Jump to content

మొల్ల రామాయణము/బాల కాండము/శివధనువు నెక్కు పెట్టిన ధీరునకు సీత నిత్తు నని జనకుని ప్రకటన

వికీసోర్స్ నుండి

శివ ధనువు నెక్కు పెట్టిన ధీరునకు సీత నిత్తునని జనకుని ప్రకటన

[మార్చు]

ఉ. కొంకక సావధాన మతిఁ గూర్చి వినుం డిదె, మత్తనూజకై
యుంకువ సేసిఁనాడ వివిధోజ్జ్వల మైన ధనంబుఁ, గాన నీ
శంకరు చాప మెక్కిడిన సత్త్వ ఘనుం డగువాని కిత్తునీ
పంకజనేత్ర సీత, నరపాలకులార! నిజంబు సెప్పితిన్‌. 72
ఆ. అనుచుఁ బలుకుచున్న యవనీశ తిలకుని
వాక్యములకు నుబ్బి, వసుమతీశ
సుతులు దాము తామె మతిలోనఁ జెలఁగుచు
దగ్గఱంగఁ బోయి ధనువుఁ జూచి, 73