మొల్ల రామాయణము/బాల కాండము/దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట
Appearance
దశరథుఁడు పుత్రకామేష్టి కావించుట
[మార్చు]సీ. సంతాన లబ్ధికై చింతించి చింతించి-శిష్ట వర్తనుఁ డౌ వశిష్ఠుఁ జూచి,
తన కోర్కి వినుపింప, విని మునిసింహుండు-పలికె ఋష్యశృంగు నెలమిఁ దేర,
ఘనుఁ డాతఁ డొగిఁ బుత్రకామేష్టి యనుపేర-యాగమ్ముఁ గావింప, నందువలన
వినుతి కెక్కఁగఁ జాలు తనయులు గలుగుట-సిద్ధమ్ము, నా మాట బుద్ధిలోన
తే. నిలుపు మని చెప్ప, నా రాజు నెమ్మితోడ-నకుటిలాత్మకు నా విభాండకుని తనయు
నెలమి రావించి, పుత్త్రకామేష్టి యనెడి-జన్న మొనరించు చున్నట్టి సమయమునను, 27