మొల్ల రామాయణము/బాల కాండము/ఆశ్వాసాంత పద్య గద్యములు
Appearance
ఆశ్వాసాంత పద్య గద్యములు
[మార్చు]క. జలజాక్ష! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత! సుధా
జలరాశి భవ్య మందిర
జలజాకర చారు హంస! జానకి నాథా! 101
గద్యము
ఇది శ్రీ గౌరీశ్వర వర ప్రసాద లబ్ధ గురు జంగమార్చన వినోద
సూరి జన వినుత కవితా చమత్కారాతుకూరి కేసనసెట్టి
తనయ మొల్ల నామధేయ విరచితంబైన
శ్రీ రామాయణ మహా కావ్యంబునందు బాలకాండము సర్వము నేకాశ్వాసము.