మొల్ల రామాయణము/సుందరకాండము/మారుతి పిడికిటిపోటుతో యమపురి కరిగిన లంకిణి

వికీసోర్స్ నుండి

మారుతి పిడికిటిపోటుతో యమపురి కరిగిన లంకిణి[మార్చు]

క. పోయెడు వాయుజు నెక్కడఁ
బోయెదు నాచేత ననుచుఁ బోనీక వడిన్‌
డాయఁగ వచ్చిన లంకిణి
కాయము వగులంగఁ బొడిచెఁ గడు వడిఁ గినుకన్‌. 223
వ. ఇట్లు లంకిణిం జంపి, సువేలాచలం బెక్కి, సింహనాదంబు సేయుచు, 224
క. పుడమీ ధర శృంగంబున
నడుగులు వడి నూఁది త్రొక్కి, యద్భుత శక్తిన్‌
జలరాశి దాఁటఁ బావని
మిడివింటం బసిఁడి యుండ మీఁటిన రీతిన్‌. 225
వ. ఇట్లు కుప్పించి, యుప్పరం బెగసి, వాయు వేగంబునం జనుచు
నయ్యబ్ధి మధ్యంబున నున్న సునాభం బను శైలంబునఁ దన
దేహంబు దాహంబుఁ దీర్చుకొని, సముద్రంబును దాఁటి, యవ్వలి
కిం జనియె నప్పుడు. 226