మొల్ల రామాయణము/కిష్కింధా కాండము/సుగ్రీవునకు వానర రాజ్య పట్టాభిషేకము
స్వరూపం
సుగ్రీవునకు వానర రాజ్య పట్టాభిషేకము
[మార్చు]క. తారాపతి శిక్షింపుచుఁ
దారా పతి ధవళ కీర్తిఁ దగు నర్కజునిన్
దారా దేవికిఁ బురి కా
తారార్కము గాఁగ రాజ తనయుఁడు నిల్పెన్. 17
క. నిగ్రహము మాని నృపతి శు
భగ్రహ లగ్నంబునందుఁ బట్టము గట్టెన్
నిగ్రహ రాజోపగ్రహు
సుగ్రీవుని, హేమదామ సుగ్రీవుఁ దగన్. 18
వ. ఇట్లు సుగ్రీవుని గపి రాజ్య పట్టభద్రునిం జేసి, వాలి తనూసంభవుని
నంగద కుమారుని యువరాజ పదంబున నిలిపె. నంత వర్షాకాలము
గడుచునంత దనుక శ్రీరాముని మాల్యవంతంబుపై నుండ
నియమించి వారు సని రయ్యవసరంబున. 19