనమామయైన శల్యుని, "మాతుర్భాతాతుమాతులః” అని అ. విరూపాక్షునిశక్తిప్రౌఢిచేతన్ = రుద్రుఁ డిచ్చినశక్తిమహిమచేత, కూల్చి = చంపి, చెలంగెన్ = సంతోషమున నుప్పొంగెను.
రామ. యుద్ధమహిమచేత, అతులునిన్ = సరిలేనివాని, విరూపాక్షుని, శక్తి = సత్త్వముయొక్క, ప్రౌఢిచేతఁ గూల్చి చెలంగెను.
| క. | పరదుస్సహశల్యమహో, దరనాశన మాచరించి తమసైనికులన్ | 236 |
రామ. పర = శత్రువులకు, దుస్సహములైన, శల్య = బాణములుగల, "శల్యం వంశశీలాకాయాం శంకుతోమరయోరపి శల్యః కశ్చిన్మహీపాలః” అని నిఘ. మహోదర = మహోదరుఁ డనెడురాక్షసునియొక్క, నాశనము నాచరించి, అలరించిన, అతనిన్ = సుగ్రీవుని, హరిముఖ్యులు = కపిశ్రేష్ఠులు, నుతించిరి = పొగడిరి.
భారత. పరదుస్సహమైన, శల్యమహః = శల్యునిపరాక్రమమువల్లనైన, దర = భయముయొక్క, “దరో స్త్రియాం భయే శ్వభ్రే" ఆని అ. అతనిన్ = ధర్మరాజును, హరిముఖ్యులు = కృష్ణాదులు, పొగడిరి, కడమ సరి.
| తే. | అంతఁ దద్భ్రాతృపుత్త్రబలాతిశయము | 237 |
భారత. అంత, తత్ = ఆధర్మరాజుయొక్క, భ్రాతృ = తమ్ములైన భీమాదులయొక్కయు, పుత్త్ర = ప్రతివింద్యాది ద్రౌపదేయులయొక్కయుఁ, బల = ధృష్టద్యుమ్నాదిబలముయొక్కయు, అతిశయము, తనున్ = తన్ను, మహత్ = అధికమైన, పార్శ్వబల = పరివారముయొక్క, నాశమునన్ = హానిచేత, ఉడుకుచున్న దుర్యోధనుని, ఉగ్రములైన, మన్యు = శోకరోషములయొక్క, దశ = అవస్థగల, ముఖున్ = ముఖము గలవాని, దుర్యోధనునికి విశేషణము, ఉలూకునియొక్కయు, శకునియొక్కయు, పాతము = నాశనము, కలంచెన్= వ్యాకులపడఁజేసెను.
రామ. అంత, తత్ = ఆసుగ్రీవునియొక్క, భ్రాతృపుత్త్రుఁడైన యంగదునియొక్క బలాతిశయము, మహాపార్శ్వ = మహాపార్శ్వుఁడనెడు రాక్షసునియొక్క, బలనాశమునన్ = కూల్చుటచే ననుట, తనున్ = తన్ను, నలచఁగ, దుర్యోధనున్ = యుద్ధము సేయ శక్యము గానివాని, దశముఖున్ = రావణుని, ఉలూక = గూబలనెడి, శకుని = పక్షులయొక్క, “ఉలూకస్తు వాయసారాతి పేచకౌ" అని అ. పాతము = పాటు, కలంచెను, అవకుశనమాయె ననుట.
| సీ. | ఆదుష్టవర్తనుఁ డప్పటితుదకు ని | |
| తే. | కాగతిని దన్నృపతిబలశ్రీ గలంగ | 238 |
రామ. ఆదుష్టవర్తనుఁడు = రావణుఁడు, వగచుచు, వైరినృపతిని, అనుజుఁడైనలక్ష్మణునియొక్కయు విభీషణునియొక్కయు నుదగ్రవిక్రమసహాయత్వముచేత విజృంభించు మహాప్రతాపునిన్ = రఘునాయకుని, తలపడన్ = మార్కొనుటకు, చాలన్ = మిక్కిలి, నితాంత=అధికమయిన, ధైర్యంబుతో, ద్వైప = ద్వీపసంబంధమైన, ఆయన = మార్గమందుఁ గల, హ్రదమతల్లికా = హ్రదశ్రేష్ఠముయొక్క - మంచిమడుగుయొక్క యనుట, గతిని = ప్రకారమున, తన్నృపతి = ఆరామునియొక్క, బల = సేనలయొక్క, శ్రీ = శృంగారము, కలంగఁగా, అరిగెనని క్రిందటి కన్వయము. అరిగి = ఈలాగు నడచి, తత్ = ఆరామునియొక్క కాండచయంబులోనన్ = బాణసమూహములోను, మునిఁగెను, మునిఁగి = ఈలాగు మునిఁగి, దానిన్ = ఆబాణసమూహమును, తిరమై, నవమైన, ఆస్తంభ = జాడ్యము లేని - ప్రకాశించుచున్నదనుట, ధర్మ = వింటియొక్క, పటిమన్ = సామర్థ్యముచేత, మేను మోయకుండ, ఆఁగెను = అస్త్రములకుఁ బ్రత్యస్త్రముల నేసెను.
భారత. ఆదుష్టవర్తనుఁడు = దుర్యోధనుఁడు, అనుజ = తమ్ములయొక్క, విభీషణ = భయంకరమునయి, ఉదగ్ర = అధికమైన, విక్రమసహాయత్వముచేత, మహాప్రతాపుని, వైరినృపతిన్ = ధర్మరాజును, తలపడఁజాలని = ఎదిరింపలేని, తాంత = తగ్గిన, ధైర్యంబుతో ద్వైపాయన మనెడి, హ్రదమతల్లికిన్ = హ్రదశ్రేష్ఠమునకు, ఆగతిని = ఆప్రకారమున - ఒంటికాఁడై యనుట. తన్నృపతి = ఆదుర్యోధనుఁడు, అరిగెను, తత్ = ఆమడుగుయొక్క, కాండచయంబులోనన్ = నీళ్లలోపల, మునిఁగి, తిరమైన, వాఃస్తంభనయొక్క ధర్మగుణముయొక్క పటిమచేత, దానిన్ = ఆయుదకమును, మేను మోయకుండ నాఁగెను, జలస్తంభనవిద్య కలదు గనుక.
| వ. | అట్టిసమయంబున. | 239 |
| చ. | అయమితభీమశక్తివిహితానుజపాతనుఁ డై గృశించుచు | 240 |
భారత. అయమిత=అణఁపఁబడని, భీమునియొక్క, శక్తి = బలిమిచేత, విహిత = చేయఁబడిన, అనుజపాతనుఁడై = దుశ్శాసనాదినాశము గలవాఁడై, అహత = అడఁగని, శోకము గలవాఁడు, మనుజనాథుఁడు = దుర్యోధనుఁడు, భీముని, విముక్తవిగ్రహున్ = శరీరరహితునిగా, అను = అనెడి, ఖేదమున, దురటిల్లెన్ = కెరలెను.
రామ. అయమిత = అడ్డపెట్టఁబడని, భీమమైన శక్తిచేత విహితమైన, ఆనుజ = లక్ష్మణునియొక్క, పాతనముగలవాఁడై కృశించుచు, నయ = నీతిచేత - ఇది శోకసమయము గాదనునీతిచేత ననుట, హతిశోకుఁ డమ్మనుజనాథుఁడు = రాముఁడు, భీమున్ = భయంకరమైనవాని, మహావిపక్షున్ = రావణుని, విముక్తమైన, విగ్రహ = యుద్ధము గలవానిఁగా, ఒనర్చి = పాఱఁద్రోలి యనుట, దురటిల్లెను, కడమ సమము.
| సీ. | అంతలావునఁ బేర్చి యనిలజుండు నిజాను | |
| తే. | వంశమున కెల్లఁ గీర్త్యభావంబు మిగుల | 241 |
రామ. అంతన్ = అంతటను, అనిలజుండు = హనుమంతుఁడు, నిజానుజ = లక్ష్మణునియొక్క, ప్రాణదానంబు = బ్రతికించుటను, చలిపి, మోదసంపదలు = సంతోషాతిశయములను, నింపుచునుండఁగా, ఆనృపాలుఁడు రాముఁడు, ఎంచినప్రకారము చెప్పుచున్నాఁడు, ఈతఁడు = హనుమంతుఁడు, బ్రతుకుమందుల = సంజీవనౌషధులయొక్క, నగమును, వినివారిత = మిక్కిలివారింపఁబడిన, ఊనతాదోష = న్యూనత్వదోషము గల, సత్త్వారూఢిచేత, సమానుఁ డగుచు, మానసహితుఁడై, కీర్త్య = కీర్తనీయమైన, భావంబు = వర్తన, మిగులఁగా, తెచ్చెనని క్రింది కన్వయము. జగతిలోనను, జనౌఘము = జనసమూహము, నవగుణ = మనోహరగుణములచేత, అధికునిఁగా నెన్నకున్నె.
భారత. అంత = అంతైన, లావునన్ = బలిమిచేత, అనిలజుండు = భీముఁడు, నిజానుజ = దుశ్శాసనునియొక్క, ప్రాణదానంబు = ప్రాణఖండనమును, చలిపి, తనదుమదిలో, అమోదసంపదలు = ఖేదాతిశయములను, నింపుచునుండ, ఆనృపాలుఁడు = దుర్యోధనుఁడు, ఎంచెను, ఖ్యాతిమిక్కిలి, నివర్తిలుచుండ = పోవుచుండఁగా, బ్రతుకు = బ్రతుకుచున్న, మందుల = నిర్భాగ్యులను, "మూఢాల్పాపటునిర్భాగ్యమందాః” అని అ. నగన్=నవ్వఁగా, మును = ముందర, మానుగ, విని = వినియుండియు, వారితోన = వారితో నట్టె, తాన్ = తాను, దోషముయొక్క, సత్త్వ = బలిమియొక్క, ఆరూఢిని = ప్రసిద్ధిచేత, సమానుఁడగుచున్ = సరియైనవాఁడై, వంశమునకెల్ల కీర్తియొక్క యభావంబును, తెచ్చెనని క్రింది కన్వయము, ఈతఁడు అనిజగతిలో, ననున్ = నన్ను, అవగుణాధికునిఁగాన్ = అవివేకిఁగా, ఎన్నకున్నె = ఎంచునే యనుట.
| ఉ. | ఎంతయు నిబ్బరం బయిన యీహనుమద్బలయుక్తిఁ జేసి యేఁ | |
భారత. ఈహను = కోరికను, మద్బలయుక్తిన్ = నాబలిమిచేత, పరిపంథుల = శత్రువులను, త్రుంచుట యెప్పుడు - ఇది యుత్సాహవాక్యము. సమీరసుతు = భీమునియొక్క, చేఁతకు నీడుగఁ జేసి యశఃస్ఫురణంబును, ఆర్జింతునొకో యని యన్వయము.
రామ. ఈ, హనుమత్ = హనుమంతునియొక్క, బలయుక్తిఁ జేసి = బలయోగముచేత, నేను, పరిపంథుల, త్రుంచుట = సంహరించితిఁగదా, సమీరసుతు = హనుమంతునియొక్క, చేఁతకున్ = ఉపకారమునకు, ఈడుగఁ జేసి = ప్రత్యుపకారముఁ జేసి, యశఃస్ఫురణంబును, ఆర్జింతునొకో = కాకుస్వరము.
| వ. | అని తలపోయుచు రిపుజయప్రయతమానమానసుం డయ్యె నంత. | 243 |
| సీ. | చలపట్టి తనుఁ జంప నముదితోపాయప | |
| తే. | భీముఁ దాఁకె నపూర్వసంభృతరణరస | 244 |
రామ. ధర్మరాజు = యముఁడు, వెడలఁ ద్రోయఁగ, తనవారి = తనమూఁకలయొక్క, నిర్గమోద్ధతి వెరఁగొనర్పఁగ, లంక విడిచి, రాజరాజుసయిదోడు = కుబేరునితమ్ముఁడు రావణుఁడు, సూడుబంటయి = పగదీర్చుకొనువాఁడై, మదనుజఘాతినిన్ = కుంభకర్ణునిఁజంపిన, నరవరున్ = రాముని, తాఁకెను, వారు రామరావణులు, కదలన్ = చలింపఁగాను, బిరుసు నెరపన్ = శౌర్యము చూపఁగాను, మండలగతిఁ దిరుగ, గదుమన్ = వీఁగనొత్తఁగాను, నారదునకు నయనతుష్టి యబ్బెను.
భారత. చలపట్టి వెదకుచు, ధర్మరాజు = పాండవజ్యేష్ఠుఁడు, వెడలఁద్రోయఁగన్ = వెళ్లఁదీయఁగా, తన = తనయొక్క, వారి = నీళ్లలోనుండి, నిర్గమోద్దతి = వచ్చెడువడి, వెరఁగొనర్ప, కలంక విడిచి, రాజరాజు = దుర్యోధనుఁడు, సయిదోడుసూడుబంటయి = తమ్ములపగ దీర్చుకొనువాఁడై, నరవరుని భీమునిఁ దాఁకెను. వారు = ఆభీమదుర్యోధనులు, గదలన్ = గుదియలచేత, బిరుసు నెరప, అబ్బెను. క్రియ.
| తే. | పొసఁగ నేఁడు గదారణభుక్తి దొరకె | 245 |
భారత. గదారణభుక్తి = గదాయుద్ధానుభవము, తిరమై, నయమ్ములపస = నేర్పుపసను.
రామ. పొసఁగ, నేఁడుగదా, తిరమైన, అమ్ములపసన్ = అస్త్రకౌశలముచేత, కడమ సులభము.
| వ. | ఇట్లు గడంగి మహాయుద్ధంబు సేయునంత. | 246 |
| ఉ. | అంచితనైపుణిం బరఁగు నంబకఘోరతరప్రయుక్తిచే | 247 |
రామ. అంబక = బాణములయొక్క, ఘోరతరమైన, ప్రయుక్తిచేన్ = ప్రయోగముచేత, మించుగ, దానవోద్ధతి = రావణార్ధత్యము, కనంబడుచుండ, రాజులఱేనిన్ = రాముని, చూచి, హరిముఖ్యులు = వానరశ్రేష్ఠులు, శంకించిరి.
భారత. అంచితనైపుణిని, అంబక = నేత్రములకు, ఘోరతరమైన, ప్రయుక్తిచేన్ = వ్యాపారముచేత, మించు, గదా = గుదియలయొక్క, నవ = వింతైన, ఉద్ధతి = ప్రహారములయొక్క, సమృద్ధి = అతిశయము, కనంబడుచుండ, రాజులఱేనిన్ = దుర్యోధనుని, చూచి, హరిముఖ్యులు = కృష్ణాదులు, శంకించిరి, కడమ సమము.
| వ. | తదనంతరంబ. | 248 |
| క. | చేవ చెదరి భీమాశుగ | |
| | డై విమతుఁ డడఁగ జయమున | 249 |
భారత. భీమునియొక్క, ఆశు = తీవ్రమైన, గదా = గుదియయొక్క, అవహతి = మొత్తుటచేత, కృతమైన, ఊరుభంగతా = తొడలు విఱుఁగుట గలవాఁడౌట యనెడి, ఆపత్ = ఆపదలచేత, జ్వలితుండై = మండుచున్నవాఁడై, విమతుఁడు = దుర్యోధనుఁడు, అడఁగఁగా, వైవస్వతసంతతి = యమపుత్త్రుఁడైన, నృవవరుఁడు = ధర్మరాజు, మించెను.
రామ. చేవచెదరి, భీమ = భయంకరములైన, ఆశుగ = బాణములనెడి, దావ = దవానలముయొక్క, హతి = కాల్చుటచేత, కృతమైన, ఉరు = అధికమైన, భంగ = పరాజయములచేతనయిన, తాపముచేత జ్వలితుండై, విమతుఁడు = రావణుఁడు, అడఁగన్ = డీలు పడఁగా, వైవస్వతసంతతి = మనువంశమందుఁగల, నృపవర్యుఁడు = రఘునాథుఁడు, మించెను.
| తే. | భీష్మగురుకర్ణశల్యరణోష్మనమర | 250 |
రామ. భీష్మ = భయంకరమునై, గురు = అధికమునై, కర్ణ = కర్ణములకు, శల్య = ములుకులవంటిదైన, రణ = ధ్వనియొక్క, ఊష్మన్ = ఉగ్రత్వముచేత, అమర = దేవతలకు, ఘోరమగు = భయంకరమైన, యుద్ధము = జగడమును, తే. 'ప్రాణిపదములు వెలిగాఁగఁ బ్రథమలెల్ల, నరయ నొక్కొకచో' ద్వితీయార్థ మిచ్చు' ననులక్షణమువల్లఁ బ్రథమకు ద్వితీయార్థము. అతనితోన్ = రామునితో, వైరి = రావణుఁడు, చలుప, అనుపమ = సరిలేని, ప్రౌఢిమంబు = ప్రౌఢిగల, అది = యుద్ధము, దినములైదురెండును = ఏడుదినములు, ఒండువిఘ్నంబు లేక = ఒకవిఘ్నమును లేక, జరిగెను.
భారత. భీష్మగురుకర్ణశల్యులయొక్క రణమందుఁగల, ఊష్మన్ = ప్రతాపముచేత, అమరన్ = ఒప్పఁగా, ఘోరమగుయుద్ధమును, అతనితో = ధర్మరాజుతో, వైరి = దుర్యోధనుఁడు, అనుపమప్రౌఢిమన్ = ప్రౌఢిచేత, చలుపన్ = నడపింపఁగా, పది, ఐదు, రెండు, ఒండు = ఒకటియు, దినములు = క్రమమున భీష్మాదియుద్ధదినములు, విఘ్నంబు లేకుండ జరిగెను.
| వ. | అంత. | 251 |
| తే. | దిగ్వధూజాలధమ్మిల్ల ధృతవిశుద్ధ | |
| | వేశ మారాత్రిచరగోత్రవిభునిలీలఁ | 252 |
భారత. దిగ్వధూ = దిక్కు లనెడుస్త్రీలయొక్క, జాలముయొక్క, ధమ్మిల్ల = కొప్పులయందు, ధృత = ధరింపఁబడిన, విశుద్ధ = నిర్మలమైన, కీర్తి గలవాఁడు, గురుసూనుఁడు = అశ్వత్థామ, ఆరాజు = ధర్మరాజుయొక్క, కృత్స్న = సమస్తమైన, “కృత్స్నమశేష” మ్మని అ. బలనివేశము = పాళెము, ఆరాత్రి = దుర్యోధనుఁడు పడినదినమురాత్రియందే, చర = చరించెడి, గోత్రవిభుని = హిమవంతునియొక్క, లీలన్ = రీతిచేత, స్వాప = నిద్రచే, "స్యాన్నిద్రాశయనం స్వాప” అని అ. హృత = హరింపఁబడిన, ఉరువిక్రమము గలదౌటచేత, కుందన్ = నిద్రచేత బిరుసు చెడియుండఁగా ననుట. కలఁచెన్ = నొప్పించెను.
రామ. కీర్తి యనెడి, గురు = అధికమైన, సూన = పుష్పములు గలవాఁడు, “సూనం ప్రసవపుష్పయోః” అని అ. ఆరాజు = ఆరఘునాథుఁడు, కృత్స్న = సమస్తమైన, బల = బలిమికి, నివేశము = స్థానమైనవాఁడు, ఆరాత్రిచరగోత్రవిభునిన్ = ఆరాక్షసవంశాధీశ్వరుఁడైనరావణాసురుని, లీలన్ = అవలీలచేత, స్వ = తనచేత, అపహృతమైన, ఉరు = అధికమైన, విక్రమతన్ = విక్రమము గలవాఁడై, కుందన్ = తగ్గుపడునట్టుగా, కలఁచెన్ = చలింపఁజేసెను.
| సీ. | అలఘుదోఃప్రౌఢిమాతులకృతవర్మసా | |
| తే. | తనుభవులసద్వరోదయంబున వెలిఁగెడు | 253 |
రామ. అలఘు = అధికమైన, దోఃప్రౌఢిము = భుజబలముచేత, అతుల = సరిలేనట్టుగా, కృతమైన, వర్మ = జోడుయొక్క, సాహాయ్యకంబునన్ = సహాయత్వముచేత, అభేద్య మైన యాత్మగలవాఁడగుచు, అప్పుడు, ఆవీరయోధాగ్రణి = రాముఁడు, అమరశత్రు = రావణునియొక్క, మస్తకములు కొట్టికొట్టి, ఊర్జిత = స్థిరమైన, బలము గలవాని, ఉత్తమమైన, ఓజున్ = తేజస్సు గలవాని, కృష్ణతనున్ = నీలదేహుని, భవు = ఈశ్వరునియొక్క, వరోదయంబున వెలిఁగెడు, సంగరకృతి = యుద్ధక్రియయందు, ధృష్ట = ధీరమైన, ద్యుమ్నున్ = శౌర్యము గలవాని, "ద్యుమ్నుం విత్తే పరాక్రమే” అని వి. శాత్రవులయొక్క, అసు = ప్రాణములనెడి, పృథుపణి = క్రూరసర్పములకు, శిఖండిన్ = నెమలివంటివాని, ఇట్టిరావణుని, భీమవిజయదీప్తమైన మహిమచేత, తెగటార్చి = చంపి, ఉదీర్ణ= ప్రసిద్ధమైన, తేజస్సు గలవాఁ డాయెను.
భారత. అలఘుదోఃప్రౌఢిగల, మాతుల = మేనమామయయిన కృపునియొక్కయు, కృతవర్మయొక్కయు, వీరయోధాగ్రణి = అశ్వత్థామ, బలిమిచేత, అమర, శత్రుమస్తకములు కొట్టికొట్టి, ఉత్తమోజునిని, కృష్ణ = ద్రౌపదియొక్క, తనుభవులన్ = ప్రతివింధ్యాదిపుత్త్రులనును, సంగరకృతి = యుద్ధసమర్థుఁడయిన, ధృష్టద్యుమ్నునిని, శాత్రవులయొక్క, అసు = ప్రాణవాయువులకు, పృథుపణి = ఘనసర్పమైనవాని, శిఖండినిని దెగటార్చి భీమవిజయులయొక్క దీప్తమహిమచేత, దీర్ఘ = పోమొత్తఁబడిన, తేజస్సు గలవాఁ డాయెను.
| వ. | అంత. | 254 |
| సీ. | క్రీడానరుం డైన శ్రీవరుం డిట్లు క్షా | |
| ఆ. | తేజరిల్లె ధర్మరాజితరక్షమా | 255 |
భారత. క్రీడానరుండయిన శ్రీవరుండు = కృష్ణుఁడు, క్షాత్ర = క్షత్తృసంబంధమైన - సారథిసంబంధమైన, “సూతః క్షత్త్రా చ సారథిః" అని అ. ప్రక్రియన్ = వర్తనచేత, విజయునికి, ప్రశక్తి = అధికబలమును, నిర్వహించుచు, శుభపదమై, వికలంక = నిష్కళంకమైన, అధిరాజ్యవిలాస = సామ్రాజ్యవిలాసమందుఁగల, పట్టాభిషేకమును, స్వపుర = తనపట్టణమందు అనఁగా హస్తినగరమందు, స్ఫూర్జితముగ నడపఁగా, అప్పుడు, తాన్ = తాను, నవప్రభుత్వమందుఁగల, విశేష = వింతరీతిచేత, పృథుతరమైనదీప్తిచేత, విభీషణుండు = భయంకరమైనవాఁడు - చూడ శక్యముగానివాఁ డనుట. ధర్మరాజు, ఇతరక్షమాపాల = తక్కినరాజులకు, దుర్లభతరమైన భాగ్యలక్ష్మిచేతఁ దేజరిల్లెను.
రామ. క్రీడానరుండయిన శ్రీవరుండు = రఘునాథుఁడు, క్షాత్ర = క్షత్త్రియసంబంధమైన, ప్రక్రియను = వర్తనచేత, విజయమందుఁగల, ప్రశక్తి = అధికసామర్థ్యమును, నిర్వహించుచు, తనకున్ = విభీషణున కనుట. శుభపదవిక = శుభమైనమార్గము గల లంకాధిరాజ్యపట్టాభిషేకము, స్వ = తనకు, పురః = ముందరికిని - ఎప్పటికిని ననుట. స్ఫూర్జితముగ నప్పుడు దానవప్రభుత్వవిశేషముచేతఁ బృథుతరదీప్తి గలవాఁడు, ధర్మ = సకలధర్మములచేతను, రాజిత = ఒప్పుచున్న, రక్షన్ = సంరక్షణచేత, మాపాలన్ = మాయందు, దుర్లభతరభాగ్యలక్ష్మి నేఁడుగా ఫలించెననుట. అస్మత్పూర్వకృతము = పూర్వపుణ్యము, అద్భుత మని సుజను లలరఁ దేజరిల్లెను.
| తే. | విష్ణుముఖ్యావతారమై వెలయువిశ్వ | 256 |
రామ. విశ్వవిభుఁడు = రఘునాథుఁడు, అనల = అగ్నియందు, సహర్ష = హర్షసహితమైన, ప్రవేశముచేతనైన, మహిమకతనన్ = మహిమవల్ల, తనచెల్వ = సీతాదేవియొక్క, మతిశుద్ధి గాంచి = హృదయశుద్ధిని గాంచి, అమరవినుతి = బ్రహ్మాదిదేవతాస్తోత్రము, మిగులఁ జేకొని, తనదుపురికిన్ = అయోధ్యానగరమునకు, ఏగెను. సీతాసమేతుఁడయి పుష్పకారూఢుఁడయి లక్ష్మణవిభీషణసుగ్రీవాదిసమేతుఁడయి వచ్చి ప్రవేశించెను.
భారత. విశ్వవిభుఁడు = శ్రీకృష్ణుఁడు, అనలస = అల్పముగాని, హర్షప్రవేశమహిమకతన, తనచెల్వము = విలాసము, అతిశుద్ధి గాంచి యమరఁగా, వినుతి = ధర్మరాజాదిస్తోత్రమును, చేకొని, తనదుపురికిన్ = ద్వారకకు, ఏగెను.
| వ. | అ ట్లేగి యుచితభంగి నంగీకృతసకలసామ్రాజ్యభోగలీలావిశేషుం | 257 |
| క. | శాంతనవోక్తివిలాసా, త్యంతసుశిక్షితసమస్తధర్మతఁ జేసెన్ | 258 |
రామ. శాంతములునైన, నవ = మనోహరములైన, ఉక్తివిలాస = ఆగస్త్యాదిమునివచోవిలాసములచేత, అత్యంతమును, సుశిక్షిత = లెస్సగాఁ దెలియఁబడిన, సమస్త = సకలమైనశత్రుమిత్రులయొక్క, ధర్మతన్ = గుణములు గలవాఁడౌటచేత, శాంతిఘనుఁడు, వైవస్వతసంతతి = మనువంశమందుఁగల, నృప = రాజులకు, శేఖరుఁడు = భూషణమైనవాఁడు రఘునాథుఁడు, ప్రజాపాలనమున్ = సకలలోకసంరక్షణమును, చేసెను.
భారత. శాంతనవ = భీష్మునియొక్క, ఉక్తివిలాస = శాంత్యానుశాసనికపర్వోక్తివిలాసములచేత, సుశిక్షిత = లెస్సగాఁ దెలియఁబడిన, సమస్తధర్మతన్ = సకలధర్మములు కలవాఁడౌటచేత, శాంతిఘనుఁడు, వైవస్వతసంతతి = ధర్మపుత్రుఁడయిన, నృపశేఖరుఁడు = ధర్మరాజు, ప్రజాపాలనమును జేసెను.
| వ. | ఆసమయంబునందు. | 259 |
| ఆ. | మౌనిపదవిసృష్టమహితనయోత్పన్న | 260 |
భారత. మౌని = వేదవ్యాసమునియొక్క, పద = వాక్యములచేత, విసృష్ట = ఇయ్యఁబడిన, మహిత = ప్రసిద్ధమైన, నయ = నీతిచేత, ఉత్పన్న = కలిగిన, కుశల = శుభకరమైన, వసు = ద్రవ్యములయొక్క, సమృద్ధివశతన్ = సమృద్ధియోగము గలవాఁడౌటఁబట్టి, అవ్విభుండు = ధర్మరాజు, అశ్వమేధాదులైన విధులు = సత్కర్మములను, కావించెను.
రామ. మౌనిపద = వాల్మీకియొక్క యాశ్రమమందు, విసృష్ట = విడువఁబడిన, మహితనయా = సీతయందు, ఉత్పన్న = పుట్టిన, కుశలవ = కుశలవులయొక్క, సమృద్ధివశతన్ = అధికైశ్వర్యప్రాప్తి గలవాఁ డౌటచేత, ఒదువుకొదవలెల్లఁ దీర్చుకొని = దేవఋషిపితృతర్పణములు తీర్చుకొని, అవ్విభుండు = ఆరామస్వామి, అశ్వమేధాదివిధులను, వెలయన్= ప్రసిద్ధమౌనట్టుగా, కావించెను.
| సీ. | శ్రీధాన్యకటకమై చెలువొందె రాష్ట్రంబు | |
| తే. | రామభద్రుండు సన్మార్గరక్షణైక | 261 |
రామ. దిక్ = దిక్కులకు, అవతంసిక = అలంకారముగాఁ జేయఁబడిన, కీర్తియనెడి, పాండుసూనుఁడు = తెల్లనిపుష్పములు గలవాఁడు, రామభద్రుండు, చతురమనోహరమైన, ఆత్మ = హృదయముగల, అనుజ = తమ్ములచేత, ఉపచరిత = సేవింపఁబడిన, చరణుఁడగుచున్ = పదములు గలవాఁడై, సామ్రాజ్యంబు సలుపునపుడు, భూమిపై నీలాగు సంతోషమున నుండెను.
భారత. రామ= ఒప్పుచున్న, భద్రముగలవాఁడు, దిగవతంసితమైన కీర్తిగలవాఁడు, పాండుసూనుఁడు = ధర్మరాజు, చతుః = నలుగురైన, ఆత్మ = తనయొక్క, అనుజులచేత, ఉపచరిత = సేవింపఁబడిన, చరణములు గలవాఁడౌచు సామ్రాజ్యంబు సలుపునపుడు శ్రీధాన్యకటకమై చెలువొందె రాష్ట్రంబు.
| శా. | దేవా దేవరప్రేరణంబునన యుద్దీపించు వాగ్వైభవ | 262 |
| శా. | క్రీడామాత్రకృతత్రిమూర్తిభరణాంగీకారచూడాపరి | 263 |
క్రీడామాత్రముచేత నేకృతమైన, త్రిమూర్తి = బ్రహ్మవిష్ణుమహేశ్వరరూపములయొక్క, భరణ = ధారణముయొక్క, అంగీకారము గలవాఁడా! త్రిమూర్తులును నీలీల లనుట. చూడా = శిఖయందు, “చూడాకిరీటం కేశాశ్చ" అని అ. పరిభ్రాట్ = ఒప్పుచున్న, ఆదిత్యధునీ = దేవనదియొక్క, "ఆదిత్యా ఋభవోస్వప్నాః" అని అ. "తటినీహ్రాదినీ ధునీ” అనియు అ. పృషత్ = బిందువులచేత, “వృషంతి బిందుపృషతౌ” అని అ. పుషిత = పోషింపఁబడిన, పంపానదియందలి శైత్యము గలవాఁడా! వేధః = బ్రహ్మచేతను, "స్రష్టా ప్రజాపతిర్వేధాః" అని అ. మరుత్ = దేవతలకు, “మరుతౌ పవనామరౌ” అని అ. రాట్ = రాజైన యింద్రునిచేతను, ఆరాధింపఁబడిన పాదములు గలవాఁడా! అం ఘ్రి = పాదములయందుఁ గల, నఖము లనెడి చంద్రులయొక్క, ద్యోత = ప్రకాశముచేత, “ప్రకాశోద్యోతఆతపః" అని అ. సిధ్యత్ = సిద్ధింపుచున్న, పరివ్రాట్ = యతీశ్వరులకు, "భిక్షుః పరివ్రాట్కర్మందీ" అని అ. ఆఖండల = ఇంద్రులైన బ్రహ్మర్షులయొక్క, మండలీ = సమూహముయొక్క, 'బింబో స్త్రీమండలం త్రిషు” అని అ. హృదయము లనెడి, జీవంజీవ = చకోరపక్షులయొక్క, “జీవంజీవశ్చకోరకః" అని అ. సంజీవనము గలవాఁడా!
| క. | కారుణ్యవిభవలక్ష్మీ, తారుణ్యసదోపభోగ ధన్యకటాక్షా | 264 |
కారుణ్యవిభవ = దయాతిశయముయొక్క, లక్ష్మీ = సంపద యనెడి, తారుణ్య = యౌవనముయొక్క, సదోపభోగ = నిత్యానుభవముచేత, ధన్యమైన, కటాక్షముగలవాఁడా! కటాక్షమునకుఁ గారుణ్యమె యౌవన మనుట. శారీర = శరీరసంబంధమైన, అర్ధమందు = అర్ధశరీరమం దనుట. సులాలిత యైనగౌరియందు, రారజ్యమాన = మిక్కిలి నాసక్తిగలవాఁ డౌచును, కమ్ర = మనోజ్ఞమైన ఆపేక్ష గలవాఁడా!
| కలహంసవృత్తము. | హిమనగాద్రితన యేక్షణలక్ష్మీ, స్తిమితపుణ్యఫలదేహవిలాసా | 265 |
| గద్యము. | ఇది నిఖలసూరిలోకాంగీకారతరంగితకవిత్వవైభవ పింగళియ | |
| గద్యము. | ఇది శ్రీమన్మదనగోపాలకృపాకటాక్షసంప్రాప్తసారసారస్వతసంపదానంద | |
సంపూర్ణము