యెంకి పాటలు/కల కలమి
స్వరూపం
కల కలమి
కలపూలసరు లచట
కలవేమె యంచు
కల తెలివిగని తోట
గాలించు యెంకీ॥
... ... ...
కలజాడ లీ మేన
నిలచెనో యంచు
అద్దాన యేమేమొ
దిద్దుకొను యెంకి
... ... ...
కలలోని కతలన్ని
కనబడునొయంచు
కలమిణుగురుల గన్న
నులుకు నా యెంకీ
... ... ...
కనిపెట్టి నే సరిగ
కల చెప్పుకొనగ
కలకలిమె సత్తెమని
కులుకు నా యెంకి