మూట లడిగితిన
Appearance
యదుకుల కాంభోజి రాగం - త్రిపుట తాళం
[మార్చు]
పల్లవి:
మూట లడిగితినా ముల్లె లడిగితినా
మూతి త్రిప్పెదవేమిరా ముద్దిడరా మోము తిప్పెద వేమి రా ||
అనుపల్లవి:
నోటి మాట కై న నోచుకోనైతినా
కూట ములా ముద్దు కోమలి పాలైన ||
చరణం 1:
త్యాగ శీలుడవీవు దాచిన సొమ్మంత వేగ నా కిమ్మంటినా
భాగా లివ్వ నైన పనికి రానైతినా
బాగాయె నది యెంత బంగారు బొమ్మైన ||
చరణం 2:
వడిగ నీ పాన్పు వద్దకు చేరగ వద్దు వద్దన నేలరా
అడుగు లొత్తగ నైన అనుకూల పడ రాదా
పడతి బోధన లిహ పర సాధన్ములైన ||
చరణం 3:
పాలించు శ్రీ తోట్ల వల్లురి వేణు గోపాలా మ్రొక్కితి మ్రొక్కితి
శ్రీ ల మించిన దాసు శ్రీ రామ కవి కృతి
వాళాయముగ నిన్ను వర్ణన జేసిన ||