మొల్ల రామాయణము/కిష్కింధా కాండము/ఆశ్వాసాంత పద్య గద్యములు
స్వరూపం
ఆశ్వాసాంత పద్య గద్యములు
[మార్చు]క. జలజాక్ష! భక్త వత్సల!
జలజాసన వినుత పాద జలజాత! సుధా
జలరాశి భవ్య మందిర
జలజాకర చారు హంస! జానకి నాథా! 28
గద్యము
ఇది శ్రీ గౌరీశ్వర వరప్రసాద లబ్ధ గురుజంగమార్చన వినోద
సూరిజన వినుత కవితాచమత్కా రాతుకూరి కేసనసెట్టి
తనయ మొల్ల నామధేయ విరచితంబైన శ్రీ రామాయణ మహాకావ్యంబునం గిష్కింధా
కాండము సర్వము నేకాశ్వాసము