మొల్ల రామాయణము/సుందరకాండము/ఆకస మంటఁ బెంచిన హనుమ రూపము
Appearance
ఆకస మంటఁ బెంచిన హనుమ రూపము
[మార్చు]క. చుక్కలు తల పూవులుగా
నక్కజముగ మేను వెంచి యంబర వీథిన్
వెక్కసమై చూపట్టిన
నక్కోమలి ముదము నొందె నాత్మస్థితికిన్. 107
వ. ఇట్లు తన మహోన్నత రూపంబు చూపి యెప్పటియట్ల మరల
సూక్ష్మ రూపంబు గైకొని నమస్కరించిన, నా హనుమంతునకు
నద్దేవి తన శిరోరత్నంబు ననుగ్రహించి యిట్లనియె. 108